అమరవీరులో, మృత వీరులో , పిరికి వాళ్ళో ! ఎట్లన్న అర్థం చేసుకొండ్రి , చావ గలిగిన తెగింపు, ధైర్యం , అది ఒక ప్రాంతం కోసం , కోట్లాది ప్రజల ఆకాంక్ష కోసం ,ఒకడికి పదవి త్యాగం చేయనికి మనసోప్పది, ఇంకొకడికి కోట్ల రూపాయలున్న ఒక్క నోటు బయటికి రాదు, ఇల్లొదిలి బయట కాలు పెట్టనికి అరవై కారణాలు అడ్డొస్తాయి, పెళ్ళాం తిడ తది , మొగుడు కొడతాడు, అయ్యా తిడతాడు, ఒకడు కరీర్ అంటడు, స్వార్థం తో నిండిన యుగంల, ప్రాణాలు లెక్ఖ చేయని నా వోల్లు, అది నా తెలంగాణా రక్తం ! సచ్చి బతిన్రా , లేకపోతె ఇపుడున్న మేము బతికి చస్తున్నమా, ఏమి అర్థం కాని పరిస్తితి.
తెలంగాణా ఉద్యమంలో పొద్దు పొడిస్తే ఒక వార్త, పొద్దు గుంకితే ఒక వార్త, కళ్ళు కాయలు కాసేటట్టు చూస్తె పేపర్లల్ల దొరికేది అన్ద్రోల్ల సెన్సెషనల్, బ్లాక్ బస్టర్స్ , తెలంగాణా పై కేంద్ర వైఖరి, సోనియా అమ్మ మూడ్ , చిదంబరం చెస్ , మా నాయకుల వ్యూహాత్మక మౌనం , కాంగ్రేసోల్ల సొల్లు, గాలి కబుర్లు, మన రాజకీయ నాయకుల చేతగాని తనం..ఇంకా టీవిల సంగతి ఎం చెప్పాలే, వాడి మీద వీడు, వీది మీద వాడు.. రచ్చ బండ వోడ్డురో మొర్రో అంటుంటే, మా తీవిలనే దాని గురించి ఒక ఆడ్ వస్తది, పోనిలే అనుకొనే సరికి, గుంటూరు కారంపొడి వాడండి అని ఇంకొక వార్త..ఇంక మండదా చెప్పుండ్రి! కళ్ళళ్ళ కారం కొట్టినాట్టే, దిమాక్ కరాబ్ కాకుండా ఉండాలంటే ఇడియట్ బాక్స్ లకి దూరంగా ఉండండి అని డిసైడ్ అయిపోయినం. మంచి వార్త కోసం చూసి చూసి అలసి పోయినయి మా అసంటిఒళ్ల పానాలు, ఆర్నెల్ల సంధి ప్రొద్దున్నే పేపర్ తీయాలంటే భయం, వణుకు, కళ్ళు ఆత్రంగా ఎతుకుతాయి ..ఎక్కడన్నా అన్న తమ్ములు సచ్చిపోయిన్రు ఏమో, లాఠి చార్జీల దెబ్బల్ తలిగి అల్లడుతున్నరేమో అని గుబుల్ గుబుల్ అయితది..అదృష్టం కలిసొస్తే , ఒక్క సావు కూడ కనపడక పొతే హమ్మయ్య..పానం అల్కగయితది. ఇయాల పేపర్ చూస్తె, ఆంధ్ర జ్యోతిల , అదికూడా పేజ్ త్రీ , గుండె చేరువయిందన్న..కడుపుల కెలికినట్టయింది..మూడు సావులు , ఆంధ్రోల్ల పేపర్ల , తప్పక రాయని పరిస్తితి, పాల పిందెల వీరేశం(౧౪) హనమకొండ, స్టేషన్ ఘన్పూర్, చిన్న తమ్ముడు బిక్క సచ్చి , ఏమి చేయాలనో తెలవక సచిపోయిండు, వరంగల్ శివుని పేట ఆటో డ్రయివర్ల ధర్నా, మద్యలో సడెన్ గా అన్న నలిమెల శ్రీనివాస్ (౨౪) కి రైల్వే స్టేషన్ కనపడ్డది, అక్కడినుంచి ఒక రైలు కూడ వస్తుంది, ఏమనుకున్నాడో ఏమో బిడ్డ, జై తెలంగాణా అనుకుంట రైలుకింద తల పెట్టిండు, తల మొండెం వేరయింది, అట్లనే ధర్మ సాగర్, కూలి పని చేసుకొనే అయ్యా, బొప్పనపల్లి చేరాలు(౪౫) , తెలంగాణా వస్తే మా పేదోళ్ళ బతుకులు బాగు పడతాయేమో అని సూసి సూసి ఒక్కపాలే గుండె ఆగిందంట… యాభై ఏండ్లు నిండ కుండ బరువు బాద్యతలు తీరకుండా ఒక చావు , యవ్వనం చూడకుండా ఒకడు, చిన్న పోరగాడు , స్కూలు కూడ అయిపోలే..ఏమి చావులే అన్నా గోస గోస పెడుతున్రు, తెలంగాణా ఒచ్చేడిది సచ్చేడిది ఏమో గాని, మీరు ఎంత ప్రాణ త్యాగాలు చేసిన ఒక భగత్ సింగ్ కాలేరు, ఒక కొమరం భీమ్ కాలేరు..ఏ వీరుడూ కాలేరు, చరిత్రలో మీరొక పిరికి పందలు, మీగురించి రాస్తే మేము మీ చావులను గ్లోరిఫై చేస్తూన్న పాపం, మీ చావులను పొగడఒద్దు , పొగడలేము, ఎవడో ఒక మాట చెప్తే అది ఒక బాంబ్ లాగ పేలుతుంది, మా చావు ఇపుడు ఒక వార్త కూడా కాలేక పోయింది..ఎన్ని చావులు , ఇంకెన్ని చావులు? ఈ దేశంలో ఏమిలేని వాడి చావులకు విలువ ఎక్కడిది? అన్ని ఉన్న వాడి దే రాజ్యం, ఎందుకు మాకు ఈ చావులు, కడుపు కోత, గుండె చప్పుళ్ళు చావు డప్పులై మోగుతున్నాయి, ఎవడికి ఎందుకు పట్టదు? ఎవరు ఈ చావులకు బాద్యులు ? సరే సారూ, మేము పిరికి పందలమే, మాకే పని లేక సస్తున్నాం, మాకు అమ్మ అవ్వ లేరు, పెళ్ళాం పిల్లలు లేరు..బేకార్ గాళ్ళం తెలంగాణా కంటే మాకు వేరే ప్రపంచం లేదు , ఒంటి పైన పొలిసు దెబ్బ పడితే గాని కునుకు పట్టది , రోడ్డు పైన గొంతు చించుకొని జై తెలంగాణా అంటే గాని నిమ్మలన్గున్డది ..ఏందో చేయాలనే తపన, ఏమి చేయలేక పోతున్నమనే ఆవేదన, అలసి పోయిన జీవితాలు, ఎం చేయమంటారో చెప్పుండ్రి, ఈ బతుకు మంటని , అగడుని తట్టుకోలేక, కళ్ళముందు జరుగుతున్న దారుణాలని చూడలేక, చావుని చల్లంగా కౌగిలించుకున్తున్నాం, బతికి సాధించ లేనిది సచ్చి సాదిద్దాం అనే కాడికి వచ్చినం, ఈ చావులకి మా పిచ్చి తనమే కారణం కావొచ్చు కాని మమ్మల్ని బతకనీయని పరిస్తితులకి ఎవరు కారణం? మా కు తెలంగాణనే ఊపిరి, జీవితం, అనే పిచ్చి తనం ఉగ్గు పాలతో , ఈ భూమి కున్న పేగు బంధం తో వచ్చిన రక్తం, ఎట్లా పోగొట్టు కోవాల్నో చెప్పుండ్రి, మీరంతా మేధావులు, బుద్ధి జీవులు, రేపటి తెలంగాణాల మీకు ఏదో ఒకటి దొరుకుతదేమో..ఈ సచ్చేతోల్లకి ఎం దొరుకుతది, సస్తే బొంద పెట్టనికి ఇంత జాగా అయిన దొరుకుతదా..మా వాళ్ళకి కలో , గంజో దొరుకుతదా, కోట్ల మంది అన్నాయం కాకుండా, ఇన్ని చావులు బూడిదల పోసినట్టు కాకుండా ఏమైనా తెలంగాణా వస్తద ? రేపటి పార్లమెంటుల బిల్లు పెట్టేటట్టు కనపడతలేరు, వినపడట లేరు..కారణాలు తెలవయి..ఎట్లా తెలిస్తాయి తండ్రి..ఇక్కడ రాజకీయ నాయకులకి వెన్నెముకలు ఉంటె కదా? ఇంత దౌర్భాగ్యపు నాయకులని తెలంగాణా తల్లి ఎట్లా మోస్తుందో ఏమో..
