Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Saturday, February 5, 2011

'Jai Bholo Telangana’ in U.S.A




‘Jai Bolo Telangana’, a much awaited movie that is set in the backdrop of recent Telangana and Andhra Agitations is coming to America starting February 04, 2011.

Director N. Shanker, a name to reckon within quality entertainers like Jayam-manadera, Encounter, and Sriramulayya, this time has come up with a film portraying current political scenario in Telangana region of Andhra Pradesh.

Some of the actors portrayed in the film are NOT reel life but real life leaders, activists, students, singers, lawyers, and journalists. This movie portrays real life instances and from the perspective all segments of people of Andhra Pradesh.

The film is produced and directed by by N. Shanker under the banner of Mahalakshmi Arts Productions, and Chakri scored the music, which is already a big success.

Ande Sri, Goreti Venkanna, Suddala Ashok Teja, Nandini Sidha Reddy, Gaddar, and K Chandrasekhar Rao penned songs for this movie.

Shanker confined that, Jagapathi Babu plays a Telangana revolutionary named Bandagi Gopanna. “It’s the most memorable character in Telugu cinema and I felt only Jagapathi Babu could do justice to it. When I narrated the story to him, he was impressed and immediately agreed to do the movie. He proved that artistes have no caste, region or religion. Bandagi is a Muslim name and Gopanna a Hindu name. Separate Telangana is the long-felt dream of four crore people following different religions and the character reflects that” Shankar Said in his preparation for the movie. “Jai Bolo Telangana reflects the current political scenario in the State. The “Garadi Chestundru” number written by KCR has become quite a rage. KCR penned a few songs as part of the Dhoom Dhaam campaigns. When I listened to those songs, the thought of having him write a song for the film came to my mind,”

We urge Not only all Telangana NRI’s to show strong solidarity to this movie but also All Telugu speaking individuals to watch the movie with families to understand the current climate in Andhra Pradesh and to. No one will go disappointed from watching this rare glimpse of current life and events in Andhra Pradesh, particularly in Telangana, on the big screen, as it is a rarity for Telugu films to portray real life events with life like people.

Below are the cities the movie will be screened during the first week.

1. Virginia – Phoenix World gate 9, Herndon (us.bigcinemas.com)


2. New Jersey – Big cinemas Movie city 8, Edison (us.bigcinemas.com)


3. Dallas – Hollywood Theatres, Irving (www.gohollywood.com)


4. California – Big cinemas Towne3, San Jose (us.bigcinemas.com)


5. Chicago – Big cinemas Golf Glen, Niles (us.bigcinemas.com)


6. Minneapolis – Brookdale cinema, Brooklyn Park (www.mncinema.com)


7. Atlanta – Big cinemas Peachtree 8, Norcross (us.bigcinemas.com)


Please visit the above websites for show timings. Release date: Friday, February 04, 2011


Note: Dates for other cities will be announced shortly.


Tag: Telangana, Telangana Report, RajNews, eenadu, Sakshi, KCR, AP, NEWS, Imges, Hot Images, Srikrishna Commitee, Jai Bolo telangana

Read more...

'జైబోలో తెలంగాణ'చూశాక సీమాం«ద్రులూ విడిపోవాలనుకుంటారు

హైదరాబాద్, ఫిబ్రవరి4 : 'జై బోలో తెలంగాణ' సినిమా చూశాక సీమాంధ్రులు కూడా జై తెలంగాణ, జై ఆంధ్రాగా విడిపోవాలని కోరుకుంటారని భావిస్తున్నట్లు టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. తొలి నుంచి సీమాంధ్రులు తెలంగాణను వ్యతిరేకించటంలేదని, హైదరాబాద్‌కు వ్యాపారం కోసం వచ్చి న పిడికెడు మంది మాత్రమే తెలంగాణను అడ్డుకుంటున్నారని పునరుద్ఘాటించారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఇక్కడ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌లో 'జైబోలో తెలంగాణ' సినిమా తిలకించారు. అనంతరం థియేటర్ వద్ద, ఆ త ర్వాత తెలంగాణ భవన్‌లో కేసీఆర్ మాట్లాడారు.

ఇది ప్రతి తెలంగాణ బిడ్డ చూడదగిన చిత్రమన్నారు. "మూడు తరాల తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని చాలా అద్భుతంగా.. నభూతోనభవిష్యత్‌గా సినిమాను చిత్రీకరించారు. శతాబ్ది కాలంగా తెలంగాణ సమాజం అనుభవిస్తున్న బాధలు, దుఃఖాన్ని, ఉద్యమాన్ని దశ్య కావ్యంగా మలిచిన తీరు అద్భుతం. దర్శకుడు ప్రెజంట్ చేసిన తీరును చూసి తీరాలి. ఇది మామూలు డైరెక్టర్లకు సాధ్యంకాదు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల తరఫున చిత్ర దర్శక, నిర్మాత ఎన్.శంకర్‌కు ధన్యవాదాలు చెబుతున్నానంటూ ఆయనతో కరచాలనం చేసి అభినందించారు.

నేను, ప్రొఫెసర్ జయశంకర్ రెండుసార్లు ఇప్పటికి ఈ సినిమాను చూశాం. శ్రీకాంతాచారి ఆత్మాహుతికి పాల్పడిన సన్నివేశం చూస్తున్నప్పుడు కళ్ల నీళ్లు పెట్టుకోకుండా ఉండలేకపోయాను. 'జైబోలో తెలంగాణ' సినిమాను హిందీసహా అన్ని భారతీయ భాషల్లో రీమేక్ చేసే ప్రయత్నంలో శంకర్ ఉన్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలందరికీ ఈ సినిమాను చూపిస్తాం. 'జైబోలో తెలంగాణ' సినిమా 150 కేంద్రాల్లో విడుదలైంది. జిల్లాల నుంచి టికెట్లు దొరకటంలేదని ఫోన్లు వస్తున్నాయి. సినిమాను నాలుగు రోజులు ఎక్కువగా ఆడిస్తారుకాని, అంతా వరుసక్రమంలో సినిమా చూడాలి. నేను కూడా 25 ఏళ్ల తర్వాత టాకీస్‌కు కుటుంబంతోసహా వెళ్లి ఈ సినిమా చూశాను.'' అని చెప్పారు.

గుంటూరు అడ్వకేట్లు ధర్మమైన పోరాటమన్నారు.. "ఈ రోజు గుంటూరు నుంచి అడ్వకేట్స్ నాకు ఫోన్ చేశారు. 'జైబోలో తెలంగాణ' సీమాంధ్రకు వ్యతిరేకంగా ఉంటుందేమోనని అనుకున్నామని, సినిమా చూశాక తెలంగాణకు సపోర్ట్ చేయాలని అనిపించిందని వారు చెప్పారు. విశాఖపట్నంలోనూ ఈ సినిమా చూశాక అక్కడి ప్రజలు 'జై తెలంగాణ' అని నినాదాలిచ్చారు. తెలంగాణ ప్రజల బతుకుపోరాటాన్ని చాలా చక్కగా చూపించిన ఈ సినిమాను చూడాలి..చూపించాలి'' అని కోరారు.

గద్దర్ పాటకు ఉర్రూతలూగిన థియేటర్.. శుక్రవారం విడుదలైన 'జైబోలో తెలంగాణ' సినిమాను టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, పలువురు పార్టీ నేతలు, తెలంగాణ జేఏసీ నేతలు, మీడియా ప్రతినిధులు కలిసి చూడటానికి థియేటర్‌లోకి చేరుకోగానే, 'జై తెలంగాణ' నినాదాలు మిన్నంటాయి. కేసీఆర్‌కు కుడి పక్కన ఆచార్య కె.జయశంకర్, ఎడమ పక్కన చిత్ర దర్శక, నిర్మాత శంకర్ కూర్చున్నారు. కాగా, చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్ ఆట-పాట సమయంలో థియేటర్ ఉర్రూతలూగటం విశేషం. మాజీ మంత్రి నాయని నర్సింహారెడ్డి «థియేటర్ వద్ద మీడియా ఎదుటే డాన్స్ చేశారు. పది పుస్తకాల సారాంశాన్ని ఈ ఒక్క సినిమాలో చూపారని జేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు.

సినిమా హిట్..శంకర్ 'జై బోలో తెలంగాణ' సినిమా విడుదలైన ప్రతి చోటి నుంచి సూపర్ హిట్ అన్న టాక్ వస్తున్నదని దర్శకుడు శంకర్ చెప్పారు. ఉద్యమానికి ఈ చిత్రం మరింత ఊతమిస్తుందన్నారు. జంటనగరాలు, రంగారెడ్డి జిల్లా వికారాబాద్, నల్లగొండ తో పాటు రాష్ట్రమంతటా విడుదలైన ఈ సినిమాను చూడడానికి జనం ఎగబడ్డారు. తెలంగాణా జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో టీఆర్ఎస్ తదితర పార్టీలు, జేఏసీలు, ఉద్యమ నేతలు తొలిరోజు సినిమా చూడడానికి వచ్చారు. వరంగల్‌లో జనజాగృతి అధ్యక్షురాలు కవిత స్థానికి టీఆర్ఎస్ నాయకులతో కలిసి సినిమాను చూశారు.

'జై బోలో తెలంగాణా' సినిమాపై విశాఖలో నిరసన విశాఖపట్నం : విశాఖలో 'జై బోలో తెలంగాణ' సినిమాను ప్రదర్శిస్తున్న శ్రీకాంతి థియేటర్ వద్ద శుక్రవారం సీమాంధ్ర విద్యార్థి జేఏసీ నిరసన వ్యక్తంచేసింది. తెలంగాణ వాసుల మనోభావాలు గౌరవిస్తామని, జై బోలో తెలంగాణ సినిమాను ఆహ్వానిస్తున్నామని సమైక్యాంధ్ర యూనివర్సిటీల జేఏసీ పేర్కొంది.

నిర్ణయం తీసుకుంటాం: దర్శక, నిర్మాతలు గుంటూరు: 'జై బోలో తెలంగాణ' చిత్రంలో సీమాంధ్రులను కించపరిచే విధంగా ఉన్న వలసవాదులు అనే సంబోధనలను తొలగించడంకాని, మార్చడం కాని చేస్తామని దర్శక నిర్మాతలు శంకర్, కోటగిరి వెంకటేశ్వరరావులు హామీ ఇచ్చారు.

take By: Andrajyothi

Read more...

జైబోలో తెలంగాణ ఓ దృశ్య కావ్యం : కేసీఆర్‌

హైదరాబాద్‌ : శంకర్‌ దర్శకత్వం వహించిన జైబోలో తెలంగాణ సినిమాపై టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ప్రశంసల వర్షం కురిపించారు. అదో దృశ్యకావ్యమని ఆయన కొనియాడారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సుదర్శన్‌ థియేటర్‌లో కేసీఆర్‌ సినిమా చూశారు. సినిమాలో శ్రీకాంతాచారికి సంబంధించిన సీన్‌ చూసి తాను కంటతడిపెట్టినట్లు కేసీఆర్‌ అన్నారు. గత 50 ఏళ్లుగా తెలంగాణ దోపిడీకి గురయిన విధానాన్ని దర్శకుడు శంకర్‌ కళ్లకు గట్టినట్లు చూపించారని కేసీఆర్‌ అన్నారు.

సీమాంధ్రలో కూడా జైబోలో తెలంగాణ సినిమాకు అద్భుతమైన ఆధరణ లభించిందని, అక్కడి ప్రజలు సినిమాను చూసి ఎంతో బాగుందని, తెలంగాణ ఎలా దోపిడీకి గురయిందనే విషయాన్ని సినిమాలో చూసేదాకా తమకు తెలియదని కొందరు తనకు ఫోన్‌ చేసి చెప్పారని కేసీఆర్‌ తెలిపారు. అంత అద్భుతంగా సినిమా తీసిన దర్శకుడు శంకర్‌కు చేతులెత్తి నమస్కరించాలని ఆయనన్నారు. ఇకనైనా సీమాంధ్ర కరుడుగట్టిన సమైక్యవాదుల మనసులు మారతాయని ఆశిస్తున్నట్లు కేసీఆర్‌ చెప్పారు. విశాఖలో సినిమా చూసిన ఉత్తరాంధ్ర ప్రజలు జైతెలంగాణ నినాదాలు చేసినట్లు ఓ టీవీ ఛానళ్లో న్యూస్‌ చూపెట్టారని కేసీఆర్‌ వెల్లడించారు.

take BY: suryaa

Read more...

టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ ఐఏఎస్‌ అధికారులు

హైదరాబాద్‌ : తెలంగాణ జిల్లాల్లో కలెక్టర్లుగా పనిచేసి పదవీ విరమన పొందిన ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు ఇవాళ టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌ భవన్‌లో కేసీఆర సమక్షంలో వారు ఆ పార్టీలో చేరారు. దోపిడీకి గురవుతున్న తెలంగాణ ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్‌లో చేరినట్లు మాజీ ఐఏఎస్‌లు ఏకే గోయల్‌, రామ్‌లక్ష్మణ్‌లు చెప్పారు. హర్యానా నుంచి పంజాబ్‌ విడిపోయినపుడు ఏకే గోయల్‌ విద్యార్థి నాయకుడిగా ఉన్నట్లు కేసీఆర్‌ తెలిపారు. వీరితోపాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మురళీయాదవ్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు.

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP