తెలంగాణ ఇస్తే సోనియా కాళ్లు కడగడానికి రెడీ: కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ ఏర్పాటు చేయడానికి అఖిలపక్ష సమావేశం అవసరం లేదని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. కేంద్రం తలచుకుంటే ఎవరి అభిప్రాయం అక్కర్లేదని అయనన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇవ్వడమే కేంద్రముందున్న ప్రత్యామ్నయమన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక బహిర్గతమైన తర్వాత ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు రెండు వారాల వ్యవధి ఇస్తున్నామని, రాష్ట్ర ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకోకుండా కేంద్రం కాలయాపన చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. కమిటీ నివేదికపై రాజకీయ నిర్ణయమే ఫైనల్ అని, కమిటీ నివేదిక ఎన్ని పరిష్కారాలు సూచించినా రాష్ట్ర ఏర్పాట్లుపై కేంద్రానిదే తుది నిర్ణయమని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసి ఉద్యమంలో చేరాలని చూస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడానికి క్యూలో నిల్చున్నారని ఆయనన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇస్తే సోనియాగాంధీ కాళ్లు కడగటానికి తాను రెడీ అని కేసీఆర్ అన్నారు.
Take By : Suryaa.com
Tag:
3 comments:
అక్కడ ఆవిడ కాళ్ళు కడిగి ఆ పైన తెలంగాణా ప్రజల జుట్టు గోరిగే పనా నాయనా..?
ఇది తెలంగాణా గుండె చప్పుడా?
ఏది తెలంగాణా గుండె చప్పుడా?
ఇది idi
ఏది edi
ముందు ఇది క్లారిఫై చేయండి.
బాంచన్ దొరా! నీ కాల్మొక్కుతా సంస్కృతి ఇంకా పోలేదు. తెలంగాణా దాకా ఎందుకు ఉపముఖ్య మంత్రి పదవి ఇస్తానంటే ఎవరి కాళ్లైనా పట్టుకుంటాడు. కదా కే.సి.ఆర్.?
Post a Comment