'జైబోలో తెలంగాణ'చూశాక సీమాం«ద్రులూ విడిపోవాలనుకుంటారు
హైదరాబాద్, ఫిబ్రవరి4 : 'జై బోలో తెలంగాణ' సినిమా చూశాక సీమాంధ్రులు కూడా జై తెలంగాణ, జై ఆంధ్రాగా విడిపోవాలని కోరుకుంటారని భావిస్తున్నట్లు టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. తొలి నుంచి సీమాంధ్రులు తెలంగాణను వ్యతిరేకించటంలేదని, హైదరాబాద్‌కు వ్యాపారం కోసం వచ్చి న పిడికెడు మంది మాత్రమే తెలంగాణను అడ్డుకుంటున్నారని పునరుద్ఘాటించారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఇక్కడ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌లో 'జైబోలో తెలంగాణ' సినిమా తిలకించారు. అనంతరం థియేటర్ వద్ద, ఆ త ర్వాత తెలంగాణ భవన్‌లో కేసీఆర్ మాట్లాడారు.
ఇది ప్రతి తెలంగాణ బిడ్డ చూడదగిన చిత్రమన్నారు. "మూడు తరాల తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని చాలా అద్భుతంగా.. నభూతోనభవిష్యత్‌గా సినిమాను చిత్రీకరించారు. శతాబ్ది కాలంగా తెలంగాణ సమాజం అనుభవిస్తున్న బాధలు, దుఃఖాన్ని, ఉద్యమాన్ని దశ్య కావ్యంగా మలిచిన తీరు అద్భుతం. దర్శకుడు ప్రెజంట్ చేసిన తీరును చూసి తీరాలి. ఇది మామూలు డైరెక్టర్లకు సాధ్యంకాదు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల తరఫున చిత్ర దర్శక, నిర్మాత ఎన్.శంకర్‌కు ధన్యవాదాలు చెబుతున్నానంటూ ఆయనతో కరచాలనం చేసి అభినందించారు.
నేను, ప్రొఫెసర్ జయశంకర్ రెండుసార్లు ఇప్పటికి ఈ సినిమాను చూశాం. శ్రీకాంతాచారి ఆత్మాహుతికి పాల్పడిన సన్నివేశం చూస్తున్నప్పుడు కళ్ల నీళ్లు పెట్టుకోకుండా ఉండలేకపోయాను. 'జైబోలో తెలంగాణ' సినిమాను హిందీసహా అన్ని భారతీయ భాషల్లో రీమేక్ చేసే ప్రయత్నంలో శంకర్ ఉన్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలందరికీ ఈ సినిమాను చూపిస్తాం. 'జైబోలో తెలంగాణ' సినిమా 150 కేంద్రాల్లో విడుదలైంది. జిల్లాల నుంచి టికెట్లు దొరకటంలేదని ఫోన్లు వస్తున్నాయి. సినిమాను నాలుగు రోజులు ఎక్కువగా ఆడిస్తారుకాని, అంతా వరుసక్రమంలో సినిమా చూడాలి. నేను కూడా 25 ఏళ్ల తర్వాత టాకీస్‌కు కుటుంబంతోసహా వెళ్లి ఈ సినిమా చూశాను.'' అని చెప్పారు.
గుంటూరు అడ్వకేట్లు ధర్మమైన పోరాటమన్నారు.. "ఈ రోజు గుంటూరు నుంచి అడ్వకేట్స్ నాకు ఫోన్ చేశారు. 'జైబోలో తెలంగాణ' సీమాంధ్రకు వ్యతిరేకంగా ఉంటుందేమోనని అనుకున్నామని, సినిమా చూశాక తెలంగాణకు సపోర్ట్ చేయాలని అనిపించిందని వారు చెప్పారు. విశాఖపట్నంలోనూ ఈ సినిమా చూశాక అక్కడి ప్రజలు 'జై తెలంగాణ' అని నినాదాలిచ్చారు. తెలంగాణ ప్రజల బతుకుపోరాటాన్ని చాలా చక్కగా చూపించిన ఈ సినిమాను చూడాలి..చూపించాలి'' అని కోరారు.
గద్దర్ పాటకు ఉర్రూతలూగిన థియేటర్.. శుక్రవారం విడుదలైన 'జైబోలో తెలంగాణ' సినిమాను టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, పలువురు పార్టీ నేతలు, తెలంగాణ జేఏసీ నేతలు, మీడియా ప్రతినిధులు కలిసి చూడటానికి థియేటర్‌లోకి చేరుకోగానే, 'జై తెలంగాణ' నినాదాలు మిన్నంటాయి. కేసీఆర్‌కు కుడి పక్కన ఆచార్య కె.జయశంకర్, ఎడమ పక్కన చిత్ర దర్శక, నిర్మాత శంకర్ కూర్చున్నారు. కాగా, చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్ ఆట-పాట సమయంలో థియేటర్ ఉర్రూతలూగటం విశేషం. మాజీ మంత్రి నాయని నర్సింహారెడ్డి «థియేటర్ వద్ద మీడియా ఎదుటే డాన్స్ చేశారు. పది పుస్తకాల సారాంశాన్ని ఈ ఒక్క సినిమాలో చూపారని జేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు.
సినిమా హిట్..శంకర్ 'జై బోలో తెలంగాణ' సినిమా విడుదలైన ప్రతి చోటి నుంచి సూపర్ హిట్ అన్న టాక్ వస్తున్నదని దర్శకుడు శంకర్ చెప్పారు. ఉద్యమానికి ఈ చిత్రం మరింత ఊతమిస్తుందన్నారు. జంటనగరాలు, రంగారెడ్డి జిల్లా వికారాబాద్, నల్లగొండ తో పాటు రాష్ట్రమంతటా విడుదలైన ఈ సినిమాను చూడడానికి జనం ఎగబడ్డారు. తెలంగాణా జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో టీఆర్ఎస్ తదితర పార్టీలు, జేఏసీలు, ఉద్యమ నేతలు తొలిరోజు సినిమా చూడడానికి వచ్చారు. వరంగల్‌లో జనజాగృతి అధ్యక్షురాలు కవిత స్థానికి టీఆర్ఎస్ నాయకులతో కలిసి సినిమాను చూశారు.
'జై బోలో తెలంగాణా' సినిమాపై విశాఖలో నిరసన విశాఖపట్నం : విశాఖలో 'జై బోలో తెలంగాణ' సినిమాను ప్రదర్శిస్తున్న శ్రీకాంతి థియేటర్ వద్ద శుక్రవారం సీమాంధ్ర విద్యార్థి జేఏసీ నిరసన వ్యక్తంచేసింది. తెలంగాణ వాసుల మనోభావాలు గౌరవిస్తామని, జై బోలో తెలంగాణ సినిమాను ఆహ్వానిస్తున్నామని సమైక్యాంధ్ర యూనివర్సిటీల జేఏసీ పేర్కొంది.
నిర్ణయం తీసుకుంటాం: దర్శక, నిర్మాతలు గుంటూరు: 'జై బోలో తెలంగాణ' చిత్రంలో సీమాంధ్రులను కించపరిచే విధంగా ఉన్న వలసవాదులు అనే సంబోధనలను తొలగించడంకాని, మార్చడం కాని చేస్తామని దర్శక నిర్మాతలు శంకర్, కోటగిరి వెంకటేశ్వరరావులు హామీ ఇచ్చారు.
take By: Andrajyothi
0 comments:
Post a Comment