ఉత్తరాంధ్రతో.. తెలంగాణ !
హైదరాబాద్, తెలంగాణలో ఉత్తరాం ధ్రకు చెందిన మూడు జిల్లాలు కలిపి హైదరాబాద్ స్టేట్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ తాజాగా తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం ఉన్న భౌగోళిక స్వరూపంతో కూడిన తెలంగాణ ప్రాంతంతో ప్రత్యేక రాష్ట్రం తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, సముద్ర తీర ప్రాంతంతో కూడిన రాష్ట్రం ఉంటేనే సత్వరంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందనే ప్రతిపాదనలను అధికార పక్షానికి చెందిన సభ్యులే తెరమీదికి తీసుకొస్తున్నారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను తెలంగాణతో కలిపి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల సౌకర్యాలు, వసతులు, సామాజిక, రాజకీయ, వాస్తు... అంశాల పరంగా కలిసి వస్తుందని వారు అభిప్రాయ పడు తున్నారు. ఇలా చేయడం వల్ల రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మరింత బలపడుతుందని, అన్ని వర్గాల వారికి కలిసొస్తుం దంటూ పాలకపక్షానికి చెందిన తెలంగాణ, ఉత్తరాంధ్ర నేతలు పలువురు గట్టిగా నమ్ముతున్నారు. ఇదే విషయమై శుక్రవారం కాంగ్రెస్‌కు చెందిన కొందరు సభ్యులు అసెంబ్లీ లాబీల్లో విస్తృతంగా ప్రచారం చేశారు.
టిఆర్‌ఎస్, తెలం గాణ టీడిపి, సిపిఐ సభ్యులతో పాటు తెలంగాణ, ఉత్తరాం ధ్ర జిల్లాలకు చెందిన పార్టీ సభ్యుల చెవిలో సైతం పడే శారు. అదే విధంగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు ఫోన్ల ద్వారా ఈ ప్రతిపాదనలు తెలియజేశారు. ఈ మూడు జిల్లాలను కలుపుకుంటే తెంలగాణకు కలిసొచ్చే ఆంశా లను సభ్యులందరికి వివరించారు. దీంతో వారు కొత్త వాదంపై ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. వారిలో కొందరైతే ఇలాగైతే బాగుంటుందంటూ ఈ ప్రతిపాదన లను తెరమీదకు తీసుకొచ్చిన అధికార పక్ష సభ్యులకు ఫోన్లు చేసి అభినందించడం మొదలుపెట్టారు. ఈ కొత్త డిమాండ్‌ను కేంద్రం, పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళేం దుకు వారు సిద్ధమవుతున్నారు.
తెలంగాణలోని పది జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను కలిపి తెలంగాణ రాష్ట్రానికి బదులు హైదరాబాద్ స్టేట్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఇప్పుడు తెరమీదకు వస్తున్నది. ఉత్తరాంధ్రలోని ఆ మూడు జిల్లాలు కూడా తెలంగాణ తర హాలోనే వెనుకబడ్డ ప్రాంతాలే. అందుకే వాటిని తెలంగాణ ప్రాంతంలో కలుపుకుంటే రెండు ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది. అంతే కాకుండా కొత్తగా ఏర్పాటయ్యే రాష్ట్రానికి సముద్ర తీరప్రాంతం ఉంటుంది. మూడు ఓడరేవులు, మరో అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రాష్ట్రానికి లభిస్తుంది. ఐటి రంగంలో విశాఖ అభివృద్ధి చెందుతున్నది. పెట్రో కారిడార్, మూడు థర్మల్ పవర్ ప్లాంట్లు, ఖనిజ సంబద, మరో ప్రఖ్యాత యూనివర్సిటీ కొత్త రాష్ట్రంలో ఉంటాయి.ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలను కలిపి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు దాన్ని తెలంగాణ అని కాకుండా హైదరాబాద్ స్టేట్‌గా ప్రకటిస్తే బాగుంటుంది. పైగా ప్రస్తుత రాజధాని హైదరాబాద్ తమకు కావాలని మరొకరు డిమాండ్ చేసే పరిస్థితి ఉండదు.
ఇక వాస్తుపరంగా కూడా ఈ కొత్త ప్రతిపాదన బాగా కలిసొస్తుందంటున్నారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ బౌగో ళిక స్వరూపంలో వాస్తు దోషం ఉంది. అందుకే గత నలభై ఏళ్ళుగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు జరుగుతున్న, వేలాది మంది ప్రాణాలు కోల్పోయినా రాష్ట్రం ఏర్పాటు కాలేదు. కొత్తగా ఉత్తరాంధ్రకు చెందిన మూడు జిల్లాలను కలుపుకోవడం వల్ల ఈశాన్యం (నార్త్ ఈస్ట్) వైపు నీళ్ళు కలిగి భూమి పల్లంగా ఉండటం, నైరుతి వైపు కొండలు, బరువుతో ఎత్తు ప్రాంతం ఉండటం వల్ల వాస్తు ప్రకారంగా కొత్త రాష్ట్రానికి బాగా కలిసొస్తుంది. ప్రపంచంలో మరే రాష్ట్రం అభివృద్ధి చెందని విధంగా రాష్ట్రం ప్రగతి సాధిస్తుం ది. ఖమ్మం, భద్రాచలం, ఎగువ సీలేరు, దిగువ సీలేరు, నర్సిపట్నం మీదుగా విశాఖ వరకు జాతీయ రహాదారి, రైల్వే లైన్లు వేసుకోవడం ద్వారా రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడుతుంది. సామాజిక ఆంశాలు కూడా ప్రతిపా దిత కొత్త రాష్ట్రానికి బాగా కలిసొస్తాయి. సముద్రం, వనరులతో కూడిన తెలంగాణ ఉంటేనే లాభం. ఇది ముందు తరాలకు కూడా బాగా ఉపయోగ పడుతుంది.
ఇక రాజకీయ పరమైన అంశాలకు వస్తే తెలంగాణ, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు కలుపుకుంటే మొత్తం 13 రాష్ట్రాలతో హైదరాబాద్ స్టేట్ ఆవిర్భవిస్తుంది. శాసన సభ్యుల సంఖ్య 153, లోక్‌సభ సభ్యుల సంఖ్య 22కు చేరుతుంది. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం ప్రవేశ పెట్టినా మెజారిటీతో సునాయసంగా అది నెగ్గుతుంది. బిజెపి లాంటి మతతత్వ పార్టీలు బలపడేందుకు అవకాశం ఉండదు. ఇదే భయంతో మజ్లిస్ తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్నది. ఉత్తరాంధ్ర జిల్లాలు మూడు కలిస్తే అలాంటి భయమే ఉండదు. సామాజిక సమతుల్యత ఉంటుంది.
తెలంగాణ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి, ఉత్తరాంధ్ర నుంచి డిప్యూటీ సిఎం, అటువారు సిఎం అయితే ఇటు నుంచి డిప్యూటీ సిఎం ఇలా పదవుల విషయంలో కూడా అవగాహనతో ముందుకు వెళ్ళొచ్చు. పైగా ఉత్తరాంధ్ర జిల్లాలోని ప్రజాప్రతినిధులు, మెజారిటీ ప్రజలందరు తెలంగాణతో కలిసి ఉండటంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటున్నారు. వారితో తెలంగాణ వారికి సైతం పెద్దగా సమస్యలు ఉండవు. రాయలసీమ, కోస్తాలోని మిగతా జిల్లాలతో ఏర్పాటయ్యే రాష్ట్రంలో చిరంజీవికి బాధ్యతలు అప్పగించడం, టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసుకోవడం ద్వారా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మరింత బలంగా ఎదుగుతుంది. అధికార పక్షానికి చెందిన తెలంగాణ, ఉత్తరాంధ్ర ప్రాంతాల ఎమ్మెల్యేలు కొందరు ఈ అంశాలన్నింటిని వివరిస్తూ శుక్రవారం అసెంబ్లీలో లాబీల్లో, ఆయా పార్టీల సభ్యుల చాంబర్లలో విస్తృతంగా ప్రచారం సాగించారు. ఈ తాజా ప్రతిపాదనలపై టిఆర్‌ఎస్, తెలంగాణ టీడిపి, సిపిఐ, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు సానుకూలంగా స్పందించడమే కాకుండా దీనిపై లోతుగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది

Tag: News, AP, Telangana, Telagnana News, KCR, Hot News, Images, Sexy, Tollywood, Hot Images, Video, RajNews, hmtv, TV, Medak, Siddiper,
take By: Suryaa.com
take By: Suryaa.com
0 comments:
Post a Comment