రేడియేషన్‌కు చెక్
ఈ
రోజుల్లో సెల్‌ఫోన్ లేని వారు ఎవరూ ఉండటం లేదు. స్కూల్ పిల్లల నుంచి
వృద్ధుల దాక అందరూ సెల్‌ఫోన్ వినియోగదారులే. సమాచారం చేరవేయడంలో సెల్‌ఫోన్
ఎంత సౌకర్యవంతమైనదైనా కూడా దాని వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. ఎంత ఎక్కువగా
ఫోన్ వినియోగిస్తే అంత ఎక్కువ రేడియేషన్‌కు గురి కావాల్సి ఉంటుంది. అలాగని
ఫోన్ వాడకుండా ఉండలేము కదా. నష్టాలను తగ్గించు కుంటూ ఫోన్ వాడుకోవచ్చు.
-వీలైనంత తక్కువ సమయం ఫోన్ వినియోగించడం మంచిది. ఎందుకంటే రెండు నిమిషాలు ఫోన్లో మాట్లాడితే మెదడులో జరిగే విద్యుత్ ప్రకంపనల ప్రకంపనల ప్రభావం ఒక గంట వరకు ఉంటాయి.
-చిన్న పిల్లలకు సెల్ ఫోన్ అందుబాటులో ఉంచకపోవడమే మేలు. తప్పని సరి పరిస్థితుల్లో పిల్లలు ఫోన్ వాడాల్సి వచ్చినా హెడ్ ఫోన్లతో వినియోగించడం మంచిది. అదికూడా చాలా తక్కువ సమయం మాత్రమే.
-ఫోన్ హెడ్ సెట్ తో వినియోగించేటట్టయితే మమూలు వైరుతో ఉండేవి కాకుండా ఎయిర్ ట్యూబ్ హెడ్‌సెట్ వాడటం మంచిది. ఎందుకంటే మాములు వైరుతో ఉండేవి యాంటినాలా పనిచేసి చుట్టు పక్కల ఉన్న ఎలక్ట్రో మ్యాగ్నటిక్ ఫీల్డులన్నింటిని గ్రహిస్తాయి.
-సెల్‌ఫోన్ ఆన్ చేసి ఉన్నపుడు ప్యాంటు జేబులో కానీ బెల్టు పౌచ్‌లో కానీ పెట్టుకోవడం అంత మంచిది కాదు. ఎందుకంటే శరీరంలోని కింది భాగాలు తలతో పోల్చినపుడు రేడియేషన్‌ను ఎక్కువగా గ్రహిస్తాయి.
-హెడ్ సెట్ లేకుండా ఫోన్ వాడుతున్నపుడు డయల్ చెయ్యగానే కాకుండా కనెక్ట్ అయిన తర్వాత మాత్రమే చెవికి ఆన్చుకోవడం అలవాటు చేసుకోవాలి.
-సిగ్నల్ తక్కువగా ఉన్నపుడు ఫోన్ వినయోగించక పోవడం మంచిది. ఎందుకంటే అలాంటి పరిస్థితులలో ఫోన్ తన సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించి మరో ఫోన్‌తో కనెక్ట్ కావాల్సి ఉంటుంది. కాబట్టి రేడియేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది.
-తక్కువ ఎస్‌ఏఆర్(స్పెసిఫిక్ అబ్సాప్షన్ రేట్) ఉన్న ఫోన్‌ను కొనడం అన్నింటికంటే మంచి పద్ధతి.
-లేదంటే తక్కువ రేడియేషన్ ఉన్న సెల్‌ఫోన్ కొనడం మంచిది. ఈ వివరాలు మొబైల్ ఫోన్ మాన్యువల్‌లో ఉంటాయి. రేడియేషన్ ఫ్రీక్వెన్సీ రేటు ఎంత తక్కువగా ఉంటే అంత మేలు.
-కార్లు, లిఫ్ట్‌ల వంటి వాటిలో ప్రయాణం చేస్తూన్నపుడు ఫోన్ తక్కువగా ఉపయోగించాలి. ఎందుకంటే ఇటువంటి ఫారడే కేజ్‌లు రేడియేషన్‌ను దారి మళ్లించి వాటిలోపల ఉన్న వారి మీదికే పరావర్తనం చెందిస్తాయి.
-సెల్ ఫోన్ బ్యాటరీ తక్కువ చార్జింగ్‌లో ఉన్నపుడు కూడా ఫోన్ వినియోగించడం సురక్షితం కాదు. కాబట్టి తప్పకుండా ఫోన్ ఎప్పుడూ పూర్తిగా చార్జి చేసి పెట్టుకోవడం మంచిది.
-ఆహారంలో యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న పోషకాహారం తీసుకోవడం ఎంతో అవసరం. ఈ యాంటి యాక్సిడెంట్లు మెదడులోని డీఎన్‌ఏ విరిగి పోకుండా కాపాడుతాయి. జింక్ కళ్లను ఆక్సిడేంట్ల వల్ల జరిగే నష్టం నుంచి కాపాడుతుంది.
ఇలా చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తూ రేడియేషన్ బారి నుంచి తప్పించుకుంటూ ఆనందంగా సెల్‌ఫోన్ వినియోగించుకోవచ్చు.
వారం ముందుగానే...
ఈ వారంలో మీకు గుండె నొప్పి రానుందా లేదా కనుక్కునే పరీక్ష త్వరలో అందుబాటులోకి రానుంది. గుండెపోటు వచ్చిన వారి రక్తకణాలను ఆరోగ్యంగా ఉన్నవారితో పోల్చినపుడు చాలా అసాధారణ స్థాయిలో పెద్దవిగా ఉండడాన్ని గమనించారు పరిశోధకులు. ఇలా మారుతున్న రక్త కణాలు రక్తం చిక్కబడటానికి సూచనగా భావిస్తున్నారు. ఛాతిలో నొప్పి అనే సమస్యతో వచ్చిన వారందరికి ఈ రక్తపరీక్ష చేయించడం ద్వారా రెండు మూడు వారాల ముందుగా గుండెపోటు ప్రమాదాన్ని పసిగట్టవచ్చునని నిపుణులు అంటున్నారు. ఇలా ముందుగా పసిగట్టడం వల్ల రక్తాన్ని పలుచగా చేసే మందులు ఇవ్వడం ద్వారా గుండెపోటుని నివారించవచ్చునని పరిశోధకులు అభివూపాయపడుతున్నారు.

0 comments:
Post a Comment