Facebook in Telugu

Tags: Telangana News, AP News, Political News, Hyderabad News, Hyderabad, News,Facebook, telugu Facebook,

పందేరాలైతేనేమి.. కబ్జాలైతేనేమి.. దందాలైతేనేమి.. హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్షరాలా పది లక్షల ఎకరాలకుపైగా భూమి సీమాంధ్ర బడాబాబుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నదని అంచనా! గోదావరి నదికి ఇరువైపులా ఉన్న సారవంతమైన భూములన్నీ దాదాపుగా వారి వశం అయ్యాయి. కృష్ణా, గోదావరి తదితర నదులపై ఉన్న ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టు భూముల్లో మెజార్టీ భూములు వారి ఆధీనంలోనే ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో కూడా కోట్లు విలువ చేసే భూములను ఎత్తున మింగేశారు. అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, వెంగళరావునగర్, పంజాగుట్ట, సోమాజిగూడ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్‌పేట, ఎర్రగడ్డ ఏరియాల్లో భూముల పరాయీకరణ విరివిగా జరిగింది. పరిక్షిశమల భూముల స్థానంలో అపార్ట్‌మెంట్లు వెలిశాయి. ఈ ప్రాంతాల్లోనే ఇరవై నుంచి ముపె్పైవేల ఎకరాల భూమి పరాయీకరణ జరిగిందని రియల్ ఎస్టేట్ వర్గాలు అంటున్నాయి. రాజధాని నడిబొడ్డున ట్యాంక్‌బండ్ కింద ఉన్న దాదాపు రూ.200 కోట్ల విలువైన డీబీఆర్ మిల్స్ భూములపై కన్నేశారు. ఈ భూములను రక్షించుకోవడానికి కార్మికులే ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ జిల్లాలో 1354 భూకబ్జా కేసులు ఉండగా, ఒక్క షేక్‌పేట మండలంలోనే భూ ఆక్రమణ కేసులు 450 వరకు ఉన్నాయి. నగరం చుట్టూ కాందిశీకుల భూములను కూడా వదలి పెట్టలేదు. దాదాపు లక్ష ఎకరాల కాందిశీకుల భూమి నేడు వందల ఎకరాలకే పరిమితమైంది. 400 చెరువులను పూడ్చేసి ప్లాట్లు చేసి తెగనమ్ముకున్నారు. సమైక్య రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఈ భూముల రక్షణ కోసం చేసుకున్న ఒప్పందాలు ఉల్లంఘనలకు గురయ్యాయి.
వాషింగ్టన్, డిసెంబర్ 6: అంతరిక్షంలో భూమి లాంటి నివాసయోగ్యమైన గ్రహ శోధనలో పరిశోధకులు మరో ముందడుగు వేశారు. గత కొన్ని సంవత్సరాలుగా మరో ధరిత్రి కోసం అంతరిక్షాన్ని టెలిస్కోప్‌లతో జల్లెడ పడుతున్న నాసా పరిశోధకులు విజయం సాధించారు. మన సౌరవ్యవస్థకు ఆవల ‘గోల్డిలాక్స్ జోన్’లో నివాసయోగ్యమైన భూమిలాంటి గ్రహాన్ని (సూపర్ ఎర్త్) అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ గుర్తించింది. దీంతో భవిష్యత్తులో సౌర వ్యవస్థ ఆవల మనుషులు నివసించొచ్చని పరిశోధకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మన గెలాక్సీలో సూర్యుని లాంటి నక్షత్రం ‘జీ5’ నుంచి 600 కాంతి సంవత్సరాల దూరంలో చక్కర్లు కొడుతున్న సూపర్ ఎర్త్ నాసాకు చెందిన కెప్లర్ అంతరిక్ష టెలిస్కోప్‌కు చిక్కింది. ఈ టెలిస్కోప్ పంపిన చిత్రాల ఆధారంగా గుర్తించిన సూపర్ ఎర్త్‌కు పరిశోధకులు ‘కెప్లర్ 22 బీ’గా నామకరణం చేశారు. ఈ విషయాన్ని నాసా సోమవారం అధికారికంగా ధ్రువీకరించింది. 
కోట్ల విలువైన భూములను వేలల్లో ఖరీదు చేసి పెట్టుబడిదారులకు అప్పగించిన వైనం అభివృద్ధి పేరుతో..ఆరేళ్లకాలంలో పట్నం శివారు భూములన్నీ ఖతంఅభివృద్ధి పేరుతో పరిక్షిశమలను ఆహ్వానించామంటూ అటు టీడీపీ ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున భూపంపకాలు చేసుకున్నాయి. కొత్త కొత్త ఇండవూస్టియల్ ప్రాజెక్టుల పేరుతో నగర శివార్లలో వేలకు వేల ఎకరాలు సేకరించింది. లక్షల ఎకరాల విలువైన భూములను అత్యంత చవకగా కొని నష్టపరిహారం నామమావూతంగా ఇచ్చి చేతులు దులుపుకొన్నది. దశాబ్దాలుగా..పూర్తిగా వెనుకబడిపోయిన ప్రాంతాల్లో పరిక్షిశమలు ఏర్పాటు చేయాల్సింది పోయి వాటిని కేవలం రాజధానికే పరిమితం చేసి వాటి ముసుగున అనుయాయులకు ప్రభుత్వ పెద్దలు కట్టబెట్టిన భూపంపకాలివీ..
ఇతర ప్రాజెక్టుల కోసం చంద్రబాబు రంగాడ్డి జిల్లాలోని ఉప్పల్, రాజేంవూదనగర్, శేరిలింగంపల్లి మెదక్‌జిల్లాలోని పటాన్‌చెరువు మండలాల్లో 184 ఎకరాల పట్టా భూమిని సేకరించారు. ఆతరువాత వైఎస్ వచ్చిన ఏడాదిలోనే ఇతర ప్రాజెక్టుల కోసం 96 ఎకరాల భూమిని సేకరించారు. ఇందులో గోల్ఫో కోర్సు కోసం మరోసారి బాబుతో పోటీపడి 77.05 ఎకరాలభూమిని రైతుల వద్ద నుంచి బలవంతంగా తీసుకున్నారు.- తెలంగాణపై తీర్మానం కోసం అసెంబ్లీలో ఒక్కరూ డిమాండ్ చేయరా?
- ఆత్మగౌరవం కంటే పదవులే ముఖ్యమా?
- 700 మంది బలిదానాలను మరిచారా?
- ప్రజాకాంక్ష పట్టదా?.. ఇది ప్రజలకు వెన్నుపోటే!
- ఒక్కరి కోసం 16 మంది విప్‌ను ధిక్కరించారు
- నాలుగున్నర కోట్ల ప్రజల కోసం ఈ మాత్రం చేయలేరా?
- టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై తెలంగాణవాదుల మండిపాటు
హైదరాబాద్, డిసెంబర్ 6 (): టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు. అసెంబ్లీలో సోమవారం జరిగిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఒక్క టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించకపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ ఇచ్చేది.. తెచ్చేది మేమే అని గప్పాలు కొడుతున్న టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల చిత్తశుద్ధి ఈ పాటిదా? అని మండిపడుతున్నారు. తెలంగాణ కోసం 700 మంది ఆత్మబలిదానాలు చేసుకున్నా, సబ్బండ వర్ణాలు ఏకమై ఉధృతంగా సకలజనుల సమ్మె చేసి తమ ఆకాంక్షను వ్యక్తం చేసినా, ఇవేమీ పట్టనట్లు ఈ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యవహరించడం, అసెంబ్లీలో తెలంగాణపై కిమ్మనకుండా ఉండటంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రస్తావన తెచ్చే దమ్ము, ధైర్యం టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎందుకు కొరవడిందని ప్రశ్నిస్తున్నారు.
అసెంబ్లీ చర్చలో కనీసం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి సైతం ప్రత్యేక రాష్ట్రం గురించి ప్రస్తావించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఒక వ్యక్తి కోసం కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన 16 మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ పదవులను గడ్డిపోచతో సమానంగా భావించారు. కాంగ్రెస్ జారీ చేసిన విప్‌ను సైతం ధిక్కరించారు. నమ్మిన సిద్ధాంతం, ఇచ్చిన మాట కోసం పదవులు పోతాయని తెలిసికూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. కాంగ్రెస్ పెద్దల దిమ్మతిరిగేలా వ్యవహరించి, భేష్ అనిపించుకున్నారు. పలువురి అభినందనలకు పాత్రులయ్యారు. కానీ టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసింది ఏంటి? ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు. తెలంగాణ ఆకాంక్షలను కాలరాసి, ఉద్యమాన్ని అణచివేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న ప్రభుత్వానికి మద్దతు పలికారని, తెలంగాణ సాధన కోసం దేనికైనా సిద్ధమే, అవసరమైతే ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వెనుకాడమని బీరాలు పోయిన వారు తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టుకున్నారని తెలంగాణవాదులు రగిలిపోతున్నారు. తెలంగాణ కోసం మీసం మెలేసి, తొడలు గొట్టిన టీ కాంగ్రెస్ ప్రజావూపతినిధులు పూర్తిగా ప్రజాకాంక్షకు విరుద్ధంగా వ్యవహరించారు.
అసెంబ్లీలో తెలంగాణ పేరు ఎత్తడానికి జంకారు. కదిలిస్తే చాలు తెలంగాణ మా లక్ష్యమనే టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఎందుకు మిన్నకుండిపోయారని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు. పార్చున్ కార్లు, ఇతరత్రా ప్రలోభాలకు వారు తలొగ్గారని ఇప్పటికే వారిపై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారనే అనుమానాలు తెలంగాణ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై టీఆర్‌ఎస్‌తోపాటు టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏదో చేస్తారని తెలంగాణ ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాల్సిందేనని టీ న్యూస్ సర్వేలో సైతం దిశానిర్దేశం చేశారు. తమ ఆకాంక్షకు కాంగ్రెస్ ప్రజావూపతినిధులు విలువ ఇస్తారని తెలంగాణ ప్రజలు గంపెడాశ పెట్టుకున్నారు.
తీరా అసెంబ్లీ చర్చలో కనీసం తెలంగాణ ఊసెత్తడానికి టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెనకాడటంతో వారు భగ్గుమంటున్నారు. పదవుల కోసమే టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పాకులాట! పదవుల మీద ఉన్న సోయి, తెలంగాణ ఆకాంక్ష మీద లేకపోవడంతో దారుణమని తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదవుల మీద ఉన్న మోజులో ఒకశాతం కూడా తెలంగాణపై లేదా? నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష పట్టదా? 700 మంది తెలంగాణ బిడ్డలను బలి తీసుకున్న సీమాంధ్ర ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే ముఖ్యమా? ఆత్మగౌరవం కన్నా, సీమాంధ్ర సర్కారును ఇచ్చే తాయిలాలే ముఖ్యమా? తెలంగాణపై కాంగ్రెస్ నేతల నోరు ఎందుకు మూగబోయిందో చెప్పాలి? అంటూ నిప్పులు చెరుగుతున్నారు. నాటి చెన్నాడ్డి నుంచి నేటి జానాడ్డి వరకు తెలంగాణను నమ్మించి, నట్టేట ముంచడమే కాంగ్రెస్ నేతల తీరుగా మారిందని పదునైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
అవిశ్వాసానికి మద్దతిచ్చి తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వాన్ని కూల్చివేయాలన్న తమ డిమాండ్‌ను పట్టించుకోకపోవడం, కనీసం తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరుతూ ఒక్కరైన సాహసం చేయలేకపోవడం కన్నా దారుణం మరొకటి ఉందడని పేర్కొంటున్నారు. అయితే త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న వార్తల నేపథ్యంలో, పదవుల ఆశతోనే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ అసెంబ్లీలో తెలంగాణపై మాట్లాడేందుకు సాహసించలేదని చెబుతున్నారు. ఐదురోజులుగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజైన సోమవారం సుమారు 16 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. రైతుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని టీడీపీ, తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి మాట తప్పిన ప్రభుత్వానికి కొనసాగే అర్హత లేదని టీఆర్‌ఎస్ రాష్ట్ర సర్కారుపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాయి.
అవిశ్వాసం చర్చ సందర్భంగా శాసనసభలో తెలంగాణపై తీర్మానం చేయాలని టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ పట్టుపట్టాయి. టీడీపీ తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా తెలంగాణపై తీర్మానం పెడితే తమ పార్టీ మద్దతివ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. అయితే ఇందుకు టీ మంత్రులు, టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పందించి, సమ్మతించకపోవడాన్ని తెలంగాణ ప్రజలతో పాటు కాంగ్రెస్‌లోని తెలంగాణ నేతలు, కార్యకర్తలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. మాట వరుసకైనా తెలంగాణ అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని వారు ముఖ్యమంవూతిపై ఒత్తిడి చేయకపోవడంతో, ఇక టీ కాంగ్రెస్ ప్రజావూపతినిధులు ప్రజల్లో తిరగడం కష్టమేనని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. తీర్మానం చేయాలని డిమాండ్ చేయడం అటుంచితే, తెలంగాణ కోరుకునే పార్టీలపై టీ మంత్రులు ఎదురుదాడి చేయడం విచివూతంగా ఉందని టీ కాంగ్రెస్ ఎంపీ ఒకరు అభివూపాయపడ్డారు.
ఇలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకుని మేము వెళ్లగలమని ఆవేదన వ్యక్తం చేశారు. టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు అదును కోసం ఎదురు చూస్తున్నారని, సమయమొచ్చినప్పుడు కర్ర కాల్చి వాత పెట్టడం ఖాయమని పలువురు అంటున్నారు.
Take By: T News

My blog has been valued at...
$606.24
Blog Valuation Tool from
BlogCalculator.com
Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory
submission service.
Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
http://www.powerhits4u.com/images/125x125.gif
© Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008
Back to TOP