బాలల దినోత్సవం

అమ్మ మాటలు నేర్పుతది
గుడి భక్తిని నేర్పుతది
లోకం పోకడ నేర్పుతది
బడి సదువు నేర్పుతది

దేవుడు లేనిదే సృష్టి లేదు
కష్టం లేనిదే సుఖం లేదు
గురువు లేనిదే శిష్యుడు లేడు

ప్రేమను పంచుతది అమ్మ
సందమామ పాట పాడుతది అమ్మ
ఏడిస్తే ఊకుంచుతది అమ్మ
ఆడుకుందాం రా...
గెలుపు ఓటములతో సంబంధం లేకుండా స్నేహభావం వెల్లివిరిసేలా సమిష్టిగా ఆడుకునే ఆటలు మన ‘తెలంగాణ’ పల్లెల్లో ఎక్కువ. అలాంటివి మచ్చుకి తొమ్మిది ఆటల్ని ఇక్కడ చూద్దాం. ఈ ఆటల్లో మీరందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని చుట్టూ తిరుగుతూ ఉత్సాహంగా ఆడుకోవచ్చు.
ఆడుకుందామా, కూడుకుందామా-కుమ్మరోళ్ళ పెరట్ల గుద్దుకుందామా వడ్లోళ్ళ బండొచ్చే మా బండి రాకపాయె
చెట్టు మీద దెయ్యం-నాకేం భయ్యం దాళ్ళదడి-దశన్న పొడి బోడ గుండు బొక్కల గుండు-కాల్చుకుంటే కమ్మగుండు కాని గిరీ కంకణం-జుట్టు వట్టి తన్నెదం సిప్ప దెచ్చుకో-డాంబరు బోత్త అద్దంచి ఆరంచి-ఏడుపుట్ల కామంచి గూట్లో రూపాయి-నీ మొగుడు సిపాయి
కథా గేయాలు

పులి బావా బుక్కా బెట్టె-జంగమయ్య సాదుకునే
గుళంబ బిక్షా!
కథలన్ని వెతలాయె-కాపురాల్ రెండాయె
నిన్న వచ్చిన కుందేలు నేడు కూరాయె
దీనిని చంపిన బంటు చచ్చి ఆరు నెలలాయె!
ఆటా-పాటా
అగ్గిపెట్టె-గుగ్గిపెట్టె, కోడీ, కొమ్మా, పిల్లా, సల్లా, సత్తూ,-లచ్చీస లవలవ చెంచో, బైటో, టాంగు, టీంగు, తమ్మల్ల పెద్దమ్మ, తుసుక్కు, తుసుక్కు.
దాగుడు మూతల దండాకోర్, పిలీ ్లవచ్చే ఎల్కా వచ్చే, ఎక్కడి దొంగలు అక్కడే- గప్ చుప్, సాంబార్ బుడ్డీ!
అల్లం, బెల్లం, ఆకుల సున్నం, ఖాస్8, కీస్8 కటీఫ్

పొట్టి బావ
ఏం చేశాడు
ఉట్టి మీద చట్టిలో
పెరుగు చూశాడు
పెరుగు చూసి నోరు వూరి
ఎగిరి చూశాడు
ఎగిరి ఎగిరి
అందలేక
క్రింద పడ్డాడు.

ఏరులు పొంగగ వస్తోంది
అక్కా పడవలు చేద్దామా?
చక్కగ నీటిలో వేద్దామా?
పాపలు పడవలు ఎక్కేద్దాం
పలు దేశాలు చూసేద్దాం
అందాల పడవలు పోతూ ఉంటే
మనకెంతో హాయ్ హాయ్!
మనసెంతో జాయ్ జాయ్!!
పొడుపు కథలు
చుట్ల చుట్ల పాం వచ్చె
సూర్యారాయని దండు వచ్చె
హనుమకొండ వాగు వచ్చె
అందులొక్క బొట్టులేదు!
జవాబు:చక్కిలం
కిరు కిరు తలుపులు
కిటారు తలుపులు
వెయ్యంగ వెయ్యస్తవి గాని
తియ్యంగ తియ్యరావు
జవాబు:ముగ్గు
గున గున వచ్చే
గున గున పోయె
గున్నాచింత పేరేమి?
జవాబు:తాడు, బొక్కెన
అడవిలో పుట్టింది
అడవిలో పెరిగింది
మా ఇంటికొచ్చింది
తైతక్క లాడింది
జవాబు:చల్ల కవ్వం
పోంగ బోడది
రాంగ జుట్టుది
జవాబు:పేలాలు
చీకటింట్లో జడల దయ్యం
జవాబు:ఉట్టి
- శశికళ దేవరాజు, చెన్నూర్
Take By: http://www.namasthetelangaana.com/news/Article.asp?category=10&subCategory=9&ContentId=44613
Tags: Telangana News, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, Telangana agitation, statehood demand, Venkat Reddy,
Read more...