ఇక సహాయ నిరాకరణ
హైదరాబాద్, : తెలంగాణకు ద్రోహం చేసే నాయకులకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని తెలంగాణ ప్రజాఫ్రంట్ పిలుపునిచ్చింది. పార్లమెంటులో బిల్లు పెట్టడం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ ప్రజాప్రతినిధులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ సహాయ నిరా కరణ చేసేందుకు ప్రజలు సన్నద్ధం కావాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ చైర్మన్ గద్దర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు సంవత్సరం పూర్తయిన సందర్భంగా గురువారం ఎన్టీఆర్ స్టేడియంలో టీపీఎఫ్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. సభ ప్రారంభించే ముందు తెలంగాణ ఉద్య మంలో అసువులు బాసిన అమరవీరులకు నివాళులర్పించారు. డిసెంబర్ తెలంగాణ తర్వాత పూర్తిగా సహాయ నిరాకరణ ఉంటుందని గద్దర్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చేవరకు తెలంగాణ భూములు, ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, వనరులు రక్షించుకునేందుకు పోరాటాలు చేయాలన్నారు. అనంతరం తెలంగాణ ప్రజాఫ్రంట్ బహిరంగ సభలో ఆమోదించిన తీర్మానాలను గద్దర్ విడుదల చేశారు.నేటి నుండి 22 తేదీ వరకు పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరుతూ ఎమెల్యేలు, ఎంపీలకు వినతిపత్రాలు ఇవ్వటం. ఈ నెల 23న తెలంగాణ జిల్లాల్లోని అన్ని కలెక్టరేట్ల ముందు ఆందోళన, ధర్నా కార్యక్రమాలకు పిలుపు.
24 నుండి జనవరి 4వ తేదీ వరకు ఎంపీలపై ఒత్తిడి పెంచటం. 5న రాజకీయ పార్టీల కార్యాయాల ముందు నిరసన కార్యక్రమాలు. జనవరి 26న ఛలో హైదరాబాద్‌కి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రజాఫ్రంట్ ఉపాధ్యక్షులు వేదకు మార్, రత్నమాల, ఆకుల భూమయ్య, కార్యదర్శులు వీరారెడ్డి, చిక్కుడు ప్రభాకర్, తెలంగాణ జర్నలిస్టు ఫోరం కన్వీనర్ అల్లం నారాయణ, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు స్వామి గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ దూం దాం కళాకారుడు రస మయి బాలకిషన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
take by: suryaanews
1 comments:
Hi All !
First of all my honarable respects to Telangana.
Im having just two questions to ask on this issue.
1. Whatever problems facing by the Telagana people are unique. Or, same as all over the India is facing like Unemployment, Poverty, Lack of funds, Lack of development.
2. Very Important. if Telagana becomes seperate state who is going to benifit ? Think practically. Only politicians, as they will get reputed posts as CM, Cabinet Ministers etc. There will be no benifit to people. The public is already watching what these politicians doing to them. No matters whether the MLA or MP is belongs to Telagana or not. Now itself the politicians are playing with students' lives 7 crushing their future.
Finally, here the problem is not that we want separate state. We want "JUSTICE".
Justice of equality between rich & poor,
Justice of protecton between powereful and powerless,
Justice of servival between good & bad.
And these problems will never get resolved as these are "Universal problems of the world".
WHT IS THE SOLUTION...?
A;- My dear Telangana Brothers & Sisters !
Awake. Arise . Fight for the justice at your doorstep only. Who ever he/she may be the Ward counsellor, MLC,MLA, MP or CM. Kick them out if they are doing good infront of you. They should not turn back to you again. Boycott them. Don't follow them blindly. Think on your future. Work on your skills and talents.Because,
"KNOWLEDGE IS WEALTH"
- Jai Hind
Post a Comment