Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Thursday, January 6, 2011

శ్రీకృష్ణ కమిటీ నివేదిక విడుదల

సమస్య పరిష్కారానికి ప్రజాస్వామ్య పద్దతిలో కృషి చేద్దామని కేంద్ర హోంమంత్రి చిదంబరం అఖిలపక్ష సమావేశంలో అన్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే కమిటీని ఏర్పాటు చేయటం అయ్యిందన్నారు.మిగతా పార్టీలో ఈ సమావేశానికి హాజరు కాకపోవటం బాధాకరమన్నారు. వారికి కూడా నివేదికను పంపించటం జరుగుతుందన్నారు.కమిటీ సభ్యులు నివేదికలో మొత్తం ఆరు ప్రతిపాదనలు చేసినట్లు చిదంబరం తెలిపారు.


నివేదిక ప్రతిపాదించిన ఆరు సూచనలు : 1. రాష్ట్రాన్ని యథాతథ స్థితి కొనసాగించటం

2. రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణగా విభజించటం, - హైదరాబాద్‌ను కేంద్రపాలిత కేంద్రంగా చేయటం
రెండు రాష్ట్రాలకు కొత్త రాజధానులు

3. రాష్ట్రాన్ని రాయల తెలంగాణ, కోస్తాంధ్ర విభజించటం, హైదరాబాద్‌ను రాయల తెలంగాణ భాగంలోనే ఉంచటం.

4. రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణగా విభజించటం, హైదరాబాద్ విస్తృత మెట్రో నగరాన్ని ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయటం. కోసాంధ్ర, రాయలసీమకు హైదరాబాద్‌తో భౌగోళిక సంబంధం కొనసాగించటం.

5 రాష్ట్రాన్ని ప్రస్తుత సరిహద్దుల పరిధి ప్రకారమే సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా విభజన తెలంగాణకు హైదరాబాద్‌ను రాజధానిగా చేయటం, సీమాంధ్రకు కొత్త రాజధాని.

6 రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతూ, తెలంగాణకు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేయటం

Tag: Telangana, Telangana Report, RajNews, eenadu, Sakshi, KCR, AP, NEWS, Imges, Hot Images

Read more...

Options given by Srikrishna Committee on Telangana

Option 1

Maintain status quo

Option 2

Bifurcation of the State into Seemandhra and Telangana; with Hyderabad as a Union Territory and the two states developing their own capitals in due course

Option 3

Bifurcation of State into Rayala-Telangana and coastal Andhra regions with Hyderabad being an integral part of Rayala-Telangana

Option 4

Bifurcation of Andhra Pradesh into Seemandhra and Telangana with enlarge(including Mahabubnagar,Ranga Reddy, and Nalgonda) Hyderabad Metropolis as a separate Union Territory.

Option 5

Bifurcation of the State into Telangana and Seemandhra as in 1956 with Hyderabad as the capital of Telangana and Seemandhra to have a new capital

Option 6

Keeping the State united by simultaneously providing certain definite Constitutional/Statutory measures for socio-economic development and political empowerment of Telangana region – creation of a statutorily empowered Telangana Regional Council.

After listing these, the commission has rejected the first three as not being practical. Options four, five and six of the above are thus the options that the report presents as possible solutions to the Telangana issue.


Tag: Telangana, Telangana Report, RajNews, eenadu, Sakshi, KCR, AP, NEWS, Imges, Hot Images

Read more...

తెలంగాణ ఇస్తే సోనియా కాళ్లు కడగడానికి రెడీ: కేసీఆర్‌

హైదరాబాద్‌ : తెలంగాణ ఏర్పాటు చేయడానికి అఖిలపక్ష సమావేశం అవసరం లేదని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ అన్నారు. కేంద్రం తలచుకుంటే ఎవరి అభిప్రాయం అక్కర్లేదని అయనన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇవ్వడమే కేంద్రముందున్న ప్రత్యామ్నయమన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక బహిర్గతమైన తర్వాత ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు రెండు వారాల వ్యవధి ఇస్తున్నామని, రాష్ట్ర ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకోకుండా కేంద్రం కాలయాపన చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. కమిటీ నివేదికపై రాజకీయ నిర్ణయమే ఫైనల్‌ అని, కమిటీ నివేదిక ఎన్ని పరిష్కారాలు సూచించినా రాష్ట్ర ఏర్పాట్లుపై కేంద్రానిదే తుది నిర్ణయమని కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణ కోసం కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసి ఉద్యమంలో చేరాలని చూస్తున్నట్లు కేసీఆర్‌ వెల్లడించారు. టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడానికి క్యూలో నిల్చున్నారని ఆయనన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇస్తే సోనియాగాంధీ కాళ్లు కడగటానికి తాను రెడీ అని కేసీఆర్‌ అన్నారు.
Take By : Suryaa.com

Tag:

Read more...

తేల్చేనా.. నాన్చేనా? - ‘తెలంగాణ’పై ఢిల్లీలో అఖిలపక్ష భేటీ నేడే





‘తెలంగాణ’పై ఢిల్లీలో అఖిలపక్ష భేటీ నేడే



* వెల్లడికానున్న శ్రీకృష్ణ నివేదిక
* తెరవేస్తారా..? సాగదీస్తారా..? రాష్ట్రంలో టెన్షన్ టెన్షన్
* శ్రీకృష్ణ నివేదికను అందించటమేనా..? నిర్ణయం తీసుకుంటారా?
* అఖిలపక్ష సమావేశానికి టీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీ దూరం
* పీఆర్పీ నో కామెంట్.. సీపీఐ తెలంగానం.. సీపీఎం సమైక్య నాదం
* హైదరాబాద్‌పైనే ఎంఐఎం దృష్టి
* కాంగ్రెస్‌లో ప్రత్యేక, సమైక్య వాదనలున్నా.. చివరికి హైకమాండ్ దారే
* అన్నిటికీ మించి కేంద్ర సర్కారు నిర్ణయమే కీలకం

హైదరాబాద్, న్యూస్‌లైన్: శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఏడాది కాలపు ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. ప్రత్యేక తెలంగాణ, సమైక్య రాష్ట్ర ఉద్యమాల నేపథ్యంలో గత ఏడాది కాలంగా రాష్ట్ర ప్రజలను తీవ్ర ఉత్కంఠలో పెట్టిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ.. వారం కిందట కేంద్రానికి సమర్పించిన నివేదికలోని అంశాలు గురువారం వెల్లడికానున్నాయి. ఈ నివేదికపై రాష్ట్రంలోని 8 గుర్తింపు పొందిన పార్టీలతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కీలక సమావేశం మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. ఈ అఖిలపక్ష సమావేశంలో జరిగేదేమిటి? అంతిమ నిర్ణయం ఎలా ఉంటుంది? అనే అంశాలపై కేంద్ర ప్రభుత్వం అత్యంత రహస్యం పాటిస్తోంది. కేంద్ర హోంమంత్రి చిదంబరం అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా కీలకమైన నిర్ణయం జరుగుతుందా? లేక కేవలం నివేదికను అన్ని రాజకీయ పార్టీలకు ఇవ్వటం వరకే పరిమితం చేసి.. ఇవే పరిస్థితులు కొనసాగటానికి కారణమవుతారా? అనేది నేటితో తేలిపోనుంది.

రాష్ట్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన తెలంగాణ, సమైక్యాంధ్ర అంశాలపై ఏర్పాటైన ఈ సమావేశానికి బీజేపీ, టీఆర్‌ఎస్‌లు రాలేమని ప్రకటించాయి. వీటి అడుగుజాడల్లోనే నడుస్తున్నట్లుగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా దూరంగా ఉంటానని ప్రకటించింది. తెలంగాణలో కీలకమైన రాజకీయ పార్టీల్లో సగం పార్టీలు తిరస్కరించిన అఖిలపక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు వస్తాయోనని రాష్టమ్రంతా ఉత్కంఠతో ఎదురుచూస్తోంది!

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వానికి ఉన్న పరిస్థితుల్లో అఖిలపక్ష సమావేశం నిరర్ధకమంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి కేంద్ర ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్క ప్రతినిధినే ఆహ్వానించకుండా భిన్నాభిప్రాయాలు వచ్చే విధంగా అనైతిక పద్ధతికి కేంద్ర ప్రభుత్వమే ప్రోత్సాహాన్నిస్తోందంటూ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు కూడా అఖిలపక్ష ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఇద్దరు ప్రతినిధులను ఆహ్వానించినా భిన్నాభిప్రాయాలను ప్రోత్సహించినట్లు కాదంటూ ఏకాభిప్రాయం ప్రకటించిన పార్టీలను ఉదహరిస్తూ కేంద్ర హోంమంత్రి చిదంబరం రెండోసారి కేసీఆర్‌ను ఆహ్వానించారు.

రెండోసారి పంపిన ఆహ్వానాన్ని కూడా కేసీఆర్ తిరస్కరిస్తూ.. అఖిలపక్ష కమిటీ సమావేశానికి రాలేమని ప్రకటించారు. బీజేపీ, టీఆర్‌ఎస్ రెండు పార్టీలు కూడా తెలంగాణ ఏర్పాటు చేసే అధికారం, బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైనే ఉన్నాయని ప్రకటించాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా కొంచెం అటూఇటుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అఖిలపక్ష సమావేశానికి వెళ్లటం లేదని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉందని.. ఈ సమావేశానికి తాము రావాల్సినంత అవసరమేమీ లేదనే కారణంతోనే గైర్హాజరవుతున్నామంటూ చంద్రబాబు లేఖ రాశారు.

అఖిలపక్ష సమావేశానికి ప్రజారాజ్యం పార్టీ ప్రతినిధిగా సి.రామచంద్రయ్య ఒక్కరే హాజరుకానున్నారు. ఈయన కూడా శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఎలాంటి అభిప్రాయాన్ని చెప్పకుండా నివేదికను మాత్రమే పార్టీ తరఫున తీసుకోనున్నారు. ఒకవేళ అభిప్రాయం చెప్పాలని కేంద్రం కోరితే పార్టీలో చర్చించిన తర్వాతే పార్టీ వైఖరిని చెప్తామని మరింత గడువు కోరటానికి రామచంద్రయ్య హాజరవుతున్నారు. ఇక సీపీఎం ప్రతినిధులుగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు, ఎమ్మెల్యే జూలకంటి హాజరవుతున్నారు. నివేదిక ఇచ్చినా, అభిప్రాయం అడిగినా సమైక్యవాదాన్నే వీరు వినిపించనున్నారు. సీపీఐ తరఫున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, శాసనసభాపక్ష నాయకుడు జి.మల్లేష్ హాజరవుతుండగా.. వారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే ఏకాభిప్రాయాన్ని వెల్లడించనున్నారు. ఎంఐఎం నుండి ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీతో పాటు ఎమ్మెల్సీ ఖాద్రీ హాజరుకానున్నారు. తెలంగాణ ఏర్పాటు చేయదలిస్తే హైదరాబాద్, మైనారిటీ అంశాలను వీరు ప్రస్తావించనున్నారు.

రాష్ట్ర కాంగ్రెస్ గొంతులో పచ్చివెలక్కాయ...
రాష్ట్ర రాజకీయ పార్టీల్లోకెల్లా కాంగ్రెస్‌లోనే తీవ్ర అనిశ్చితి, అయోమయ పరిస్థితి నెలకొనిఉంది. టీడీపీ తర్వాత.. అంతర్గతంగా అదేస్థాయిలో తెలంగాణ, సమైక్యాంధ్ర విషయాల్లో సొంతపార్టీ నేతల మధ్యనే అగాధం నెలకొంది. పుట్టినరోజు నాడే నిర్ణయాన్ని ప్రకటించినందున తెలంగాణకు అనుకూలంగానే పార్టీ అధినేత్రి నిర్ణయం తీసుకుంటారని తెలంగాణ ప్రాంత నాయకులు చెప్తున్నారు. రెండో ఎస్‌ఆర్‌సీయే పార్టీ విధానమని, రాష్ట్ర విభజనకు అంగీకరించబోరని సమైక్యవాద నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే పార్టీ పదవులే కాదు ఎలాంటి త్యాగాలనైనా చేస్తామని తెలంగాణ నాయకులు హెచ్చరిస్తుంటే.. రాష్ట్రాన్ని విభజిస్తే రాజకీయాల నుండి నిష్ర్కమిస్తామంటూ సమైక్యవాద నాయకులు బెదిరిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి రెండు ప్రాంతాలకు చెందిన ఇద్దరు నేతలు కావూరి, ఉత్తమ్‌లు అఖిలపక్ష భేటీకి హాజరవుతున్నారు. రాష్ట్రాన్ని విభజించటం అంత ఈజీ కాదని కావూరి అంటే.. తెలంగాణ ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఉత్తమ్ ఉద్ఘాటించారు. రాష్ట్ర పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్, టీడీపీ వంటివి అంతర్గతంగా నిట్టనిలువునా చీలిపోతున్న ఈ పరిస్థితుల్లో శ్రీకృష్ణ కమిటీ దాదాపు 10 నెలల పాటు రాష్ట్రంలో అధ్యయనం చేసింది. కమిటీ చేసిన అధ్యయనం, సూచించిన పరిష్కారాలు, వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయోనని రాష్ట్ర రాజకీయవర్గాల్లోనే కాకుండా వ్యాపార, ఉద్యోగ, విద్యార్థులతో పాటు ప్రజానీకమంతా ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. కమిటీలో ఏయే అంశాలు, పరిష్కారాలు చోటుచేసుకున్నాయనేది ఒక అంశమైతే దీనిపై కేంద్ర వైఖరేమిటన్నదే అన్నింటికన్నా అంతిమ ప్రాధాన్యతాంశం.


Tag: Sakshi, eenadu, News, Telangana, KCR, RajNews, AP,

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP