ఉద్యోగుల సహాయ నిరాకరణకు మద్దతుగా ర్యాలీ
సిద్దిపేట,: పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ జేఏసీ ఆద్వర్యంలో చేస్తున్న సహాయ నిరాకరణకు మద్దతుగా శుక్రవారం నాడు రాజకీయ జేఏసీ మద్దతుగా సంఘీభావ ర్యాలీ నిర్వహించింది. పట్టణ వీధుల గుండా ర్యాలీ నిర్వ హించి ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో బైటాయించిన ఉద్యోగులకు మద్దతును ప్రకటించారు. ఈ సందర్బంగా మున్సిపల్ మాజీ ఛైర్మన్ రాజనర్సు మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంఎల్‌ఏలు ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షలకు అనుగు ణంగా ఉద్యమానికి మద్దతు పలకాలన్నారు. పదవులు శాశ్వతం కాదని ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తున్న వారందరిని ప్రజలు పూవుల్లో పెట్టుకుని మరీ అందలం ఎక్కిస్తారన్నారు. ఇందుకు నిదర్శనంగానే ఉపఎన్నికల్లో రాజీనామాలు చేసిన అభ్యర్థులను తెలంగాణవాదులు భారీ మెజార్టీతో గెలిపిం చారన్నారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు సాకారం అయ్యే రోజులు ఎంతో దూరంలో లేవని ఇలాంటి సమయంలో రాజకీయాలు మంచిది కాదన్నారు. జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీలకు అతీతంగా ఎజండాలు పక్కనపెట్టి తెలంగాణ రాష్ర్ట సాధన కోసం ఉద్యమిం చాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమం లో పాల్గొనని ప్రజాప్రతినిధులు తెలంగాణ ప్రజల చేతిలో భంగపాటుకు గురికాక తప్పద న్నారు. ఉద్యోగుల సహాయ నిరాకరణకు జడ్పీటీసీ బాలం రంగం, ఎంపీపీ ఉపాద్యక్షులు మారెడ్డి రవీందర్‌రెడ్డి, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, కూర బా ్‌రెడ్డి, ఎంపీటీసీలు కొండం సంపత్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, సర్పంచ్ ర్రె రాజు, జీడిపల్లి కమలాకర్‌రావు, బాలకిషన్, నరేష్, వెంకట్‌గౌడ్, డాల్పిన్ మురళీ, పాల సాయిరాం, చిప్ప ప్రభాకర్, బూర విజయ, నందాదేవి, మంతూరి పద్మ, సుశీల, టైగర్ నర్సమ్మలు సంఘీభావం ప్రకటించారు.అదే విధంగా ఐసీడీఎస్ ఉద్యోగులు, రేషన్‌డీలర్ల సంఘం ఆధ్వర్యంలో సహాయ నిరాకరణకు సంఘీభావం ప్రకటిం చారు. అంతకు ముందు ఆర్డీఓ కార్యాలయ ఆవరణలోనే మిహ ళలు బతుకమ్మ, ఉద్యోగులు కబడ్డీ ఆటలను ఆడారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు విక్రం, శ్రీహరి, వేణు గోపాల్‌రెడ్డి, బిక్షపతి, గురువారెడ్డి, బిక్షపతి, పరమేశ్వర్, కమాల్, రాజు, మజీద్, చంద్రశేఖర్‌రెడ్డి, రాజశేఖరవర్మ, శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.
నంగునూరులో...
తెలంగాణ ప్రత్యేక రాష్ర్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మండల ఉద్యోగ జేఏసీ ఆద్వర్యంలో నంగునూరులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా తహిసీల్దార్ కార్యాలయం ఎదుట బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం గ్రామ వీధుల గుండా విద్యార్థులు, రాజకీయ జేఏసీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా జేఏసీ నాయకులు నరేందర్ మాట్లాడుతూ మార్చి 5వ తేదీ వరకు నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో ఉద్యోగులు తప్పనిసరిగా పాలుపంచు కోవాలన్నారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పడే వరకు కలిసికట్టుగా పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ నాయకులు ప్రభాకర్, సుగుణ, ప్రభాకర ్‌రావు, హరికిషన్, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు జయ పాల్‌రెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డి, రాజయ్య, సుభాష్‌చందర్, రాజ కీయ జేఏసీ నాయకులు సారయ్య, జాప శ్రీకాంత్‌రెడ్డి, రమేష్‌గౌడ్, సోమిరెడ్డి, సత్యనారాయణ, యాదమల్లు, పురేందర్, వేణుచక్రవర్తి, సతీష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నా