Earn Money per click 1 dollar .................. Think
Tags:Earn Money, free money, online earn money, full time, Part time, money,
Tags:Earn Money, free money, online earn money, full time, Part time, money,
న్యూఢిల్లీ : తెలంగాణపై పార్లమెంట్‌లో చర్చించాలని కోరుతూ పార్లమెంట్‌లో ప్రతిపక్షనాయకురాలు, బీజేపీ నేత సుష్మాస్వరాజ్ లోక్‌సభ స్పీకర్‌కు నోటీసు ఇచ్చారు. గత వర్షాకాల సమావేశాల్లో సమస్యను త్వరగా పరిష్కరిస్తామని చెప్పిన కేంద్రం, నేటి వరకు ఈ అంశంపై ఎటూ తేల్చలేదని ఆమె ఆరోపించారు. తెలంగాణపై సుధీర్ఘ చర్చ చేసి, సమస్య పరిష్కారానికి మార్గం వెతకాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణకు తాము కట్టుబడి ఉన్నామని గతం నుంచి బీజేపీ అగ్రనేతలు చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో జనచేతన యాత్ర సందర్భంగా బీజేపీ అగ్రనేత అద్వానీ కూడా పదేపదే తెలంగాణ ప్రస్తావన తెచ్చారు. పార్లమెంట్‌లో బిల్లు పెడితే తాము పూర్తి మద్దతు ఇస్తామని, రాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని ఆయన స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ వారు ఇవ్వని పక్షంలో 2014 ఎన్నికల అనంతరం ఎన్డీయే అధికారంలోకి రాగానే తెలంగాణ ఇస్తామని ఆయన చెప్పిన విషయం కూడా విదితమే. అంతేకాక నల్గొండలో ఇటీవల నిర్వహించిన తెలంగాణ పోరు సభలో సుష్మాస్వరాజ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పూర్తిగా వెనుకబడి పోయిన తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాల్సిందేనని ఆమె పేర్కొన్న విషయం విదితమే. ఈ నెల22 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ అంశం ప్రధాన అస్త్రంగా కేంద్రాన్ని, కాంగ్రెస్ నేతలను ఇరకాటంలో పెట్టేందుకు ఇప్పుడు బీజేపీ సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణపై పార్లమెంట్‌లో చర్చకు సుష్మా నోటీస్ ఇచ్చింది.
హైదరాబాద్ : డీఎస్పీ కోసం వెయి కళ్లతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. కొత్త సంవత్సరం మొదట్లోనే డీఎస్పీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి పార్థసారథి చెప్పారు. జనవరిలో టెట్ పరీక్ష అనంతరం ఈ నోటిఫికేషన్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
Take By: T News
Tags: Telangana News, Jobs, Notification, Govt Jobs, Full Time, Part Time, Job News, ryk, AP, TET, APTET, Venkat Reddy,
- పూర్వాంచల్, పశ్చిమ ప్రదేశ్, అవధ్ ప్రదేశ్, బుందేల్‌ఖండ్
- యూపీని నాలుగు రాష్ట్రాలు చేసే ప్రతిపాదన
- 21నుంచి యూపీ అసెంబ్లీ
- ఆ సమావేశాల్లోనే మాయ ప్రతిపాదన
- రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర
- చిన్న రాష్ట్రాలతోనే పరిపాలన సులువు
- సమక్షిగాభివృద్ధికీ చిన్న రాష్ట్రాలే మార్గం
- విలేకరుల సమావేశంలో యూపీ సీఎం
- అవాక్కయిన యూపీ విపక్షాలు
- ఎన్నికల్లో లబ్ధి పొందడానికే : ఎస్పీ
- రాష్ట్రాలు ఇలా ఏర్పడవు : బీజేపీ
- సున్నిత సమస్య.. ఎంతో ఆలోచించాలి : కాంగ్రెస్
పూర్వాంచల్ ప్రాంతంలో గోరఖ్‌పూర్, బలియా సహా 22 జిల్లాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రస్తుత రాజధాని లక్నో అవధ్‌వూపదేశ్‌లోకి వస్తుంది. ఈ ప్రాంతంలో 14 జిల్లాలు ఉన్నాయి. బుందేల్‌ఖండ్‌లో ఝాన్సీ సహా ఏడు జిల్లాలు ఉన్నాయి. పశ్చిమవూపదేశ్ పరిధిలో మీరట్, ఘజియాబాద్, గౌతమ్‌బుద్ధ నగర్ సహా 22 జిల్లాలు ఉన్నాయి.
1. పూర్వాంచల్ (తూర్పు యూపీ), 2. పశ్చిమ ప్రదేశ్ (పశ్చిమ యూపీ),
3. అవధ్ ప్రదేశ్ (మధ్య యూపీ), 4. బుందేల్‌ఖండ్
2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరవూపదేశ్ జనాభా 19 కోట్లు
మొత్తం దేశ జనాభాలో యూపీ జనాభాయే 16 శాతం
లక్నో, నవంబర్ 15:
ఉత్తరవూపదేశ్ రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేయాలన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి తన మాటలకు ఆచరణాత్మక రూపం ఇవ్వబోతున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ‘తాంబూలాలు ఇచ్చాం.. తన్నుకు చావండి’ అన్న పద్ధతిలో ఒకేదెబ్బకు అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలను ఇరకాటంలోకి నెట్టారు. యూపీ విభజన విషయంలో ఇక కేంద్రమే ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిని సృష్టించారు. ప్రాంతీయ ఆకాంక్షలకు ఎవరు వ్యతిరేకమో? ఎవరు అనుకూలమో తేల్చుకోవాల్సిన పరిస్థితిని యూపీ రాజకీయ పక్షాలకు కల్గించారు. మెరుగైన అభివృద్ధి కోసం చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తాను సుముఖమన్న మా యావతి యూపీని 4 చిన్న రాష్ట్రాలుగా విభజించాలన్న ప్రతిపాదనను ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రవేశపెట్టబోతున్నట్లు మంగళవారం వెల్లడించారు. పూర్వాంచల్ (తూర్పు యూపీ), పశ్చిమ ప్రదేశ్ (పశ్చిమ యూపీ), అవధ్ ప్రదేశ్ (మధ్య యూపీ), బుందేల్‌ఖండ్‌గా ఉత్తరవూపదేశ్‌ను విభజించాలని మాయావతి ప్రతిపాదించనున్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా, ఉత్తమ పరిపాలన అందించాలన్నా చిన్న రాష్ట్రాలుగా విభజించితేనే సాధ్యమని మాయావతి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం జరిగిన ఉత్తరవూపదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రాష్ట్రాన్ని నాలుగు చిన్న రాష్ట్రాలుగా విభజించే ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. అనంతరం మాయావతి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తీవ్ర స్థాయిలో చర్చలు జరిపి, మంచి చెడ్డలు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాయావతి చెప్పారు. ఈ ప్రాంతాల ప్రజల ఆకాంక్షలు, అభివూపాయాలను పరిగణనలోకి తీసుకునే ఈ డిమాండ్‌ను చేపట్టినట్లు తెలిపారు. పెద్ద రాష్ట్రాలతో పోల్చితే చిన్న రాష్ట్రాలనే చక్కగా నిర్వహించవచ్చునని ఆమె అన్నారు. పరిమాణంలో పెద్దది కావడమే యూపీ వెనుకబాటుకు ప్రధాన కారణమని ఆమె పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక మంది ప్రధాన మంత్రులను ఉత్తరవూపదేశ్ అందించినా.. వారెవరూ రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేయలేదని మాయావతి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, వివక్ష వల్లే యూపీ అభివృద్ధి చెందలేకపోయిందని అన్నారు.
రాజ్యాంగంలోని మూడవ అధికరణం ప్రకారం పునర్వ్యవస్థీకరణ, రాష్ట్రాల విభజన, రాష్ట్రాల పేరు మార్పు పార్లమెంటు చేతిలోనే ఉందని మాయావతి తెలిపారు. కానీ దురదృష్టవశాత్తూ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంగానీ, కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంగానీ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ఆమె విమర్శించారు. 2007లో తాను సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే యూపీ విభజన అంశాన్ని పరిశీలించాలని కోరుతూ ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. తూర్పు యూపీ, బుందేల్‌ఖండ్‌ల అభివృద్ధి కోసం రూ.80వేల కోట్ల ప్యాకేజీ సైతం కోరానని చెప్పారు. కానీ కేంద్రం ఈ విషయంలో చేసింది శూన్యమన్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశాభావంతో తాను అభివృద్ధి ప్యాకేజీ, రాష్ట్ర విభజన అంశాలపై ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నానని తెలిపారు.
ప్రక్రియ ప్రకారమైతే యూపీఏ ప్రభుత్వం యూపీ విభజనపై పార్లమెంటులో తీర్మానం ఆమోదించి దానిని యూపీ రాష్ట్ర అసెంబ్లీ సమ్మతి నిమిత్తం పంపాల్సి ఉంటుందని చెప్పారు. ‘‘ప్రాంతీయ అకాంక్షలు పరిగణనలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని, అప్పుడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, రాష్ట్ర విభజనపై తీర్మానం చేసి కేంద్రానికి పంపుదామని ఆశించాను. అయితే కేంద్రం నుంచి అటువంటి నిర్దిష్ట చర్యలేమీ లేవు. దీర్ఘకాలంగా ఎదురుచూశాక, కేంద్రం చేసింది ఏమీ లేకపోవడంతో చివరకు యూపీ విభజన ప్రతిపాదనను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని తీర్మానించుకున్నాం. దీనిని యూపీఏ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చే విధంగా కేంద్రానికి పంపనున్నాం’’ అని ఆమె విలేకరులకు తెలిపారు. 2011 లెక్కల ప్రకారం ఉత్తరవూపదేశ్ జనాభా 19 కోట్లు దాటిపోయిందని అన్నారు. అంటే దాదాపు మొత్తం దేశంలో 16శాతం మంది ఇక్కడే నివసిస్తున్నారని చెప్పారు.
ఈ నేపథ్యంలోనే ప్రజల సమగ్ర అభివృద్ధికి, ఉత్తమ భవిష్యత్తుకు విభజనే మార్గమని మాయావతి నొక్కి చెప్పారు. భౌగోళికంగా కూడా ఉత్తరవూపదేశ్ అతిపెద్ద రాష్ట్రమని అన్నారు. గతంలో ఉత్తరవూపదేశ్‌ను పరిపాలించిన కాంగ్రెస్, బీజేపీ, సమాజ్‌వాది పార్టీ, ఇతరుల తప్పుడు విధానాల కారణంగా యూపీ సమక్షిగాభివృద్ధి సాధించలేక పోయిందని మాయావతి విచారం వ్యక్తం చేశారు. చిన్న రాష్ట్రాలు, విభాగాలను మెరుగ్గా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందన్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ అభివూపాయాన్ని తమ పార్టీ, తమ ప్రభుత్వం సమర్థిస్తోందని అన్నారు. ‘‘అందుకే యూపీలో బీఎస్పీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కొత్త జిల్లాలు, కొత్త డివిజన్‌లు ఏర్పాటు చేశాం’’ అని ఆమె గుర్తు చేశారు.
యూపీ ఎన్నికలకు తురుపుముక్క!
మాయావతి చర్య రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి తురుపుముక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత, తనపై వచ్చిన అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మళ్లించడంలో భాగంగా మాయావతి ఈ చర్య తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభివూపాయపడుతున్నారు. ప్రతిపక్షాలను కూడా ప్రచారంలో వెనక్కు నెట్టే ఉద్దేశంతో ఆమె ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చారని చెబుతున్నారు. యూపీలో 80 లోక్‌సభ నియోజకవర్గాలు, 403 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పశ్చిమ, తూర్పు ప్రాంతాలు, బుందేల్‌ఖండ్ ప్రాంతాల్లో చిన్న రాష్ట్రాలకోసం ఉన్న సెంటిమెంట్‌ను ఓట్ల రూపంలో మార్చుకునేందుకు మాయావతికి ఈ చర్య దోహదం చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
యూపీలో కాంగ్రెస్ రాహుల్ గాంధీతో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మరుసటి రోజే మాయావతి ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. మాయావతి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి అడుగంటి పోయిందని రాహుల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
రాజకీయ ఎత్తుగడే:ఎస్పీ
‘‘రాష్ట్ర ప్రజలను వెర్రివాళ్లను చేసేందుకు వేసిన ఎన్నికల ఎత్తుగడ ఇది. ఇది రాజకీయ కుట్ర కూడా. దీనిని తుదికంటా వ్యతిరేకిస్తాం. అభివృద్ధి అనేది ఆయా ప్రభుత్వాల ఉద్దేశాలను బట్టి ఉంటుంది. ఎప్పుడూ సమస్యలు సృష్టించడమే బీఎస్పీకి అలవాటు. సమాజంలో చీలికలు తెచ్చే బీఎస్పీ ఇప్పుడు రాష్ట్రాన్ని చీల్చాలనుకుంటోంది’’ అని ములాయం మండిపడ్డారు. ‘‘ఇది రాజకీయ కుట్ర. దీనిని అసెంబ్లీలోపల, బయట మా పార్టీ వ్యతిరేకిస్తుంది’’ అని యూపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత శివ్‌పాల్‌సింగ్ యాదవ్ చెప్పారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తన ప్రతిష్ట మసకబారిన సమయంలో ఆమె తీసుకువచ్చిన ఈ ప్రతిపాదన ఆమె చిత్తశుద్ధిని చెప్పకనే చెబుతున్నది. చిన్న రాష్ట్రాలపై కేవలం ప్రధానికి లేఖలు రాయడంతోనే సరిపెట్టిన మాయావతి వైఖరిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు’’ అని సమాజ్‌వాది అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి అన్నారు.
మద్దతిస్తాం.. కానీ..: ఆర్‌ఎల్డీ
పశ్చిమ ప్రాంతాన్ని హరితవూపదేశ్‌గా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌పై ఉద్యమిస్తున్న ఆర్‌ఎల్డీ కూడా మాయావతి చర్యలో రాజకీయ ఉద్దేశాలను పట్టిచూపుతున్నది. ఆమె చర్యలు ఉన్నతమైనవి కావని ఆర్‌ఎల్డీ అధికార ప్రతినిధి అనిల్‌దూబే చెప్పారు. అయితే ఆమె ప్రవేశపెట్టే ప్రతిపాదనకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని ప్రకటించారు.
ఎన్నికల జిమ్మిక్కు : కాంగ్రెస్
మాయావతి చర్య ఎన్నికల జిమ్మిక్కని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రషీద్‌అల్వీ తేల్చేశారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలే కాకుండా యావత్ దేశ ప్రయోజనాలను తమ పార్టీ దృష్టిలో ఉంచుకుంటుందని ఆయన చెప్పారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తమ పార్టీ నిర్ణయాలు తీసుకోదని ఆయన అన్నారు. ఇది చాలా సున్నితమైన సమస్యని, దీని పై ఎంతగానో ఆలోచించాల్సి ఉందని మరో అధికార ప్రతినిధి జనార్ధన్ ద్వివేదీ చెప్పారు.
రాజకీయ ఎత్తుగడే: ఉమాభారతి
మాయావతి నిర్ణయం ఎన్నికల ముందు రాజకీయ ఎత్తుగడని బీజేపీ నేత, ఆ పార్టీ ఉత్తరవూపదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఉమాభారతి అభివర్ణించారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే ఒక రాష్ట్రంలో ముస్లింల జనాభా అధికంగా ఉంటుందని, అక్కడ కాశ్మీర్ తరహా సమస్యలు తలెత్తుతాయని అన్నారు. ‘‘రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ఏర్పడనేలేదు. ప్రకటన చేసే ముందు మాయావతి ఈ విషయాన్ని కేంద్రానికి నివేదించలేదు. కనుక ఈ రాష్ట్రాలు ఏర్పాటు చేయడం ఉత్తరవూపదేశ్‌లో ఎన్నికలు ముగిశాకే జరగాలి’’ అన్నారు. ‘‘రాజకీయంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు బీజేపీ సానుకూలమే. గతంలో ఉత్తరాంచల్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసింది బీజేపీయే. అయితే పశ్చిమ యూపీ విభజనను బీజేపీ వ్యతిరేకిస్తున్నది. ఇక్కడ ముస్లిం జనాభా అధికంగా ఉండటమే ఇందుకు కారణం. అక్కడ బీజేపీకి సీట్లు గెల్చుకునే అవకాశం లేదు’’ అని ఆమె పేర్కొన్నారు.
ఎన్నికలకు ముందు అకస్మాత్తుగా మాయావతి ఈ ప్రకటన చేశారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. కాంగ్రెస్‌పైనా ఆయన విమర్శలు కురిపించారు. అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ విఫలమైందని మండిపడ్డారు. ‘‘మాయావతి చర్యకు కాంగ్రెస్ మద్దతు పలుకుతుందో లేదో మాకు తెలియదు. తెలంగాణ డిమాండ్‌ను వారు ఇప్పటికీ అంగీకరించలేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బీజేపీ పోరాడుతున్నది. మాయావతి ప్రకటన చేసిన పద్ధతుల్లో రాష్ట్రాలు ఏర్పాటు కాబోవు.’’ అని జావడేకర్ చెప్పారు. అయితే విభజన ప్రతిపాదనకు అసెంబ్లీలో సానుకూలంగా స్పందిస్తారా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానాన్ని దాట వేశారు. ‘‘అది ఆచరణ సాధ్యం కాదని మాయావతికి తెలుసు. ఇది కేవలం రాజకీయ ఎత్తుగడే’’ అని ఆయన సమాధానమిచ్చారు. ప్రతిపాదన అసెంబ్లీలో వచ్చినప్పుడే దీనిపై తాము నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.
విపక్షాల్లో గందరగోళం..వ్యతిరేకత
ఎన్నికలకు ముందు మాయావతి తీసుకున్న ఈ నిర్ణయంతో యూపీలోని ప్రతిపక్షాలు అవాక్కయ్యాయి. హరితవూపదేశ్‌ను డిమాండ్ చేస్తున్న ఆర్‌ఎల్డీతో పాటు సమాజ్‌వాది, కాంగ్రెస్, బీజేపీలు మాయావతి తన తాజా చర్యతో రాజకీయ లబ్ధి పొందుతారని ఆందోళన చెందుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాది పార్టీ ఇప్పుడు తీవ్ర సంకటాన్ని ఎదుర్కొంటోంది. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎస్పీ.. అదే వైఖరితో ఉన్నట్లయితే.. ఇప్పుడు అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు పూర్వాంచల్, పశ్చిమాంచల్, బుందేల్‌ఖండ్ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా నిలబడాల్సి వస్తుంది. ఇది ఆయా ప్రాంతాల్లో ప్రజలను చేజేతులా దూరం చేసుకోవడమే అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.
- పెండింగ్‌లో రాజగోపాల్,మేకపాటి రాజీనామాలు
- మనోహర్ దారిలోనే మీరాకుమార్!
- భావోద్వేగాలతోనే నిర్ణయమని నిర్ధారణకు?
- నిర్దేశిత ఫార్మాట్‌లో లేనందునే వెనక్కి
- స్పీకర్ కార్యాలయ వర్గాల వెల్లడి
న్యూఢిల్లీ, నవంబర్ 15 () : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యానికి నిరసనగా తెలంగాణ ఎంపీలు చేసిన రాజీనామాలను లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయ సంయుక్త కార్యదర్శి మంగళవారం ఎంపీలందరికి వ్యక్తిగతంగా ఫోన్లు చేసి ఈ విషయాన్ని తెలిపారు. అయితే భువనగిరి ఎంపీ కోమటిడ్డి రాజగోపాల్‌డ్డి రాజీనామాను మాత్రం పెండింగ్‌లోనే ఉంచారు. రెండ్రోజుల్లో స్పీకర్ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆయనకు సమాచారమందించారు. గురువారం ఆయన స్పీకర్‌ను కలవనున్నారు. జగన్ అక్రమ ఆస్తుల కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్ రాజశేఖరడ్డి పేరును చేర్చడాన్ని నిరసిస్తూ రాజీనామా చేసిన నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌డ్డి రాజీనామాను కూడా పెండింగ్‌లో పెట్టారు.
రెండ్రోజుల్లో స్పీకర్‌ను వ్యక్తిగతంగా కలవాలని ఆయనకు కూడా ఆదేశాలు అందాయి. పార్లమెంట్ నిబంధనల్లోని అధ్యాయం 22, రూలు 240కి అనుగుణంగా రాజీనామాల లేఖలు లేనందున వాటిని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ కార్యాలయవర్గాలు పేర్కొన్నాయి. రూలు 240 ప్రకారం రాజీనామా లేఖలో పలానా కారణంతో రాజీనామా చేస్తున్నామని ప్రస్తావించకూడదు. అయితే కొందరు ఎంపీల రాజీనామా లేఖలు నిర్దేశిత నమూనాలో లేనట్లుగా తెలిసింది. అదే సమయంలో రాజీనామాలు చేసిన కొందరు ఎంపీలు స్థాయిసంఘం సమావేశాలకు హాజరవడం, టీఏ, డీఏ వంటి భత్యాలను తీసుకోవడం, సభకు హాజరవడంతో రాజీనామాలపై వారు నిజాయితీతో లేరని మీరాకుమార్ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో నెలకొన్న భావోద్వేగ పరిస్థితులకు అనుగుణంగా రాజీనామా చేశారనే కారణంతో శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యేల రాజీనామాలను తిరస్కరించిన విషయం తెలిసిందే.
ఎంపీలు కూడా అదే కారణంతో, అదే సమయంలో రాజీనామలు చేసినందున నాదెండ్ల మనోహర్ అభివూపాయాన్ని మీరాకుమార్ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణపై డిసెంబర్ 9న చేసిన ప్రకటనను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ జూలై 4న 9 మంది కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీలు, ఒక రాజ్యసభ ఎంపీ, ఆ తర్వాత రెండ్రోజులకు ఇద్దరు టీఆర్‌ఎస్, మరో ఇద్దరు టీడీపీ ఎంపీలు తమ రాజీనామా లేఖలను స్పీకర్‌కు సమర్పించారు. ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు, ఇద్దరు టీడీపీ ఎంపీలు స్పీకర్‌ను స్వయంగా కలిసి రాజీనామా లేఖలను అందజేయగా.. టీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు, ఒక కాంగ్రెస్ ఎంపీ ఫ్యాక్స్ ద్వారా రాజీనామాలను పంపించారు. ఆ తర్వాత తమ రాజీనామాలను ఆమోదించాలని ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్‌ను మరోసారి కలిసి విజ్ఞప్తి చేశారు. ఒకరిద్దరు మినహా పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ఎంపీలు బహిష్కరించిన విషయం తెలిసింది.
రాజీనామాలపై నాలుగు నెలల పాటు సుదీర్ఘ పరిశీలన తర్వాత పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే వీరితో పాటు రాజీనామా చేసిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు రాజీనామాపై రాజ్యసభ చైర్మన్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
పార్లమెంట్‌లో తేల్చుకుంటాం : టీఎంపీలు
తమ రాజీనామాలను తిరస్కరించినందున ఇక పార్లమెంటు వేదికగానే ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలంగాణవూపాంత ఎంపీలు ప్రకటించారు. స్పీకర్ నిర్ణయం ఊహించిందేనని పేర్కొన్నారు. అయినా తమ చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు అవసరమైతే మళ్లీ రాజీనామా చేస్తామని టీఎంపీల అధికార ప్రతినిధి గుత్తాసుఖేందర్ రెడ్డి తెలిపారు.
Take By: T News
Tags: Telangana News, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, Telangana agitation, statehood demand, Venkat Reddy,
My blog has been valued at...
$606.24
Blog Valuation Tool from
BlogCalculator.com
© Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008
Back to TOP