కేంద్రం అణచివేతకు దిగితే ఆమరణదీక్ష చేస్తా
జేఏసీ అంతర్గత సమావేశంలో కేసీఆర్
తెలంగాణ ప్రజల ఐక్యత చూసి కేంద్ర ప్రభుత్వం ఆశ్చర్యపోతోంది’ అని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. శనివారం బంజారాహిల్స్ లోటస్‌పాండ్‌లోని ప్రైవేట్ ఫాంహౌజ్‌లో జరిగిన తెలంగాణ రాజకీయ జేఏసీ విస్తృత స్థాయి స్టీరింగ్ కమిటీ అంతర్గత సమావేశంలో ఆయన తనదైన శైలిలో మాట్లాడారు. చలో హైదరాబాద్ పేర బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిద్దామని, కఠినంగా వ్యవహరించే పరిస్థితులు తప్పవని కేసీఆర్ పేర్కొన్నారు.
ఇప్పటికే 26 రోజులుగా సకల జనుల సమ్మెను శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా నిర్వహిస్తున్నామని, మరికొంత కాలం సమ్మెను కొనసాగించి కేంద్రంపై ఒత్తిడి పెంచుదామని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కోసం జీతాలను, పండుగలను త్యాగం చేశామని, భవిష్యత్ కార్యాచరణ మరింత కఠినంగా ఉండేలా చూద్దామని ఆయన అన్నట్లు తెలిసింది. సమ్మె వల్ల తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని, బంగారు భవిష్యత్ కోసం త్యాగాలు తప్పవని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది.
శాంతియుత ఉద్యమాన్ని అణిచివేసేందుకు కేంద్రం యత్నిస్తే ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయులు, సింగరేణి, ఆర్టీసీ కార్మికులు, ఇతర అన్ని వర్గాలకు మద్దతుగా తానే ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమని కేసీఆర్ వెల్లడించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం మాట్లాడుతూ కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత ప్రజావూపతినిధులు కలిసి వస్తే ఇంత ఇబ్బంది ఉండేది కాదన్నారు.
కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటనను అమలు చేయాలని కోరుతూ సమ్మె చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడేదాక సమ్మె,ఉద్యమాలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. చలో హైదరాబాద్ కార్యక్షికమం ఎప్పుడెప్పుడా అంటూ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఈనెల మూడవ వారంలో ఈ కార్యక్షికమాన్ని అమలు చేస్తామని ఆయన వెల్లడించినట్లు తెలిసింది.
0 comments:
Post a Comment