ఓ లచ్చా గుమ్మడి
ఓ లచ్చా గుమ్మడి
ఆదిలాబాద్ జిల్లాలోన ఓ లచ్చా గుమ్మడి
తంగేడు పువ్వుల బతుకమ్మట ఓ లచ్చా గుమ్మడి
నిజామాబాద్ జిల్లాలోన ఓ లచ్చా గుమ్మడి
గునక పువ్వుల బతుకమ్మట ఓ లచ్చా గుమ్మడి
కరీంనగర్ జిల్లాలోన ఓ లచ్చా గుమ్మడి
కట్ల పువ్వుల బతుకమ్మట ఓ లచ్చా గుమ్మడి
మెదక్ జిల్లాలోన ఓ లచ్చా గుమ్మడి
బీర పువ్వుల బతుకమ్మట ఓ లచ్చా గుమ్మడి
వరంగల్ జిల్లాలోన ఓ లచ్చా గుమ్మడి
జాజి పువ్వుల బతుకమ్మట ఓ లచ్చా గుమ్మడి
హైదరాబాద్ జిల్లాలోన ఓ లచ్చా గుమ్మడి
రుద్రాక్ష పువ్వుల బతుకమ్మట ఓ లచ్చా గుమ్మడి
రంగారెడ్డి జిల్లాలోన ఓ లచ్చా గుమ్మడి
గుమ్మడి పువ్వుల బతుకమ్మట ఓ లచ్చా గుమ్మడి
నల్లగొండ జిల్లాలోన ఓ లచ్చా గుమ్మడి
గన్నేరు పువ్వుల బతుకమ్మట ఓ లచ్చా గుమ్మడి
ఖమ్మం జిల్లాలోన ఓ లచ్చా గుమ్మడి
కనకాంబరం పువ్వుల బతుకమ్మట ఓ లచ్చా గుమ్మడి
మహబూబ్‌నగర్ జిల్లాలోన ఓ లచ్చా గుమ్మడి
మందారపు పువ్వుల బతుకమ్మట ఓ లచ్చా గుమ్మడి
పది జిల్లాల పువ్వులు తెచ్చి ఓ లచ్చా గుమ్మడి
రంగురంగుల బతుకమ్మలు పేర్చి ఓ లచ్చా గుమ్మడి
సుందర సతులంతా చుట్టుగా నిల్చుండి ఓ లచ్చా గుమ్మడి
ఆటలు ఆడిరి, పాటలు పాడిరి, గౌరమ్మ మెచ్చి ఓ లచ్చా గుమ్మడి
గౌరమ్మ మెచ్చి వరములు ఇచ్చెను ఓ లచ్చా గుమ్మడి
పది జిల్లాలు పోరాడితే ఓ లచ్చా గుమ్మడి
మా తెలంగాణ మాకు వస్తుందటా ఓ లచ్చా గుమ్మడి.
- వేముల తిరుపతి రెడ్డి,హుస్నాబాద్
Take By: T News
Tags: T News, hmtv, tv9, Telangana agitation, statehood demand, Songs, Cinema, Images, Telangana Songs, movies, Tollywood, Bollywood, Hollywood, Dacanwood
Tags: T News, hmtv, tv9, Telangana agitation, statehood demand, Songs, Cinema, Images, Telangana Songs, movies, Tollywood, Bollywood, Hollywood, Dacanwood
0 comments:
Post a Comment