26న వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టులకు నోటిఫికేషన్
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వీఆర్‌వో, వీఆర్‌ఏ పోస్టులకు ఈ నెల 26న నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు అధికారికంగా మంత్రి రఘువీరారెడ్డి ప్రకటించారు. 1172 వీఆర్‌వో పోస్టులు, 6063 వీఆర్‌ఏ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. వీఆర్‌వోల ఎంపికకు కనీస అర్హతగా ఇంటర్మీడియట్, వీఆర్‌ఏ పోస్టులకు కనీస అర్హతగా పదవ తరగతిగా నిర్ణయించారు. నోటిఫికేషన్లను జిల్లాల వారిగా విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ పోస్టులకు స్థానికులనే ఎంపిక చేస్తామని చెప్పారు. దరఖాస్తులు సమర్పించుటకు చివరి తేదీ డిసెంబర్ 17. జనవరి 2న అర్హతా జాబితా విడుదల చేయనున్నారు. ఎంపికైన వారికి జనవరి 18 నుంచి 28 వరకు ఇంటర్వూలు నిర్వహించనున్నారు. అనంతరం తుది జాబితాను జనవరి 30న ప్రకటించనున్నారు. 31లోపు పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు.
Tags: Telangana News, Jobs, Notification, Govt Jobs, Full Time, Part Time, Job News, ryk, AP, TET, APTET, Venkat Reddy,
0 comments:
Post a Comment