తెలంగాణ యుద్ధ నీతి!
తెలంగాణా బిడ్డలు యుద్ధం చేస్తున్నారు , సంవత్సరాల తరబడి అలుపెరుగని పోరాటం చేస్తున్నారు, గత శతాబ్ద కాలంగా రాజకీయ రూపు సంతరించుకున్నపుడే ఈ యుద్ధం మొదలైందని చాల మందికి అపోహలున్నాయి, చరిత్ర చదువుతుంటే దీని మూలాలు అన్యాయానికి పాల్పడ్డ ప్రతిసారి ఎదురొడ్డి నిలిచి , ఇడ్లి సాంబార్, గోంగూర గో బాక్ కంటే ముందునుండే ఉన్నాయ్. ఏ యుద్దమైన రక్త తర్పణ జరిగినపుడు, ప్రాణాలు కోల్పోయినపుడే బయటికి వస్తుంది, కేవలం ఆకాంక్షలను బయట పెట్టడానికి మాత్రం పార్టీలు, ఎన్నికలు అవసరం అవుతాయి, అవి రాజకీయ పరిష్కారానికి దారి తీస్తాయి, అదే చరిత్ర, ఏ పోరాట చరిత్ర చూసిన అంతే . గెలుపు ఓటములు ఉద్యమ ప్రభావాన్ని బట్టి మాత్రమే ఉంటాయి, ఎంత మద్యం ఏరులై పారినా, డబ్బు సంచులు చేతులు మారిన, రాజకీయ సమీకరణాలు ఎంత మోసం చేసిన కూడ , తెలంగాణా వోటు ఎపుడు నిజాయితికే పడింది, ప్రేమకి పడింది, నమ్మకానికి పడింది..కథ ముదిరి పాకాన పడిన్దిపుడు, ప్రాణాలు తీయకుండా, ప్రాణాలు తీసుకొనే కాడికి వచ్చింది..నిజాన్ని, నివురు గప్పిన ఉద్వేగాన్ని లావాలా తన్నుకుని వచ్చే సమయం ఆసన్న మైంది.
ఆంధ్రా చానళ్ళ వ్యవహారం, ఆంధ్రా పత్రికల కథనాలు చూస్తుంటే, సగటు తెలంగాణా వాది గుండె బరువేక్కక మానదు, ఒకడు ఇప్పట్లో రాదంటాడు, మరొకడు జగన్ అడ్డం అంటాడు, పొలిసు బలగాలు మొహరించాయి కాబట్టి, యునివర్సిటిలల్లో, విసి నియమకాలల్లో ‘ గవర్నర్’ అనే పొలిసు అధికారి హస్తం ఉండాలని జివో తెచ్చు కున్నారు కాబట్టి, ఇక ఉద్యమాల దుకాణం బంద్ అంటాడు, కేసులు ఎత్తివేయాలని అడుక్కొని, అడుక్కొని అలసిపోయిన నాయకులకి, సరి అయిన సమాధానం దొరకలేదు కాబట్టి ఇంక అంతే అంటాడు, నిజంగా మన నాయకులు కూడ అమాయకులే సుమా, ఈ ప్రభుత్వాలు ఎపుడైనా అడగంగానే ఏమైనా ఇచ్చినాయ? ఆ అవకాశం, ఆశ తెలంగాణా విషయంలో ఎపుడైనా జరుగుతుందా? చిరంజీవితో ఒక మాట మాట్లడిస్తారు, హటాత్తుగా జయ ప్రకాష్ అనే విప్లవ వాది ఏదో కూస్తాడు..సోనియా అమ్మ, ప్లినరి లో ఏమి మాట్లాడ లేదు కాబట్టి, మాట్లాడ నివ్వలేదు కదా, కచ్చితంగా తెలంగాన రాదు అని కావూరి గాడు కావ్ కావ్ అని అరుస్తాడు..ఒకాయన రైతులకోసం ప్రాణాలు అర్పిస్తాను అని ఒక నాటకం, మరొకాయన ‘లక్ష దీక్ష’ అని లవ్ వలక పోస్తూ ఇంకో naatakam..ఇవి రెండు మాత్రం టీవి వాళ్లకి పండుగ, నిరంతరం చూపిస్తుంటారు. అవును మరి, వాళ్ళలో ఉన్న రాజకీయ ఐక్యత, మీడియా ఐక్యత, జాక్ల ఐక్యత, వ్యాపారుల ఐక్యత మనకు ఉందా? అసలు సాని మంత్రాలు, పాటలు పాడటానికే ఉన్న ఒకే ఒక చానెల్ పరిమితమైంది, అపుడో ఇపుడో కొద్దిగా తెలంగాణా కవరేజ్ చేస్తుంటారు. అందులో సవా లక్ష రాజకీయాలు, ఏమి చేస్తాం, బాంచన్ దొరా అనాలే, కొద్దిగా తేడా మాట్లాడినా, నువ్వు ద్రోహిగా మిగిలిపోతావ్ జాగ్రత్త! అవును భై! ఇది సత్యం, ఇదే సత్యం!
ఇపుడేంది మరి? ఏమి చేయాలే? మనోల్లందరూ, ప్రతోక్క సంఘం పొద్దుగాల నుంచి , పోద్దుమికిన్దాక మీటింగులు పెట్టుకుంటున్నారు, మాటలు మాటలు, చర్చలే చర్చలు, ఆవేశ కావేశాలు..అయినా ఏమంటది కృష్ణ కమిటి రిపోర్ట్? ఎవరికైనా ఇసుమంతైనా నమ్మకం ఉందా? రాత్రి పగలు కష్ట పడి , రిసర్చ్ చేసి కొండంత ఆసతో మరి ఇస్తిమి..ఇపుడు మంచిగా , మనకోసం రాకపోతే ఏమ్చేయాలే అని ప్లాన్ వేస్తుంటిమి..కర్ర ఇరగది, పాము చావడి లెక్క ఉంటది అని చాన మంది చెపుతున్రు..బాగానే ఉంది మరి ఆరువందల మంది దాక పానాలు పోగొట్టుకున్నారు కదా, వాళ్ళ సంగతి తెలేదేట్ల? ఇపుడిపుడే సహాయ నిరాకరణ అని కొంత మంది అంటున్రు, వ్యాపారాలు బందు పెట్టాలె అంటే మరికొంత మంది అయ్యో ఎట్లా అని వాపోతున్నారు, వాళ్ళకంటే ఎక్కువ మనకే బాద ఉన్నది..ఇయాల కాంగ్రెస్ నాయకులు మంతనాలు చేస్తున్నారు, మనం కూడ అన్ద్రోల్ల లెక్క రాజీనామాలు చేస్తే బాగుంటది అని ఒక దయగల్ల పెద్ద మనిషి అన్నదంట, అంతా గొప్ప గుణం మనోళ్ళకు ఉంటె, తెలంగాణా ఇన్ని రోజులు పడుతున్దేనా, ఇన్ని సావులు కళ్ళ చూస్తుంటిమ? ఇదేదో మన మీద ప్రేమ అంటే పొరపాటే, వారి రాజకీయ భవిష్యత్తు కోసం అని అనుకోవాలే. మన నాయకులు అందరు ఒక్క తాటిపైన నడిచేటట్టు మనం అందరం వత్తిడి తేవాలే, లేకపోతె పిల్లలు ఇంకొంతమంది ఆగమైతారు. ఒకాయన వచ్చే ఎన్నికలలో ఎట్లా గెలవాలే అంటుండు, అయ్యా! వచ్చే ఎన్నికలు అంటే, ఇక్కడ జరిగే సావులకి బొందపెడ్తానికి కూడ జాగలేదు, అన్ద్రోల్లని జాగా అడుక్కోవాలే, ప్లీస్ అట్లా అనకున్డ్రి, మీ కల్మోక్తం కాని. అందరు ఒకే మాటపై ఉంది, ఇంక బోనాలు, బతకమ్మలు, రోడ్ల పై బోజనాలు కాకుండా, కాస్త కాక తలిగే పనులు చేయాలే, మూటా ముల్లె సర్దుకొని పోయేటట్టు చేయాలే..ఆ తీరుగా మనమందరం ఆలోచించాలే.
ఆంద్ర సినిమాలు, ఆంధ్రా వస్తువులు, వ్యాపారాలు బందు పెట్టాలె, దయ చేసి ఒక్కరోజు నాటకాలు వేయడానికి, బేరాలు చేసుకోవడానికి మాత్రం కాదు సుమా, ఎవరికైనా ప్రేమ ఉంటె వారి ప్రాంతంలో వెళ్లి ఉండవచ్చు, రావొచ్చు, పోవచ్చు, రొయ్యలమ్ముకోవచ్చు అని పాటలు పాడుకుంట..అరె! చంద్రబాబు అనే పెద్ద మనిషి కోసం జాతీయ రహదారులు బందు చేస్తాం అని భూములు కబ్జా చేసిన దొంగలంతా రైతులకోసమని నాటకాలడిన్రు, మన తల్లిని, మన ప్రాంతాన్ని కాపాడు కోవాడానికి మనం ఆ పని చేయలేమ? నాయకులు పిలుపునిస్తే , యుద్ధ భేరి మోగిస్తే, సమర శంకం పూరిస్తే, నాలుగు కోట్ల మంది సిద్దంగున్నారు, మోసం చేయనికి ప్రయత్నిస్తే మాత్రం భూస్తాపితం చేస్తారు, ఇంక ఓపిక లేదు, సహనం లేదు, క్షమించండి శాంతి కాముకులార, ప్రజా స్వామ్య ప్రేమికులారా, మా ప్రాణాల కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం మేము ఏమైనా చేయడానికి సిద్ధం, మరొకసారి, కమీతల లాంటి నాటకాలు మీరు నమ్మొద్దు, మమ్మల్ని నమ్మిన్చోడ్డు, ఇపుడు జరిగేది అంతా ప్రత్యక్ష్య యుద్ధమే, మీరు ఒకే అయితే, మేము ఒకే, లేకపోతె మేమే నాయకులం, సైనికులం, కాపాడనీకి ఇంట్ల, బయట అన్నలు సిద్దంగా ఉన్డున్డ్రి, కులాలు, పార్టీలు దూరం పెట్టున్రి! ఒకే ఒక్క తెలంగాణా పాట పాడున్ద్రి!
ఇంక రిపోర్ట్ మంచిగోస్తే మంచిది, లేకపోతె చింపితే చలి కాసుకున్టానికి పనికొస్తది, అసలే సలి ఎక్కువుంది ఇయాల రేపు. మరిన్ని పానాలు పోకుండా కాపాడు కోవడానికి మన ఐక్యత చానా అవసరం. మసి పూసి మారేడు కాయ చేయ కుండా చూసుకోవాలి, బలగాలతో ఉద్యమాలని తొక్కి పట్టి అరవై తొమ్మిది తరువాతి పరిణామాలు రాకుండా చూసుకోవాలి, నవ్ ఆర్ నెవర్! మన విజయమా, ఆంధ్రా దోపిడీ దారుల విజయమా తేలి పోవాలి..ఇదే యుద్ధ నీతి, తెలంగాణా తీర్పు! ఎవరు ఎన్ని చెప్పినా న్యాయమే గెలుస్తుంది కదా! గెలుపు మనదే, మనం నమ్మాలి, మన పిల్లల్ని నమ్మించాలి!
జై తెలంగాణా!
Take By: simply Telangana
0 comments:
Post a Comment