శ్రీకృష్ణ కమిటీ నివేదిక విడుదల
సమస్య పరిష్కారానికి ప్రజాస్వామ్య పద్దతిలో కృషి చేద్దామని కేంద్ర హోంమంత్రి చిదంబరం అఖిలపక్ష సమావేశంలో అన్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే కమిటీని ఏర్పాటు చేయటం అయ్యిందన్నారు.మిగతా పార్టీలో ఈ సమావేశానికి హాజరు కాకపోవటం బాధాకరమన్నారు. వారికి కూడా నివేదికను పంపించటం జరుగుతుందన్నారు.కమిటీ సభ్యులు నివేదికలో మొత్తం ఆరు ప్రతిపాదనలు చేసినట్లు చిదంబరం తెలిపారు.
నివేదిక ప్రతిపాదించిన ఆరు సూచనలు : 1. రాష్ట్రాన్ని యథాతథ స్థితి కొనసాగించటం
2. రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణగా విభజించటం, - హైదరాబాద్‌ను కేంద్రపాలిత కేంద్రంగా చేయటం
రెండు రాష్ట్రాలకు కొత్త రాజధానులు
3. రాష్ట్రాన్ని రాయల తెలంగాణ, కోస్తాంధ్ర విభజించటం, హైదరాబాద్‌ను రాయల తెలంగాణ భాగంలోనే ఉంచటం.
4. రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణగా విభజించటం, హైదరాబాద్ విస్తృత మెట్రో నగరాన్ని ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయటం. కోసాంధ్ర, రాయలసీమకు హైదరాబాద్‌తో భౌగోళిక సంబంధం కొనసాగించటం.
5 రాష్ట్రాన్ని ప్రస్తుత సరిహద్దుల పరిధి ప్రకారమే సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా విభజన తెలంగాణకు హైదరాబాద్‌ను రాజధానిగా చేయటం, సీమాంధ్రకు కొత్త రాజధాని.
6 రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతూ, తెలంగాణకు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేయటం
Tag: Telangana, Telangana Report, RajNews, eenadu, Sakshi, KCR, AP, NEWS, Imges, Hot Images
2 comments:
జై తెలంగాణ, జై జై తెలంగాణ
http://neelahamsa.blogspot.com/2010/12/blog-post_19.html
Post a Comment