Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Saturday, November 10, 2012

అజర్‌కు ఊరట - Andhra high court lifts life ban on Azharuddin


మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలపై ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు అజరుద్దీన్‌పై విధించిన జీవిత కాల నిషేధాన్ని రాష్ట్ర హైకోర్టు రద్దు చేయడంతో ఆయనకే కాదు, ఆయన అభిమానులకు కూడా ఊరటనిచ్చింది. పన్నెండేళ్ళపాటు నడిచిన ఈ కేసులో ఎన్ని మలుపులు ఉన్నప్పటికీ, చివరకు తనకు న్యాయం లభించిందనే సంతృప్తి అజరుద్దీన్‌కు మిగిలిం ది. న్యాయస్థానం తీర్పును పరిశీలిస్తున్నామని బీసీసీఐకి చెందిన పెద్ద ఒకరు తెలిపారు. ఈ వ్యవహారాన్ని ఒక అజరుద్దీన్‌కే పరిమితం చేయకుండా ఇంకా విస్తృతంగా పరిశీలించాలె. 

సమకాలీన క్రికెట్ క్రీడలో అజరుద్దీన్ ఉన్నత శిఖరాలకు చేరిన ఆటగాడనడంలో సందే హం ఎవరికీ లేదు. క్రీడాకారుడిగా కానీ, జట్టు కెప్టెన్‌గా కానీ ఆయన సేవలు అత్యుత్తమమైనవి. హైదరాబాద్‌లోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అజరుద్దీన్, తమ కండ్ల ముందే సైకిల్‌కు ప్యాడ్‌లు కట్టుకుని మైదానానికి వెళ్ళే హుషారైన పిల్లగాడు క్రికెట్‌లో సాధించిన విజయాలు స్థానికులను ఉత్తేజాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి.

 అజర్ తొలి సెంచరీలను నాటి బ్లాక్ అండ్ వైట్ టీవీలలో చూసిన జ్ఞాపకం మధ్యతరగతి క్రికెట్ అభిమానుల కు మరిచిపోలేనిది. గవాస్కర్ కాలం తరువాత కొత్త తరానికి కపిల్ దేవ్‌కు, సచిన్‌కు మధ్యకాలంలో ఎదిగిన అజర్ యువతకు అభిమాన క్రీడాకారుడుగా వెలిగిపోయాడు. అజరుద్దీన్ టెస్టు క్రికెట్‌లోకి వచ్చీ రావడంతోనే ప్రభంజనం సృష్టించాడు. తొలి టెస్టులోనే సెంచరీ సాధించి ఔరా అనిపించాడు. 

ఆ వెంటనే ఆడిన రెండు టెస్టుల్లోనూ సెంచరీ కొట్టాడు. ఇట్లా వరుసగా మూడుటెస్టుల్లోనూ మూడు సెంచరీలు కొట్టడం ఇప్పటికీ రికార్డే. అజర్ రికార్డుకు మురిసిపోయిన ఒక స్థానిక రాజకీయపక్షం హైదరాబాద్ నగరంలోని బషీరుబాగ్ చౌరస్తాలో ‘అజర్, అజర్, అజర్ కంగ్రాజులేషన్స్’ అంటూ కట్టిన బ్యానర్ ఆనాడు విశేషంగా యువతను ఆకర్షించింది. అజరు క్రికెట్ రంగంలో అడుగుపెట్టడంతోనే వేగంగా నిలదొక్కుకున్నాడు.

ఓ దశలో అజర్ ప్రభంజనం కారణంగానే విశ్వనాథ్ అప్పట్లో రిట్మైంట్ ప్రకటించాల్సి వచ్చిందన్న వ్యాఖ్యలు కూడా వినిపించాయంటే ఆయన ఆటతీరు ఏస్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ‘బ్యాటింగ్‌లో మణికట్టు మాయాజాలంతో ఆకట్టుకోవడంలో అజరుద్దీన్ తర్వాతే సచిన్ కానీ ఎవరైనా..’ అని మాజీ కెప్టెన్, అంతర్జాతీ య అంపైర్ వెంకవూటాఘవన్ అప్పట్లో ప్రశంసలు కురిపించాడు.

 అప్పట్లో ఇంగ్లండ్ జటు పై అజర్ విజృంభణను చూసి సంబురపడ్డ ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత జాన్ వుడ్‌కాక్- ‘అజర్ లార్డ్స్ మైదానంలో ఆడితే అతడు కొట్టిన బంతిని పట్టుకునేందుకు గ్రేహౌండ్స్ దళాలను మోహరించాలేమో..’ అని ప్రశంసించాడు. బ్యాటింగ్‌లోనే కాదు, ఫీల్డింగ్‌లోనూ అజరుద్దీన్ విశిష్టత కాదనలేనిది. అన్నిటికీ మించి భారత జట్టు కెప్టెన్‌గా అజరుద్దీన్ చేసిన సేవ దేశం మరిచిపోలేనిది. అప్పటి వరకు భారత జట్టుకు గెలుపుపై ధీమా ఉండకపోయేది. అంతర్జాతీయ పోటీల్లో మనమూ గెలవగలమనే ధీమా అందించిన కెప్టెన్ అజరుద్దీన్. దేశానికి 14 విజయాలతో జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని అందించాడు.


