Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Sunday, November 25, 2012

స్కూల్ గొడవల ‘పసంగ’ - Pasanga


pasanga
పసంగ అంటే తమిళంలో పిల్లలు అని అర్థం. అందుకే ఈ సినిమా అంతా పిల్లల చుట్టే తిరుగుతుంది. పిల్లలకు ఏదో బోధించాలని, సందేశాన్నివ్వాలని కాకుండా అత్యంత సహజంగా ఒక నిజమైన పిల్లల సినిమా ఇది. ఐదో తరగతి నుంచీ ఆరో తరగతికి వెళ్ళిన కొందరు పిల్లల కథ. పిల్లల్లోని పిడుగులూ, అల్లరిమూకలూ, బుద్ధిమంతులు, క్లాస్ లీడర్ రాజకీయాలు అన్నీ కలిపిన అద్వితీయమైన కథ. కథలోకి వెళ్తే... అన్బు(కిషోర్), జీవ(శ్రీరాం) అనే ఇద్దరు విద్యార్థుల ఉంటారు. ఒక చిన్న ఊర్లోని గవర్నమెంటు స్కూళ్ళో ఏంమేమి జరుగుతుంటాయో వాటన్నింటినీ తెరకెక్కించిన చిత్రం. ఊహల్లో స్కూటక్కినట్లు ఊహించుకుని సౌండ్ చేసుకుంటూ వెళ్లడం.. పదిపైసల బిళ్ళని కాగితం కిందపెట్టి పెన్సిల్ తో అచ్చుగీయడం.. నాలుక మీద మచ్చున్నోళ్ళు ఏంచెబితే అది జరుగుతుందని నమ్మడం.. నెమలి ఈకని పుస్తకంలో పెట్టి పిల్లలు పెడుతుందని ఎదురుచూడటం.. గట్టిగా చదువుతూ పక్క పిల్లలను చదవకుండా చేయడం.. అల్లరిచేసినవాళ్ళ పేర్లు క్లాస్ లీడర్ బోర్డు మీద రాస్తే గొడవపడటం.. క్లాసులో నిద్రపోయే వాళ్లకు మొట్టికాయలు వేయడం... మార్కులు తక్కువొస్తే ముక్కు చెంపలు వాయించే పిల్లలు. ఇలా ఎన్నెన్నో జరుగుతుంటాయి ఆ స్కూల్లో. తండ్రి ఆర్థిక పరిస్థితి బాగోక ఇంగ్లీషు మీడియంలో చదివే అన్బు గవర్నమెంటు స్కూళ్ళో ఆరవతరగతిలో చేరతాడు.

అప్పటివరకూ క్లాసులో ఎదురులేకుండా ఉన్న జీవాకు కంటగింపుగా మారతాడు. జీవా తండ్రి ఈ ఇద్దరూ ఉన్న క్లాస్‌కి క్లాస్ టీచర్. అన్బు చదువులో, సంస్కారంలో అందరికన్నా ముందుంటూ మన్ననలు పొందుతుంటాడు. క్లాస్ లీడర్ అవుతాడు. జీవా ఈర్ష్య కోపంగా మారుతుంది. ఎప్పటికప్పుడు అన్బుని తక్కువచేసి చూపాలనే ప్రయత్నాలు చేస్తాడు. చివరకు అదే క్లాసులో చదువుతున్న జీవా అత్తకూతురు కూడా అన్బుతో స్నేహంగా మెదులుతుంది. జీవా కోపం కసిగా మారుతుంది. ఎప్పటికప్పుడు అన్బు జీవాతో స్నేహం చెయ్యాలని చూసినా, జీవా పెంకితనం వారి స్నేహానికి అడ్డుగా మారుతుంది. దానికి తోడు జీవా పక్కనున్న ఒక మిత్ర ద్వయం ఎప్పటికప్పుడు జీవాను ఎగదోస్తూ పరిస్థితిని ఇలాగే కొనసాగేలా చూస్తుంటారు.

అన్బు-జీవాల గొడవలు చివరకు వాళ్ళ కుటుంబాల వరకూ వెళ్తాయి. అప్పటికే ఆర్థిక పరిస్థితి బాగాలేని అన్బు కుటుంబం మరింత కల్లోలానికి గురవుతుంది. ఈ గొడవల మధ్యలో జీవా అక్క సోబికన్ను(వేగ), అన్బు బాబాయ్ సుందరం(విమల్) ప్రేమించుకుంటారు. ఈ పిల్లల వైరాలు సమసిపోతాయా? కుటుంబాలు కలుస్తాయా? సోబికన్ను -సుందరంల ప్రేమ సఫలం అవుతుందా అనేది చిత్రకథ.2009లో వచ్చిన ఈ సినిమా పాండియరాజన్ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా. తెలుగులో అనంతపురం - 1980 సినిమా నిర్మించిన శశికుమార్ నిర్మాత కాగా, జేమ్స్ వాసంతన్ మ్యూజిక్ ఇచ్చారు. మూడు నేషనల్ అవార్డులను దక్కించుకోవడమే కాదు... అనేక ఫిల్మ్‌ఫెస్టివల్స్‌లో ప్రదర్శింపబడి ప్రశంసలందుకున్నది పసంగ!

Read more...

124 dead in Bangladesh factory fire

Dhacca, November 25:
At least 124 people were killed when a fire raged through a garment factory in the outskirts of the Bangladesh capital, officials said Sunday.

The fire that started Saturday evening at Tazreen Fashion near the Dhaka Export Processing Zone in Ashulia was brought under control around 6 a.m. Sunday, the Daily Star quoted fire service officials as saying.

Sources said the toll may rise as a search operation was still going on.

Nine bodies were found Saturday night, and 115 more were recovered from the factory Sunday morning.

Police and fire-fighters said those killed in the incident did not suffer burns, but died after jumping from different floors of the eight-storey building. Some also died in a stampede.

An official from the Bangladesh Garment Manufacturers and Exporters Association said they will provide one lakh taka (around $12,300) to the kin of each of the dead.

Officials told Xinhua the blaze began at the cotton warehouse on the second floor of the factory.

Police suspect the fire originated from an electrical short-circuit.

There were around 4,000 workers when the fire started. About 1,000 workers were trapped inside the factory while 3,000 managed to escape.

In a similar incident in 2007, at least 50 workers were killed in a blaze at a garment factory in the southeastern city of Chittagong.

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP