లాఠీలు తూటాలు తెలంగానని ఆపలేవు
కొట్టండిరా బాగ కొట్టండి
మా తలలు చిట్లేటట్టు
ఇన్ని రొజులుగా మిమ్మల్ని
నమ్మినందుకు మా మెదళ్ళు పగిలెటట్టు
కొట్టండి..లాఠీలు కాదు దుడ్డు కర్రలతో
ఒక్కళ్ళు కాదు పదిమంది కొట్టండి
బొక్కలు ఇరిగెటట్టు
మాకు ఈ శాస్తి కావలసిందె
మాకు గుడిసె కూడ లేకుండా
మీరు మా జాగల బంగ్లాలు కట్టుకున్నపుడు
చెమటోడ్చి దగ్గరుండి కాపల
కుక్కల్లెక్క గూర్ఖా లైనము
ఇదెం అన్యాయం అని ఎన్నడూ అడుగలె
ఆ మంచితనం మచ్చుకైన లెకుండా
పొయెదాక కొట్టండి
మా నీళ్ళు మీరు తోల్క పొతుంటే
అంతా మావొల్లే అని మర్యాదగా
ఉర్కొని మట్టి పని చేసుకుంటెందుకు
మూటముల్లె సర్దుకొని
ముంబయి, దుబై పొయినము ,నీళ్ళు లేక
బొర్లు ఎసుకొని బొర్ల బడి
బతుకులు ఆగం చెసుకున్నం
చావులని చల్లంగ చూసినం
నర నరాల్లొంచి ఈ మర్యాద
పొయెదాక కొట్టండి
కింద మిద బడి గింత చదువు
చదువుకుంటె కొలువులొస్తయిలె అని
ఆశ పడ్డం, ఎడినుంచొ వచ్చి
గద్దలొలె తన్నుకు పొతె
మా రాజకీయ నాయకులు
కాపాడుతరులె అని
కోటి ఆశలు పెట్టుకొని
ప్రతిసారి నమ్మినం
మా నమ్మకాలు అన్ని
నాశనం అయెటట్టు కొట్టండి
పాఠాలు నేర్సుకునే మా పిల్లల మీద
బలగాలు దింపి
బాష్ప వాయువులు ఎయండి
హక్కులు అడిగినపుడల్లా
తూటాలతో పిట్టలను
కాల్చినట్లు కాల్చండి..
రాజకీయ నాయకుల్లార
మా శవాలను తివాచిల్లాగ
పరచుకొని వాటిపై
మా రక్త మాంసాలను
అమ్ముకొని సంపాదించిన
సొమ్ములు, పదవులు ఎంజాయ్ చేస్కుంట
ఆంధ్రా నాయకుల
తొత్తులుగా మారి
మా పై జరుగుతున్న విద్వంసాన్ని
ఆహ్లాదంగా ఆస్వాదించండి
సిగ్గు లజ్జ లేని
శవ రాజకీయాలను చేసె
నాయకుల్లారా మీరు
ఈ తెలంగాన గడ్డ బిడ్డలైనందుకు
మా చావులు, మా పై విరిగిన లాఠీలు
చిందిన రక్తం, మిమ్మల్ని
కదిలించనందుకు,
మీ మౌనాన్ని చూసి
మమ్మల్ని మెమె అసహ్యించుకుంటున్నం
రాపిడిలొ పుట్టేవి అగ్గి రవ్వలే
పిల్లిని పట్టుకొని కొడితే అయ్యేది పులే
ఇక్కడ రక్తంలో అమాయకత్వం ఉంది
అట్లనే విప్లవం కూడా ఉంది
బ్రిటీష్ రాజరికపు గోడలను,
దొరల గడిలను
రజాకార్ల అరాచకాలను
కూల్చిన రక్తం
గుండుకు గుండె పెట్టిన ధైర్యం
అన్యాయాన్ని భరించ లేక
ప్రాణాలను కూడ లెక్ఖ చెయని యువ రక్తం
ఈ అణచివేతలు , ఊచ కోతలు
హింసలు విద్వంసాలు
తెలంగానని ఆపలెవు
మంచితనాన్ని , అమాయకత్వాన్ని
అణచివేస్తే వచ్చే ఆవేశాన్ని
దాని రూపాలని
అంచనా వెయలేవు
సైన్యాన్ని దింపితె
అక్కడ జరిగేది యుద్దమే
మర్యాద తప్పితే
మారణ హొమమే
మానవత్వాన్ని, మంచిని మరిస్తే
తయారయేది మానవ బాంబులే
శాంతి కావాల్న?
అశాంతి కావాల్నా తేల్చు కోండి
సుజాత సురేపల్లి
Take By: simply telangana
0 comments:
Post a Comment