Sunday, October 9, 2011
త్రి ‘యూ’డియట్స్ - 3 Idiots
ముగ్గురి బర్త్ డే సెలవూబేషన్స్ కూడా ఒకేరోజు జరుపుకోవాలని డిసైడ్ అయ్యారు.
కేక్ తీసుకొచ్చారు. ఎవరు ముందు కట్ చేయాలనేది వారి సమస్య.
‘‘నేనంటే నేనని’’ముగ్గురూ వాదించుకున్నారు.
వాదనతో సమస్య పరిష్కారం కాదనీ..
‘‘చూడండీ.. నోకియా, దాల్మియా! మనం ఇలా ఫైటింగ్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ కాదు! అందుకే నేనొక ఐడియా ఇస్తాను. దాన్ని ఫాలో అవుదాం’’ అన్నాడు ఐడియా.
అందుకు నోకియా, దాల్మియా ఓకే అన్నారు.
ఈ రాత్రికి కేక్ కటింగ్ వాయిదా వేసుకుందాం. నిద్రలో ఎవరికి మంచి కల వస్తుందో వారే కేక్ కట్ చేయాలి- ఇదీ ఐడియా ఇచ్చిన ఐడియా.
తెల్లారి వారి కలలు ఇలా ఉన్నాయి.
నోకియా : నేను నిద్రపోగానే ఒక మంచి కల వచ్చింది. అదేంటంటే నేను, దాల్మియా కలిసి లండన్‌కి వెళ్లాం. అక్కడో అందమైన అమ్మాయి నన్ను చూసి ప్రేమలో పడింది. ఇద్దరం కలిసి సినిమాకు వెళ్తుంటే.. దాల్మియా నేను కూడా వస్తానన్నాడు. బిల్లు వీడితోనే కట్టించాం. ఆ అమ్మాయి దాల్మియాకు ‘థ్యాంక్యూ బ్రదర్’ అని చెప్పింది. దెబ్బకు దాల్మియా పారిపోయాడు.
దాల్మియా : నేను చంద్ర మండలం పోయానట. నేను వద్దన్నా వినకుండా నోకియా కూడా నాతో వచ్చాడు. చంద్రునికి కోపం వచ్చి నోకియాని ఒక్క తన్ను తంతే పోయి సూర్య మండలంలో పడ్డాడు. అప్పుడు నోకియా కళ్లద్దాలు కాలిపోయి.. ఇయర్ ఫోన్ ఊడిపోయింది. బ్యాటరీ పేలిపోయింది. ఆ దెబ్బకి నోకియా కింద పడిపోయాడు.
ఐడియా : ఔనా భలే ఉన్నాయి మీ కలలు. నా కల కూడా చెప్తా. నేను నిద్రపోగానే యమధర్మరాజు ఆటోలో వచ్చి కేక్ ఎక్కడ పెట్టారని అడిగాడు. చెప్పకపోతే గద తీసుకుని ఒక్కటిస్తానన్నాడు. నాకు భయమేసి కేక్ చూపించాను. నన్ను కేక్ కట్‌చేసి మొత్తం తినేయమన్నాడు. చేసేదేం లేక కేక్ అంతా తినేశా.
నోకియా, దాల్మియా : మొత్తం తినేశావా? మేమున్నామని మరిచిపోయావా?
ఐడియా : ఆ.. భలే అడిగారు. మీ గురించి వెతికాను. నువ్వేమో లండన్‌లో ఉన్నావు! వాడేమో చంద్రమండలంలో ఉన్నాడు. నేనేం చేయను?
నీతి : ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది.
హస్తినలో... మాటలు మస్త్!
- - చిదంబరం, ప్రణబ్‌తో గవర్నర్ భేటీ
- కోర్‌కమిటీ ముందుకు రాష్ట్ర నాయకత్వం
- ఉదయం 11.30 నుంచి సాయంత్రం 5 దాకా
- ‘అవును’.. ‘కాదు’.. పద్ధతిలో ఇంటర్వ్యూ
- సీఎంతో పావుగంట..జైపాల్‌తో ముప్పావుగంట
- ముక్కుసూటిగా ప్రణబ్ ప్రశ్నలు
- హైదరాబాద్‌పైనా పెద్దల వాకబు
- రాష్ట్రం ఇస్తే పార్టీకి లాభమా? నష్టమా?
- ఎవవరు రాజీనామాలు చేస్తారు?
- వ్యక్తిగత అభివూపాయాల సేకరణ
- సత్వర పరిష్కారమే మేలన్న రాష్ట్ర నేతలు
- ప్రస్తావనకు రాని రాష్ట్రపతి పాలన
- ఊసే లేని రాయల్ తెలంగాణ
- ఇప్పుడే నిర్ణయం చెప్పలేం: ఆజాద్
- సోమవారంతో చర్చలకు ఫుల్‌స్టాప్: ప్రణబ్
- రేపటి కోర్ కమిటీలో వైఖరిపై నిర్ణయం?
న్యూఢిల్లీ, అక్టోబర్ 8:తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో సాగుతున్న సకల జనుల సమ్మె అంతకంతకూ కాక పెంచుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం తన చర్చల ప్రక్రియను వేగవంతం చేసింది. తొలి దఫాగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నేతలతో గ్రూపులుగా చర్చించిన కాంగ్రెస్ పెద్దలు.. రెండవ విడతలో భాగంగా శనివారం నాడు గవర్నర్‌తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు, రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రులుగా ఉన్నవారితోనూ వ్యక్తిగతంగా సమావేశాలు జరిపి వారి అభివూపాయాలను తీసుకున్నారు. దీనికి కొనసాగింపుగా సోమవారం నాడు మళ్లీ చర్చల ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఈ సారి చర్చల్లో సీమాంధ్ర నేతలు కావూరి సాంబశివరావు, చిరంజీవి, వివిధ స్థాయీ సంఘాల చైర్మన్లు ఉంటారని సమాచారం.
గత రెండు మూడు రోజులుగా జరుగుతున్నదంతా విస్తృత స్థాయి సంప్రతింపుల్లో భాగమేనని ఆజాద్ అన్నారు. సోమవారంతో చర్చల ప్రక్రియను ముగిస్తామని ప్రణబ్ ముఖర్జీ చెప్పడం విశేషం. చర్చల ప్రక్రియ ముగియగానే కోర్‌కమిటీ సమావేశం జరిపి తెలంగాణపై కాంగ్రెస్ వైఖరిని స్పష్టం చేయాల్సి ఉంటుంది. అయితే.. సోమవారం ఆ విధాన ప్రకటన వెలువడుతుందా? లేక జాతీయ స్థాయిలో ఇతర పార్టీల నాయకులతో చర్చలు జరిపిన తర్వాత వెలువడుతుందా? అన్నది తేలాల్సి ఉంది. నిర్ణయంలో అందరికీ భాగస్వామ్యం కల్పించే ప్రక్రియలో తదుపరి చర్చలను కాంగ్రెస్ కోర్ కమిటీ ప్రతినిధులు కొనసాగించారు. రెండు దఫాలుగా మూడు గంటలపాటు పాటు ఆర్థిక శాఖ కార్యాలయం నార్త్ బ్లాక్‌లో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రులు ప్రణబ్, చిదంబరం, ఆంటోనీ, అహ్మద్ పటేల్‌తో పాటు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి అజాద్ పాల్గొన్నారు. రాష్ట్ర సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, డీసీఎం దామోదర్ రాజనర్సింహ, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, పీసీసీ మాజీ చీఫ్ డీ శ్రీనివాస్, కేంద్ర మంత్రులు జైపాల్ రెడ్డి, కిషోర్ చంద్రదేవ్, పనబాక లక్ష్మి, పల్లం రాజు, పురందేశ్వరిని కోర్‌కమిటీ సమావేశానికి విడివిడిగా ఆహ్వానించి, వ్యక్తిగత అభివూపాయాలను తీసుకున్నారు. రాష్ట్రంలోని పరిస్థితులతోపాటు సమస్య పరిష్కారానికి అభివూపాయాలను సేకరించారు. రెండో విడత చర్చల ప్రక్రియను శనివారం ఉదయం 11.40 నిమిషాలకు ప్రారంభించిన కోర్‌కమిటీ.. సాయంత్రం ఐదు గంటలకు ముగించింది. కోర్‌కమిటీ ఎదుట తొలుత రాజనర్సింహ, చిట్టచివరిగా కిశోర్‌చంవూదదేవ్ హాజరయ్యారు.
అన్నీ తానై ప్రణబ్
అభివూపాయ సేకరణ సందర్భంగా ప్రణబ్ మినహా ఇతర కోర్‌కమిటీ సభ్యులకు అధినేత్రి సోనియా గాంధీ నుంచి నిర్దిష్ట ఆదేశాలు లేవని తెలిసింది. ఫలితంగానే నేతలతో మాట్లాడే సమయంలో ఒక్క ప్రణబ్ ముఖర్జీయే అంతా తానై వ్యవహరించారని తెలిసింది. మిగిలిన నేతలు మధ్యలో జోక్యంచేసుకోవడం, వారు చెబుతున్న అంశాలు నోట్ చేసుకోవడానికి పరిమితమయ్యారని సమాచారం.
మరీ ముఖ్యంగా రాష్ట్రంలోని పరిస్థితులను, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై వారికి ఉన్న అభివూపాయాలను, సమ్మె నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనే కోర్‌కమిటీ సభ్యులు, ప్రధానంగా ప్రణబ్‌ముఖర్జీ ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. పార్టీ తరఫున తెలంగాణ సమస్య పరిష్కారం బాధ్యతను భుజానికెత్తుకున్న ప్రణబ్.. వచ్చిన వారి నుంచి కరాఖండితంగా ‘మీరు తెలంగాణకు వ్యతిరేకమా? అనుకూలమా?’ అని ప్రశ్నించి నిర్దిష్ట జవాబు రాబట్టారని సమాచారం. తెలంగాణ అంశాన్ని ఇక ఏ మాత్రం నాన్చకుండా త్వరగా తేల్చేసే ప్రక్రియలో భాగంగానే డొంక తిరుగుడు వ్యవహారానికి ప్రణబ్ చెల్లుచీటీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఆయన వేసిన ప్రశ్నలు ముక్కుసూటిగా ఉన్నాయని ఒక మంత్రి తెలిపారు. ఇక నిర్ణయం వారాల వ్యవధిలోనే ఉంటుందన్న తీరులో ప్రణబ్ వ్యవహరించాని ఆయన చెప్పారు. అదే సమయంలో రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించడమా? లేక తెలంగాణ ఇచ్చే పక్షంలో రాయల్ తెలంగాణ ఏర్పాటు చేయడమా? అన్న అంశాలపై కనీస ప్రస్తావన రాలేదని తెలిసింది. దీంతో ఈ రెండు అంశాలను కేంద్ర నాయకత్వం దాదాపుగా పక్కన పెట్టేసిన ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. భేటీలో అడిగిన ప్రశ్నల వివరాలు ఇలా ఉన్నాయి. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఇస్తే సీమాంవూధలో పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయని ఆయన ప్రతి ఒక్కరినీ అడిగారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు రేపు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే సీమాంవూధలో నెలకొనే అవకాశం ఉందా? అని వాకబు చేశారు.
తెలంగాణ ఏర్పాటు చేసే పక్షంలో వారికి ఉన్న అభ్యంతరాలను సైతం అడిగారు. హైదరాబాద్ అంశం కూడా కీలకమైన ప్రశ్నగా ఉంది. రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాద్ పరిస్థితి ఏంటి? హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా నిర్దిష్టకాలం పాటు కొనసాగించడానికి ఇరు ప్రాంత ప్రజలకు అభ్యంతరాలు లేనందున సమస్య పరిష్కారానికి ఆ దిశగా పావులు కదుపుదామా? హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేస్తే తెలంగాణ ప్రజల్లో భయాందోళనలను ఎంత మేరకు తొలగించగలం? సీమాంధ్ర ప్రజల్లోని వ్యామోహాన్ని ఎంత మేరకు కాపాడగలం? అనే ప్రశ్నలు సంధించారు. తెలంగాణలో ఉధృతంగా కొనసాగుతున్న సమ్మె విరమణకు సూచనలు కోరారు. అదే సమయంలో రాష్ట్ర విభజన వల్ల పార్టీపై పడే ప్రభావం కూడా చర్చకు వచ్చింది. రాష్ట్రాన్ని విభజిస్తే పార్టీ భవిష్యత్తు ఏంటి? రాష్ట్రం ఇచ్చే పక్షంలో ఎవవరు రాజీనామాలు చేస్తారు? ఇవ్వక పోతే తెలంగాణలో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది? వంటి ప్రశ్నలను కురిపించి రాష్ట్ర నాయకత్వం నుంచి నిర్దిష్టమైన సమాచారాన్ని రాబట్టారు. అయితే.. రాష్ట్రంలో సుదీర్ఘంగా కొనసాగుతున్న అనిశ్చితి వల్ల ఇరు ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడిందని చెప్పిన రాష్ట్ర నాయకులు, కేంద్ర మంత్రులు తెలంగాణ సమస్యను సత్వరమే తేల్చడమే మేలని అభివూపాయపడ్డారు.
సమస్యపై నిర్ణయం కూడా శాశ్వత పరిష్కారం దిశగా ఉండాలని సూచించారు. రాజధానిపై ఒకరిద్దరు అభ్యంతరాలు వ్యక్తపరిచినప్పటికీ రాష్ట్ర విభజనకే అందరూ మొగ్గు చూపారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి కోర్‌కమిటీ సభ్యులతో మాట్లాడుతూ టీ కాంగ్రెస్ నేతల వల్లే సమస్య తీవ్రంగా ఉందని, వారిని కేంద్రమే అదుపు చేయాలని కోరినట్లు తెలిసింది.
ఆ తర్వాతి పరిస్థితులకు తాను ఎదుర్కొగలనని చెప్పినట్లు తెలిసింది. ఉద్యోగుల సమ్మెను మరికొంత కాలం కొనసాగించలేరని, వారితో సంప్రదింపులు జరుపుతానని తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రం కలిసుం మెరుగ్గా ఉంటుందన్నది పురందేశ్వరి, కిషోర్ చంద్రదేవ్ వాదనలుగా చెబుతున్నారు. కాగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాత్రం వాస్తవ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారని, ప్రస్తుత ప్రభుత్వం సమస్యను సరిగ్గా డీల్ చేయలేకపోయిందని వెల్లడించారని సమాచారం. జైపాల్‌డ్డి, డీ శ్రీనివాస్‌లు తెలంగాణ కోసం పట్టుబట్టినట్లు సమాచారం. మొత్తంగా ఇరు ప్రాంతాలకు అమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవడం వల్ల పార్టీని ఇరు ప్రాంతాల్లో బలోపేతం చేసుకోవచ్చని రాష్ట్ర నేతలు అభివూపాయపడ్డారు. దానికి కోర్ కమిటీ సానుకూలంగా స్పందించింది.
అవును... కాదు...
కోర్ కమిటీ సభ్యులు నేతల అభివూపాయాలను నివేదిక రూపంలో కాకుండా వారిచ్చిన జవాబులను బట్టి ‘అవును’, ‘కాదు’ అని టిక్ చేసుకున్నారు. అలాగేతే సులభంగా క్రోడీకరించి సోనియాకు, ప్రధానికి నివేదించవచ్చని వారు ఆ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి చర్చలను కూడా ఇది సులభతరం చేస్తుందని భావించడంవల్లే కోర్‌కమిటీ నేతలు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలిసింది. శనివారం రాత్రికే నివేదికను సోనియాకు అందించి, ఆమె అభివూపాయాలు తీసుకున్న తర్వాత వాటికి అనుగుణంగా సోమవారం నాడు చర్చలు కొనసాగించనున్నారు.
శనివారం చర్చలు ముగించిన అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆజాద్... తదుపరి చర్చలు సోమవారం కొనసాగుతాయని వెల్లడించారు. సోమవారం నాడు సీమాంవూధకు చెందిన సీనియర్ ఎంపీ కావూరి సాంబశివరావు, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి, పలువురు స్టాండింగ్ కమిటీ చైర్మన్లతో పాటు పలువురు సీనియర్ నాయకులకు ఢిల్లీ రావాల్సిందిగా ఆదేశాలు వెళ్లాయి. కాగా.. తమ చర్చల ప్రక్రియ సోమవారంతో ముగియనుందని ప్రణబ్ చెప్పడం విశేషం.
సోమవారం వైఖరి
ప్రణబ్ చెప్పిన ప్రకారం సోమవారంతో చర్చల ప్రక్రియ ముగిస్తే.. ఇక మిగిలేది తెలంగాణపై కాంగ్రెస్ వైఖరిని వెల్లడించడమే! అయితే.. వైఖరిని సోమవారం వెల్లడిస్తారా? లేక జాతీయ పార్టీల నేతలతో కూడా చర్చిస్తామని ముందుగా చెప్పినట్లు చర్చల ప్రక్రియను విస్తరిస్తారా? అన్నది తేలాల్సి ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. కోర్‌కమిటీలో అహ్మద్ పటేల్ కాకుండా మిగిలిన వారందరూ కేంద్ర మంత్రులే కావడంతో చర్చలను ఇతర పార్టీలకు కూడా విస్తరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలంటున్నాయి.
రాష్ట్రానికి నేతల తిరుగు పయనం
తమ అభివూపాయాలను వ్యక్తం చేసిన పార్టీ, ప్రభుత్వ పెద్దలను అత్యవసరంగా రాష్ట్రానికి వెళ్లి సమ్మె విరమణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించడంతో వారంతా శనివారమే హైదరాబాద్ బయలుదేరారు. సమ్మె విరమించే దిశగా జేఏసీతో చర్చలు జరపాల్సిందిగా ముఖ్యమంవూతికి సూచించామని ఆజాద్ మీడియాకు తెలిపారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంవూతితో ప్రణబ్ కాస్తంత ఘాటుగానే వ్యవహరించారని సమాచారం. భేటీ తర్వాత బయటికి వస్తూ రాజనర్సింహ నిరుత్సాహంగా కనిపించారు.
జైపాల్‌తో 45 నిమిషాలు భేటీ
కోర్‌కమిటీ నేతలతో మాట్లాడిన కేంద్ర మంత్రి జైపాల్‌డ్డి తెలంగాణవాదనను గట్టిగానే వినిపించారని సమాచారం. తన సహచరులతో సమావేశమై ఆంధ్రవూపదేశ్‌లో పరిస్థితిపై తన అంచనాను వివరించినట్లు తెలిపారు. ‘‘నేను నిర్దిష్టమైన అంచనాను వారికి చెప్పాను. కానీ ఆ వివరాలు మీడియాకు చెప్పలేను’’ అన్నారు. తమ మాటల మధ్య రాష్ట్రపతి పాలన ప్రసక్తి రాలేదని ఆయన తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి సహా పలువురు నేతలు పది ఇరవై నిమిషాల పాటే కోర్‌కమిటీ ముందు హాజరు కాగా.. జైపాల్ రెడ్డితో మాత్రం కోర్‌కమిటీ సభ్యులు 45 నిమిషాల పాటు చర్చించడం విశేషం.
ఓ దశలో కేంద్రం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు ప్రయత్నిస్తున్నదంటూ చానళ్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. కానీ.. ఆజాద్, ప్రణబ్‌తోపాటు కోర్‌కమిటీ ముందు హాజరైన పలువురు నేతలు సైతం ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు. అదే సమయంలో సీఎంను మార్చేందుకు ప్రయత్నం జరుగుతున్నదన్న వాదన కూడా వినిపించింది. కొత్తముఖ్యమంత్రి రేసులో జైపాల్‌డ్డి, రాజనర్సింహ, పురందేశ్వరి ఉన్నారని వదంతులు వచ్చాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన జైపాల్‌డ్డి ఈ రేసులో అగ్రస్థానంలో ఉన్నారని ప్రచారం జరిగింది. జైపాల్‌డ్డి సీఎం అయితే తెలంగాణ ప్రజలు కాస్త మెత్తబడతారని అధిష్ఠానం భావిస్తున్నదని విశ్లేషణలు వెలువడ్డాయి.
Take by: Namaste Telangana (NT)
Read more...
లంగాణ కోసం...!-వికలాంగుని ఒంటరి దీక్ష
ఎంజీఎం, అక్టోబరు 8: తెలంగాణ వచ్చేంత వరకు పచ్చి మంచి నీళ్లయినా ముట్టేది లేదని భీష్మించుకుని ఆమరణ దీక్షకు పూనుకున్న వికలాంగుడైన ఎల్లయ్య ఉదంతం శనివారం వెలుగులోకి వచ్చింది.. గత ఆరు రోజులుగా అన్నపానియాలు ముట్టకుండా ఒంటరిగా తన ఇంటిలో ఆమరణ దీక్ష చేపట్టి తీవ్ర అస్వస్థకు గురై ఆస్పవూతిలో చేరిన ఎల్లయ్య భార్య ఎల్లమ్మ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. జఫర్‌గడ్ మండలానికి చెందిన కొక్కుల ఎల్లయ్య(45)కు భార్య, కూతురు, కుమారుడున్నారు.
కూలీ పనులు చేసుకునే ఎల్లయ్య తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నాడు. తెలంగాణ రాష్ట్రం కోసం అందరూ ఉద్యమిస్తున్నా.. ఆత్మబలిదానాలు చేసుకుంటున్నా కేంద్రం స్పందించకుండా మొండిగా వ్యవహరిస్తుండటంతో ఎల్లయ్య మనసు గాయపడింది. తన చావుతోనైనా తెలంగాణ వస్తుందని భావించి ఆమరణ దీక్షకు పూనుకున్నాడు. భార్య పిల్లలతో కలిసి బంధువుల ఇంటికి పండుగకు వెళ్లింది చూసి ఈనెల 2వ తేదీ నుంచి ఎల్లయ్య ఒక్కడే ఒంటరిగా తన ఇంటి వద్ద దీక్ష చేపట్టాడు. మెడలో టీఆర్‌ఎస్ కండువా ధరించి దీక్షకు ఉపక్షికమించాడు.
గత ఆరు రోజులుగా మంచినీళ్లు కూడా ముట్టకుండా ఉండటంతో అతని ఆరోగ్యం దెబ్బతింది. శనివారం భార్య పిల్లలు ఊరి నుంచి ఇంటికి చేరుకునే సరికే అతను తీవ్ర అస్వస్థకు గురై కనీసం మాట్లాడలేని స్థితికి చేరుకున్నాడు. ఆనోట ఈనోట విషయం కాస్త బయటికి పొక్కడంతో స్థానిక నాయకులు అతని ఇంటికి చేరుకుని అస్వస్థకు గురైన ఎల్లయ్యను చికిత్స కోసం ఎంజీఎం ఆస్పవూతికి తరలించినట్లు అతని భార్య ఎల్లమ్మ ‘టీన్యూస్’కు తెలిపింది.
తాము అసలే పేదరికంతో బాధపడుతున్నామని, తన భర్తకు తెలంగాణ అంటే ఎంతో ఇష్టమని రాష్ట్రం వస్తే తమలాంటి పేదలు బాగుపడతారని చెపుతుండే వారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఎందుకు ఇలా జరిగిందని ప్రశ్నిస్తే.. తెలంగాణ రాష్ట్రం రావాలనే దీక్ష చేశానని, అప్పటి వరకు నీళ్లు కూడా ముట్టనని చెబుతున్న ఎ ల్లయ్య మరోమాట మాట్లాడటం లేదు. ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు..
సింధ్‌లో ఒక తెలంగాణ కల ---- తెలంగాణ ముద్దుబిడ్డల పోరాటం
అందిస్తున్నాం. - ఎడిటర్
సన్ నాసిర్ హైదరాబాద్‌లోని జాతీయ భావాలు గల కుటుంబంలో 1928 ఆగస్టు 2వ తేదీన జన్మించాడు. సెయింట్‌జ్జాస్ గ్రామర్ స్కూళ్లో చదువుకున్నాడు. ఆ తరువాత కేంబ్రిడ్జిలో, హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో, అలీగఢ్‌లో ఆయన ఉన్నత విద్యాభ్యాసం సాగింది.
1940 దశకంలోని హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్‌లో కార్యకర్తగా ఉన్నా రు. 1946 మార్చిలో ఐఎన్‌ఎ యోధులను విడుదల చేయాలంటూ సాగిన విద్యా ర్థి ఉద్యమంలో ముందు భాగాన నిల్చాడు. అదే సంవత్సరం సెప్టెంబర్‌లో సూర్యాపేట పిల్లలపై అణచివేతకు నిరసనగా విద్యార్థుల సమ్మెలో పాల్గొన్నాడు.
1946 కల్లా తెలంగాణలో రైతు ఉద్యమం తీవ్రమవుతున్నది. జూలై 4న కడ మొదటి కమ్యూనిస్టు అమరుడు కొమురయ్య నేలకొరిగాడు.
ప్రజాస్వామ్యం కోసం, భూమి కోసం, స్వాతంత్య్రం కోసం పెల్లుబుకుతున్న ఈ ఉద్య మం సున్నితమైన స్పృహ గల యువ నాసిర్‌పై గట్టి ముద్ర వేసింది. తిరుగుబాటుతత్వం, దేశభక్తి ఆయన కుటుంబ సంప్రదాయంగా ఉండేది. ఆయన పెంపకం కూడా అటువంటిదే. పాలక వర్గంలోని కుటుంబాలతో ఉన్న సాన్నిహిత్యం వల్ల పతనమవుతున్న ఫ్యూడల్ వ్యవస్థపట్ల ఆయనకు మంచి అవగాహన ఉంది. దీనివల్ల సామ్యవాద
భావాలు నాటుకొని విప్లవోద్యమంలోకి వెళ్లడానికి ఆస్కారం ఏర్పడింది.
1947లో హైదరాబాద్‌లో జాతీయ ప్రజాస్వామిక ఉద్యమం భారీ ఎత్తున పెల్లుబుకింది. అప్పుడు భారత్ పాక్షిక స్వతంత్ర, పాక్షిక బానిస
దేశం. ఇక హైదరాబాద్ స్వేచ్ఛా భారతంలోని వ్యూహాత్మక బానిస ప్రదేశం. స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంటనే పోరాటం ప్రారంభించాలని కోరుతూ 1947 జూలై 31న 25,000 మంది విద్యార్థులు భారీ ప్రదర్శన జరిపారు. దీనికి నాయకత్వం వహించినవారిలో నాసిర్ ఒకరు. 1947 ఆగస్టు సెప్టెంబర్‌లలో భారీ ఎత్తున విద్యార్థి ప్రదర్శనలు, సమ్మెలు సాగాయి. 1947 సెప్టెంబర్ 29న భారత, హైదరాబాద్
ప్రభుత్వాల మధ్య సిగ్గులేకుండా యథాతథ ఒప్పందం జరిగింది. అప్పటికే తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమైంది. భూమికోసం, స్వాతంత్య్రం కోసం, ప్రజాస్వామ్యం కోసం విప్లవోద్యమం ఉవ్వెత్తున సాగుతున్నది. ఈ పరిస్థితులతో ప్రభావితమైన నాసిర్ 1947 డిసెంబర్‌లో పాకిస్థాన్ వెళ్లిపోయాడు.
1947 డిసెంబర్ 19న బొంబాయి నుంచి వెళ్లే ముందు తల్లికి రాసిన ఉత్తరంలో నేను తీసుకున్న నిర్ణయం (పాకిస్థాన్ వెళ్లడం) పరిణామం ఎట్లుందో తెలిసే వయసే నాది అని పేర్కొన్నాడు.సామ్రాజ్యవాదులు, తిరోగమనవాదులు భారత పాకిస్థాన్‌ల మధ్య వైషమ్యా న్ని, శత్రుభావాన్ని పాదుకొల్పారు. సామాన్య ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, సామ్యవాదులు మాత్రమే ఈ అగాథాన్ని పూడ్చి స్నేహం పెంచగలరని ఆయన రాశారు. అదీ ఆయన నిబద్ధత. ఆ విధంగా ఒక కార్యసాధన కోసం ఆయన పాకిస్థాన్ వెళ్లాడు. విప్లవోద్యమాన్ని, సామ్యవాద పార్టీని నిర్మించడానికి వెళ్లాడు. పోవడంతోనే సింధ్‌లోని భూమి కోసం పోరాడుతున్న నిరుపేద రైతులతో మమేకమయ్యారు. వీరోచిత తెలంగాణ బిడ్డనని, మఖ్దుం శిష్యుడినని, సింధ్‌లో ఒక‘తెలంగాణ’ను నిర్మించడమే తన కోరిక అని చెప్పుకునేవాడు. అదీ ఆయన స్ఫూర్తి. ఆయన దృక్పథం.
నాసిర్ సింధ్‌లోని భూమిలేని రైతులకు నాయకుడయ్యాడు... కార్మికులకు నాయకుడయ్యాడు... కరాచీలోని-షిప్‌యార్డ్ కార్మికులకు, చమురు గని కార్మికులకు, జౌళి కార్మికులకు నాయకుడయ్యాడు. నాసిర్ కరాచీలోని కమ్యూనిస్టు పార్టీ కి నాయకుడయ్యాడు. క్రమంగా
పాకిస్థాన్ కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీకి ఎన్నికయ్యాడు. పాకిస్థాన్‌లోని పాలకవర్గాలు- సామ్రాజ్యవాదులు మిలాఖత్ అయిన బూర్జువాలు, ఫ్యూడల్ వర్గాలు, సైన్యం బ్యూరోక్షికాట్లు ఈ కమ్యూనిస్టు ఉద్యమా న్ని సహించలేకపోయాయి. కమ్యూనిస్టులపై అణచివేత సాగింది. నాసిర్ నాలుగేళ్లు జైలు జీవితం అనుభవించాడు. లాహోర్ ఫోర్టు జైలు నుంచి హైదరాబాద్‌లోని తన తమ్ముడు ముంతాజ్‌కు రాసిన లేఖలో-‘ ముంతాజ్, నా జీవితంలో నెరవేర్చవలసిన కర్తవ్యం ఒకటి ఉన్నది. ప్రయాణం ఆ వైపుగనే సాగుతున్నది’. అని పేర్కొన్నాడు. మళ్లీ 1953 జూన్ 6న కరాచీ జైలు నుంచి తన తల్లికి రాసిన లేఖలో -‘ నా జీవితంలో నేనో మార్గాన్ని ఎంచుకున్నాను. నా యిష్టంగానే ఈ మార్గం చేపట్టాను. ఒక ఐదేళ్లు వెనక్కి అవకాశం లభించినా మళ్లీ ఇదేమార్గంలో జీవిస్తాను.’ అని తన దృఢకాంక్షను వెల్లడించాడు. ఇదీ హసన్ నాసిర్
అంటే...1958 నాటికి నాసిర్ మళ్లీ కార్మికవర్గంతో, అభ్యుదయవాదులతో చేరిపోయాడు. 1960లో, అయూబ్‌ఖాన్ హయాంలో, ఆయనను మళ్లీ అరెస్టు చేశారు.
జైళ్లో చిత్రహింసలు పెట్టారు. దీంతో 1960 నవంబర్ 13న నాసిర్ జైళ్లోనే కన్నుమూశాడు. నాసిర్ మరణానంతరం వ్యవహరించిన తీరుతోఅయూబ్‌ఖాన్ ప్రభు త్వ పాశవికత మరోసారి వెల్లడైంది. నాసిర్ మరణానికి కారణం తెలుసుకోవడం కోసం ఆయన తల్లి సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి పరిశీలించాలని కోర్టు ఆదేశించింది. దీంతో పాలక ముఠా రాత్రికి రాత్రే సమాధి నుంచి ఆయన మృతదేహాన్ని బయటికి తీసి ఆ స్థానంలో మరో మృతదేహాన్ని పెట్టింది. ఆ మృతదేహం పొడుగు వెంట్రుకలు, గోళ్లు తదితర లక్షణాలను పరిశీలించిన తల్లి మేడమ్ జహ్రాఅలం బర్దార్ అది తన కుమారుడి మృతదేహం కాదని తేల్చి చెప్పింది. ఆ తరువాత భారత దేశం తిరిగివచ్చింది.
మహత్తర తెలంగాణ నుంచి విప్లవ సందేశాన్ని తీసుకుపోయిన ఆ వీరుడి జీవితం ఈ విధంగా ముగిసింది. కానీ-నాసిర్ బతికే ఉన్నాడు. అణగారిన ప్రజల కోసం బలిదానం చేసిన మహానుభావుల పరంపరలో, ఒడిదొడుకులను అధిగమిస్తూ స్థిరంగా పురోగమిస్తున్న పాకిస్థాన్ సామ్యవాద ఉద్యమ చరివూతలో ఆయన సజీవంగా ఉన్నాడు. విప్లవ సందేశంలో నాసిర్ జీవిస్తూనే ఉంటాడు.
కేంద్రం అణచివేతకు దిగితే ఆమరణదీక్ష చేస్తా
తెలంగాణ ప్రజల ఐక్యత చూసి కేంద్ర ప్రభుత్వం ఆశ్చర్యపోతోంది’ అని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. శనివారం బంజారాహిల్స్ లోటస్‌పాండ్‌లోని ప్రైవేట్ ఫాంహౌజ్‌లో జరిగిన తెలంగాణ రాజకీయ జేఏసీ విస్తృత స్థాయి స్టీరింగ్ కమిటీ అంతర్గత సమావేశంలో ఆయన తనదైన శైలిలో మాట్లాడారు. చలో హైదరాబాద్ పేర బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిద్దామని, కఠినంగా వ్యవహరించే పరిస్థితులు తప్పవని కేసీఆర్ పేర్కొన్నారు.
ఇప్పటికే 26 రోజులుగా సకల జనుల సమ్మెను శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా నిర్వహిస్తున్నామని, మరికొంత కాలం సమ్మెను కొనసాగించి కేంద్రంపై ఒత్తిడి పెంచుదామని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కోసం జీతాలను, పండుగలను త్యాగం చేశామని, భవిష్యత్ కార్యాచరణ మరింత కఠినంగా ఉండేలా చూద్దామని ఆయన అన్నట్లు తెలిసింది. సమ్మె వల్ల తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని, బంగారు భవిష్యత్ కోసం త్యాగాలు తప్పవని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది.
శాంతియుత ఉద్యమాన్ని అణిచివేసేందుకు కేంద్రం యత్నిస్తే ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయులు, సింగరేణి, ఆర్టీసీ కార్మికులు, ఇతర అన్ని వర్గాలకు మద్దతుగా తానే ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమని కేసీఆర్ వెల్లడించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం మాట్లాడుతూ కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత ప్రజావూపతినిధులు కలిసి వస్తే ఇంత ఇబ్బంది ఉండేది కాదన్నారు.
కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటనను అమలు చేయాలని కోరుతూ సమ్మె చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడేదాక సమ్మె,ఉద్యమాలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. చలో హైదరాబాద్ కార్యక్షికమం ఎప్పుడెప్పుడా అంటూ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఈనెల మూడవ వారంలో ఈ కార్యక్షికమాన్ని అమలు చేస్తామని ఆయన వెల్లడించినట్లు తెలిసింది. Read more...