డిసెంబర్ 9 ప్రకటన
తెలంగాణ అంశంైపై విస్తృత స్థాయిలో చర్చించాం. ప్రధాని మన్మోహన్ సింగ్ వచ్చాక ముఖ్యమంత్రి రోశయ్యనూ సంప్రదించాం. అన్ని రకాలుగా చర్చించిన తర్వాత భారత ప్రభుత్వం తరపున ఈ ప్రకటన చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తాం. దీనికి సంబంధించి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాల్సిందిగా రోశయ్యకు సూచించాం. నవంబర్ 29(కేసీఆర్ దీక్ష ప్రారంభించిన రోజు) తర్వాత ఆందోళనకారులు, విద్యార్థులపై పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాం. కేసీఆర్ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఆయన సత్వరం దీక్ష విరమించుకోవాల్సిందిగా విన్నవిస్తున్నాం. తదుపరి ఆందోళనలకు స్వస్తి పలకాల్సిందిగా విద్యార్థులను కోరుతున్నాం
డిసెంబర్ 23 ప్రకటన
2009 డిసెంబర్ 7న ఆంధ్రవూపదేశ్ ముఖ్యమంత్రి నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఏకాభివూపాయం వ్యక్తమైంది. ఆ భేటీ వివరాలను అందుకున్న తర్వాత డిసెంబర్ 9న ఇందుకు సంబంధించి కేంద్రవూపభుత్వం ప్రకటన కూడా చేసింది. అయితే ఈ ప్రకటన తర్వాత ఆంధ్రవూపదేశ్‌లో పరిస్థితి మారిపోయింది. ఈ విషయంపై రాజకీయ పార్టీలు చీలిపోయాయి. రాష్ట్రంలో ఉన్న పార్టీలు, ఇతరత్రా సంఘాలతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రవూపదేశ్‌లో శాంతి, సామరస్యాలను పునరుద్ధరించాల్సిన అవసరముంది. పరిపాలన, అభివృద్ధిపైన దృష్టి పెట్టేందుకు ప్రభుత్వానికి అవకాశమివ్వాలి. తమ ఆందోళనలను విరమించి శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పాలని కేంద్రవూపభుత్వం ఆంధ్రవూపదేశ్‌లోని వివిధ ప్రాంతాల వారికి, అన్ని రాజకీయ పార్టీలకు, విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నది.’
బండెనక బండి కట్టి.. పదహారు బండ్లు కట్టి.. అంటూ నిజాం ప్రభువు శృంఖాలలను తెగ్గొట్టుకునేందుకు పిడికిలి బిగించిన పోరుగడ్డ ఈ తెలంగాణ. భారతదేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని తీసుకెళ్లి పాకిస్థాన్‌లో కలిపేందుకు సిద్ధమైన నిజాం నవాబుకు, ఆయన సైన్యం రజాకార్లకు ఎదురునిలిచి నిలబడింది ఈ గడ్డ. ఉద్యమస్ఫూర్తి, అన్యాయంపై తిరగబడే తత్వాన్ని అలవరుచుకున్న ఈ సమాజానికి స్వాతంత్య్రం లభించిన ఆనందం ఎంతో సేపు నిలవలేదు. విశాల ప్రయోజనాల మాటున సామ్రాజ్యవాద భావనలతో తెలంగాణను పెట్టుబడిదారులు అన్ని విధాలుగా కబ్జాచేశారు. 1969లో ఉవ్వెత్తున లేచిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని తూటాలతో అణిచేశారు.
ఆ తర్వాత మళ్లీ నలభై ఏళ్లకు తెలంగాణ మరోసారి ఉద్యమనినాదాన్ని అందుకున్నది. ప్రభుత్వోద్యోగులు, విద్యార్థులు, న్యాయవాదులు, మేధావులు, ఉపాధ్యాయులు ఏకమయ్యారు. తమకు జరుగుతున్న అన్యాయాలను ముక్తకం నిరసించారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక తెలంగాణే ధ్యేయంగా 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. పదేళ్ల పాటు అనేక విధాలుగా పోరాటాలు సాగిస్తూ వచ్చింది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష పట్ల దాటవేత వైఖరిని అవలంబిస్తూ విపరీతమైన కాలయాపన చేస్తూ వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ.. తెలంగాణ ఆవిర్భావాన్ని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2009 నవంబర్ 29న ఆమరణ దీక్ష చేపట్టారు. ఆయన దీక్షకు మద్దతుగా తెలంగాణ అంతటా మద్దతు పలుకుతూ రాస్తారోకోలు, ఆందోళనలు, బంద్‌లు, నిరాహారదీక్షలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ విషాదకరమైన రీతిలో యువకులు ఆత్మహత్యలు కూడా చేసుకోవడం ప్రారంభించారు.
ఈ నేపథ్యంలోనే కేంద్రవూపభుత్వం ఆదేశాల మేరకు డిసెంబర్ 7న అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య నేతృత్వంలో అఖిలపక్షభేటీ జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తమకెలాంటి అభ్యంతరం లేదంటూ ఆ భేటీలో పాల్గొన్న టీడీపీ, పీఆర్పీ, సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా స్పష్టం చేస్తూ లిఖితపూర్వక ప్రకటన ఇచ్చాయి. దీంతో డిసెంబర్ 9 రాత్రి పదకొండున్నరకు పార్లమెంటు సాక్షిగా కేంద్రవూపభుత్వం తరపున హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు. అనంతరం కేసీఆర్ దీక్ష విరమించారు. చిదంబరం ప్రకటన విన్న వెంటనే యావత్ తెలంగాణ సంబరాల్లో మునిగిపోయింది. ఉస్మానియా, కాకతీయ సహా అన్ని తెలంగాణ ప్రాంత యూనివర్సిటీల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. అయితే ఈ సంబురం పట్టుమని పదిహేను రోజులు కూడా నిలవలేదు. తెలంగాణలో, హైదరాబాద్‌లో వ్యాపారాలు చేస్తూ వేలకోట్లు ఆర్జిస్తున్న పెట్టుబడిదారులైన సీమాంధ్ర నేతలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను వ్యతిరేకించారు.
సీమాంవూధకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలను ఏకం చేసి రాజీనామాల డ్రామాను నడిపారు. సీమాంధ్ర ప్రాంతాల్లో అద్దె ప్రదర్శనలు చేయించి ఆందోళనల పర్వాన్ని రక్తి కట్టించారు. ఇందుకు సీమాంధ్ర మీడియా బాగా తోడ్పడింది. దీంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. డిసెంబర్ 9న ఇచ్చిన ప్రకటనను వెనక్కి తీసుకుంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై విస్తృతస్థాయిలో సంప్రదింపులు అవసరమంటూ డిసెంబర్ 23న చిదంబరం మరో ప్రకటన చేశారు. ఇచ్చిన తెలంగాణను వెనక్కి తీసుకునే సరికి తెలంగాణ భగ్గుమన్నది. మరోసారి ఉద్యమబాట పట్టింది. తెలంగాణను డిమాండ్ చేస్తూ బలిదానాలు ఆగలేదు. మరోవైపు చిదంబరం అఖిలపక్షాలతో 2010 జనవరి5 న ఢిల్లీలో భేటీ నిర్వహించారు. ఆ తర్వాత విస్తృత సంప్రదింపుల పేరుతో జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తూ ఫిబ్రవరి 3న ప్రకటన చేశారు.
ఈ నేపథ్యంలోనే... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం నడిపేందుకు అటు రాజకీయ పక్షాలను ఇటు ప్రజాసంఘాలను కలుపుకొంటూ తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ఆవిర్భవించింది. తెలంగాణ వ్యాప్తంగా ఎడతెగని ఉద్యమాలు నిర్వహించింది. వంటావార్పులు నిర్వహించింది. రైల్‌రోకోలు, బస్సురోకోలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. రాజీనామాలు చేసి ఐక్యతను చాటి తెలంగాణ కాంక్షను చాటిచెప్పాలని జేఏసీ పిలుపునిచ్చింది. కానీ ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, టీడీపీలు వెనక్కి తగ్గాయి. తమ అవకాశవాదాన్ని మరోసారి చాటుకున్నాయి. కేవలం టీఆర్‌ఎస్, బీజేపీలు మాత్రమే ముందుకొచ్చాయి. 12 స్థానాల్లో వారు రాజీనామాలు చేసి 2010 జూలైలో ఉప ఎన్నికల్లో తలపడ్డారు. తెలంగాణ కాంక్ష కోసం పదవులు వదులుకొని నిబద్ధత చాటుకున్న ఆ పన్నెండు మందికి జనం బ్రహ్మరథం పట్టారు. కనీవినీ ఎరుగని మెజారిటీతో వారిని గెలిపించారు. మరోవైపు ఇదే సమయంలో శ్రీకృష్ణ కమిటీ అన్ని రాజకీయ పక్షాల, ప్రజా సంఘాల అభివూపాయాలు తీసుకున్నది. ఇటు తెలంగాణ, అటు సీమాంవూధలో పర్యటించింది. ప్రజాభివూపాయ సేకరణ చేసింది.
2010 డిసెంబర్ 30న 550 పేజీలతో 8 అధ్యాయాలతో కేంద్రవూపభుత్వానికి నివేదిక సమర్పించింది. కట్టె విరగొద్దు..పాము చావొద్దు..అన్న రీతిన సమస్యకు ఎటువంటి పరిష్కారాన్ని చూపలేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ లేదా విడగొట్టాలంటూ ఆరు ఆప్షన్లు చెబుతూ తెలంగాణ అంశాన్ని మరింత సంక్లిష్టపరిచింది. 2011 జనవరిలో ఈ నివేదిక వెలువడిన తర్వాత ఉద్యోగులు ఫిబ్రవరి నెలలో పదహారు రోజుల పాటు సహాయ నిరాకరణ చేశారు. ఆ తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ మార్చి 10న జేఏసీ మిలియన్ మార్చ్‌కు పిలుపునిచ్చింది. తెలంగాణలో అడుగడుగునా పోలీసులు విధించిన నిర్బంధాన్ని ఎదిరించి వేలాది మంది ట్యాంక్‌బండ్‌పైకి చేరుకున్నారు. అదిగో.. ఇదిగో.. అంటూ నయవంచన చేస్తూ ఉద్యమాన్ని అణిచివేస్తున్న ప్రభుత్వానికి ఉద్యమవేడి రుచి చూపారు. సీమాంధ్ర పాలక ఆధిపత్య చిహ్నాలైన విగ్రహాలను విరగ్గొట్టి నేలపాలు చేశారు. కొన్నింటిని హుసేన్‌సాగర్‌లోకి గిరా అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తూనే ఉన్నాయి.
మరోసారి తెలంగాణ జనం రోడ్లెక్కారు. జూన్ 19న హైదరాబాద్ నడివీధుల్లో వంటావార్పు చేశారు. ఆ తర్వాత కేంద్రంలో కదలిక తీసుకొచ్చేందుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఓ ప్రయత్నం చేశాయి. జూలై 4, 5 తేదీల్లో మొత్తం 118 మంది తెలంగాణ ఎమ్మెల్యేల్లో వందమంది, 14 మంది ఎంపీలు, 20 మంది ఎమ్మెల్సీలు తెలంగాణను కోరుతూ రాజీనామాలు సమర్పించారు. కానీ ఆ రాజీనామాలను లోక్‌సభ స్పీకర్, శాసనసభ స్పీకర్ ఆమోదించలేదు. తెలంగాణ ప్రజావూపతినిధులు చేసిన ఈ ప్రయత్నాన్ని కేంద్రం తన కుయుక్తులతో తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగులు మరోసారి తమ పోరాటపటిమను కనబరిచారు. సెప్టెంబర్ 13 నుంచి 42 రోజుల పాటు సింగరేణి, ఆర్టీసీ, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, అన్ని విభాగాల ఉద్యోగులు సమ్మె ప్రారంభించారు. తెలంగాణలోని సబ్బండవర్ణాల వారు ఇందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఈ సమ్మెకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చినట్టే దిగొచ్చి మళ్లీ కాలయాపన చేయడం ప్రారంభించింది. రాష్ట్రంలో అభివూపాయసేకరణ పూర్తి చేసిన కేంద్రం..ఇపుడు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల మద్దతు కావాలంటూ కొత్త పాట పాడటం ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యవహారం మాత్రం ఎక్కడ వేసిన గొంగళిలాగా అక్కడే ఉంది.
విద్యార్థిని పట్టిస్తే వంద!
తెలంగాణ మలి ఉద్యమానికి ఊపిరులూదిన ఉస్మానియా యూనివర్సిటీపై సీమాంధ్ర ప్రభుత్వం ఎంత కక్ష గట్టిందో ఇదో చిన్న ఉదాహరణ. 2009 డిసెంబర్ నెలలో కేసీఆర్ దీక్షకు విద్యార్థులు మద్దతు ప్రకటిస్తూ ఉద్యమబాట పట్టారు. మరోవైపు పోలీసులు క్యాంపస్‌లోకి మావోయిస్టులు ప్రవేశించారంటూ తప్పుడు ప్రచారం చేసి దొరికిన విద్యార్థిని దొరికనట్టుగా చితకబాదారు. హాస్టళ్లలోకి చొరబడి చావబాదారు. అంతేకాదు క్యాంపస్‌కు ఆనుకొని పక్కనే ఉన్న మాణికేశ్వర్‌నగర్‌లో కూడా విద్యార్థులను పట్టుకుపోయి వేధించేవారు. ఆ బస్తీలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులను పట్టిస్తే వందరూపాయల చొప్పున ఇస్తామంటూ పోలీసులే బహిరంగంగా ప్రకటించడం స్థానికులను విస్మయానికి గురిచేసింది.
వందల సంఖ్యలో ప్రత్యేక బలగాలను రప్పించి ఉస్మానియాలను ఓ బందీఖానలాగా మార్చివేశారు. విద్యార్థులతో సమావేశాలు పెట్టుకుంటున్నాం.. అనుమతివ్వండి.. అని అడిగిన ప్రతీసారి పోలీసులు అనుమతి నిరాకరించారు. చివరికి హైకోర్టు జోక్యం చేసుకుం అనుమతి దక్కలేదు. ఆ నేపథ్యంలోనే 2010 జనవరి 3న జరిగిన విద్యార్థి గర్జన ఉస్మానియా విశ్వవిద్యాలయ చరివూతలోనే ఓ మైలురాయి. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నా లెక్కచేయక లక్షన్నర మంది విద్యార్థులు గర్జనకు హాజరయ్యారు.
42 రోజుల సమ్మె
2010లో ఉద్యమాన్ని విద్యార్థులు అందిపుచ్చుకుంటే ఆ బాధ్యతను 2011లో ఉద్యోగులు తీసుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ సెప్టెంబర్ 13 నుంచి 42 రోజుల పాటు సమ్మె చేశారు. ఈ వరుసలో అందరికన్నా ముందు నిలబడింది సింగరేణి కార్మికులే. బొగ్గుబావుల్లోకి దిగకుండా, ఉత్పత్తిని నిలిపివేసి ప్రభుత్వాన్ని గడగడలాడించారు. ఆర్టీసీతో పాటు ఆర్టీసీ, ఎకై్సైజ్ అధికారులు కూడా సమ్మెలో పాల్గొన్నారు. సచివాలయం స్తంభించిపోయింది. తెలంగాణలోని ఏ ఊరువాడలోనూ ప్రభుత్వ కార్యాలయం పనిచేయలేదు. 42 రోజుల్లో ఒక్కరోజంటే ఒక్క రోజుకూడా పనులు సాగలేదు.
29.11.2009 : తెలంగాణ కోసం ఆమరణ నిరాహార
దీక్ష చేప కరీంనగర్ నుంచి సిద్ధిపేటకు బయలుదేరిన టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను అలుగునూరు వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు. ఖమ్మం మున్సిఫ్ మెజివూస్టేట్ ముందు హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్, జైలుకు తరలింపు. జైల్లోనే ఆమరణ దీక్ష ప్రారంభించిన కేసీఆర్.
09.12.2009 : భారత ప్రభుత్వం తరపున ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ’ ప్రారంభమవుతుందని చిదంబరం ప్రకటన.
23.12.2009 : ‘‘తెలంగాణ ఏర్పాటుపై రాష్ట్రంలోని వివిధ పార్టీలు, సంఘాలతో విస్తృత చర్చలు అవసరం’’ అని రెండో ప్రకటన విడుదల చేసిన కేంద్ర హోంమంత్రి చిదంబరం.
24.12.2009 : కళింగ ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ జేఏసీ మొట్ట మొదటి సమావేశం ఏర్పాటు. రెండు రోజుల తెలంగాణ బంద్‌కు పిలుపు.
03.01.2010 : ఉస్మానియా యూనివర్సిటీలో ‘తెలంగాణ విద్యార్థి మహాగర్జన’ సమావేశం. హాజరైన లక్షలాది మంది విద్యార్థులు.
28.01.2010 : తెలంగాణపై కమిటీ(శ్రీకృష్ణ) ఏర్పాటు చేస్తున్నట్లు చిదంబరం ముందస్తు ప్రకటన.
04.02.2010 : జాతీయ రహదారులపై వంటావార్పు కార్యక్షికమాలు.
14.02.2010 : 15 మంది తెలంగాణ ఎమ్మెల్యేల రాజీనామాలు. ఓయూలో రెచ్చిపోయిన పోలీసులు, విద్యార్థులు, మీడియాపై పాశవిక దాడి.
20.02.2010 : ఓయూ ఐకాస ‘అసెంబ్లీ ముట్టడి’ పిలుపు. సిరిపురం యాదయ్య ఆత్మహత్యాయత్నం, తర్వాత మరణం.
27.07.2010 : తెలంగాణలోని 12 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు.
30.07.2010 : ఉప ఎన్నికల ఫలితాలు విడుదల. రాజీనామా చేసిన 12 మంది ఎమ్మెల్యేల విజయం. 12 టీడీపీ, నలుగురు కాంగ్రెస్ అభ్యర్థుల డిపాజిట్ గల్లంతు.
16.12.2010 : వరంగల్‌లో మహాగర్జన సభ స్వామి అగ్నివేశ్ ప్రసంగం.
30.12.2010 : ఒక రోజు ముందుగానే కేంద్రానికి శ్రీకృష్ణ కమిటీ నివేదిక.
15.02.2011 : తెలంగాణ అంతటా సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభం.
10.03.2011 : ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్ విజయవంతం.
19.05.2011 : టీజేఎఫ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా.
19.06.2011 : హైదరాబాద్‌లో వంటా వార్పు కార్యక్షికమం.
14.07.2011 : రైల్‌రోకో కార్యక్షికమం విజయవంతం.
21.07.2011 : పార్లమెంట్ సమీపంలో యాదిడ్డి ఆత్మహత్య. ఏపీ భవన్ వద్ద ఉద్రిక్తత
06.08.2011 : ప్రొఫెసర్ జయశంకర్ సంస్మరణ సభలు
13.09.2011 : నుంచి 24.10.2011 : సకలజనుల సమ్మె.
04.11.2011 : పీడీ యాక్టు కింద డాక్టర్ చెరుకు సుధాకర్ అరెస్టు, వరంగల్ జైలుకు తరలింపు.
08.04.2011 : చెరుకు సుధాకర్ విడుదలకు హైకోర్టు ఆదేశం.
Take By: T News
Tags: Telangana News, Telangana agitation, Telangana issue, Azad, T News, hmtv, tv9, Harish Rao, Sima Andra, AP News, Political News, December 9,
Read more...