Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Wednesday, December 7, 2011

అందరూ గద్దలే ఆంధ్రా పెద్దలే

BHUDANDA talangana patrika telangana culture telangana politics telangana cinema
- హైటెక్ సిటీ వెనుక అంతులేని కుట్రలు
- అవినీతి పునాదిపై ఎమ్మార్ భవంతులు
- ఔటర్ పేరుతో రోడ్డుపాలైన కుటుంబాలు
- సర్కారుకే రహేజా టోకరా
- శంషాబాద్‌లో రియల్‌కు రెక్కలు
- సంస్థ ఏదైనా.. సంపద ఒక్కరికే
- కోట్లు పోగేసుకున్న సీమాంధ్ర బడాబాబులు
- భూ పందేరంపై సీబీఐ భూతద్దం
- తీగలాగుతున్న దర్యాప్తు సంస్థలు
- కలవరపడుతున్న భూ రాబందులు

సేకరణ పేరుతో బడుగు జీవుల నేల గుంజుకోవడం..దానిని తమ ప్రయోజనాలు నెరవేర్చే కంపెనీలకు చౌకగా పంపిణీ చేయడం.. అదే భూమిలో సదరు కంపెనీలు దందా చేసి.. కోట్లకు కోట్లు కూడబెట్టుకోవడం! అది నారావారి జమానా అయినా.. వైఎస్సారు హయామైనా జరిగింది ఇదే! రాష్ట్ర రాజధాని హైదరాబాద్, దాని చుట్టూ ఉన్న రంగారెడ్డి జిల్లాలో భూములపై ఇప్పుడో భూతద్దం తిరుగుతున్నది! ఇద్దరు ముఖ్యమంత్రుల హయాంలో భారీగా పందేరం జరిగిన భూముల అక్రమాల పుటలు తిరగేస్తున్నది! తమ అంతేవాసులకు కారుచౌకగా భూములు చుట్టబెట్టేందుకు పాలకులే పావులు కదిపిన కుతంత్రాల లోతులకు దృష్టి సారిస్తున్నది! అక్రమంగా జరిగిన పందేరాలపై ఆరా తీస్తున్నది! ఎన్నో ఏళ్ల క్రితమే భూమాతను చెరబట్టి ఇప్పుడు కోట్ల కొద్దీ సొమ్ము వెనకేసుకుంటున్న బడాబాబుల ముసుగులు తొలగిస్తున్నది!భూములపై వాలిన రాబందుల బాగోతాలు బయటికి తీస్తున్నది! ఆ భూతద్దం పేరు సీబీఐ! ఈ భూతద్దం పరిధిలోకి ఇప్పటికే వచ్చిన రాబందులు.. ఇబ్బంది పడుతున్నాయి! ఈ భూతద్దం పరిధి మరింత విస్తరిస్తే తమ గుట్టూ బయట పడుతుందని మరికొన్ని కలవరపడుతున్నాయి! దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నారన్న చందంగా సాగిన ఈ భూదందాలో తెలంగాణ గుండెకాయ హైదరాబాద్, దాని పొరుగున్న ఉన్న రంగారెడ్డి జిల్లా కోల్పోయింది వెయ్యి, రెండువేల ఎకరాలు కాదు..! అక్షరాలా పది లక్షల ఎకరాల పైమాటే! ఇందులో అధికారికంగా కీలక సంస్థలకు పందేరం చేసిందే లక్ష ఎకరాలు! ఎత్తులు, పై ఎత్తులతో జరిగే పందేరంలో చివరకు చిత్తయిపోయింది హైదరాబాద్! వీరి కుతంత్రాలకు బలైపో యింది రాజధాని చుట్టుపక్కల ప్రాంతం! ఇది మొన్న తెలంగా ణ భూమి. నేడూ తెలంగాణ భూమే! ఇది ‘మా భూమి’ అని ప్రతి ఒక్క తెలంగాణ వాసి గొంతెత్తి నినదించే నేలతల్లి!

ఈ నేలలో మొన్నటిదాకా పంటలు పండాయి! పువ్వులు వికసిం చాయి! కూరగాయలు నవనవలాడాయి! కానీ.. ఇదే భూమి.. నాటి బ్రిటిష్ వలస పాలకులను గుర్తుకు తెస్తూ.. పరాయీ కరణకు గురైంది! ఇప్పుడా భూముల్లో సీమాంధ్ర బడాబాబు లకు నోట్ల చెట్లు మొలుస్తున్నాయి! ఆ నోట్ల చెట్లకు నీళ్లు పోసిన పాలకులకు ప్రతిఫలాల నీడనిస్తున్నాయి. ఈ భూ పందేరం గుట్టంతా ఇప్పుడు బయటికి వస్తున్నది. పందేరాల్లో భాగస్వా ములైన వారు, వారి ప్రతినిధులు ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలే ఆ గుట్టును బయటపెడుతున్నాయి. పిటిషన్‌ల రూపంలో బయటపడినవే కాక.. తాజాగా అవిశ్వాస తీర్మానం పై చర్చలో హైదరాబాద్ భూముల కేటాయింపుల లోగుట్టులు బయటపెట్టుకున్నారు. తమ బంధువులకు, మిత్రులకు అప్ప నంగా భూములు కట్టబెట్టారని చంద్రబాబు విమర్శించారు. 2004 నుంచి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పారు. ఇందుకు అంతే దీటుగా స్పందించిన ముఖ్యమంత్రి కిరణ్.. అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న చంద్రబాబుకు అవినీతి గురించి మాట్లాడే హక్కులేదని అన్నారు. వీరి ఆరోపణలు ఎలా ఉన్నా.. చంద్రబాబు, వైఎస్ హయాంలో సాగిన అడ్డగోలు అక్రమాలపై సీబీఐ తీగలాగుతున్నది! అక్రమాల భువన భవంతుల్లో దాగిన డొంకలను కదిలిస్తున్నది! నేతాగ్రేసరుల పాపాల పుట్టలు బద్దలు కొట్టబోతున్నది!

( హైదరాబాద్‌ పభుత్వం ఓ కీలకమైన ప్రాజెక్టును ప్రకటించడం.. అంతకు ముందే తమకు కావల్సిన వారికి ఆ మేరకు సంకేతాలు ఇవ్వడం.. ప్రాజెక్టు ప్రకటించే నాటికే దాని చుట్టుపక్కల భూములను ‘కావల్సినవారు’ కాజేయడం..! ఇదో భూమాయ! కోట్ల ఖరీదు పలికే భూములను అగ్గువకు కాజేసే కుతంత్రం! సేకరణ పేరుతో బడుగు జీవుల నేల గుంజుకోవడం.. దానిని తమ ప్రయోజనాలు నెరవేర్చే కంపెనీలకు చౌకగా పంపిణీ చేయడం.. అదే భూమిలో సదరు కంపెనీలు దందా చేసి.. కోట్లకు కోట్లు కూడబెట్టుకోవడం! అది నారావారి జమానా అయినా.. వైఎస్సారు హయామైనా జరిగింది ఇదే! హైదరాబాద్ అభివృద్ధి పేరుతో సాగిన ఈ తంతు.. చివరకు తెలంగాణ గుండెకాయను పీల్చిపిప్పి చేసింది. పాలకులకు కావల్సిన వారికి కాసుల పంట పండించింది. పేరేదైనా దందా ఒక్కటే! సంస్థ ఏదైనా.. సంపద పోగుపడింది ఒక్కరికే! వచ్చింది ఏదైనా.. పోయింది మాత్రం తెలంగాణ జనం భూమే! హైదరాబాద్‌కు ఆత్మనే లేకుండా చేశారు. దశాబ్దాలుగా సీమాంవూధులు చేసిన ఈ భూ దోపిడీ పాపాల పుట్టలు ఇప్పుడు పగులుతున్నాయ్. మంత్రి శంకర్‌రావు వేసిన పిటిషన్‌తో వైఎస్ కుటుంబం, ఆయన కోటరీ.. విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌తో చంద్రబాబు ఆయన కోటరీ భాగస్వామ్యం ఉన్న అన్ని లావాదేవీలతోపాటు భూ దందాలపై సీబీఐ విచారణ జరుపనుంది. ఈ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతుందా? ఇన్నాళ్లూ సీమాంవూధుల దోపిడీని భరిస్తూ వస్తున్న తెలంగాణ ఆత్మఘోషను వెలుగులోకి తెస్తుందా? ఇప్పుడు సగటు తెలంగాణవాసి ఆసక్తిగా చూస్తున్న అంశమిది! తమ భూమి తమది కాకుండాపోయిన వేళ.. జరిగిన అక్రమాలకు న్యాయం జరుగుతుందా? అని ఆశగా చూస్తున్న సందర్భమిది!

సీమాంధ్ర కబంధ హస్తాల్లో పది లక్షల ఎకరాలు!
PPP talangana patrika telangana culture telangana politics telangana cinemaపందేరాలైతేనేమి.. కబ్జాలైతేనేమి.. దందాలైతేనేమి.. హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్షరాలా పది లక్షల ఎకరాలకుపైగా భూమి సీమాంధ్ర బడాబాబుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నదని అంచనా! గోదావరి నదికి ఇరువైపులా ఉన్న సారవంతమైన భూములన్నీ దాదాపుగా వారి వశం అయ్యాయి. కృష్ణా, గోదావరి తదితర నదులపై ఉన్న ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టు భూముల్లో మెజార్టీ భూములు వారి ఆధీనంలోనే ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో కూడా కోట్లు విలువ చేసే భూములను ఎత్తున మింగేశారు. అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, వెంగళరావునగర్, పంజాగుట్ట, సోమాజిగూడ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్‌పేట, ఎర్రగడ్డ ఏరియాల్లో భూముల పరాయీకరణ విరివిగా జరిగింది. పరిక్షిశమల భూముల స్థానంలో అపార్ట్‌మెంట్లు వెలిశాయి. ఈ ప్రాంతాల్లోనే ఇరవై నుంచి ముపె్పైవేల ఎకరాల భూమి పరాయీకరణ జరిగిందని రియల్ ఎస్టేట్ వర్గాలు అంటున్నాయి. రాజధాని నడిబొడ్డున ట్యాంక్‌బండ్ కింద ఉన్న దాదాపు రూ.200 కోట్ల విలువైన డీబీఆర్ మిల్స్ భూములపై కన్నేశారు. ఈ భూములను రక్షించుకోవడానికి కార్మికులే ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ జిల్లాలో 1354 భూకబ్జా కేసులు ఉండగా, ఒక్క షేక్‌పేట మండలంలోనే భూ ఆక్రమణ కేసులు 450 వరకు ఉన్నాయి. నగరం చుట్టూ కాందిశీకుల భూములను కూడా వదలి పెట్టలేదు. దాదాపు లక్ష ఎకరాల కాందిశీకుల భూమి నేడు వందల ఎకరాలకే పరిమితమైంది. 400 చెరువులను పూడ్చేసి ప్లాట్లు చేసి తెగనమ్ముకున్నారు. సమైక్య రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఈ భూముల రక్షణ కోసం చేసుకున్న ఒప్పందాలు ఉల్లంఘనలకు గురయ్యాయి.

పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం హైదరాబాద్ సహా తెలంగాణలో ప్రాంతేతరులు భూములు కొనరాదు. కొన్నా చెల్లవు. ఎవరైనా భూములు కొనాలనుకుంటే తెలంగాణ ప్రాంతీయబోర్డు అనుమతి తీసుకోవాలి. తెలంగాణ భూములపై కన్నేసిన సీమాంధ్ర పాలక పెద్దలు ప్రాంతీయ కమిటీనే ఏర్పాటు చేయలేదు. అడ్డగోలుగా భూములు కొన్నారు. తెలంగాణను మార్కెట్ సరుకుగా మార్చారు. అసైన్డ్ భూములు కూడా వదల్లేదు. సీమాంధ్ర బడా బాబులు ఒక్కొక్కరు వేల ఎకరాల భూములను తమ ఖాతాలో వేసుకున్నారు. ఒక్క రామోజీరావే హయత్‌నగర్ మండలంలో దాదాపు 2,350 వేల ఎకరాల భూమిని కారు చౌకగా సొంతం చేసుకున్నారు. శంషాబాద్‌లో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేస్తున్న విషయాన్ని చంద్రబాబు ముందే రామోజీకకి లీక్ చేసినట్టుగా ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే రామోజీ శంషాబాద్ పరిసరాల్లో బినామీ పేర్లతో 360 ఎకరాలు కొన్నారు. రెండు మూడేళ్లలోనే విమానాక్షిశయం రావటంతో ఇక్కడ భూముల ధరలు ఆకాశానికి పెరగటం, రామోజీ వాటిని అమ్ముకుని దండిగా డబ్బు సంపాదించటం జరిగిపోయాయి. నార్నె రంగారావు నార్నె ఎస్టేట్ పేరుతో బీబీనగర్ ఏరియాలోనే దాదాపు 3 వేల ఎకరాల భూమిని సొంతం చేసుకున్నారు. నగరం చుట్టూ అనేక ప్రాంతాల్లో ఈ సంస్థకు మరో 3 వేల ఎకరాల భూమి ఉంటుందని అంచనా. సినీనటుడు మురళీమోహన్‌కు చెందిన జయభేరి రియల్ ఎస్టేట్‌కు నగరంలో కీలకమైన ప్రాంతాల్లోనే దాదాపు 2 వేల ఎకరాల భూమి ఉంది. ఇక, చంద్రబాబు హైటెక్‌సిటీని ప్రకటించక ముందే ఆయన బినామీగా సినీనటుడు మురళీమోహన్ అక్కడ రంగవూపవేశం చేశారని చెబుతున్నారు. నిబంధనల ప్రకారమే లావాదేవీలు జరిగినట్టుగా ఉన్నా హైటెక్‌సిటీ వస్తుందని ముందే తెలిసి నామమావూతపు ధరలకు ఎకరాలకొద్దీ భూములను కొనేసుకున్నారు. కొందరు వ్యక్తులు వివిధ పేర్లతో కేవలం భూముల కోసం ఏర్పాటు చేసిన సంస్థలకు కేటాయింపులు జరిపారు.

ఆ తరువాత ఈ సంస్థలు మురళీమోహన్ తదితరులకు ఆ భూములను బదలాయించారు. ఇవే భూములను రియల్‌బూమ్‌లో అమ్ముకున్న మురళీమోహన్ తదితరులు వందలకోట్లు పోగేసుకున్నారు. ఇక, చంద్రబాబు కుటుంబం 1989లో రామా అగ్రికల్చరల్ ఫామ్స్ పేరిట కొండాపూర్‌లో 3,276 ఎకరాలు కొనుగోలు చేసింది. రామా అగ్రికల్చరల్ ఫామ్స్‌లో భువనేశ్వరి, లోకేష్, అమ్మణ్ణమ్మలు భాగస్వాములు. ఈ భూములు కొన్న తరువాత కొండాపూర్‌కు అరకిలోమీటరు దూరంలో హైటెక్‌సిటీని ప్రకటించారు. ఇక, 1989లో డాక్టర్ రెడ్డీస్ కంపెనీకి ట్యాక్స్ డిఫర్‌మెంట్‌ను వర్తింపచేసి రూ.25కోట్ల మేర లబ్ధిని చేకూర్చిన బాబు ఆ తరువాత 2000 సంవత్సరంలో కొండాపూర్‌లో తాను కొన్న భూమిని ఎకరా కోటి రూపాయలకు డాక్టర్ రెడ్డీస్ సంస్థ అధిపతి అంజిడ్డి తనయుడైన సతీష్‌డ్డి భార్య దీప్తిడ్డికి అమ్మి సొమ్ము చేసుకున్నారు. నిజానికి అదే ఏడాది మదీనాగూడలో అమ్మణ్ణమ్మ ఎకరా 8లక్షలకు కొన్నారు. దానికి కొద్దిదూరంలోనే ఉన్న కొండాపూర్‌లో మార్కెట్ విలువ రూ.12లక్షలు ఉండగా ఎకరా కోటి చొప్పున చంద్రబాబు ఎలా అమ్మారో... సతీష్‌డ్డి దంపతులు ఎలా కొన్నారో ఆ దేవునికే తెలియాలి.

కొండాపూర్‌లో భూములు కొన్న తరువాత సతీష్‌డ్డి కుటుంబం ఆ తరువాత వాటిని డెవలప్‌మెంట్ కోసం దివ్యశ్రీ గ్రూప్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ గ్రూప్‌నకు చంద్రబాబు హైటెక్‌సిటీ లే అవుట్‌లో ఏడెకరాల భూమిని కేటాయించటం గమనార్హం. ఇలా దాదాపు 50 సంస్థలు నగరంలో రకరకాల పేరుతో భూదందాలు చేస్తున్నాయి. ఫలితంగా హైదరాబాద్ చుట్టూ ఎక్కడ చూసినా సీమాంవూధుల ఎస్టేట్‌లు, ఫాం హౌస్‌లే. ఒక్క జూబ్లీహిల్స్, బంజరాహిల్స్‌లోనే సీమాంవూధకు చెందిన ఇద్దరు నేతలు 1700 ఎకరాల భూమిని మింగారని ఏకంగా మంత్రి శంకర్‌రావే ఆరోపించారు. బంజారాహిల్స్‌లో ఉన్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి భూమిని కూడా స్వాహా చేశారు. హైటెక్‌సిటీకి ఆనుకొని ఉన్న గురుకుల్ ట్రస్ట్ భూమి 637 ఎకరాలు కబ్జా చేశారు. కళ్లు మూసుకున్న ప్రభుత్వ సంస్థలు ఏకంగా నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం గమనార్హం. కబ్జా భూములకు తామే వారసులమన్న తీరుగా అక్కడ సీమాంధ్ర కబ్జాదారులు గుండాలతో భూములకు పహారా కాయడం విచిత్రం. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు పేరుతో శివారు భూములన్నింటినీ హస్తగతం చేసుకున్నారు. అలైన్‌మెంట్ల పేరుతో భూసేకరణ నోటీసులు ఇప్పించి కారు చౌకగా భూములను లాక్కొని ఆ తరువాత నోటిఫికేషన్ ఉపసంహరింపజేసుకొని అలైన్‌మెంట్లు మార్చి మార్చి రైతుల భూములను అడ్డికి పావుషేరుకు తీసేసుకున్నారు.

భూముల కేటాయింపులో ఘరానా మోసం
ఇది చాలదని సీమాంధ్ర సర్కారే నేరుగా భూకబ్జాదారుడి అవతారమెత్తింది. చంద్రబాబు హయాంలో మొదలైన భూ పందేరం, కాంగ్రెస్ హయాంలో అడ్డూ అదుపూ లేకుండా కొనసాగింది. గత ఆరేళ్ల కాంగ్రెస్ పాలనలోనే హైదరాబాద్ కేంద్రంగా 150 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 70 వేల ఎకరాల భూమిని వివిధ సంస్థలకు, వ్యక్తులకు, సెజ్‌లకు కేటాయించింది. ఇంతే కాదు అసలు ఉనికిలోనే లేని పత్రికలకు గజం లక్ష రూపాయల వరకు ధర పలికే జూబ్లీహిల్స్‌లో రెండెకరాల చొప్పున భూమిని కేటాయించింది. ఢిల్లీకి చెందిన ఆగాఖాన్ ఫౌండేషన్‌కు శంషాబాద్‌కు దగ్గరలో రూ.450 కోట్ల విలువైన 100 ఎకరాల భూమిని ఉచితంగా కట్టబెట్టింది. సీమాంవూధకుచెందిన ఇందూ టెక్నోజోన్‌కు రూ.750 కోట్ల విలువ చేసే 250 ఎకరాల భూమిని కేవలం రూ.50 కోట్లకే అప్పగించారు. ఇదే తీరుగా బ్రహ్మణీ ఇన్‌వూఫాకు రూ.750 కోట్ల విలువ చేసే 250 ఎకరాల భూమి రూ.50 కోట్లు, స్టార్‌గేజ్ ప్రాపర్టీస్‌కు రూ.750 కోట్ల విలువ కలిగిన 250 ఎకరాల భూమిని రూ.50 కోట్లకే అప్పగించారు. ఫ్యాబ్‌సిటీకి రూ.400 కోట్ల విలువ చేసే 100 ఎకరాల భూమిని ఎకరాకు ఒక్కపైస లీజు కింద అప్పగించారు. ఇలా ఏపీఐఐసీ, హెచ్‌ఎండీఏల ద్వారా దాదాపు 70 వేల ఎకరాల భూమి కేటాయింపులు చేశారు. ఇందులో రహేజాది మరో మోసం. హెటెక్‌సిటీకి సమీపంలో ఉన్న రూ.520 కోట్ల విలువ చేసే 109 ఎకరాల భూమిని కేవలం 55 కోట్లకు తీసుకుంది. ఉద్యోగాలు కల్పిస్తామని భూమిని కాజేసిన రహేజా కంపెనీ ఈ భూమిని బ్యాంకులో తాకట్టు పెట్టి వచ్చిన సొమ్ముతో ఐటీ పార్కులు కట్టి అద్దెకు ఇచ్చుకుంది. దీనితో రహేజా నెలకు రూ.30 కోట్ల లాభం ఆర్జిస్తోంది. ఇందులో సర్కారుకు నయాపైస ఆదాయం రాకపోగా రూ.500 కోట్లు నష్టపోయింది. రహేజా అక్రమాల్లో మాజీ సీఎం చంద్రబాబు పాత్రపై సీబీఐ విచారణ జరిపించాలంటూ లాయర్స్ జేఏసీ కన్వీనర్ రంగారావు సీఎంను కలిశారు. రహేజా భూ కేటాయింపుల్లో బాబు అక్రమాలపై తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని అంటున్నారు.

శంషాబాద్ దందా
మెట్రో నగరంగా అభివృద్ధి చెందుతున్న రాజధానికి అంతే సొబగులతో అంతర్జాతీయ స్థాయి విమానాక్షిశయం కావాలని చంద్రబాబు హయాంలో భావించారు. అప్పటికే ఉన్న బేగంపేట విమానాక్షిశయం ఎలాంటి ఇబ్బంది లేకుండా సేవలందిస్తున్నది. పైగా నగరం నడిబొడ్డున ఉండటంతో వచ్చిపోయేవారికి ఎంతో అనుకూలం. కానీ.. తన ప్రయోజనాలు తనకు ఉన్న చంద్రబాబు నాయుడు సర్కారు.. భారీ ఎత్తున శంషాబాద్ విమానాక్షిశయం నిర్మాణానికి పూనుకుంది. ఈ క్రమంలోనే దాని సమీప భూములను విమానాక్షిశయం ఏర్పాటు ప్రకటనకు ముందే తనకు కావల్సిన వారి చేత కొనిపించేశారు.

మైండ్ బ్లాక్ చేసే ఎమ్మార్ అక్రమాలు
వివాదాస్పదమై, ప్రస్తుతం చర్చనీయంశంగా మారిన ఎమ్మార్ ప్రాపర్టీ అక్రమాలు చూస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఇందులో దొందూ దొందే.. అన్న తీరుగా చంద్రబాబు, వైఎస్.. ఇద్దరూ భారీ అక్రమాలకు పాల్పడ్డారు. ఫలితంగా భారీ ఎత్తున లబ్ధి పొందారు. 2002లో టీడీపీ ప్రభుత్వం ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు నగరశివారు ప్రాంతమైన మణికొండలో 535 ఎకరాలను అప్పగించింది. ఈ సంస్థతో జరిగిన ఒప్పందం ప్రకారం గోల్ఫ్ కోర్సు, అంతర్జాతీయ కన్వెన్షెన్ సెంటర్‌తోపాటు ఇతర బహుళ ప్రయోజన ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించారు. ప్రతిపక్షంలో ఉండగా ఎమ్మార్ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించిన వైఎస్ రాజశేఖర్‌డ్డి అధికారంలోకి రాగానే మాట మార్చారు. ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్న ఏపీఐఐసీకి సంబంధం లేకుండానే ఎమ్మార్‌కు మూడో పార్టీగా ఎంజీఎఫ్‌ను చేర్చుకొని, మొత్తం ప్రాజెక్టుకు డెవలపర్ హక్కులు అప్పగించింది. ఈ రహస్య ఒప్పందాల ద్వారా బినామీ వ్యక్తులకు, సంస్థలకు అతి తక్కువ మొత్తానికి పలు ప్లాట్లు విక్రయించింది. ఇందులో ఒక్కరూపాయి కూడా ఏపీఐఐసికి దక్కలేదు. దీనిపై సీబీఐ విచారణ చేస్తోంది. అమీర్‌పేట సెంటర్‌లోరూ. 200 కోట్ల విలువ చేసే హెచ్‌ఎండీఏ భూమిని మాజీ ముఖ్యమంత్రి రోశయ్య తన హయాంలో కడపజిల్లాకు చెందిన ఒక టీడీపీ నాయకుడికి అప్పగించేశారు. దీనిపై పెద్ద వివాదం జరిగింది. దీనిపై విచారణ చేపట్టాలని లాయర్లు సీఎంను కోరారు.

ప్రభుత్వ భూములు మాయం
నగరంలో వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్షికాంతమయ్యాయి. రికార్డులనే తారుమారు చేసిన భూ మాఫియా.. బడా నేతలను తమ గుప్పిట్లో పెట్టుకొని వందల ఎకరాలు కబ్జా చేశారు. ఈ మధ్య కాలంలోనే ఉప్పల్‌లోని సర్వే నెంబర్ 789/1లో రూ.250 కోట్ల విలువ చేసే 27 ఎకరాల భూమి అన్యాక్షికాంతమైంది. హైదరాబాద్‌లోని కోఠీ ఈఎన్‌టీ ప్రభుత్వ ఆసుపవూతికి చెందిన రూ. 3381 చదరపు గజాల స్థలాన్ని కబ్జా చేశారు. సీమాంధ్ర సర్కారు ఏకంగా ఈ భూమిని కబ్జాదారులకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన రావడంతో సర్కారు ఆ ఆదేశాల అమలును పెండింగ్‌లో పెట్టింది. ఇవే కాదు.. శివారు ప్రాంతమైన జవహర్‌నగర్‌లో దాదాపు వందల ఎకరాల ప్రభుత్వ భూమిలో కాలనీలు వెలిశాయి. నగరంలో ఇలా దాదాపు 2 వేల ఎకరాల భూమి కబ్జా అయినట్లుగా అధికారులు గుర్తించినా అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలుసుకునే పరిస్థితిలో రెవెన్యూ యంత్రాంగం లేదు. ఈ మధ్య కాలంలో యూఎల్సీ క్లియన్స్ కోసం వచ్చిన దరఖాస్తుల ఆధారంగా వీటిని వెతుక్కునే పనిలో ఉన్నారు.

చెరువులు మింగిన ఘనులు
రాజధానితోపాటు శివారు ప్రాంతాల్లో రియల్ వ్యాపారం సీమాంవూధుల కబంధ హస్తాల్లోనే ఉంది. ఈ బడా బాబులు రాత్రికి రాత్రే చెరువులను పూడ్చి ప్లాట్లు చేసి విక్రయానికి పెట్టిన మహా ఘనులు. దీంతో నగరంలో దాదాపు 400 చెరువులు మాయమయ్యాయి. హైటెక్‌సీటీకి సమీపంలో ఉన్న దుర్గం చెరువును పూడ్చి అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. దీనిని ఒక మురికి గుంటగా మార్చిన ఘనత సీమాంధ్ర కబ్జాదారులదే. కూకట్‌పల్లిలోని కాజా కుంటది అదే పరిస్థితి. నగరం నడిమధ్యలో ఉన్న యూసుఫ్‌గూడ పెద్ద, చిన్న చెరువులు కాలనీలయ్యాయి. ఇలా అనేక చెరువులను పూడ్చి ఆక్రమించి అమ్మేశారు. ఈ మేరకు రికార్డులనే తారుమారు చేసిన ఘనా పాటీలు వీరు.


మణికొండలో లగడపాటి మహామాయ
రాజశేఖర్‌డ్డి హయాంలో కీలకమైన ప్రయోజనాలు పొందినవారిలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఒకరు. హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతంలో లగడపాటిరాజగోపాల్‌కు చెందిన ల్యాంకో కంపెనీకి ఐటీ సెజ్ నిమిత్తం ప్రభుత్వం 108 ఎకరాల వక్ఫ్ భూములను కేటాయించింది. ఈ భూముల కేటాయింపు పూర్తి కాగానే ఐటీ సెజ్ పక్కకు పోయింది. నాలుగోవంతు భూమిని సెజ్‌కు పరిమితం చేసిన లగడపాటి.. మిగిలిభూమిలో ల్యాంకో హిల్స్ పేరుతో రియల్‌ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. 7200 కోట్లతో కూడిన ఈ ప్రాజెక్టు భారతదేశంలోనే అతి పెద్ద రియల్ వెంచర్‌గా మారింది. సెజ్ పేరుతో వచ్చే రాయితీలు అనుభవిస్తూ పక్కా దందాకు తెరతీశారు. స్టాంప్‌డ్యూటీ, ఇతర పన్నుల మినహాయింపు పేరుతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలను కోల్పోయాయి. నిజానికి ఈ దందా మొదలైనప్పుడు ల్యాంకో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డు పెట్టుకున్నారు. దానిని తర్వాత ల్యాంకో టెక్నాలజీ పార్క్‌ప్రైవేట్ లిమిటెడ్‌గా మార్చారు. ఆ తర్వాత ల్యాంకో మంత్రి టెక్నాలజీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్‌గా మారి.. చివరకు ల్యాంకో హిల్స్ టెక్నాలజీ పార్క్ ప్రైవేట్ లివిటటెడ్‌గా మిగిలింది. తన రియల్ ఎస్టేట్ మోసాలను కప్పిపుచ్చుకునేందుకే కంపెనీ పేరును ఇన్ని సార్లు మార్చారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే నిర్మాణం మొదలైన కొద్దికాలానికి ఆ భూములు వక్ఫ్ భూములన్న సంగతి బయటికి వచ్చింది. అంటే ఈ భూమిని స్వాధీనం చేసుకున్న సర్కారు.. అక్రమంగా ల్యాంకోకు కేటాయించిందన్నమాట!

అవుటర్.. అదో భూమాయ
హైదరాబాద్ చుట్టూ రింగురోడ్డన్నారు! రాజధాని చుట్టూ గ్రోత్‌కారిడార్‌ను అభివృద్ధి చేయడం కోసమని చెప్పారు. కానీ.. ఆ గ్రోత్ కారిడార్‌లో ఇప్పుడు అవినీతి ప్రబలిపోయింది. అవినీతికి, భూ కుంభకోణాలకు రింగ్‌రోడ్ వ్యవహారం కేరాఫ్ అడ్రస్‌గా మారింది. భూముల మాయాజాలంలో రింగ్ రోడ్డు అష్ట వంకరలు తిరిగింది. రింగ్‌రోడ్డు కోసం సర్కారు 86 గ్రామాల్లో 6,500 ఎకరాల భూమిని సేకరించింది. ఇందులో 5,500 ఎకరాల భూమి రైతుల వద్దనుంచే సేకరించింది. అయితే భూసేకరణలో పెద్దల భూములను వదలి పేదల భూములు, ఇళ్లపై నుంచి తీసుకు శంషాబాద్ జంక్షన్ కోసం మొదట జాతీయ రహదారిపై 18.9 కిమీ వద్ద ప్రతిపాదించారు. దీని ప్రకారమైతే సామాన్యుల హుడా కాలనీలో కేవలం 4 ఇళ్లు మాత్రమే పోయేవి. కానీ.. ఇదే ప్రతిపాదనతో ఒక మాజీ మంత్రితో పాటు, అప్పట్లో బడా వ్యాపారులకు చెందిన 12 ఎకరాల భూములు పోతున్నాయి. అంతే.. సదరు పెద్దలు సర్కారు వద్ద తమ పలుకుబడిని ప్రయోగించారు. ఫలితం.. అలైన్‌మెంట్ మారిపోయింది.. హుడా కాలనీ మొత్తంగా అదృశ్యమైంది. శ్మశానవాటిక సైతం సమాధి అయిపోయింది. కీసరలో మూడు సార్లు అలైన్‌మెంట్ మార్చారు. ఇంతే కాదు భూసేకరణ నోటీస్‌లతో హడపూత్తించారు. వట్టినాగుల పల్లిలో మొదటి భూసేకరణ ప్రకారం సర్వే నెంబరు 410 నుంచి 425 వరకు నోటీస్‌లు ఇచ్చారు. ఆ తరువాత దళారీలు రంగంలోకి దిగారు. హుడా కంటే ఎక్కువ ధర ఇప్పిస్తామని సత్యం కంప్యూటర్స్ తరఫున ఎకరాకు రూ.16 లక్షల నుంచి 35 లక్షల వరకు చెల్లించి తీసేసుకున్నారు.

ఆ తరువాత అలైన్‌మెంట్ మార్చారు. భూములు పోతాయని భయపడి అమ్ముకున్న రైతులు నష్టపోగా ఇప్పుడు ఆ భూములు ఎకరా రూ.4 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకు ధర పలుకుతున్నాయి. సీమాంధ్ర భూబకాసురుల భూములు కాపాడుకుంటూ సామాన్యుల భూములను మింగుతూ వెళ్లిన ఆనకొండ ఈ రింగ్‌రోడ్డు. ఈ రింగ్ రోడ్డును అడ్డం పెట్టుకొని సీమాంధ్ర నేతలు రియల్ వ్యాపారం పేరుతో భారీ భూదందా నిర్వహించారు. కోట్లకు కోట్లు గడించారు. గ్రోత్‌కారిడార్‌లో వేలాది ఎకరాలు సీమాంధ్ర భూబకాసురుల చేతుల్లోనే ఉన్నాయి. ఇది ఇక్కడి సామాన్య రైతులకు డెత్ కారిడార్‌గా మారింది. ఇక్కడ కోట్ల రూపాయలు చేతులు మారాయి. అలైన్‌మెంట్ల మార్పులపై సీబీఐ విచారణ చేసినా నివేదికను వెలుగు చూడకుండా నొక్కిపెట్టారు. రావిరాల గ్రామంలో బ్రహ్మణీ, ఇందు, స్టార్‌గేజ్ కంపెనీలకు కేటాయించారు.

Take By: T News http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=2&ContentId=51104


Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News,  Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News, Assembly, RingRoad,Scam, APScam,   

0 comments:

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP