(
నిజామాబాద్)తెలంగాణలోని పది జిల్లాల్లో చిన్నదైన జిల్లా నిజామాబాద్. కానీ.. పౌరుషంలో మాత్రం మేటిగా నిరూపించుకుంటోంది. యావత్ తెలంగాణలోనే కాక.. రాష్ట్రం మొత్తాన్నీ ప్రభావితం చేయగలిగిన నాయకత్వం ఎదగడం ఈ జిల్లా విశేషం. 33 ఏళ్ల క్రితమే నాటి పీపుల్స్‌వార్ ఉద్యమం నీడలో ఇందూరుగడ్డపై సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులపై వీరోచితమైన పోరాటాలే జరిగాయి. జంగల్, జమీన్ కోసం పొరక దొరల పేరిట రాంచందర్, ప్రసాద్ నాయకత్వంలో లక్ష కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన అటవీ పల్లెల్లో అగ్గిరాజుకుంది. జంగ్లాత్ అధికారుల దౌర్జన్యాలను, పల్లెల్లో పటేల్, పట్వారీ పెత్తనం, పంచాయతీల పేరిట దండుగుల వసూళ్ల దందాను రూపుమాపారు. రాజకీయ కక్షలు, కార్పణ్యాలకు చరమగీతం పాడారు. ఇప్పటికీ ఆ పోరు వారసత్వంతో నిజమాబాద్ జిల్లా నిప్పురవ్వలా ఉద్యమసెగలు తాకిస్తూనే ఉంది.
టీడీపీ కంచుకోటలు తునాతునకలు
నిజాం నవాబు పిలుపుతో వడివడిగా వచ్చి అగ్గువ సగ్గువకు భూములను కొనుక్కొని నిజాంసాగర్ కాలువల పొంట వెలసిన తెలంగాణ సెటిలర్లు టీడీపీ ఆవిర్భావంతో రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకున్నారు. బోధన్, బాన్సువాడ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల గెలుపోటములను నిర్దేశించగలిగిన స్థాయికి ఆ సామాజిక శ్రేణులు ఎదిగాయి. ఫలితంగానే టీఆర్‌ఎస్ ఆవిర్భావానికి మునుపు జిల్లాలో టీడీపీ అడ్డా భిఠాయించగలిగింది. స్థానికసంస్థల ఎన్నికల ఫలితాలు, తెలంగాణ అంతటా తెలంగాణ రాజకీయ శక్తుల పునరేకీకరణ కారణంగా 2004 ఎన్నికల్లో వై.ఎస్ రాజకీయ అనివార్యతలో భాగంగా టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నారు. ఈ పొత్తు సమీకరణ 2004 ఎన్నికల్లో టీడీపీని నామరూపాలు లేకుండా చేసింది. 9 నియోజకవర్గాల్లో మూడింటిని టీఆర్‌ఎస్, మిగిలిన ఆరింటిని కాంగ్రెస్ గెలుచుకోగా టీడీపీకి అసెంబ్లీలో నిజామాబాద్ నుంచి ప్రాతినిథ్యమే లేకుండాపోయింది.
ఆ నాలుగేళ్లకు ఉప ఎన్నికల పుణ్యమా అని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మండవ వెంక గెలువడంతో ఒక స్థానంపై పచ్చజెండా ఎగిరింది. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌తో పొసగిన పొత్తుతో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బాగానే రాజకీయ లబ్ధి పొందింది. టీఆర్‌ఎస్ మద్దతుతో ఐదు స్థానాలను గెలుచుకోగలిగింది. అయితే ఆ సంబరం ఎంతోకాలం మిగల్లేదు. చంద్రబాబు రెండుకళ్ళ సిద్ధాంతాన్ని ధిక్కరించి బాన్సువాడ గడ్డపై టీడీపీకి పెద్దదిక్కయిన పోచారం శ్రీనివాస్ రెడ్డి టీడీపీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఉద్యమ సారథిగా పేరు తెచ్చుకున్న టీఆర్‌ఎస్‌లో చేరి.. 50 వేల మెజార్టీతో గెలిచారు. కామాడ్డి డివిజన్‌లో టీడీపీలో బలమైన నాయకుడిగా ఎదిగిన గంప గోవర్ధన్ సైతం తెలంగాణ కోసం గులాబీ గుడారంలో చేరారు. ఎమ్మెల్యే పదవికి ఆయన చేసిన రాజీనామా ఆమోదం పొందింది. మూడు అసెంబ్లీ స్థానాలకే పరిమితమైన టీడీపీ జిల్లాలో రాజకీయ ప్రాభవాన్ని రోజురోజుకు కోల్పోతూనే ఉంది. తెలంగాణపై స్పష్టమైన వైఖరిని చెప్పలేని ఇరకాట పరిస్థితి కారణంగా జిల్లాలో టీడీపీ నిర్మాణపరమైన నష్టాన్ని చవిచూస్తోంది.
అందరూ పెద్దోల్లే - అయినా ఎవరికి వారే
20 ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పగలుగుతున్న ఉద్దండులే జిల్లా కాంగ్రెస్‌లో ఉన్నారు. మర్రి చెన్నాడ్డి హయాం నుంచి మొదలుకొని కిరణ్‌కుమార్ కేబినెట్‌లోనూ ఇందూరు రాజకీయ ఉద్దండులు ఒక వెలుగు వెలుగుతూనే ఉన్నారు. చెన్నాడ్డి, విజయభాస్కర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గాల్లో జిల్లాకు చెందిన డీ శ్రీనివాస్, సంతోష్‌డ్డి, షబ్బీర్ అలీ గతంలో చక్రం తిప్పినవారే. ఐదేళ్లు స్పీకర్‌గా సురేష్‌డ్డి సైతం రాష్ట్ర రాజకీయాల్లో స్థిరపడ్డారు. ఇప్పటికీ డీ శ్రీనివాస్ 10జనపథ్‌తో సన్నిహిత సంబంధాలను కలిగిఉన్నారు. ఫలితంగానే వరుస పరాజితుడైనప్పటికీ, ఆయనను ఎమ్మెల్సీ పదవి వరించింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌తో షబ్బీర్ అలీ, కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ కోటరీలో చోటుకలిగిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, ఎంపీ మధుయాష్కీ గౌడ్‌లు రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలకపావూతనే పోషిస్తున్నారు. ఇలా జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఉద్దండులు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన స్థాయికి ఎదిగారు. కానీ ఈ నేతల మధ్య ఆధిపత్యపోరు మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. డీఎస్, సుదర్శన్ రెడ్డి మధ్య ఆధిపత్యపోరు పలు సందర్భాల్లో జిల్లా యంత్రాంగానికి తలనొప్పి తెచ్చిపెట్టింది.
కేరాఫ్ హైదరాబాద్
పార్టీ ఆవిర్భావం నుంచి మొదలుకొని ఇప్పటిదాకా జిల్లాలో టీఆర్‌ఎస్‌కు మంచి పట్టు ఉంది. ప్రాంతాలకు అతీతంగా అంతటా టీఆర్‌ఎస్‌కు అనుకూల వాతావరణమే ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులు కలిగిన జుక్కల్, మద్నూర్, పిట్లం, నిజాంసాగర్ లాంటి ప్రాంతాల్లో సైతం ప్రజలు గులాబీ జెండాను మోసేందుకు సిద్ధంగానే ఉన్నారు. 2001 స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు జనం బ్రహ్మరథం పట్టారు. 520 సర్పంచ్ స్థానాలను, 228 ఎంపీటీసీ స్థానాలను, 23 మండల పరిషత్ అధ్యక్ష స్థానాలను టీఆర్‌ఎస్ గెలుచుకోగలిగింది. 36 స్థానాల్లో 19 స్థానాలను గెలిచి జిల్లాపరిషత్‌పై గులాబీ జెండాను రెపపలాడించారు. అప్పటి నుంచి మొదలైన తెలంగాణ రాజకీయ ప్రస్థానం ఇందూరు గడ్డపై సంప్రదాయ రాజకీయ పార్టీలను చావుదెబ్బ తీసింది. మూడు గంటల్లో జిల్లా అంతటా కలియతిరిగేందుకు వీలుగా ఉన్న భౌగోళిక స్వరూపం సైతం అంతగా ఆర్థిక వనరులు లేని తెలంగాణ ఉద్యమ రాజకీయ ప్రస్థానానికి కలిసొచ్చిన అవకాశంగా చెప్పుకోవచ్చు. కానీ నిజామాబాద్‌లో నాయకత్వ లోపాలే టీఆర్‌ఎస్‌కు శాపంగా పరిణమించాయన్న వాదన ఉంది.
పార్టీకి జవసత్వాలు పోయాల్సిన కీలక బాధ్యత కలిగిన నియోజకవర్గ ఇన్‌చార్జిలు కేరాఫ్ హైదరాబాద్‌గా ఉండడమే అసలు సమస్యగా మారింది. స్థానికంగా అందుబాటులో లేని నియోజకవర్గ నాయకత్వం వల్ల పార్టీ వ్యవస్థాగతమైన వ్యవహారాలు అంతగా సాగడంలేదన్న విమర్శ ఉంది. జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో జుక్కల్, బాన్సువాడ, నిజామాబాద్ ఇన్‌చార్జిలు మినహా మిగతా వారంతా హైదరాబాద్‌లోనే నివాసం. పార్టీ కార్యక్షికమాలప్పుడు చుట్టంచూపుగా వచ్చి వంటి కారణాలు పార్టీని దెబ్బతీస్తున్నాయని టీఆర్‌ఎస్ శ్రేణులు చెబుతున్నాయి.
కమలం శ్రేణుల కదనోత్సాహం
2009 సాధారణ, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో గెలవడం కమలం ్రే ణుల్లో సరికొత్త కదనోత్సహానికి దోహదపడింది. యెండల లక్ష్మీనారాయణ వరుస విజయాల పరంపర నీడలో జిల్లా రాజకీయాల్లో పట్టు సాధించేందుకు బీజేపీ అడుగులేస్తోంది. కేసీఆర్ నిరాహారదీక్షల సందర్భంగా ఎగిసిన ఉద్యమాన్ని వేదికగా చేసుకొని బీజేపీ సంస్థాగతంగా పటిష్టత కోసం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఉద్యోగుల సహా య నిరాకరణ, సకల జనుల సమ్మె వంటి మలి విడత పోరాటాల్లో ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని పెంచుకొని పార్టీ శ్రేణులను క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా మార్చింది.
న్యూ డెమోక్షికసీలో నూతనోత్తేజం
ప్రజా సమస్యలపై పనిచేస్తున్న న్యూ డెమోక్షికసీకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లడాయి నూతనోత్తేజాన్ని ఇస్తోంది. నిజామాబాద్, ఆర్మూర్ ప్రాంతాల్లో మాత్రమే కొంతమేరకు ప్రభావితం చూపగలిగిన స్థాయిలో ఉన్న ఆ పార్టీ మలితరం తెలంగాణ పోరాటంలో కీలకపాత్ర పోషించడం ద్వారా జిల్లా రాజకీయాల్లో వెలుగు వెలుగుతోంది. మిలిటెన్సీ ఎత్తుగడలతో తెలంగాణ ఉద్యమ శక్తుల మెప్పును పొందుతోంది. రచ్చబండ సభల సందర్భంగా వందలాది మంది పోలీసుల కళ్లుగప్పి జై తెలంగాణ నినాదాలతో కిరణ్ సర్కారు ప్రతినిధులకు ఇందూరు గడ్డపై చెమటలు పట్టించారు.
లడాయిలో సీపీఐ చురుకైన పాత్ర
గతంలో ప్రజా సమస్యలపై సభలు, సమావేశాలకే పరిమితమైన సీపీఐ జిల్లాలో మలితరం తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్రనే పోషిస్తోంది. తెలంగాణ డిమాండ్‌పై కలెక్టరేట్ ముట్టడి వంటి కార్యక్షికమాల్లో సాయుధ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి, రక్తం చిందించగలిగిన తెగింపును ఆ పార్టీ నాయకత్వ శ్రేణులు అనేకసార్లు ప్రదర్శించాయి. మిలిటెన్సీ స్వరూ పం కలిగిన కార్యకలాపాలతో తెలంగాణ ఉద్యమంలో సీపీఐ ప్రత్యేకతను చాటుకుంది.
ఇరకాటంలో సీపీఎం
తెలంగాణ ఉద్యమం ఉప్పెనైన తరుణంలో సీపీఎం నీళ్లు, పింఛన్ల కోసమని ఆందోళనల పేరిట తెలంగాణకు పోటీ కార్యాచరణతో ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. పదేళ్లుగా అస్థిత్వం కోసం ఆరాటపడుతున్న సీపీఎం జిల్లాలో బలంగా నాటుకుపోయిన తెలంగాణ ఆకాంక్ష ముందు వెల ఈ పరిస్థితి ఆ పార్టీని ఇరకాటంలోకి నెడుతోంది. దశాబ్దాల తరబడి జిల్లాలో పని చేస్తున్నప్పటికీ సీపీఎంకు జిల్లాలో గ్రామస్థాయి ప్రజావూపతినిధి, పట్టణాల్లో బస్తీస్థాయి ప్రజావూపతినిధి లేకపోవడం గమనార్హం.