ఇదంతా ఇప్పుడు గుర్తు చేసుకోవలసిన సందర్భం, ఔచిత్యం ఉన్నది. తన క్రీడా జీవితమంతా క్రీడకు, దేశానికి సేవలందించిన ఆటగాళ్ళ పట్ల మనం వ్యవహరిస్తున్న తీరు ఇదేనా అనే ఆవేదన కలుగుతున్నది. క్రికెట్ క్రీడల్లో ఉత్తమ సేవలందించిన వారంతా దోషులు కారని చెప్పలేము. ఉన్నతస్థాయి క్రీడాకారులలోఎందరో మ్యాచ్ ఫిక్సింగ్‌లకు, బెట్టింగ్‌లకు పాల్పడిన వారు ఉండే ఉంటారు. కొన్ని దశాబ్దాలుగా ఆటతీరు పరిశీలిస్తే కచ్చితంగా ఉన్నారని కూడా చెప్పవచ్చు. అటువంటి వారిని గుర్తించి ఏరివేయాల్సిందే. ఇప్పుడు క్రీడారంగాన్ని పీడిస్తున్న అవినీతి అంతా ఇంతా కాదు.

దానిని ప్రక్షాళన చేయాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. కానీ నూనూగు మీసాల వయసు నుంచి ఆటనే ప్రాణంగా బతికి, జీవిత కాలమం తా సేవలందించి, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానాన్ని మూటగట్టుకున్న క్రీడాకారుల పట్ల ఆరోపణలు వచ్చినప్పుడు తొందరపాటుతో వారి ప్రతిష్టకు భంగం కలగకుండా క్రీడారంగంలోని పెద్దలు వ్యవహరించాలె. ఈ విషయం ఇతరుల కన్నా క్రీడారంగంలోని పెద్దలకు ఎక్కువగా తెలిసి ఉండాలె. ఇంత సున్నితమైన విషయంలో అంత మొరటుగా నిర్ణయాలు తీసుకోకూడదు. పరువు ప్రతిష్టలను కాపాడుకునే హక్కు సాధారణ ప్రజలకైనా, క్రీడాకారులకైనా ఉంటుంది. 


అజరుద్దీన్ మీద బీసీసీఐ ఆనాడు నిషేధం విధించనట్టయితే అప్పటి వరకు 99 టెస్టుల్లో ఆడిన ఆయన మరో టెస్టుతో వంద పూర్తి చేసుకునేవాడు. వందకు చేరి రికార్డు సృష్టించాలనేది ఏ క్రీడాకారుడికైనా ఉండే కల. నిషేధం విధించిన నాటి నుంచి అజర్ కళంకితుడిగా గడపాల్సి వచ్చింది. ఆయన పొందిన నష్టాన్ని గణించడానికి ఏ కొలమానాలు సరిపోవు. తాను 99 టెస్టులు మాత్రమే ఆడాలనేది విధి రాత కావచ్చునని, తనకు ఎవరిపై ఆగ్రహం లేదని, బీసీసీఐపై కూడా న్యాయం కోసం పోరాడబోనని అజర్ నిర్వికారంగా వ్యాఖ్యానించడంలోనే ఆయనలోని ఆవేదన కనిపిస్తున్నది.

అజర్ ఆటలో ఏ ఒత్తిళ్ళకు లొంగినట్టు ఆధారాలు లేవని న్యాయస్థానం అభివూపాయపడింది. ఆయనపై జీవిత కాల నిషేధం విధించడానికి తగిన ఆధారాలను బీసీసీఐ చూపలేక పోయిందని కోర్టు స్పష్టం చేసింది. బీసీసీఐ ఏకపక్షంగా వ్యవహరించిందని కూడా పేర్కొంది. దీనిని బట్టి బీసీసీఐ ఆటగాళ్ళ పట్ల వ్యవహరిస్తున్న తీరు తెలిసిపోతున్నది. మ్యాచ్ ఫిక్సింగ్‌తో పాటు అనేక రూపాల అవినీతి క్రీడా వ్యవస్థను పీడిస్తున్నది.

 ఆరోపణలు వచ్చినప్పుడు ఆటగాళ్ళపై వేటు వేస్తూ, అతిగా స్పందించినట్టు కనిపిస్తున్నదే తప్ప బీసీసీఐ వ్యూహాత్మకంగా మ్యాచ్ ఫిక్సింగ్‌ను కట్టడి చేయడానికి, ఇతర విధాల అవినీతిని నిర్మూలించడానికి పూనుకోవడం లేదు. అజర్‌పై రాష్ట్ర హైకోర్టు తీర్పు నేపథ్యంలోనైనా బీసీసీఐ తనను సంస్కరించుకోవాలె. క్రీడావ్యవస్థను ప్రక్షాళన చేసి దోషులను గుర్తించడంలో తగిన విధానాలను రూపొందించుకోవాలె. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా తనకు బాధ్యత ఉందని గ్రహించాలె.

0 comments:

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP