ఆర్థిక మంత్రిగా మహిళకు చాన్స్! - రచ్చబండలో సీఎం వ్యాఖ్యలు
కూకట్‌పల్లి, నవంబర్ 29 (): రాష్ట్ర ఆర్థికశాఖ బాధ్యతలను మహిళకు అప్పగించాల్సిన విషయమై ఆలోచించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌డ్డి పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో ఆర్థిక విషయాలన్నీ మహిళలే చూసుకుంటున్నారని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక బాధ్యతలను కూడా ఆడవారికి అప్పగిస్తే మరింత మెరుగ్గా పనిచేసే అవకాశం ఉందంటూ తన అభివూపాయాన్ని వెల్లడించారు. ఆర్థిక శాఖను మహిళకు కేటాయించే అంశాన్ని ఆలోచించాల్సిన అవసరముందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్‌నగర్ డివిజన్‌లో మంగళవారం జరిగిన రచ్చబండ కార్యక్షికమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు మరింత ప్రాధాన్యతనిచ్చేందుకు, ప్రతి సంక్షేమ పథకానికి మహిళలనే అర్హులుగా గుర్తిస్తున్నామన్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌కు మంత్రి పదవి బీసీ కోటా కింద ఇవ్వాలని సీఎం కిరణ్‌కుమార్‌డ్డి ఎంపీ సర్వే సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్షికమంలో మంత్రులు సబితా ఇంద్రాడ్డి, శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు కూన శ్రీశైలంగౌడ్, సుధీర్‌డ్డి, కిచ్చనగారి లకా్ష్మడ్డి, రాజిడ్డి, రాజేందర్, ప్రసాద్‌రావు, ఎంఎల్‌సీ రాజాడ్డి, పాల్గొన్నారు.
Take By: T News
Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News,
0 comments:
Post a Comment