రావె నా రంగి
రావె నా రంగి
చెరువు గట్టుకాడ తుమ్మచెట్టు నీడ
కలియ రమ్మంటివే కాటుక కండ్ల రంగి
ఊసులాడుకుందాము
ఉరికి రమ్మంటివే మోహనాల నా రంగి
ఉరుమచ్చే మెరపచ్చే వానచ్చె వరదచ్చె
కాలమంత గడవచ్చే నీ జాడ కానరాదయ్యె
నీవు చేసిన బాసలన్ని
యాదికచ్చి గోల జేస్తున్నయో నా రంగి
కాలమంత గడచిపోయె కానరాక నీ జాడ
అత్త కూతురని అత్తరు కొనుక్కొస్తినే
మంగయ్య తోట్లకెల్లి మల్లెపూలు నే దెస్తి
పంతులోరి శేండ్లకెల్లి పల్లికాయ నే దెస్తి
దసరా పండగకు బాసరకు పోదమంటె
‘సై’యంటి కదనే నా వెన్నెల రంగి
మాయ మాటలు శాన జెప్పి
నా మతి బోడ గొడితివే నా రంగి
ఇట్ల నన్ను సతాయిస్తె బతిమాలుతాననుకోకు
సంకురాత్రి వరకు సక్కని సుక్కని
పెండ్లి జేసుకుంటనే నా రంగి
0 comments:
Post a Comment