టెట్, డియస్‌సిలకు వీడ్కోలు ‘టెస్ట్’ టాలెంట్ చాలు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్), ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష (డియస్‌సి) రెండింటి స్థానంలో ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నదే టెస్ట్.
ఇదెలా ఉంటుంది? టెస్ట్ అంటే ఏమిటి?
టెస్ట్
అంటే టీచర్ ఎలిజబులిటీ, సెలక్షన్ టెస్ట్ - Teacher Elijibility &
Selection Test-TEST. అంటే ఉపాధ్యాయ అర్హత, ఎంపిక పరీక్ష.
టెస్ట్ ఆలోచన ఎందుకు?
మన
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షగా టెట్ - టీచర్ ఎలిజబులిటీ టెస్ట్,
ఉపాధ్యాయ ఎంపిక కోసం డిఎస్‌సి నిర్వహిస్తున్నారు. అప్పటికే డిప్లొమా ఇన్
పబ్లికేషన్స్, బి.ఇ.డి, లాంగ్వేజ్ పండిట్స్ పాసైన ఉపాధ్యాయ ఉద్యోగస్తులకు
రెండు పరీక్షలు నిర్వహించటం పట్ల తీవ్ర విమర్శలు రేగాయి. ఈ విధానం ఏ
రాష్ట్రంలో లేదని ఏదో ఒక దానిని రద్దు చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు
డిమాండ్ చేస్తున్నారు. చుక్కా రామయ్య వంటి విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు
దీనిని వ్యతిరేకించాయి. దీనితో ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఈ రెండింటినీ
కలిపి టెస్ట్ నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. దీనినే విద్యామంత్రి
డియస్‌సి ఫలితాల సమయంలో ప్రకటించారు.
ఏదో ఒక దానిని రద్దు చేయకుండా, రెండింటినీ కలపడమెందుకు?
2009
విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ అర్హత నిర్ధారించేందుకు టెట్ పరీక్షను
విధిగా నిర్వహించాలి. దీని నుంచి ఏ రాష్ట్రానికీ మినహాయింపు లేదు.
ఇదేవిధంగా ఉపాధ్యాయ ఎంపికల కోసం గత కొన్ని దశాబ్దాల నుంచి ప్రభుత్వం
డియస్‌సిలను నిర్వహించి దానిలో ఏ ఒక్కటి రద్దు చేసే అవకాశం లేక రెండింటినీ
కలిపి టెస్ట్‌గా నిర్వహించాలని భావిస్తోంది.
టెస్ట్ మౌలిక స్వరూపం ఎలా ఉంటుంది?
టెట్, డియస్‌సిలను కలిపి వేస్తున్నందుకు రెండు పరీక్షల్లో ఉన్న కామన్‌గా ఉంచే విభాగాలను తొలగించి నైతన స్వరూపంలో టెస్ట్ నిర్వహించాలని ప్రభుత్వ అభిమతం. అంటే ఒక పరీక్షలో ఉండే విభాగం మరొక పరీక్షలో ఉంటే దానిని తొలగిస్తారు. దీనివల్ల రిపిటీషన్ ఉండదు. డి.యస్.సి., బి.ఇ.డి.లు ప్రొపెషన్ కోర్సులు ఈ రెండు కోర్సుల్లో ఏదో ఒకటి పాసై ఉపాధ్యాయ పోస్టు అభిలషిస్తున్న వారికి ఇలా రెండు పరీక్షలు నిర్వహించడం ఏ రాష్ట్రంలోనూ లేదు.
ఎలాంటి పరీక్ష రూపొందిస్తారు?
ఇటు డియస్సీ పరీక్షలో పేర్కొన్న సిలబస్ అంశాలు, అటు టెట్ పరీక్షలో పేర్కొన్న సిలబస్ అంశాలలో ఏవైతే రిపీట్ అవుతాయో వాటిని కొత్త టెస్ట్ పరీక్షలో తొలగించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఉదా॥ లాంగ్వేజీ అంశాలు, కంటెంట్ అంశాలు రెండు రకాల పరీక్షలలో రిపీట్ అవుతున్నాయి. అటువంటి సిలబస్‌లో ప్రశ్నలు తగ్గిస్తారు. అలాగే అటు డియస్సీ, ఇటు టెట్ పరీక్షలను కలుపుతున్న దృష్ట్యా రిపీటెడ్ సిలబస్ గురించే కాకుండా పరీక్ష సమయం, ప్రశ్నల సంఖ్య వంటి పలు అంశాలపై అధ్యయనం చేస్తూ టెస్టు పరీక్షను సమగ్రంగా రూపొందించనున్నారు. టెట్ పరీక్ష స్ట్రక్చర్ అండ్ కంటెంట్‌ను ఎస్.సి.టి.ఇ. రూపొందించింది. కాబట్టి దానినే రాష్ట్రాలు పాటించాలి. అదే సమయంలో టెట్‌కు వెయిటేజీ 20 శాతం మార్కులు, డియస్సీ పరీక్షకు 80 శాతం ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
3 గంటల పరీక్ష టెస్టు?
నూతనంగా రూపొందిస్తున్న టెస్టు పరీక్ష వ్యవధి 3 గంటలుగా ఖరారు చేసే ప్రతిపాదన లున్నాయి. డియస్‌సిలో 2.30 గంటలలో 160 ప్రశ్నలు అభ్యర్థులు జవాబులు రాయాల్సి ఉండేది. అదే టెట్ పరీక్షలో 2.30 గంటలలో 120 ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంది. నూతన టెస్టులో 200 ప్రశ్నలకు 200 జవాబులను గుర్తించేలా పరీక్ష వ్యవధి 3 గంటలు నిర్ణయిస్తారని తెలుస్తోంది. టెస్టులో 200 ప్రశ్నలకు 100 మార్కులు ఇవ్వాలనే ప్రతిపాదనలు రూపొందించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా డియస్సీ పరీక్షకు 80 మార్కులు టెట్ పరీక్షకు 20 మార్కులు విధానం నిష్పత్తిలో కొత్త టెస్టు నిర్మాణంలో 70.:30 నిష్పత్తి లేదా 60:40 నిష్పత్తిలో ప్రశ్నలు ఇవ్వనున్నారనేది సమాచారం. మొత్తం మీద టెట్ కంటే డియస్సీ సిలబస్ నుంచే అధిక ప్రశ్నలు ఉంటాయని తెలుస్తోంది.
టెస్ట్ ఏర్పాట్లు మొదలయ్యాయా?
ఇంకా లేదు. మంత్రిగారు విధాన ప్రకటన చేశారుగానీ ఇప్పటి వరకు ఎటువంటి ... సన్నాహాలు ఆరంభం కాలేదు. .. కొత్త పరీక్ష విధానం, సిలబస్ రూపకల్పనకు పాఠశాల విద్యాశాఖ ఒక కమిటీని నియమిస్తుంది. కమిటీ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఎన్.సి.ఇ.ఆర్.టి. సిలబస్‌లో మార్పులు చేర్పులు చేస్తుంది. అయితే ఇంతవరకు ఈ దశల్లో ఏదీ ఆరంభం కాలేదు.
మరి.. టెస్ట్ నోటిఫికేషన్‌ను ఎప్పటిలోగా ఆశించవచ్చు?
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ నియామాలకు కట్టుబడి ఉంది కాబట్టి రాబోయే రెండు నెలల్లో ఈ దశలు పూర్తి చేసి ఆపై నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. టెస్ట్-2013గా నోటిఫికేషన్ వెలువడవచ్చు. ఈ దశలు పూర్తి చేసేందుకు విద్యాశాఖకు ఎక్కువ సమయం పట్టదని అధికార వర్గాలు చెబు తున్నాయి.
Take BY: T News
Read more...