అజర్‌కు ఊరట - Andhra high court lifts life ban on Azharuddin
ఓ దశలో అజర్ ప్రభంజనం కారణంగానే విశ్వనాథ్ అప్పట్లో రిట్మైంట్ ప్రకటించాల్సి వచ్చిందన్న వ్యాఖ్యలు కూడా వినిపించాయంటే ఆయన ఆటతీరు ఏస్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ‘బ్యాటింగ్‌లో మణికట్టు మాయాజాలంతో ఆకట్టుకోవడంలో అజరుద్దీన్ తర్వాతే సచిన్ కానీ ఎవరైనా..’ అని మాజీ కెప్టెన్, అంతర్జాతీ య అంపైర్ వెంకవూటాఘవన్ అప్పట్లో ప్రశంసలు కురిపించాడు.
ఇదంతా ఇప్పుడు గుర్తు చేసుకోవలసిన సందర్భం, ఔచిత్యం ఉన్నది. తన క్రీడా జీవితమంతా క్రీడకు, దేశానికి సేవలందించిన ఆటగాళ్ళ పట్ల మనం వ్యవహరిస్తున్న తీరు ఇదేనా అనే ఆవేదన కలుగుతున్నది. క్రికెట్ క్రీడల్లో ఉత్తమ సేవలందించిన వారంతా దోషులు కారని చెప్పలేము. ఉన్నతస్థాయి క్రీడాకారులలోఎందరో మ్యాచ్ ఫిక్సింగ్‌లకు, బెట్టింగ్‌లకు పాల్పడిన వారు ఉండే ఉంటారు. కొన్ని దశాబ్దాలుగా ఆటతీరు పరిశీలిస్తే కచ్చితంగా ఉన్నారని కూడా చెప్పవచ్చు. అటువంటి వారిని గుర్తించి ఏరివేయాల్సిందే. ఇప్పుడు క్రీడారంగాన్ని పీడిస్తున్న అవినీతి అంతా ఇంతా కాదు.
దానిని ప్రక్షాళన చేయాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. కానీ నూనూగు మీసాల వయసు నుంచి ఆటనే ప్రాణంగా బతికి, జీవిత కాలమం తా సేవలందించి, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానాన్ని మూటగట్టుకున్న క్రీడాకారుల పట్ల ఆరోపణలు వచ్చినప్పుడు తొందరపాటుతో వారి ప్రతిష్టకు భంగం కలగకుండా క్రీడారంగంలోని పెద్దలు వ్యవహరించాలె. ఈ విషయం ఇతరుల కన్నా క్రీడారంగంలోని పెద్దలకు ఎక్కువగా తెలిసి ఉండాలె. ఇంత సున్నితమైన విషయంలో అంత మొరటుగా నిర్ణయాలు తీసుకోకూడదు. పరువు ప్రతిష్టలను కాపాడుకునే హక్కు సాధారణ ప్రజలకైనా, క్రీడాకారులకైనా ఉంటుంది.
అజర్ ఆటలో ఏ ఒత్తిళ్ళకు లొంగినట్టు ఆధారాలు లేవని న్యాయస్థానం అభివూపాయపడింది. ఆయనపై జీవిత కాల నిషేధం విధించడానికి తగిన ఆధారాలను బీసీసీఐ చూపలేక పోయిందని కోర్టు స్పష్టం చేసింది. బీసీసీఐ ఏకపక్షంగా వ్యవహరించిందని కూడా పేర్కొంది. దీనిని బట్టి బీసీసీఐ ఆటగాళ్ళ పట్ల వ్యవహరిస్తున్న తీరు తెలిసిపోతున్నది. మ్యాచ్ ఫిక్సింగ్‌తో పాటు అనేక రూపాల అవినీతి క్రీడా వ్యవస్థను పీడిస్తున్నది.