9/17 Special : తెలంగాణా సమర గీతం
ఈ రేయి, ఆ రాయి చిరునవ్వుల పాపాయి
కదిలాయి, పాడాయి ఒక స్వేచా గీతం
ఆ గీతం పాడింది నవాబులకు చరమ గీతం
మరువలేము మనమెప్పుడు తెలంగాణా సమర గీతం ||2||
పల్లె కదిలింది, పిల్లా కదిలింది ||2||
పడచు కదిలింది, పడతీ కదిలింది
అది చూసిన నవాబులకు
నర నరాన, ఖన ఖనాన
ఉద్భావిందే బయోత్పాతం…… అదే స్వేచా గీతం
ఆ గీతం పాడింది నవాబులకు చరమ గీతం
మరువలేము మనమెప్పుడు తెలంగాణా సమర గీతం
చుక్క పొడచింది, చినుకు రాలింది ||2||
మొక్క మొలచింది, మానై వెలసింది
ఆ నీడలో, జడి వానలో
యుగ యుగాన, తర తరానా
వినుపించు అనునిత్యం ఆ ప్రళయ గీతం….. అదే స్వేచా గీతం
ఆ గీతం పాడింది నవాబులకు చరమ గీతం
మరువలేము మనమెప్పుడు తెలంగాణా సమర గీతం
Thanks Vinodh Kumar Mandhala for sharing
take BY: simply telangana
0 comments:
Post a Comment