Sunday, December 16, 2012
రేడియేషన్‌కు చెక్
-వీలైనంత తక్కువ సమయం ఫోన్ వినియోగించడం మంచిది. ఎందుకంటే రెండు నిమిషాలు ఫోన్లో మాట్లాడితే మెదడులో జరిగే విద్యుత్ ప్రకంపనల ప్రకంపనల ప్రభావం ఒక గంట వరకు ఉంటాయి.
-చిన్న పిల్లలకు సెల్ ఫోన్ అందుబాటులో ఉంచకపోవడమే మేలు. తప్పని సరి పరిస్థితుల్లో పిల్లలు ఫోన్ వాడాల్సి వచ్చినా హెడ్ ఫోన్లతో వినియోగించడం మంచిది. అదికూడా చాలా తక్కువ సమయం మాత్రమే.
-ఫోన్ హెడ్ సెట్ తో వినియోగించేటట్టయితే మమూలు వైరుతో ఉండేవి కాకుండా ఎయిర్ ట్యూబ్ హెడ్‌సెట్ వాడటం మంచిది. ఎందుకంటే మాములు వైరుతో ఉండేవి యాంటినాలా పనిచేసి చుట్టు పక్కల ఉన్న ఎలక్ట్రో మ్యాగ్నటిక్ ఫీల్డులన్నింటిని గ్రహిస్తాయి.
-సెల్‌ఫోన్ ఆన్ చేసి ఉన్నపుడు ప్యాంటు జేబులో కానీ బెల్టు పౌచ్‌లో కానీ పెట్టుకోవడం అంత మంచిది కాదు. ఎందుకంటే శరీరంలోని కింది భాగాలు తలతో పోల్చినపుడు రేడియేషన్‌ను ఎక్కువగా గ్రహిస్తాయి.
-హెడ్ సెట్ లేకుండా ఫోన్ వాడుతున్నపుడు డయల్ చెయ్యగానే కాకుండా కనెక్ట్ అయిన తర్వాత మాత్రమే చెవికి ఆన్చుకోవడం అలవాటు చేసుకోవాలి.
-సిగ్నల్ తక్కువగా ఉన్నపుడు ఫోన్ వినయోగించక పోవడం మంచిది. ఎందుకంటే అలాంటి పరిస్థితులలో ఫోన్ తన సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించి మరో ఫోన్‌తో కనెక్ట్ కావాల్సి ఉంటుంది. కాబట్టి రేడియేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది.
-తక్కువ ఎస్‌ఏఆర్(స్పెసిఫిక్ అబ్సాప్షన్ రేట్) ఉన్న ఫోన్‌ను కొనడం అన్నింటికంటే మంచి పద్ధతి.
-లేదంటే తక్కువ రేడియేషన్ ఉన్న సెల్‌ఫోన్ కొనడం మంచిది. ఈ వివరాలు మొబైల్ ఫోన్ మాన్యువల్‌లో ఉంటాయి. రేడియేషన్ ఫ్రీక్వెన్సీ రేటు ఎంత తక్కువగా ఉంటే అంత మేలు.
-కార్లు, లిఫ్ట్‌ల వంటి వాటిలో ప్రయాణం చేస్తూన్నపుడు ఫోన్ తక్కువగా ఉపయోగించాలి. ఎందుకంటే ఇటువంటి ఫారడే కేజ్‌లు రేడియేషన్‌ను దారి మళ్లించి వాటిలోపల ఉన్న వారి మీదికే పరావర్తనం చెందిస్తాయి.
-సెల్ ఫోన్ బ్యాటరీ తక్కువ చార్జింగ్‌లో ఉన్నపుడు కూడా ఫోన్ వినియోగించడం సురక్షితం కాదు. కాబట్టి తప్పకుండా ఫోన్ ఎప్పుడూ పూర్తిగా చార్జి చేసి పెట్టుకోవడం మంచిది.
-ఆహారంలో యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న పోషకాహారం తీసుకోవడం ఎంతో అవసరం. ఈ యాంటి యాక్సిడెంట్లు మెదడులోని డీఎన్‌ఏ విరిగి పోకుండా కాపాడుతాయి. జింక్ కళ్లను ఆక్సిడేంట్ల వల్ల జరిగే నష్టం నుంచి కాపాడుతుంది.
ఇలా చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తూ రేడియేషన్ బారి నుంచి తప్పించుకుంటూ ఆనందంగా సెల్‌ఫోన్ వినియోగించుకోవచ్చు.
వారం ముందుగానే...
ఈ వారంలో మీకు గుండె నొప్పి రానుందా లేదా కనుక్కునే పరీక్ష త్వరలో అందుబాటులోకి రానుంది. గుండెపోటు వచ్చిన వారి రక్తకణాలను ఆరోగ్యంగా ఉన్నవారితో పోల్చినపుడు చాలా అసాధారణ స్థాయిలో పెద్దవిగా ఉండడాన్ని గమనించారు పరిశోధకులు. ఇలా మారుతున్న రక్త కణాలు రక్తం చిక్కబడటానికి సూచనగా భావిస్తున్నారు. ఛాతిలో నొప్పి అనే సమస్యతో వచ్చిన వారందరికి ఈ రక్తపరీక్ష చేయించడం ద్వారా రెండు మూడు వారాల ముందుగా గుండెపోటు ప్రమాదాన్ని పసిగట్టవచ్చునని నిపుణులు అంటున్నారు. ఇలా ముందుగా పసిగట్టడం వల్ల రక్తాన్ని పలుచగా చేసే మందులు ఇవ్వడం ద్వారా గుండెపోటుని నివారించవచ్చునని పరిశోధకులు అభివూపాయపడుతున్నారు.
డాడీనే మమ్మీ
‘పిల్లల్ని
పెంచడం’ అనే బాధ్యత గురించి మాట్లాడుకున్న ప్పుడు సాధారణంగా తల్లిదండ్రుల
బాధ్యత, తల్లి బాధ్యత అనేవే ప్రము ఖంగా ప్రస్తావనకు వస్తాయి. పిల్లల్ని
నాన్న పెంచడం అనేది నిజ జీవితంలో అరుదుగా, సినిమాల్లో అందంగా
కనిపిస్తుంటుంది. కానీ రోజు లు మారాయి. బాధ్యతలు కూడా మారాయి, ఇది వరకటి
రోజుల్లో అయితే అమ్మ ఎప్పుడూ ఇంట్లో నే ఉండేది కాబట్టి పిల్లల సంగతి మొత్తం
అమ్మే చూసుకునేది. ఒకవేళ పుట్టింటికి వెళ్ళినా పిల్లల్ని తీసుకునే
వెళ్ళిపోయేది. తండ్రి మాత్రం మహరాజులా పిల్లల బాధ్యత లకు దూరంగానే ఇంతకాలం
ఉంటూ వచ్చాడు.ఇప్పుడు అమ్మ కూడా ఉద్యోగం చేస్తోంది. టూర్లు వెళ్తోంది.
అయినా ఏ ఆఫీసు పనీ లేకపోయినా, అమ్మకి కూడా తన స్నేహితురాళ్ళతో కలిసి అలా ఏ
అవుటింగ్‌కి అయినా వెళ్ళి రావా లని ఉండదా? ఇలా మారిన ఆధునిక వాతావరణంలో
పిల్లల్ని పెంచే బాధ్యతను తండ్రి కూడా నిర్వహించవలసిన అవసరం ఏర్పడింది. మరి
ఇంతకాలంగా అలవాటు లేని పనిని నాన్న సరిగా నిర్వహించగలడా? పిల్లల్ని
పొద్దున్నే నిద్రలేపడం, బ్రష్ చేయించడం, స్నానం చేయించడం, స్కూలుకి
తయారుచేయడం, టిఫిను బాక్సులు సర్దిపెట్టడం, తినిపించడం వీటన్నింటికి తోడు
వీరు చేసే అల్లరిని భరించడం, సముదా యించడం ఇలా ఒక తల్లి ఎంతో నేర్పుగా,
ఓర్పుగా చకచకా చేసే పనులను తండ్రి ఎంత సమర్థవంతంగా చేయగలడు? ఈ ప్రశ్నకు
జవాబు ఏదైనా సరే తప్పనిసరిగా ఇప్పుడు తండ్రి అవన్నీ చేయవలసిన పరిస్థితులు
ఏర్పడ్డాయి. తెలియక పోయినా తెలుసుకొని, నేర్చుకొని ఈ బాధ్యతలను తండ్రి
నిర్వహించవలసిందే. ఇప్పటికే చాలా మంది నాన్నలు ఈ పనులు చక్కగా చేస్తున్నారు
కూడా.
డాడీ పెంపకం ఎందుకు కష్టం?
మన
సమాజ సంసృ్కతిలో పిల్లల్ని పెంచడం లో ప్రధాన పాత్ర అమ్మదే. అమ్మకి ప్రకృతి
సహజంగా ఉండే ఓర్పు, చాకచక్యం యాదృచ్ఛికం గానే వచ్చేస్తాయి. పిల్లలకి
ఎప్పుడు ఏం కావాలో? ఏంచెయ్యాలో? ఎవరికి ఏది ఇష్టమో? ఎవరి మనస్తత్వం
ఎలాంటిదో? ఎవర్ని ఎలా దారికి తేవాలో? అన్నీ అమ్మకి తెలిసినట్లుగా, నాన్నకి
తెలియవు. దీనికి తోడు అమ్మ దగ్గర లేకపోయే సరికి పిల్లలు మానసికంగా కొంత
ఒత్తిడికి లోనవుతారు.. అమ్మ ఎప్పుడొస్తుంది? అని పదేపదే అడుగుతుంటారు. వారి
ప్రశ్నలన్నింటికీ సరైన జవాబులిస్తూ, వాళ్ళని మానసికంగా ఉత్సాహంగా ఉంచడం
అంత తేలికైన విషయం కాదు. ఒకవేళ పిల్లలు కాస్త అల్లరి వారు, మొండివారు అయితే
ఇక ఆ తండ్రి పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఇటువంటి పరిస్థితులలో
పొద్దున్న లేచిన దగ్గర్నుండి అమ్మ ఎప్పుడు ఏంచేస్తుందో ప్రతిరోజూ నిశితంగా
గమనించిన పిల్లలు, నాన్న అలా చేయకపోవడంతో ఇబ్బందిగా ఫీలవుతారు. నాన్న కి ఏం
తెలీదనే అనుకుంటారు. పిల్లలు ఒకరికొ కరు చెప్పుకొని నవ్వు కుంటారు. ‘అలా
కాదు డాడి అంటూ తండ్రికి పిల్లలే సలహాలు ఇస్తుంటారు.
తండ్రి పెంపకంలో తల్లి బాధ్యత
పిల్లల్ని
తండ్రి ఒక్క డే పెంచవలసిన పరిస్థితులు ఏర్పడినప్పుడు అందులో ఎంటువంటి
ఒడిదుడు కులు రాకుండా ఉండ డానికి తల్లి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
తాను
ఊరికి వెళు తున్నట్టుగా, కొన్ని రోజు లు పాటు ఉండననే విషయాన్ని పిల్లలకి
ముందే చెప్పి వాళ్ళని మానసికంగా సిద్ధం చేయాలి. ఎప్పుడంటే అప్పుడు ఫోన్లో
మాట్లాడ వచ్చని చెప్పాలి.
పిల్లల అలవాట్లు, దినచర్య, ఎప్పుడు ఏం చేయాలి అనే విషయా లను భర్తకు పూర్తిగా వివరించాలి. అవసరమైతే ఒక కాగితం మీద రాసి ఇవ్వాలి.
