Friday, December 10, 2010
ఇక సహాయ నిరాకరణ
హైదరాబాద్, : తెలంగాణకు ద్రోహం చేసే నాయకులకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని తెలంగాణ ప్రజాఫ్రంట్ పిలుపునిచ్చింది. పార్లమెంటులో బిల్లు పెట్టడం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ ప్రజాప్రతినిధులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ సహాయ నిరా కరణ చేసేందుకు ప్రజలు సన్నద్ధం కావాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ చైర్మన్ గద్దర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు సంవత్సరం పూర్తయిన సందర్భంగా గురువారం ఎన్టీఆర్ స్టేడియంలో టీపీఎఫ్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. సభ ప్రారంభించే ముందు తెలంగాణ ఉద్య మంలో అసువులు బాసిన అమరవీరులకు నివాళులర్పించారు. డిసెంబర్ తెలంగాణ తర్వాత పూర్తిగా సహాయ నిరాకరణ ఉంటుందని గద్దర్ తెలిపారు.తెలంగాణ రాష్ట్రం వచ్చేవరకు తెలంగాణ భూములు, ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, వనరులు రక్షించుకునేందుకు పోరాటాలు చేయాలన్నారు. అనంతరం తెలంగాణ ప్రజాఫ్రంట్ బహిరంగ సభలో ఆమోదించిన తీర్మానాలను గద్దర్ విడుదల చేశారు.నేటి నుండి 22 తేదీ వరకు పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరుతూ ఎమెల్యేలు, ఎంపీలకు వినతిపత్రాలు ఇవ్వటం. ఈ నెల 23న తెలంగాణ జిల్లాల్లోని అన్ని కలెక్టరేట్ల ముందు ఆందోళన, ధర్నా కార్యక్రమాలకు పిలుపు.
24 నుండి జనవరి 4వ తేదీ వరకు ఎంపీలపై ఒత్తిడి పెంచటం. 5న రాజకీయ పార్టీల కార్యాయాల ముందు నిరసన కార్యక్రమాలు. జనవరి 26న ఛలో హైదరాబాద్‌కి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రజాఫ్రంట్ ఉపాధ్యక్షులు వేదకు మార్, రత్నమాల, ఆకుల భూమయ్య, కార్యదర్శులు వీరారెడ్డి, చిక్కుడు ప్రభాకర్, తెలంగాణ జర్నలిస్టు ఫోరం కన్వీనర్ అల్లం నారాయణ, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు స్వామి గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ దూం దాం కళాకారుడు రస మయి బాలకిషన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
take by: suryaanews