పది లక్షల మందితో హైదరాబాద్ దిగ్బంధం
హైదరాబాద్,మేజర్‌న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్లు ఇస్తామని టీఆర్‌ఎస్ అధినేత కే.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. తెలంగాణ వచ్చేదాకా పోరాటం కొనసాగిద్దామని ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. మార్చి10న ‘మిలియన్ మార్చ్ టు హైదరాబాద్’ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. 10 లక్షల మందితో హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. రోడ్ల ద్వారా హైదరాబాద్‌లోకి ఒక్క చీమను కూడా దూరనిచ్చేది లేదన్నారు. రోడ్లపైనే వంటావార్పు ఉంటుందని చెప్పారు. శనివారం ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో లెక్చరర్లు చేస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని కేసీఆర్ సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ సహాయ నిరాకరణ చేస్తున్న ఉద్యోగులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడితే సార్వత్రిక సమ్మెకు పిలిపునిస్తామని హెచ్చరించారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలనిగత తొమ్మిది రోజులుగా తెలంగాణ ఉద్యోగులు చేపట్టిన సహాయ నిరాకరణపై ప్రభుత్వం స్పందించటం లేదని టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ చెప్పారు. శనివారం ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ఎదుట లెక్చరర్లు దీక్షా శిబిరాన్ని కోదండరామ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టకపోతే ప్రభుత్వానికి సహకరించేది లేదని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు చెబితే కేంద్ర ప్రభుత్వం దిగిరాదా అని ప్రశ్నించారు. మార్చి 1న తెలంగాణ ప్రాంతం ద్వారా ఢిల్లీకి ఒక్క రైలు కూడా వెళ్ళనివ్వకుండా రైల్‌రోకో కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు.

0 comments:
Post a Comment