జహీరాబాద్‌లో టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభ
జహీరాబాద్, నవంబర్ 19 : టీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్‌రావు శుక్రవారం జహీరాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభ విజయవంతమైంది. స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిర్వహించిన బహిరంగ సభ వద్ద పెద్దఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్‌కు స్వాగతం పలికారు. సభ విజయవంతం కావడంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. సభ ప్రారంభంలో తెలంగాణ కళాకారులు నిర్వహించిన ధూంధాం కార్యక్రమం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాలను వారు ఆట-పాటలతో వివరించారు.
సాయంత్రం నాలుగు గంటల నుంచే నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు సభా ప్రాంగణానికి తరలివచ్చారు. ఐదు గంటల పది నిమిషాలకు సభ ప్రాంగణానికి తరలివచ్చిన కేసీఆర్ వేదికపైకి వచ్చి ప్రజలకు అభివాదం చేయడంతో సభ ప్రాంగణమంతా తెలంగాణ కేరింతలతో మారుమోగింది. మొదట మాజీ ఎంపీపీ లక్ష్మారెడ్డితో పాటు వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్‌లో చేరిన నాయకులకు కేసీఆర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
సభాప్రాంగణమంతా గులాబీమయమైంది. కేసీఆర్ రాక సందర్భంగా పట్టణంలో భారీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. కేసీఆర్ ఉర్దూలో మాట్లాడి మైనార్టీలను ఆకట్టుకున్నారు. ఈ సభలో టీఆర్ఎస్‌నాయకుడు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుతో పాటు జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు రఘునందర్‌రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రామలింగారెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, మునీర్ నియోజకవర్గ ఇన్‌చారిజ గౌని శివకుమార్, నాయకులు వై.నాంద్రప్ప, మునీరుద్దీన్, ఎండీ. యాకూబ్, వై.శశికాంత్, నామ రవికిరణ్, ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఎండీ. మతిన్, ముత్యాల చందు, హన్మంత్‌రెడ్డి, ఇసాముద్దీన్, కాంతారెడ్డి, ఆర్.స్వామిరెడ్డి, విఠల్‌నాయక్, వెంకట్‌రెడ్డి, రంగమ్మ, శాంతమ్మ, పుణ్యమ్మ, పర్వత్‌రెడ్డి, దత్తాత్రేయ, పండరి, రాణాప్రతాప్, బస్వరాజ్, ప్రశాంత్, గులాం, అంజి, సమీమ్, జహీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
take by: Andrajyothi
Keywords: Eenadu, Anhdrajyothi, Surya, RAJNews, Hmtv,
0 comments:
Post a Comment