Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Wednesday, October 19, 2011

Decision on Telangana likely by month-end

Congress leaders of Andhra Pradesh are expecting their party high command to end the procrastination over the Telangana issue and announce a roadmap for the future, most likely before the end of October. 

A highly-placed source with access to the thinking of top Congress leaders said the high command was in no mood to delay its decision since it had completed comprehensive consultations with senior party men from both regions. Even on Tuesday, a senior AICC functionary indicated to a State party leader who called on him in New Delhi that the Congress leadership might take another ten days to announce its decision. 

All the inputs needed for taking a well-reasoned decision were available with the members of the Congress Core Committee and other Central leaders in the government after their interactions earlier this month with Governor E.S.L. Narasimhan, Chief Minister N. Kiran Kumar Reddy, all the Union Ministers from Andhra Pradesh, party MPs, and other key leaders from both regions. 

The sources said the high command was convinced that nothing new would come out of further consultations and it was time to end the prevailing uncertainty by restoring the focus on development instead of allowing divisive tendencies to gain an upper hand. 

But the sources could not indicate the Centre's mind -- whether it was in favour of separate Telangana or to keep the State united. However, the constitution of a second State Reorganisation Commission (SRC) or carving out Rayala-Telangana which would include Kurnool and Anantapur were not among the options under any serious consideration. 

Signals
 
The signals emanating from New Delhi are that the issue would be placed before the Congress Working Committee (CWC) before making any announcement to ensure that the wisdom of a wider body was available and to deflect likely criticism that a small group of leaders had taken the decision
.
Once the announcement was made, the Congress leadership would brook no dissent from within. There was every likelihood of trouble on the law and order front, but the State government would be expected to firmly handle any situation arising out of the announcement, the sources said. 



Read more...

Schools reopen, coal miners back to work in Telangana

Schools were reopened in twin cities after long holidays on Tuesday in Hyderabad. Photo: Mohammed Yousuf
  Schools were reopened in twin cities after long holidays on Tuesday in Hyderabad. 
 
Schools across the Telangana region reopened and thousands of coal mine workers resumed work on Tuesday, calling off their agitation even as the general strike called by the Telangana Joint Action Committee (T-JAC) entered its 36th day. 

About 52 lakh students and two lakh teachers were back at school in about 40,000 institutions, both government and private, in the region. 

In the Singareni Collieries, 1.5 lakh miners reported to work in shifts and daily production is expected to reach the normal capacity of 1.5 lakh tonnes soon. This will considerably ease the power situation with thermal generation showing signs of improvement. 

With the A.P. State Road Transport Corporation operating full-fledged services since Saturday, the impact of the strike has largely eased, paving way for restoration of a semblance of normality in the beleaguered region. 

After the breakthrough achieved by the government in persuading bus crew, coal miners and school managements, several other unions have fallen in line.

On Tuesday, Social Welfare residential school teachers and members of the Telangana Government Junior Lecturers' Association withdrew their agitation after talks with Social Welfare and Education Ministers Pithani Satyanarayana and K. Parthasarathy respectively. 

They assured the government that they would report for duty from Wednesday and work on holidays to compensate for the loss of 17 days. The government also agreed to consider their various service-related issues. 

TEJAC to continue stir
 
However, the Telangana Employees Joint Action Committee (TEJAC), which works in close coordination with the political JAC led by M. Kodandaram of the Telangana Rashtra Samiti, has stuck to its stand to continue with the strike until a road map for a separate State is announced. 

The Secretariat Telangana Employees Association also continued its protest. It deplored Congress MLAs and Ministers for not showing the resolve to continue the agitation after seeking the employees' support for the general strike. The employees had been agitating to reflect the aspirations of the Telangana people, and not for personal goals, at risk of disciplinary action, the association said. 

Its president Narender Rao said different unions, which suspended their strike, would join the movement later, if necessary.



Take By:  The Hindu


Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, Tags: bandh in Telanagana, schools closed, TRS, Banswada, TRS win Banswada,
Telangana issue, separate statehood, Telangana JAC, school reopen

Read more...

తెలంగాణ కాంగ్రెస్ విశ్వాస ఘాతుకమే

- స్వరాష్ట్ర సాధనలో మొదటినుంచీ నేతలది మోసపూరిత వైఖరే
- సకల జనం సమ్మెలో ఉంటే సర్కారుకు సన్నాయి ఊదే మంత్రులు
- అక్రమ అరెస్టులతో నిర్బంధకాండ సాగుతున్నా నోరు మెదపని వైనం
- టీ కాంగ్రెస్‌పై నిప్పులు చెరుగుతున్న తెలంగాణవాదులు
- కాంక్షిగెస్‌కో ఖతం కరో నినాదమే ఈ గడ్డపై ఇక పిక్కటిల్లాలని నిర్ణయం


tcongrash-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, అక్టోబర్ 18 :కాలమేదైతేనేం.. ద్రోహ చింతనే నరనరాన సర్రున కదులుతున్నపుడు! కాలమేదైతేనేం.. కొత్త బాట వేసుకొని ముందుకు సాగిపోతున్నవారితో కలిసిరాక బాటనిండా జిల్లేళ్లు చల్లాలనుకున్నపుడు! కాలమేదైతేనేం.. కరవాలాలను ఇచ్చి కదనరంగాన చెలరేగమన్నపుడు ఆ కాలాన్నే వెన్నుపోటు పొడవాలనుకున్నపుడు!! ఉద్యమాల కాలం విలువ తెలియని ఇలాంటి వారిని ఏమంటారు? ద్రోహులంటారు.. వారిని తెలంగాణ కాంగ్రెస్ నాయకులంటారు.. అని 36 రోజులుగా సకల జనుల సమ్మెలో కదం తొక్కుతున్న సబ్బండ వర్ణాలు ఇప్పుడు నినదిస్తున్నాయి. తెలంగాణ సాధన కోసం ఒక్క తాటిపైకి రాలేని తెలంగాణ కాంగ్రెస్ నాయకులను అన్ని వర్గాలు ఛీత్కరిస్తున్నాయి. నిజానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మొదటి నుంచీ ద్రోహ బుద్ధ్దితోనే వ్యవహరిస్తున్నారు. ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులతోపాటు వేర్వేరు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు సకల జనుల సమ్మె ప్రారంభించిన సమయంలో కాంగ్రెస్ నేతలు కూడా తమతో కలిసి వస్తారని వారు విశ్వసించారు. కానీ, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వారి నమ్మకాన్ని వమ్ము చేశారని, విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే, కాంగ్రెస్‌కో ఖతం కరో అనే నినాదంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. దీంతో గుబులు రేగిన తెలంగాణ కాంగ్రెస్ తమ వరకు తాము సంఘటితంగా ఉన్నామని చాటుకునేందుకు ఆదరాబాదరగా మంగళవారం సాయంత్రం ఎంపీ కె. కేశవరావు నివాసంలో స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. మరోసారి అభాసుపాలయ్యారు. నిర్ధిష్టమైన కార్యాచరణకు పూనుకోకుండానే వారు ఆ సమావేశాన్ని తూతూ మంత్రంగా ముగించారు. తెలంగాణ ప్రజలను మోసం చేసే విధంగానే ఈ సమావేశం కూడా కొనసాగింది. అంది వచ్చిన అవకాశాలను కనీసం ఉపయోగించుకునే ప్రయత్నం చేయకుండా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అవకాశవాదంతో, డోలాయమానంతో వ్యవహరిస్తూ ఉద్యమానికి చేయూతనివ్వకపోగా స్వార్థానికే ప్రతీ కార్యక్షికమాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారని వారిపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు.

పదవీ రాజకీయాల కోసం అప్పటి పీసీసీ అధ్యక్షుడు వై.ఎస్.రాజశేఖర్‌డ్డి అనుమతి తీసుకుని, ఆయన తోడ్పాటును స్వీకరించిన తరువాతే నాడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఉద్యమమంటూ సోనియా గాంధీకి మహజర్లు సమర్పించారని, ఆనాటి నుంచి నేటి వరకు వారికి పదవీకాంక్ష తప్ప తెలంగాణ పోరుపై శ్రద్ధ కనిపించటం లేదని తెలంగాణవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరాయి నేత కోసమే అధిక సీట్లను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ఆడిన నాటకంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెలంగాణవాదం వినిపించారు తప్పితే సొంతగడ్డలో పరాయి పాలనతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పట్టించుకునే పాపానికి పోలేదని తెలంగాణవాదులు విమర్శిస్తున్నారు. అయితే, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆమరణ దీక్ష తరువాత ఏర్పడిన పరిస్థితుల్లో తెలంగాణకు అనుకూలంగా కేంద్రం చేసిన ప్రకటన నేపథ్యంలో మరింత సంఘటితంగా ఉద్యమించి ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా వ్యవహరించాల్సిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అవకాశవాదంతోనే పనిచేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఆ తరువాత సీనియర్ మంత్రి జానాడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో తెలంగాణ రాజకీయ జేఏసీ ఆవిర్భమైంది. డిసెంబర్ 9 ప్రకటన తరువాత కొందరు తెలంగాణ కాంగ్రెస్ నేతలు హడావిడిగా కనిపించినా మళ్లీ వారే జేఏసీ నుంచి డిసెంబర్ 23న బయటపడ్డారు.

ఆ తరువాత జేఏసీలో టీఆర్‌ఎస్ క్రియాశీలక పాత్రను పోషిస్తూ ఇతర పార్టీలను కలుపుకొని ఉద్యమ నిర్మాణం చేస్తున్నా కాంగ్రెస్ నేతలు ప్రేక్షకపావూతనే వహిస్తూ వస్తున్నారని, నిర్మాణాత్మక పాత్రను పోషించటం లేదని తెలంగాణవాదులు దుయ్యబడుతున్నారు. కేసీఆర్ దీక్ష తరువాత కేంద్రంలో పూర్తి అనుకూల వాతావరణం ఏర్పడింది. దీనిని ప్రతికూలంగా మార్చేందుకు సీమాంధ్ర నేతలు రాజీనామాల డ్రామా ఆడారు. సమైక్యాంధ్ర పేరిట కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించారు. అంతే స్థాయిలో ప్రతిఘటించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కనీసమావూతంగా కూడా ప్రయత్నించలేదని, నాడు వారి వైఖరి సమర్థనీయంగా లేదని తెలంగాణవాదులు అభివూపాయపడుతున్నారు. ప్రభుత్వపరంగా తెలంగాణకు వ్యతిరేకంగా చర్యలు కనిపిస్తున్నా ముఖ్యమంవూతుల మెప్పు కోసం తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు పాకులాడుతున్నారు తప్పితే ఇప్పటివరకు వారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చటానికి తగిన కార్యాచరణను అమలు చేయలేదని వారంటున్నారు. సీమాం ధ్ర నాయకుల వైఖరికి నిరసనగా వందల సంఖ్యలో యువకులు, విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు భీషణ ప్రతిజ్ఞలు మాత్రం చేశారు. శవాలపై ప్రతినలు చేస్తూ తెలంగాణ కోసం అవిక్షిశాంత పోరాటం చేస్తామని, తెలంగాణ సాధ నే తమ లక్ష్యమని బీరాలు పోయారు. పోరుగడ్డ ఉస్మానియా వర్సిటీకి వెళ్లి విద్యార్థులతో చర్చలు జరిపి మేమే పోరాడుతాం అని చెప్పారు తప్పితే చేతల్లో మాత్రం ఏమీ చేయలేదు.

పిండ ప్రదానాల తరువాతే...
తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా కళ్లు తెరవని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు, మంత్రులకు వ్యతిరేకంగా ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు పిండ ప్రదానాలు చేసి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేసిన తరువాతే తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కదలిక వచ్చింది. ఇక మేమూ పోరాడుతామంటూ జనంలోకి వచ్చారు తప్పితే అప్పటివరకు తెలంగాణ జిల్లాల్లో పర్యటించే సాహసం కూడా చేయలేకపోయారు. ప్రజల ఒత్తిడికి తలొగ్గారు తప్పితే చిత్తశుద్ధి కనిపించలేదని, సొంత నియోజకవర్గాల్లో పర్యటించాలంటే జై తెలంగాణ అనక తప్పదని భావించే వారు డ్రామాలాడారని తెలంగాణవాదులు అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ప్రజల్లో మొదటి నుంచీ అనుమానాలున్నాయి. చివరకు తెలంగాణ మేధావి ప్రొఫెసర్ జయశంకర్ అంత్యక్షికియల్లోనూ టీ కాంగ్రెస్ నేతలను పాలు పంచుకోనివ్వకుండా తెలంగాణవాదులు అడ్డుకున్నారు. వారిపై అనుమానాలకు ఇది పరాకాష్టగా చెప్పుకోవచ్చని తెలంగాణవాదులు అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల నమ్మకవూదోహం తెలిసినందునే తెలంగాణవాదులు వారిపట్ల మొదటి నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సకల జనుల సమ్మె ప్రారంభిస్తూ ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులు తెలంగాణ సమాజం అంతా కాంగ్రెస్ మంత్రులు, నాయకుల నుంచి కొద్దిపాటి విశ్వాసాన్ని ఆశించారు. అత్యద్భుతంగా సాగుతున్న సకల జనుల సమ్మెలో తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, శాసనసభ్యులు కూడా పాల్గొని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఒప్పించి తెలంగాణను సాధిస్తారని, రాజకీయంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా కదులుతారని భావించినట్టు తెలంగాణవాదులు పేర్కొంటున్నారు.

అయితే, అందరి ఆశలపై నీళ్లు చల్లి సకల జనుల సమ్మె పెద్ద ఎత్తున జరిగినా కాంగ్రెస్ నేతలు అందులో భాగస్వాములు కాకుండా నమ్మకవూదోహం చేశారని తెలంగాణవాదులు నిరసిస్తున్నారు. పైగా సమ్మె వాయిదా వేసుకోవాలని సీనియర్ మంత్రి జానాడ్డి చెప్పటాన్ని కూడా తెలంగాణవాదులు సహించలేకపోయారు. తెలంగాణ జిల్లాల్లో జానాడ్డి దిష్టిబొమ్మలను దహనం చేయటంతోపాటు పిండ ప్రదానాలు చేశారు. తెలంగాణ సమాజం మొత్తంగా కాంగ్రెస్ మంత్రుల వైఖరిని తీవ్రస్థాయిలో దుయ్యబట్టింది. ఉద్యమిస్తున్న ఉద్యోగులు, టీచర్లను ఇబ్బందులకు గురి చేసేలా జీవోలు జారీ చేస్తుంటే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు కనీసం ఖండించలేదు. పైగా మంత్రివర్గంలో ఉండి తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్ర సర్కార్ తీసుకున్న నిర్ణయాల్లో పాలు పంచుకోవటాన్ని తెలంగాణవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా కొన్ని కార్మిక సంఘాలు, మరికొన్ని టీచర్ల సంఘాలు తమ సమ్మెను వాయిదా వేసుకుని కార్యాచరణ ప్రకటించినా, తెలంగాణ సమాజాన్ని ఉత్తేజ పరిచేలా ఈ పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ మంత్రులు, నాయకులు తగిన వ్యూహాన్ని, ప్రణాళికను రూపొందించలేకపోయారు. టీ కాంగ్రెస్ మంత్రుల శషబిషలు అర్థం చేసుకున్న తెలంగాణ సమాజం ద్రోహులను నమ్మకూడదని, అందుకే కాంగ్రెస్‌కో ఖతం కరో అన్న నినాదంతో భావి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం జరిగిన తెలంగాణ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ సమావేశం కొండంత రాగం తీసి ఏదో చేసినట్టు సాగింది.

కాగా, కొందరు తెలంగాణ ఎంపీలు టీఆర్‌ఎస్‌లో చేరుతారని వచ్చిన వార్తలను తీవ్రస్థాయిలో ఖండించేందుకు తమ ఉక్రోషాన్ని వెళ్లగక్కారు తప్పితే అసలు లక్ష్యం గురించి ఈ సమావేశంలో చర్చించలేదు. తమలోనే కొందరు తెలంగాణ ద్రోహులున్నారని స్వయంగా సీనియర్ నేత కే.కేశవరావు చెప్పటం గమనార్హం. కనీస నిబద్ధత లేని తెలంగాణ కాంగ్రెస్ నేతల వల్ల ప్రయోజనం లేదని, అందుకే కాంగ్రెస్‌ను ఖతం చేయటమే లక్ష్యంగా పనిచేస్తేనే అధిష్ఠానానికి సెగ పుడుతుందని తెలంగాణవాదులు భావిస్తున్నారు. సొంత ఎంపీలు, ఎమ్మెల్యేలను ఇతర పార్టీల నేతలను అరెస్టులు చేసినా పట్టించుకోని తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు పైరవీల కోసం పదవులను అంటి పెట్టుకుని ఉన్నారని, తెలంగాణ కాంగ్రెస్ మోసకారితనాన్ని బట్టబయలు చేసి ఆ పార్టీలోని నమ్మకవూదోహులకు తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు.

రాజీనామా చేయండి లేదా మాలో కలవండి:కాంగ్రెస్ నేతలకు హిజ్రాల సూచన
ఖమ్మం: ఖమ్మంలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో హిజ్రాలు బొట్టుబోనాలతో ప్రదర్శన నిర్వహించారు. టీ కాంగ్రెస్ నేతలు రాజీనామా చేయాలని, ముఖ్యంగా జిల్లాకు చెందిన డిప్యూటీ స్పీకర్ బట్టి విక్రమార్క వెంటనే రాజీనామా చేయాలని లేకపోతే చీరకట్టుకొని తమలో కలవాలని సూచించారు. నీటిపారుదల శాఖ ఉద్యోగులు దీక్ష ే పట్టారు. ‘రామయ్య మా తెలంగాణ మాకిప్పించవయ్యా’ అంటూ జేఏసీ నాయకులు భద్రాచలంలోని గోదావరి నదిలో మునిగి నిరసన వ్యక్తం చేశారు. మధి, బోనకల్లు, పాల్వంచలో సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో, కొత్తగూడెం, పాల్వంచలో దీక్షలు, కల్లూరు, జేఏసీ ఆధ్వర్యంలో ధూంధాం, కామేపల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో, కొత్తగూడెంలో సీమాంధ్ర భూతాన్ని తరిముకుంటూ నిరసన ప్రదర్శన నిర్వహించారు.

Take By: T News


Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, Tags: bandh in Telanagana, schools closed, TRS, Banswada, TRS win Banswada,
 

Read more...

విరమణ కాదు.. రూపం మార్పు సమ్మె కొనసాగుతుంది

- జాక్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టీకరణ
- స్వాతంత్య్ర సమరం,విప్లవాల్లోనూ ఎన్నో రూపాలు
- తెలంగాణ ప్రజలపై ప్రభుత్వం వివక్ష
- రెండో శ్రేణి పౌరులుగా పరిగణిస్తోంది
- అణచివేత కాంగ్రెస్‌పై ఉద్యమిస్తాం
- నేడు మద్యం దుకాణాలు బంద్


kodanda-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, అక్టోబర్ 18 :తెలంగాణ కోసం వివిధ వర్గాల ప్రజలు రకరకాలుగా ఉద్యమిస్తున్నారని, సమ్మె విరమణ మాటే లేదని, రూపం మాత్రమే మారుతుంటుందని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలను రెండో శ్రేణి పౌరులుగా పరిగణిస్తున్నదని ఆయన ఆరోపించారు. తెలంగాణకోసం సమ్మెకు దిగినవారిపై పోలీసుల లాఠీచార్జీలు, దాడులతో కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశం తేటతెల్లమైందని చెప్పారు. ఇకనుంచి తెలంగాణ వ్యతిరేకి కాంగ్రెస్‌పైనే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. మంగళవారం ఆయన ఉద్యోగ సంఘాల జేఏసీ సెక్రటరీ జనరల్ శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘‘ప్రజలు వ్యతిరేకిస్తున్నందునే సమ్మె విరమించారా..? అందుకే ఒక్కో సంఘం సమ్మె నుంచి జారిపోతున్నదా..?’’ అంటూ విలేకరులు ప్రశ్నించగా సమాధానమిచ్చారు.

‘‘తెలంగాణకోసం సకల జనుల సమ్మె కొనసాగుతుంది. ఉద్యమంలో అనేకులు చేరారు. కొన్ని సంఘాలు సమ్మె విరమిస్తే, ఉద్యమం నుంచి ఆ సంఘాలు వెళ్లిపోతున్నాయని మీడియా చిత్రీకరించడం సరికాదు. సమ్మె రూపం మార్చుకున్నాం. అనేక మార్పులు, చేర్పులు చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తాం. ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు అందరూ సహకరిస్తున్నారు. ప్రజలు వ్యతిరేకించినందునే సమ్మె విరమించామన్న వార్తలు అవాస్తవం. ఇకనుంచి ఉద్యమం అవసరాన్ని బట్టి, పరిస్థితులనుబట్టి అనేక రూపాల్లో కొనసాగుతుంది. అణచివేయాలనుకుంటున్న కాంగ్రెస్‌పై ఉద్యమిస్తాం’’ అని తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కూడా అనేక మార్పులు జరిగాయన్న సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. సహాయ నిరాకరణ నుంచి నాటి ఉద్యమం అనేక రూపాలు మార్చుకున్నదన్నారు. అదే విధంగా ఫ్రెంచ్, రష్యా విప్లవాల్లోనూ అనేక రూపాలు మారాయని తెలిపారు. సమ్మె విషయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీలతో చర్చించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. తెలంగాణ కోసం మద్యం దుకాణాలను ఒకరోజు బంద్ చేస్తామని మద్యం దుకాణాల సంక్షేమ సంఘం ప్రకటించడాన్ని ఆయన స్వాగతించారు. మద్యం దుకాణాల బంద్‌కు సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు.

ఎకె్సైజ్ సిబ్బంది సమ్మెలో ఉండడంతో మద్యం దుకాణాలు సరఫరా చేయకున్నా.. రెంట్ వసూలు చేయడాన్ని ఆయన ఖండించారు. అధికారుల సూచన మేరకు వేరే జిల్లాల నుంచి మద్యం తీసుకునేందుకు వెళ్లిన దుకాణాల వారిని అక్కడి వారు పరాయివారిగా చూశారని ఆయన తెలిపారు. తెలంగాణ కోరుతూ శాంతియుతంగా ఉద్యమం చేస్తే రాజవూదోహం, దేశవూదోహం కేసులు పెడ్తారా అని ఉద్యోగ సంఘాల జేఏసీ సెక్రటరీ జనరల్ శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పదవులకు రాజీనామా చేయకున్నా తెలంగాణ ఉద్యమాన్ని కాపాడుతారని ఆశించామని, అయితే వారు మోసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నేడు మద్యం దుకాణాలు బంద్
తెలంగాణ సాధనలో భాగంగా బుధవారం ఒకరోజు మద్యం దుకాణాలు మూసివేస్తున్నామని తెలంగాణ మద్యం దుకాణాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు దామోదర్‌గౌడ్ తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్షతో పోతే మళ్ళీరాని ప్రాణాలను 700 మంది త్యాగం చేశారని ఆయన ఆవేదన చెందారు. అంతటి త్యాగాలు సాగినచోట- డబ్బు పోయినా సంపాదించగలమన్న భావంతో తాము ఒక రోజు దుకాణాలను మూసివేస్తున్నామని తెలిపారు. తెలంగాణవ్యాప్తంగా అందరూ బుధవారం దుకాణాలను మూసివేయాలని ఆయన కోరారు.

Take By: T News


Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, Tags: bandh in Telanagana, schools closed, TRS, Banswada, TRS win Banswada,



Read more...

గమ్యం లేదు.. గమనం లేదు ..అన్నీ కోతలే

- మాటల కోతలే తప్ప ఏదీ తేల్చని నేతలు
- జానాడ్డి మార్కు ప్రసంగంతో విసుగు
- ఆషామాషీగా ముగిసిన టీ కాంగ్రెస్ స్టీరింగ్ సమావేశం
- జానా తీరుపై ఎంపీల ఫైర్.. గంటన్నరకు పైగా క్లాస్
- తెలంగాణకోసం నేను త్యాగాలు చేశాను..
- సుదీర్ఘంగా వివరణ ఇచ్చుకున్న జానా
- జానా మాటలకు సంతృప్తి చెందని ఎంపీలు
- తెలంగాణ ఇవ్వకపోతే ఫోరంగా ఏర్పడాలి
- 3 రోజుల్లో జరిగే సమావేశంలో తుది నిర్ణయం

888-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
హైదరాబాద్, అక్టోబర్ 18 : కాంగ్రెస్ కో ఖతం కరో... తెలంగాణ హాసిల్ కరో అని జేఏసీ స్టీరింగ్ కమిటీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో మంగళవారం జరిగిన తెలంగాణ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ సమావేశం ఆషామాషీగా కొనసాగినట్టు తెలిసింది. ఒక ప్రణాళిక లేకుండా, ఎజెండా లేకుండా ఈ సమావేశంలో అయిదు గంటలపాటు చర్చలు కొనసాగించారు. చివరికి ఏమీ తేల్చలేదు. ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం, తెలంగాణ కాంగ్రెస్ కూడా తెలంగాణ కోసం నిలబడ్తుందని ప్రగల్భాలు పలికి ఏర్పాటు చేసిన సమావేశంలో చర్చనంతా తెలంగాణ మంత్రులు ఉద్యమంలో కలిసి రాకపోవడంపై కేంద్రీకరించినట్టు తెలిసింది. ఒక దశలో జానాడ్డి, ముందు కాంగ్రెస్ ఎంపీలందరూ రాజీనామా చేస్తే, తాను ప్రచారం చేస్తానని అన్నట్టు తెలిసింది. అదే సమయంలో మంత్రుపూవరూ తనతో కలిసి రావడంలేదని, ఈ పరిస్థితుల్లో తాను ఒక్కణ్ని ఏంచేయగలనని అన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

సమావేశంలో ఎలాంటి ప్రణాళికాబద్ధమైన, సీరియస్ చర్చ జరగకున్నప్పటికీ, బయట పరువు నిలబెట్టుకోవడానికి, జానాడ్డి, కేకే, మధుయాష్కీలు మాత్రమే స్టీరింగ్ కమిటీ తరఫున విలేకరులతో మాట్లాడారు. ఈ విలేకరుల సమావేశంలో గంభీరంగా, ఒక్కముక్కా నేరుగా అర్థంకాకుండా మాట్లాడిన జానాడ్డి మాటలు కానీ, చివరగా, కేంద్రంనుంచి ఫీలర్లూ ఉన్నాయని మాట్లాడిన మాటలుకానీ ఉత్తరకుమార ప్రగల్భాలే అని అంతా ఉత్తమాటలని ఆ పార్టీ వర్గాలే తెలిపాయి. కొసమెరుపు ఏమిటంటే, లోపల జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోకపోవడం, ఫుజూల్‌గా అయిదు గంటలు రానీపోనీ చర్చ జరగడం, కాంగ్రెస్‌లో తెలంగాణ ద్రోహులు ఉన్నారని జేఏసీ అనడం సబబుకాదని ఖండించిన స్టీరింగ్ కమిటీ, అందుకు దీటుగా ఒక కార్యక్షికమం ప్రకటించకపోవడం. ఈ ప్రక్రియ అంతా ప్రహసనంగా, వృథా ప్రయాసగా తేలిపోయిందని ఆ పార్టీ వర్గాలే వ్యాఖ్యానించాయి.

తెలంగాణ సాధన ఉద్యమ భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసిన ఈ సమావేశం స్టీరింగ్ కమిటీ ఛైర్మన్, సీనియర్ మంత్రి జానాడ్డికి వేదికగా అందివచ్చింది. ఆయన సమావేశంలో, బయట మీడియాకు తెలంగాణ ఉద్యమంలో తనపై వస్తున్న విమర్శలు, ఆరోపణలకు వివరణ ఇచ్చుకున్నారు. ఉధృతంగా సాగుతున్న సకలజనుల సమ్మె, సొంత పార్టీతో సహా ఇతర పార్టీల ప్రజావూపతినిధులపై కిరణ్ సర్కార్ కేసులు నమోదు చేయడం, తెలంగాణ రాజకీయ ఐకాస కాంగ్రెస్‌నే టార్గెట్ చేస్తూ ఇక ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని పిలుపునివ్వడం, తెలంగాణ ప్రాంత టీ కాంగ్రెస్ ప్రజావూపతినిధులు, మంత్రులు రాజీనామాలు చేయాలంటూ ఇతర పక్షాల నుంచి ఒత్తిడి తీవ్రం కావడం వంటి పరిణామాల నేపథ్యంలో ఎంతో మేధోమథనం జరగాల్సిన సమావేశం ఆషామాషీగా ముగిసిపోయింది.

ఒక నిర్ణయానికి వచ్చామని, ఆ నిర్ణయాన్ని అమలుచేయడానికి కొన్ని గంటల సమయం కావాలని, ఢిల్లీ నుంచి తెలంగాణపై కొన్ని సంకేతాలు వస్తున్నాయంటూ రాజ్యసభ సభ్యుడు, స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ కే కేశవరావు ప్రకటించినప్పటికీ అలాంటిదేమీ లేదని తెలుస్తోంది. రాజీనామాల విషయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు మంత్రి జానాడ్డితో వాగ్వాదాలకు దిగారు. టీ కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాలు ఆమోదించుకుని వస్తేనే తాను మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తానని, ఎన్నికల్లో ఎంపీల తరఫున ప్రచారం చేసి వారిని గెలిపించుకొస్తానని జానా చేసిన వ్యాఖ్యలపై ఎంపీలు మండిపడినట్లు తెలిసింది. ప్రజల దృష్టిలో తెలంగాణకు ద్రోహం చేస్తున్నట్లు ప్రచారమవుతున్న జానా తమను గెలిపించడమేమిటి? ప్రచారానికి వస్తే జానా ముఖం చూసి ఓట్లు వేసేది ఎవరు? అని ఎంపీలు కొందరు జానా వ్యాఖ్యలపై కస్సుబుస్సుమన్నారు.

మంగళవారం సాయంత్రం కేకే నివాసంలో జరిగిన టీ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ సమావేశానికి ఎంపీలు కేకేతో పాటు గుత్తా సుఖేందర్‌డ్డి, మందా జగన్నాథం, బలరాం నాయక్, సిరిసిల్ల రాజయ్య, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, వివేక్, కోమటిడ్డి రాజగోపాల్‌డ్డి, మంత్రి జానాడ్డి, ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, కోమటిడ్డి వెంకట్‌డ్డి, చిరుమర్తి లింగయ్య, టీ రాజయ్య, నర్సాడ్డి, ఎమ్మెల్సీలు కే యాదవడ్డి, ఆమోస్, పీసీసీ అధికార ప్రతినిధి బీ కమలాకర్‌రావు, మాజీ ఎంపీ ఇంద్రకరణ్‌డ్డి, డాక్టర్ శ్రీధర్‌డ్డి తదితరులు హాజరయ్యారు. కమిటీ కన్వీనర్‌గా ఉన్న మంత్రి బస్వరాజు సారయ్యతో పాటు సభ్యులుగా ఉన్న మరికొందరు ఎమ్మెల్యేలు ఏ కారణంవల్లనోగానీ ఈ సమావేశానికి హాజరుకాలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సమావేశం ప్రారంభం కాగానే ఎంపీలు అందరు కలిసి మూకుమ్మడిగా మంత్రి జానాడ్డిపై మాటల దాడి ప్రారంభించారు.

ఇటీవలి కాలంలొ టీ కాంగ్రెస్ ఉద్యమంలో జానా పాత్ర, ఆయన వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీలు నిప్పులు చెరిగారు. నోటికొచ్చిన మాటలతో ఆయన్ని గట్టిగా నిలదీశారు. తామంతా ఎంపీ పదవులకు రాజీనామాలు చేస్తే రాష్ట్ర మంత్రివర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ మంత్రిగా రాజీనామా ఎందుకు చేయడం లేదు? అంతేకాకుండా సకలజనుల సమ్మె విరమించాలని కోరుతారా? అని జానాపై నిప్పులు చెరిగారు. రైల్‌రోకో సందర్భంగా టీ ఎంపీలపై తప్పుడు కేసులు, నాన్‌బెయిలబుల్ కేసులు బనాయించి జైళ్ళకు తరలిస్తే టీ మంత్రులు ఏం చేస్తున్నారు? కేసులు పెట్టకుండా సీఎం వద్ద అడ్డుకునే ప్రయత్నాలు ఎందుకు చేయలేదు? టీ మంత్రులకు సీఎం ఏ మాత్రమైనా విలువ ఇస్తున్నాడా? అలాంటప్పుడు మంత్రివర్గంలో ఉండటం కన్నా బయటికి వచ్చి మాతో కలిసి ఉద్యమంలో పాల్గొనవచ్చు కదా? అని ఎంపీలు జానాపై నిప్పులు చెరిగారు. తెలంగాణలోని తాజా పరిణామాలు, టీ కాంగ్రెస్ మంత్రుల వ్యవహారంపై ఎంపీలు సుమారు గంటన్నరకు పైగా జానాకు గట్టి క్లాస్ తీసుకున్నారు.

ఎంపీల మాటల దాడికి గురయిన జానా ఆ తరువాత గంటన్నరపాటు ఎంపీలకు వివరణ ఇచ్చుకున్నారు. మంత్రిగా ఉంటూ తాను తెలంగాణ కోసం చేసిన త్యాగాలు, అనుసరించిన విధానాలను ఎంపీలకు వివరించి తాను ఉద్యమంలో ఏ మాత్రం వెనకడుగు వేయలేదని, అందరి కంటే అగ్రభాగానే ఉన్నానని తెలియజేసేందుకు ప్రయత్నించారు. జానా చెప్పినదంతా విన్న ఎంపీలు చేసిన కృషికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, అయితే దానికి ఎలాంటి ఫలితం లేపోవడంతో బయటికి వచ్చి తమతో కలిసి పోరాడాలని సూచించారు. దీనిపై జానా స్పందిస్తూ తన వెంట రాజీనామాల కోసం టీ మంత్రులు ఎవరూ కూడా రావడం లేదని, స్టీరింగ్ కమిటీ సమావేశానికి రావాలని కన్వీనర్ సారయ్యను కోరినా అతను రాలేదని నిస్సహాయతను వ్యక్తం చేశారు. ‘నేను టీ మంత్రుల వద్దకు వెళ్ళి రాజీనామా అడగను. నా రాజీనామాతో తెలంగాణ వస్తది అనుకుంటే ఇప్పుడే ఇచ్చేస్తా.

తెలంగాణ కోసం పార్టీకి రాజీనామా చేస్తా. కావాలంటే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా’ అని జానా అన్నారు. ఇందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు కలగజేసుకుంటూ మీరు పార్టీని వదలవద్దు, మీరు మా నాయకులు, రాజకీయాల నుంచి రిటైర్డ్ కాకుండానే తెలంగాణ కోసం పోరాడాలి అని జానాను కోరారు. తొలుత మీరు రాజీనామాలు ఆమోదించుకుని రండి, ఆ తరువాత మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను, ప్రజల్లో కలిసి తిరుగుదాం, ఎన్నికలొస్తే మీకు మద్దతుగా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసే గెలిపిస్తానని జానా చెప్పడం ఎంపీలకు ఎంతమాత్రం రుచించలేదు. అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమయింది. ఆ వెంటనే ఒక ఎంపీ జోక్యం చేసుకుంటూ మేము ఇప్పటికే రాజీనామాలు చేశాం, మీరు రాజీనామా సమర్పించండి, మేము ఆమోదించుకుంటాం, ఆ తరువాత మీరు ఆమోదించుకోండి అని జానాకు సవాలు విసిరారు.
రాజీనామాలు నువ్వు చెయ్, నువ్వు చెయ్, ఢీ అంటే ఢీ అనే రీతిలో ఎంపీలు, జానా మధ్య సంభాషణ జరిగింది. దీంతో సమావేశం ఒక్క సారిగా వేడెక్కింది. ఎంపీలు జానాపై మండిపడటం, ఒక్క సారిగా సమావేశం వేడెక్కడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీలులేని పరిస్థితుల్లో మూడు, నాలుగు రోజుల తరువాత మరోసారి భేటీ అయి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించాలని స్టీరింగ్ కమిటీ నేతలు నిర్ణయించుకున్నారు.

తొమ్మది మంది ఎంపీలు, కనీసం నలుగురు మంత్రులు, పదిహేను మంది ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 25 నుంచి 30 మంది వరకు రాజీనామాలు చేస్తే అధిష్ఠానం, కేంద్రం దిగివస్తుందని, లేకపోతే ఒకరిద్దరు రాజీనామాల వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని ఈ సమావేశం చివర్లో నేతలు అభివూపాయానికి వచ్చారు. మీరు ఒక్కరు రాజీనామా చేస్తే మరి కొందరు మంత్రులు మీతో కలిసి వచ్చే పరిస్థితులు ఉంటాయని ఎంపీలు జానాడ్డికి సూచించారు. జానా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండటంతో తెలంగాణపై గట్టిగా ఉన్న మరో ముగ్గురు మంత్రులు గీతాడ్డి, బస్వరాజు సారయ్య, శ్రీధర్‌బాబులను కూడా రాజీనామాలకు ఒప్పించాలని ఎంపీలు నిర్ణయించారు.

జానా మాట్లాడుతున్నప్పుడు ముఖం చాటేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలు

టీ స్టీరింగ్ కమిటీ సమావేశం అనంతరం మంత్రి జానాడ్డి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఎంపీలు పొన్నం ప్రభాకర్, కోమటిడ్డి రాజగోపాల్‌డ్డి, సిరిసిల్ల రాజయ్య ముఖం చాటేసి వెళ్ళిపోయారు. పొన్నంను పేరుపెట్టి పిలిచినా కూడా ఆయన అటువైపు రాకుండా వెళ్ళిపోయారు. అదే విధంగా ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, టీ రాజయ్య కూడా జానా మాట్లాడుతున్నప్పుడు ఆయన వెంట నిలబడేందుకు ఏమాత్రం ఇష్టంలేక బయటికి వచ్చేశారు. జానాడ్డి అధిక ప్రసంగంతో విసిగిపోయి ప్రెస్ కాన్ఫెన్స్ మధ్యలోనుంచే కోమటిడ్డి వెంకట్‌డ్డి, ఎమ్మెల్సీ యాదవడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నిష్ర్క మించారు. 


Take By: T News


Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, Tags: bandh in Telanagana, schools closed, TRS, Banswada, TRS win Banswada,
 


Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP