‘కారు’ కలిస్తేనే .. తెలంగాణ
ఇప్పటిదాకా అన్ని పార్టీలపై ఒత్తిడి పెంచుతున్న టీఆర్‌ఎస్ ఇకపై తానే ఒత్తిడి ఎదుర్కోనుంది. తెలం గాణ రాష్ట్ర ఏర్పాటు వ్యవహారం ఇప్పుడు టీఆర్‌ఎస్ కోర్టుకే చేరింది. టీఆర్‌ఎస్ తన పార్టీలో విలీనం అయితేనే రాష్ట్ర విభజనకు అంగీకరిస్తామని కాం గ్రెస్ నాయకత్వం తనను కలుస్తున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులకు స్పష్టం చేయ డంతో.. ఇకపై టీఆర్‌ఎస్‌పై ఒత్తిడి పెంచాలని కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయించుకున్నట్లు సమా చారం. తెలంగాణ ఉద్యమం ఉధృతమవుతున్న నేపథ్యంలో తమపై పెరుగుతున్న ఒత్తిళ్ల నుంచి రక్షించాలంటూ ఇటీవల కొందరు ఎంపీలు ప్రణబ్‌ముఖర్జీ, అహ్మద్‌పటేల్ వద్దకు వెళ్లారు.
ఉద్యోగులు సహాయ నిరాకరణ చేస్తున్నారని, జేఏసీ సైతం తమను ఇబ్బందిపెడుతోందంటూ వారు మొరపెట్టుకున్నారు. అసెంబ్లీలో టీఆర్‌ఎస్ రోజూ తెలంగాణ తీర్మానం కోసం స్తంభింపచేస్తోందని, ఫలితంగా ప్రజల్లో కాంగ్రెస్ ఎంపీలు ఏమీ చేయ డం లేదన్న వ్యతిరేకత పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీల ఆవేదనవిన్న ప్రణబ్, అహ్మద్ పటేల్ తెలంగాణపై నిర్ణయం రాజ కీయ ప్రయోజనాలతో ముడిపడి ఉందని, అందుకు మీరు కూడా సహకరించాలని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తేనే రాష్ట్ర విభ జనకు కేంద్రం నిర్దిష్ట నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటించి, టీఆర్ ఎస్‌కు రాజకీయ ప్రయోజనం పొందమని చెప్ప లేము కదా? అని సూటిగానే ప్రశ్నించినట్లు తెలిసింది. పీఆర్పీని విలీనం చేయడం ద్వారా కోస్తాలో పార్టీ బలపడిందని వివరించారు.
అదేవిధంగా తెలంగాణలో కూడా టీఆర్‌ఎస్‌ను విలీనం చేసుకోవడం ద్వారా అక్కడ కూడా పార్టీ బలపడాలన్నదే పార్టీ విధానమని వారికి స్పష్టం చేసినట్లు సమాచారం. ఇదే విషయాన్ని అహ్మద్‌పటేల్ సైతం పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తే తప్ప తెలంగాణ రాష్ట్ర ం ఇవ్వడం సాధ్యం కాదని, ఆ మేరకు మీరు టీఆర్‌ఎస్‌ను ఒప్పించాలని కూడా డీఎస్‌కు సూచించినట్లు తెలిసింది. ‘విలీనంపై మీరంతా టీఆర్‌ఎస్‌పై ఎంత ఒత్తిడి తీసుకువస్తే మేం కూడా అంత త్వరగా నిర్ణయం తీసుకుంటామ’ని విస్పష్టంగా చెప్పినట్లు పార్టీ వర్గాల సమాచారం.
దీనితో.. తెలంగాణ రావాలంటే టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనం కావాలన్న నినాదంతో ఒత్తిడి చేయాలని కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆ మేరకు ఒత్తిడి పెంచితే ప్రజల నుంచి కూడా టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయాలన్న డిమాండ్ వస్తుందని భావిస్తున్నారు. టీఆర్‌ఎస్ విలీనం అయితే, తెలంగాణ త్వరగా వస్తుందన్న ప్రచారం ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే సర్వే సత్యనారాయణ వంటి ఎంపీలు టీఆర్‌ఎస్ వెంటనే కాంగ్రెస్‌లో విలీనం చేస్తే అమ్మగారు (సోనియా) వెంటనే తెలంగాణ ఇచ్చేస్తుందని, ఇక తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్‌ఎస్ ఎందుకని కేసీఆర్ సమక్షంలోనే సర్వే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరో సందర్భంలో సర్వేనే ‘టీఆర్‌ఎస్ విలీనం కాకుండా కాంగ్రెస్ తెలంగాణ ఎలా ఇస్తుంది.
వాళ్లకు పొలిటికల్ అడ్వాంటేజ్ ఇచ్చి మేం నష్టపోవాలా?’ అని ప్రశ్నించటం గమనార్హం. అప్పుడు సోనియా తెలంగాణ ఇస్తే ఆమె కాళ్లు కడిగి నెత్తిన చల్లుకునేందుకు సైతం సిద్ధంగా ఉన్నానని, తెలంగాణ వస్తే తాను బర్ఖాస్ అయ్యేందుకు సిద్ధమేనని స్వయంగా కేసీఆర్ కూడా ప్రకటించారు.మరోవైపు.. డీఎస్ కూడా టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయాలని కేసీఆర్‌ను కోరుతున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు అధిష్ఠానం నుంచి తనకు వచ్చిన ఆదేశాలను డీఎస్ వివరించినట్లు సమాచారం. అయితే.. ముందు తెలంగాణ ఇవ్వాలని, ఆ తర్వాతే తమ పార్టీని విలీనం చేస్తామని కేసీఆర్ చెప్పినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కాగా, కేసీఆర్ మాటలను విశ్వసించడానికి లేదని, ఒకవేళ ఆయన మాట నమ్మి తెలంగాణ ప్రకటిస్తే ఆ తర్వాత విలీనంపై అడ్డం తిరిగితే మళ్లీ కాంగ్రెస్ టీఆర్‌ఎస్‌పై ఆధారపడక తప్పదంటున్నారు. అందుకే ముందు జాగ్రత్తగానే విలీనం షరతు విధించినట్లు పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ ఇకపై కాంగ్రెస్ నుంచి ఒత్తిళ్లు ఎదుర్కోనుంది. తెలంగాణ రాష్ట్ర సాధనే టీఆర్‌ఎస్ ధ్యేయమని చెబుతున్నందున.. తెలంగణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తే తెలంగాణ వెంటనే వస్తుందన్న వాదనతో కాంగ్రెస్ తెరపైకి రానుంది. కేసీఆర్ మళ్లీ తాజాగా రూటు మార్చి కాంగ్రెస్‌ను విమర్శిస్తుండటంతో కాంగ్రెస్ సైతం టీఆర్‌ఎస్‌ను త్వరగా విలీనం చేసుకునేందుకు సిద్ధమవుతోంది.
take By: Suryaa

0 comments:
Post a Comment