పిల్లలకు ఆరోగ్యం గురించిన విషయాలు, ముఖ్యంగా ఇవ్వవలసిన మందులు, పిల్లలకు పడని ఆహారం మొదలైనవి భర్తకి చెప్పాలి.
ఊరు వెళుతున్నందుకు తల్లే ముందుగా బెంగ పడిపోకూడదు. ‘మీరు ఎలా ఉంటారో, ఏమో? అనే మాటలు అసలు మాట్లాడకూడదు.
పిల్లలు
తండ్రికి ఎలా సహకరించాలో, వాళ్ళు స్వయంగా ఏయే పనులు చేసుకోవాలో చెప్పాలి.
అలా ఉంటే ఊరినుంచి వచ్చేటప్పుడు ఏయే బహుమానాలు తెస్తారో చెప్పాలి.
ఎవరికి వారే !
పిల్లల
వ్యక్త్తిత్వం, మనస్తత్వం రూపుదిద్దుకోవడంలో తల్లిదండ్రులిద్దరి ప్రభావా
లు వేరువేరుగా ఉంటాయి. ‘పెంపకం’ అనే పదం ఒకరికి సంబంధించినది కాదు. పిల్లలు
కేవలం ఒక్క తల్లి పెంపకంలోనే పెరిగినప్పుడు తండ్రి నుంచి నేర్చుకోవలసిన
అంశాలను కోల్పోతాడు. అలాగే తండ్రి ఒక్కడే పెంచిన ప్పుడు తల్లి నుండి
సంక్రమించే గుణాలను కోల్పోతారు. అమ్మ, నాన్న ఇద్దరూ కలిసి పిల్లల్ని
పెంచినప్పుడే అది సంపూర్ణ పెంపకం అవుతుంది. అయితే పరిస్థితుల ప్రభావం వలన
తండ్రి ఒక్కడే పిల్లల్ని పెంచవలసిన అవసరం ఏర్పడితే ముందుగా ఈ విషయానికి
సంబంధించి పిల్లల మనసులో తలెత్తే అనేక సందేహాలను పూర్తిగా తీర్చడం అత్యంత
ముఖ్యమైనది. పిల్లలు ఒక క్లారిటీకి వచ్చేట్లుగా చేయవలసిన బాధ్యత పెద్దలదే.
దీని వలన తమని ఒక్కరే పెంచుతున్నారనే విష యంలో పిల్లల్లో కలిగే మానసిక
సంఘర్షణ కొంత తగ్గుతుంది.
-తల్లి
గెర్హాజరుతో తండ్రే పిల్లల్ని పెంచవలసిన పరిస్థితులు ఏర్పడినప్పుడు అది
తండ్రికి, పిల్లలకి ఒక చక్కని అనుభవంగా ఉండాలంటే అందుకు తండ్రికి కొంత
ప్రిపరేషన్ అవసరం.
-కుటుంబంలో భార్య కూడా ఉద్యోగస్తురాలైనప్పుడు, లేదా
మరే ఇతర కారణాల వలన అయిన తాను కూడా ఎప్పుడో ఒకప్పుడు పిల్లల్ని పెంచవలసిన
అవసరం ఏర్పడుతుందనే విషయాన్ని ముందుగానే గ్రహించి, అందుకు తగినట్టుగా
ముందునుంచే పెంపకంలో తాను కూడా పాలు పంచుకోవాలి. తండ్రి పెంపకం పిల్లలకు
అలవాటయ్యేలా చూడాలి.
-అమ్మ దగ్గర లేకపోయినా నాన్న పెంపకం, నాన్నతో గడిపే సమయం తమకు అద్భుతంగా ఉంటుందని పిల్లలు భావించేలా తండ్రి వర్ణించి చెప్పాలి.
- ఇంట్లో ఉన్నంతసేపూ వాళ్ళతోనే ఆడుతూ, పాడుతూ, డ్యాన్స్‌చేస్తూ గడపాలి. లేకపోతే వాళ్ళకు ఖాళీ దొరికితే అమ్మకోసం ఏడ్చే ప్రమాదం ఉంది.
-పిల్లల
ఇష్టాయిష్టాలు, దినచర్య, ఆరోగ్య విషయాలు మొత్తం క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
తండ్రిలా గంభీరంగా, కోపంగా ఉండకూడదు. పిల్లల్ని బెదిరించకూడదు.
-
పిల్లల్ని పెంచడంతో భార్య పద్ధతిని అనుకరించకుండా, తనకంటూ ఒక ప్రత్యేక
పద్ధతిని భర్త రూపొందించుకోవాలి. అది పిల్లలకు నచ్చి ‘డాడీ సూపర్’
అనిపించేలా ఉండాలి. అయితే ఈ ప్రక్రియలో పిల్లలు ముందు భార్యని తక్కువ చేసి
మాట్లాడకూడదు.
-భోజనం విషయంలో ముందు పిల్లల్ని తినేయమని చెప్పకూడదు. పిల్లలతో కలిసి భోంచేస్తే తండ్రి పెంపకానికి మార్కులు పడతాయి.
-అల్లరి
పిల్లలు, మొండి పిల్లల్ని హేండిల్ చేసేటప్పుడు తండ్రికి కూడా భూదేవి అంతటి
సహనం ఉండాలి. అప్పుడే ఈ పరీక్షలో తండ్రి గెలవగలడు.
-పిల్లల అల్లరి
భరించలేక వారి కోరికలన్నీ తండ్రి తీర్చేయకూడదు. బోలెడన్నీ తిను బండరాలు,
బొమ్మలు తెచ్చేయడం, సినిమాలకి ,హోటళ్ళకి తీసుకెళ్ళడం వంటివి చేయకూడదు.
- పొద్దున్నే లేచి పిల్ల్లలు తమ పని తాము చేసుకుంటుంటే పొగుడుతూ ఉండాలి.
-
పిల్లల పెంపకంలో తల్లికి, తండ్రికి మధ్య ప్రధాన తేడా పిల్లల ఆకలి, ఆహార
విషయంలో కనిపిస్తుంది. వారు వద్దన్నా తినిపించే అమ్మగుణం నాన్న కూడా
అలవర్చుకోవాలి.
ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుంటే డాడీ పెంపకంలో పిల్లలు అనేది అటు తండ్రికి, ఇటు పిల్లలకి ఒక మధురమైన అనుభూతిగా ఉంటుంది.
అది తీరని లోటే !
తల్లి
తమని విడిచి పెట్టి ఉద్యోగం కోసం దూరంగా ఉండడం పిల్లలకు ఏ మాత్రం నచ్చదు.
నాకు తెలిసిన ఒక పాప వాళ్ళమ్మ ఉద్యోగ రీత్యా వేరే ఊళ్ళో ఉంటుంటే- అమ్మమ్మా
నువ్వు ఉద్యోగం చేయకుండానే మా అమ్మన్ని పెంచావు కదా, మరి అమ్మ ఎందుకు
ఉద్యోగం చేస్తోంది. అని అమ్మమ్మని అడిగిం దంట దానికి అమ్మమ్మ మనవరాలికి
సర్థిచెప్పే ఉద్దేశ్యంతో ‘‘నీకోసం పెద్ద టివి కొనడానికి డబ్బులు కావాలిగా
అందుకోసం’’ అని చెప్పిదంట. అప్పుడు ఆ పాప వెంటనే ‘నాకు పెద్ద టివి
అక్కర్లేదు అమ్మని వచ్చేయమనండి’ అని అందట. నాన్న లేదా ఇంట్లోని ఇతర పెద్దలు
ఎంత ఆప్యాయంగా లోటు లేకుండా పెంచినా అమ్మ దగ్గర లేదనే భావన పిల్లల
వ్యక్తిత్వ,మనో వికాసంపై ప్రతి కూల ప్రభావం చూపిస్తుంది.