సంప్రతింపులు పూర్తి కాలేదు
- చర్చల ప్రక్రియ కొనసాగుతోంది.. తెలంగాణపై
ఏం చేయబోతున్నామో ఇప్పుడే చెప్పలేం
- వీలైనంత త్వరలో పరిష్కారం
- తేల్చిచెప్పిన ఆజాద్
న్యూఢిల్లీ, నవంబర్ 14 ():తెలంగాణ సమస్య పరిష్కారానికి సంప్రతింపుల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, చర్చలు కొనసాగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. సంప్రతింపుల ప్రక్రియ ముగిసిన తర్వాత సమస్యపై ఏదో ఒక నిర్ణయానికి వస్తామని ఆయన తెలిపారు. ఇలాంటి దశలో తెలంగాణపై ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నామో తాను చెప్పలేనన్నారు. సోమవారం రాజధానిలో ప్రారంభమైన ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్‌లో తన ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సంబంధించిన స్టాల్‌ను ప్రారంభించిన అనంతరం ఆజాద్ విలేకరులతో మాట్లాడారు. తాను మొదటి నుంచి చెబుతున్నట్లుగానే కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సమస్యను సత్వరం పరిష్కరించడానికి కృషిచేస్తున్నాయన్నారు. ఆ దిశలోనే వీలైనంత త్వరలో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. భాగస్వామ్య పక్షాలతో సమావేశమవుతారా అన్న ప్రశ్నకు ఆ విషయం చెప్పలేనని సమాధానం దాటవేసారు. కేంద్రం ఒకవేళ రెండో ఎస్సార్సీ వేస్తే దాన్ని తెలంగాణకు వర్తింపచేస్తారా అన్న ప్రశ్నకు, ఇప్పుడేం చేయాలన్న దానిపై తాము ఏమీ నిర్ణయించుకోలేదని తెలిపారు. సోమవారం పార్టీ కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణపై జరిగిన చర్చలో పురోగతి ఉందని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు.
07.06.2011
‘తెలంగాణ అంశాన్ని పరిష్కరించడం అంత సులభం కాదు. దీనిని సామరస్యంగా పరిష్కరించడానికి మా పార్టీ ప్రయత్నిస్తోంది. తెలంగాణపై ఇప్పటికే కొంత కసరత్తు జరిగింది, మిగిలిన దాన్ని పూర్తిచేస్తాం. శ్రీకృష్ట కమిటీ ఆరు ప్రత్యామ్నాయాలను సూచించడంతో సమస్య సంక్లిష్టయయ్యింది’
న్యూఢిల్లీలో విలేకరులతో
01.07.2011
‘తెలంగాణ ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదు. వారు రాజీనామాలపై తొందర పడొద్దు. తెలంగాణ సమస్యను పరిష్కరించడానికి కాంగ్రెస్ చిత్తశుద్ధితో పనిచేస్తోంది. ఇప్పటికిప్పుడే పరిష్కారం కావాలంటే సాధ్యం కాదు. దానికి సమయం పడుతుంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల అభివూపాయాలు సేకరిస్తున్నాం ’
హైదరాబాద్‌లోని జూబ్లిహాల్లో జరిగిన నేషనల్ దళిత్ క్రిస్టియన్ సదస్సు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. 05.07.2011
‘తెలంగాణపై కాంగ్రెస్ పార్టీగానీ, ప్రభుత్వంగానీ ఏకపక్ష నిర్ణయం తీసుకోలేవు. మూడు ప్రాంతాల ప్రజలతో మాట్లాడాల్సి ఉంది. ఒక ప్రాంతం వారికి మనోభావాలు ఉంటే, మరో ప్రాంతం వారికీ ఉంటాయి. ఇలాంటి మనోభావాల అంశంలో మూడు ప్రాంతాల వారినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మొదటగా పార్టీలో అంతర్గతంగా, ఆ తర్వాత రాష్ట్రంలోని ఇతర పార్టీలతో సంప్రదింపుతు జరపాలి. జాతీయ స్థాయిలో ఇతర పక్షాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. వెంటనే, ఓ నిర్ణయానికి వచ్చేయడానికి ఇదంత తేలికైన వ్యవహారమేమీ కాదు.’
న్యూఢిల్లీలో విజ్ఞాన్‌భవన్ వద్ద మీడియాతో
08.07.2011
‘తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు డిమాండ్‌పై సంప్రతింపుల ప్రక్రియ ఇంకా ప్రారంభంకాలేదు. త్వరలో మొదలుపెడతాం. రోడ్‌మ్యాప్ విషయం మీడియాకు చెప్పేది కాదు’
న్యూఢిల్లీలో విలేకరులతో
13.07.2011
‘ఆంవూధవూపదేశ్ శాసనసభ ఏకక్షిగీవ తీర్మానం చేయనిదే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు వ్యవహారంలో కేంద్రం అంగుళం కూడా ముందడుగు వేయదు. అన్ని ప్రాంతాల శాస సభ్యుల ఏకాభివూపాయం లేకుండా రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదు. తెలంగాణ రగులుతున్న సమస్య. కాదనను. తెలంగాణలోని ప్రతిఒక్కరి హృదయంలో సెంటిమెంట్ ఉంది. సీమాంద్ర ప్రజల హృదయాల్లోనూ ఉంది. అందర్నీ కలుపుకొని వెళ్లకపోతే నిర్ణయం తీసుకోవడం కష్టం’
బీజింగ్‌లోని భారతీయ విలేకరులతో
28.07.2011
‘అరమరికల్లేకుండా పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో మూడు ప్రాంతాల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఈ చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి నిర్దిష్ట మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాం. రెండు నెలల్లో ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలనుకుంటున్నాం’
న్యూఢిల్లీలో తెలంగాణ ప్రజావూపతినిధులతో చర్చలు ముగిసిన అనంతరం విలేకరుల సమావేశంలో
02.10.2011
‘తెలంగాణ సమస్య సరిష్కారానికి మరింత సమయం పడుతుంది. ఆ పరిష్కారం రేపా? ఎల్లుండా? అని మాత్రం నేను చెప్పలేను. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత నేతలతో సంప్రదింపుల ప్రక్రియ ముగిసింది. ఇంకా జాతీయ స్థాయిలో చర్చలు జరగాల్సి ఉంది’
ప్రకాశం, కృష్ణా జిల్లాల పర్యటనకు వెళ్తూ శంషాబాద్
విమానాక్షిశయంలో విలేకరులతో
Take By: T News
Tags: Telangana News, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, Telangana agitation, statehood demand, Venkat Reddy,
0 comments:
Post a Comment