జైబోలో తెలంగాణ ఓ దృశ్య కావ్యం : కేసీఆర్
హైదరాబాద్ : శంకర్ దర్శకత్వం వహించిన జైబోలో తెలంగాణ సినిమాపై టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. అదో దృశ్యకావ్యమని ఆయన కొనియాడారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సుదర్శన్ థియేటర్‌లో కేసీఆర్ సినిమా చూశారు. సినిమాలో శ్రీకాంతాచారికి సంబంధించిన సీన్ చూసి తాను కంటతడిపెట్టినట్లు కేసీఆర్ అన్నారు. గత 50 ఏళ్లుగా తెలంగాణ దోపిడీకి గురయిన విధానాన్ని దర్శకుడు శంకర్ కళ్లకు గట్టినట్లు చూపించారని కేసీఆర్ అన్నారు.
సీమాంధ్రలో కూడా జైబోలో తెలంగాణ సినిమాకు అద్భుతమైన ఆధరణ లభించిందని, అక్కడి ప్రజలు సినిమాను చూసి ఎంతో బాగుందని, తెలంగాణ ఎలా దోపిడీకి గురయిందనే విషయాన్ని సినిమాలో చూసేదాకా తమకు తెలియదని కొందరు తనకు ఫోన్ చేసి చెప్పారని కేసీఆర్ తెలిపారు. అంత అద్భుతంగా సినిమా తీసిన దర్శకుడు శంకర్‌కు చేతులెత్తి నమస్కరించాలని ఆయనన్నారు. ఇకనైనా సీమాంధ్ర కరుడుగట్టిన సమైక్యవాదుల మనసులు మారతాయని ఆశిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. విశాఖలో సినిమా చూసిన ఉత్తరాంధ్ర ప్రజలు జైతెలంగాణ నినాదాలు చేసినట్లు ఓ టీవీ ఛానళ్లో న్యూస్ చూపెట్టారని కేసీఆర్ వెల్లడించారు.
take BY: suryaa
0 comments:
Post a Comment