ఎం మనుషులే మీరు, ఎం ప్రబుత్వాలు, నీ యవ్వ మా చావులు కదిలించవు, నిప్పులాంటి నిజాలు కదిలించవు, రాసుకున్న రాజ్యాంగాలు పనికి రావు, ఏమి రాజకీయాలు? ఈజిప్ట్ ల తెహరిర్ స్కెర్ లెక్ఖ నాలుకు కోట్ల మంది హైదరాబాద్ల జమ అయితే కేంద్రంల కదుల్తర? ఇయాల తెలంగాణాల గల్లి గల్లి కి ఒక తెహరిర్ స్కెర్ ఉండనే ఉంది..ఈజిప్ట్ కాదు దాని అబ్బ పోరాటం చేస్తానికి సిద్డంగున్నారు, కదిలించ నీకి ఒక నాయకుడు లేదు, ఉన్నాట్టు లేనట్టు ఒకరో ఇద్దరో ఉంటారు, ఎవడు ఎం చేస్తరో అర్థం కాదు, కడుపు చించు కుంటే కాళ్ళ మీద పడతది, ప్రజలని ఒదిలేయండి ప్లీస్ , మాకు ఏ నాయకులు వద్దు..మమ్మల్ని మేము చూసుకుంటాం, ప్రజలే డిసంబర్ తొమ్మిది ప్రకటన తెచ్చుకున్నారు, వాళ్ళే తెలంగాణా కూడ తెచ్చుకుంటారు.. మీ లెక్కల్ల, ప్రనాలికలల్ల మా పానాలు అడుగంటుతున్నై, ఆశలు కొండేక్కుతున్నై..ఒక ఉద్యమ పార్టీగా పేరు తెచ్చుకుంటే ఒక్క మంచి ఎందుకు జరుగుట లేదు అయ్యా? ఇయాల నా అన్న తమ్ములు సస్తున్నారు, మీ కు గుండె ఎందుకు కరుగుత లేదు, ఒక్కొక్క శవం మీద ఎన్ని కోట్లు పెడతారు? ఎందుకు ఇవాళ రహదార్లు బందు పెడతలేరు ? నా అన్నల తమ్ముల పానాలు అంటే అంతా చులకననా..వాడెవడో కౌన్ కిస్కా గాడు సస్తేనే ఆంధ్ర వచ్చిందంట కదా? మా వాళ్లకి ఎం తక్కువనే? ఏ స్వార్థం లేకుండా పానాలు ఇస్తున్నారు..వాళ్లకు బుద్ది లేదు సరే, పానం అంటే లెక్ఖ లేదు , మనకు కూడ బుద్ది లేదా చావులు చల్లంగా సుస్కుంట కాలం గడుపుదామ.. మస్తు టైం పాస్ ఐతది లే? వారెవ్వా ఏమి ఉద్యమం రా భై..ఏకదం చఖాస్!
నాయకులకు అందరికి ఈ పానాలు హెచ్చరిస్తున్నాయి, పులి మీద స్వారి చెయ్యొద్దు, మా అమాయకత్వం మీద రాజకీయాలు చేయొద్దు..ఒక్క సారి తిరగాబడ్డారంటే ఇంక ఎవడు ఎవడిని కాపాడలేదు..అన్నా! గాంధీలేమో కాని గాడ్సేలు పుట్ల కొద్ది పుట్టుకొస్తారు. జర పైలం గా ఉన్డున్డ్రి ..మీరు మమ్మల్ని కాపడలేరని మాకు అర్థం అయింది, కనీసం మీ పానాలన్న కాపాడుకోండి..
ఔర్ ఎక్ ధక్కా! ఇపుడు బిల్లు పెట్టకపోతే, ఈ తెలంగాణాల ఏ రాజకీయ నాయకుడు, పార్టీ అవసరం లేదు.. అందరూ చాతకాని దద్దమ్మల కిందనే l ఎవడు ఎవడిని తిట్టుకోవద్దు..మాకు ఈ తిట్ల పురాణాల మీద నమ్మకాలు పోయినాయి, చాతనైతే ప్రజలలో ఉన్న గుండెల మంటని ఒక్క తాటికి తెస్తే, తెలంగాణా వస్తది, అమ్మ, అబ్బ దిగి వస్తారు..లేకపోతె మీ పని మీరు, మా పని మేము, మీ దద్దమ్మ రాజకీయాలు చూసి మా పోరాటాలకు చెడ్డ పేరు వస్తుంది. ముళ్ళ కంచెలు అడ్డం వేసి, రోడ్ల మీద మంటలు వేసి, చీపుర్లతో ఇవాల ఎట్లా రచ్చబండల నాయకులని ఎల్ల గోడుతున్నమో , అట్లనే ఎల్ల గోడతం ఒక్కొక్కడిని..యాద్ పెట్టుకోండి, ఇపుడు మాకు అన్ద్రోడు, మావోడు అనే బేదాలు లేవు..మమ్మల్ని పట్టిన్చుకోనోల్లందరూ మాకు శత్రువులే..
కోయి బాత్ నహి భాయ్, మీరు మంచి గా వోటు రాజకీయాలు చేసుకోండి , మేము పోరాడుతాం, చస్తాం, బతుకుతాం..తెలంగాణా నే ఉపిరి, పానం గా బతుకుతాం..మాకు ఇల్లూ వాకిలి, ఇష్టాలు కష్టాలు అన్ని తెలంగాణనే, ప్రజలుగా ఒక్కటైన రోజు..హోస్ని ముబారక్ లకి ఇంక తెలంగాణాల జాగా లేదు రా! ఇప్పటికైనా సర్డుకుంటే మంచిది, లేకపోతె..మే యువర్ సోల్స్ రెస్ట్ ఇన్ పీస్ !
జై తెలంగాణా!
సుజాత సూరేపల్లి
take BY: Simply Telangana
Read more...