గమ్యం లేదు.. గమనం లేదు ..అన్నీ కోతలే
- మాటల కోతలే తప్ప ఏదీ తేల్చని నేతలు
- జానాడ్డి మార్కు ప్రసంగంతో విసుగు
- ఆషామాషీగా ముగిసిన టీ కాంగ్రెస్ స్టీరింగ్ సమావేశం
- జానా తీరుపై ఎంపీల ఫైర్.. గంటన్నరకు పైగా క్లాస్
- తెలంగాణకోసం నేను త్యాగాలు చేశాను..
- సుదీర్ఘంగా వివరణ ఇచ్చుకున్న జానా
- జానా మాటలకు సంతృప్తి చెందని ఎంపీలు
- తెలంగాణ ఇవ్వకపోతే ఫోరంగా ఏర్పడాలి
- 3 రోజుల్లో జరిగే సమావేశంలో తుది నిర్ణయం
హైదరాబాద్, అక్టోబర్ 18 : కాంగ్రెస్ కో ఖతం కరో... తెలంగాణ హాసిల్ కరో అని జేఏసీ స్టీరింగ్ కమిటీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో మంగళవారం జరిగిన తెలంగాణ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ సమావేశం ఆషామాషీగా కొనసాగినట్టు తెలిసింది. ఒక ప్రణాళిక లేకుండా, ఎజెండా లేకుండా ఈ సమావేశంలో అయిదు గంటలపాటు చర్చలు కొనసాగించారు. చివరికి ఏమీ తేల్చలేదు. ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం, తెలంగాణ కాంగ్రెస్ కూడా తెలంగాణ కోసం నిలబడ్తుందని ప్రగల్భాలు పలికి ఏర్పాటు చేసిన సమావేశంలో చర్చనంతా తెలంగాణ మంత్రులు ఉద్యమంలో కలిసి రాకపోవడంపై కేంద్రీకరించినట్టు తెలిసింది. ఒక దశలో జానాడ్డి, ముందు కాంగ్రెస్ ఎంపీలందరూ రాజీనామా చేస్తే, తాను ప్రచారం చేస్తానని అన్నట్టు తెలిసింది. అదే సమయంలో మంత్రుపూవరూ తనతో కలిసి రావడంలేదని, ఈ పరిస్థితుల్లో తాను ఒక్కణ్ని ఏంచేయగలనని అన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
సమావేశంలో ఎలాంటి ప్రణాళికాబద్ధమైన, సీరియస్ చర్చ జరగకున్నప్పటికీ, బయట పరువు నిలబెట్టుకోవడానికి, జానాడ్డి, కేకే, మధుయాష్కీలు మాత్రమే స్టీరింగ్ కమిటీ తరఫున విలేకరులతో మాట్లాడారు. ఈ విలేకరుల సమావేశంలో గంభీరంగా, ఒక్కముక్కా నేరుగా అర్థంకాకుండా మాట్లాడిన జానాడ్డి మాటలు కానీ, చివరగా, కేంద్రంనుంచి ఫీలర్లూ ఉన్నాయని మాట్లాడిన మాటలుకానీ ఉత్తరకుమార ప్రగల్భాలే అని అంతా ఉత్తమాటలని ఆ పార్టీ వర్గాలే తెలిపాయి. కొసమెరుపు ఏమిటంటే, లోపల జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోకపోవడం, ఫుజూల్‌గా అయిదు గంటలు రానీపోనీ చర్చ జరగడం, కాంగ్రెస్‌లో తెలంగాణ ద్రోహులు ఉన్నారని జేఏసీ అనడం సబబుకాదని ఖండించిన స్టీరింగ్ కమిటీ, అందుకు దీటుగా ఒక కార్యక్షికమం ప్రకటించకపోవడం. ఈ ప్రక్రియ అంతా ప్రహసనంగా, వృథా ప్రయాసగా తేలిపోయిందని ఆ పార్టీ వర్గాలే వ్యాఖ్యానించాయి.
తెలంగాణ సాధన ఉద్యమ భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసిన ఈ సమావేశం స్టీరింగ్ కమిటీ ఛైర్మన్, సీనియర్ మంత్రి జానాడ్డికి వేదికగా అందివచ్చింది. ఆయన సమావేశంలో, బయట మీడియాకు తెలంగాణ ఉద్యమంలో తనపై వస్తున్న విమర్శలు, ఆరోపణలకు వివరణ ఇచ్చుకున్నారు. ఉధృతంగా సాగుతున్న సకలజనుల సమ్మె, సొంత పార్టీతో సహా ఇతర పార్టీల ప్రజావూపతినిధులపై కిరణ్ సర్కార్ కేసులు నమోదు చేయడం, తెలంగాణ రాజకీయ ఐకాస కాంగ్రెస్‌నే టార్గెట్ చేస్తూ ఇక ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని పిలుపునివ్వడం, తెలంగాణ ప్రాంత టీ కాంగ్రెస్ ప్రజావూపతినిధులు, మంత్రులు రాజీనామాలు చేయాలంటూ ఇతర పక్షాల నుంచి ఒత్తిడి తీవ్రం కావడం వంటి పరిణామాల నేపథ్యంలో ఎంతో మేధోమథనం జరగాల్సిన సమావేశం ఆషామాషీగా ముగిసిపోయింది.
ఒక నిర్ణయానికి వచ్చామని, ఆ నిర్ణయాన్ని అమలుచేయడానికి కొన్ని గంటల సమయం కావాలని, ఢిల్లీ నుంచి తెలంగాణపై కొన్ని సంకేతాలు వస్తున్నాయంటూ రాజ్యసభ సభ్యుడు, స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ కే కేశవరావు ప్రకటించినప్పటికీ అలాంటిదేమీ లేదని తెలుస్తోంది. రాజీనామాల విషయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు మంత్రి జానాడ్డితో వాగ్వాదాలకు దిగారు. టీ కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాలు ఆమోదించుకుని వస్తేనే తాను మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తానని, ఎన్నికల్లో ఎంపీల తరఫున ప్రచారం చేసి వారిని గెలిపించుకొస్తానని జానా చేసిన వ్యాఖ్యలపై ఎంపీలు మండిపడినట్లు తెలిసింది. ప్రజల దృష్టిలో తెలంగాణకు ద్రోహం చేస్తున్నట్లు ప్రచారమవుతున్న జానా తమను గెలిపించడమేమిటి? ప్రచారానికి వస్తే జానా ముఖం చూసి ఓట్లు వేసేది ఎవరు? అని ఎంపీలు కొందరు జానా వ్యాఖ్యలపై కస్సుబుస్సుమన్నారు.
మంగళవారం సాయంత్రం కేకే నివాసంలో జరిగిన టీ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ సమావేశానికి ఎంపీలు కేకేతో పాటు గుత్తా సుఖేందర్‌డ్డి, మందా జగన్నాథం, బలరాం నాయక్, సిరిసిల్ల రాజయ్య, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, వివేక్, కోమటిడ్డి రాజగోపాల్‌డ్డి, మంత్రి జానాడ్డి, ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, కోమటిడ్డి వెంకట్‌డ్డి, చిరుమర్తి లింగయ్య, టీ రాజయ్య, నర్సాడ్డి, ఎమ్మెల్సీలు కే యాదవడ్డి, ఆమోస్, పీసీసీ అధికార ప్రతినిధి బీ కమలాకర్‌రావు, మాజీ ఎంపీ ఇంద్రకరణ్‌డ్డి, డాక్టర్ శ్రీధర్‌డ్డి తదితరులు హాజరయ్యారు. కమిటీ కన్వీనర్‌గా ఉన్న మంత్రి బస్వరాజు సారయ్యతో పాటు సభ్యులుగా ఉన్న మరికొందరు ఎమ్మెల్యేలు ఏ కారణంవల్లనోగానీ ఈ సమావేశానికి హాజరుకాలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సమావేశం ప్రారంభం కాగానే ఎంపీలు అందరు కలిసి మూకుమ్మడిగా మంత్రి జానాడ్డిపై మాటల దాడి ప్రారంభించారు.
ఇటీవలి కాలంలొ టీ కాంగ్రెస్ ఉద్యమంలో జానా పాత్ర, ఆయన వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీలు నిప్పులు చెరిగారు. నోటికొచ్చిన మాటలతో ఆయన్ని గట్టిగా నిలదీశారు. తామంతా ఎంపీ పదవులకు రాజీనామాలు చేస్తే రాష్ట్ర మంత్రివర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ మంత్రిగా రాజీనామా ఎందుకు చేయడం లేదు? అంతేకాకుండా సకలజనుల సమ్మె విరమించాలని కోరుతారా? అని జానాపై నిప్పులు చెరిగారు. రైల్‌రోకో సందర్భంగా టీ ఎంపీలపై తప్పుడు కేసులు, నాన్‌బెయిలబుల్ కేసులు బనాయించి జైళ్ళకు తరలిస్తే టీ మంత్రులు ఏం చేస్తున్నారు? కేసులు పెట్టకుండా సీఎం వద్ద అడ్డుకునే ప్రయత్నాలు ఎందుకు చేయలేదు? టీ మంత్రులకు సీఎం ఏ మాత్రమైనా విలువ ఇస్తున్నాడా? అలాంటప్పుడు మంత్రివర్గంలో ఉండటం కన్నా బయటికి వచ్చి మాతో కలిసి ఉద్యమంలో పాల్గొనవచ్చు కదా? అని ఎంపీలు జానాపై నిప్పులు చెరిగారు. తెలంగాణలోని తాజా పరిణామాలు, టీ కాంగ్రెస్ మంత్రుల వ్యవహారంపై ఎంపీలు సుమారు గంటన్నరకు పైగా జానాకు గట్టి క్లాస్ తీసుకున్నారు.
ఎంపీల మాటల దాడికి గురయిన జానా ఆ తరువాత గంటన్నరపాటు ఎంపీలకు వివరణ ఇచ్చుకున్నారు. మంత్రిగా ఉంటూ తాను తెలంగాణ కోసం చేసిన త్యాగాలు, అనుసరించిన విధానాలను ఎంపీలకు వివరించి తాను ఉద్యమంలో ఏ మాత్రం వెనకడుగు వేయలేదని, అందరి కంటే అగ్రభాగానే ఉన్నానని తెలియజేసేందుకు ప్రయత్నించారు. జానా చెప్పినదంతా విన్న ఎంపీలు చేసిన కృషికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, అయితే దానికి ఎలాంటి ఫలితం లేపోవడంతో బయటికి వచ్చి తమతో కలిసి పోరాడాలని సూచించారు. దీనిపై జానా స్పందిస్తూ తన వెంట రాజీనామాల కోసం టీ మంత్రులు ఎవరూ కూడా రావడం లేదని, స్టీరింగ్ కమిటీ సమావేశానికి రావాలని కన్వీనర్ సారయ్యను కోరినా అతను రాలేదని నిస్సహాయతను వ్యక్తం చేశారు. ‘నేను టీ మంత్రుల వద్దకు వెళ్ళి రాజీనామా అడగను. నా రాజీనామాతో తెలంగాణ వస్తది అనుకుంటే ఇప్పుడే ఇచ్చేస్తా.
తెలంగాణ కోసం పార్టీకి రాజీనామా చేస్తా. కావాలంటే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా’ అని జానా అన్నారు. ఇందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు కలగజేసుకుంటూ మీరు పార్టీని వదలవద్దు, మీరు మా నాయకులు, రాజకీయాల నుంచి రిటైర్డ్ కాకుండానే తెలంగాణ కోసం పోరాడాలి అని జానాను కోరారు. తొలుత మీరు రాజీనామాలు ఆమోదించుకుని రండి, ఆ తరువాత మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను, ప్రజల్లో కలిసి తిరుగుదాం, ఎన్నికలొస్తే మీకు మద్దతుగా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసే గెలిపిస్తానని జానా చెప్పడం ఎంపీలకు ఎంతమాత్రం రుచించలేదు. అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమయింది. ఆ వెంటనే ఒక ఎంపీ జోక్యం చేసుకుంటూ మేము ఇప్పటికే రాజీనామాలు చేశాం, మీరు రాజీనామా సమర్పించండి, మేము ఆమోదించుకుంటాం, ఆ తరువాత మీరు ఆమోదించుకోండి అని జానాకు సవాలు విసిరారు.
రాజీనామాలు నువ్వు చెయ్, నువ్వు చెయ్, ఢీ అంటే ఢీ అనే రీతిలో ఎంపీలు, జానా మధ్య సంభాషణ జరిగింది. దీంతో సమావేశం ఒక్క సారిగా వేడెక్కింది. ఎంపీలు జానాపై మండిపడటం, ఒక్క సారిగా సమావేశం వేడెక్కడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీలులేని పరిస్థితుల్లో మూడు, నాలుగు రోజుల తరువాత మరోసారి భేటీ అయి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించాలని స్టీరింగ్ కమిటీ నేతలు నిర్ణయించుకున్నారు.
తొమ్మది మంది ఎంపీలు, కనీసం నలుగురు మంత్రులు, పదిహేను మంది ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 25 నుంచి 30 మంది వరకు రాజీనామాలు చేస్తే అధిష్ఠానం, కేంద్రం దిగివస్తుందని, లేకపోతే ఒకరిద్దరు రాజీనామాల వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని ఈ సమావేశం చివర్లో నేతలు అభివూపాయానికి వచ్చారు. మీరు ఒక్కరు రాజీనామా చేస్తే మరి కొందరు మంత్రులు మీతో కలిసి వచ్చే పరిస్థితులు ఉంటాయని ఎంపీలు జానాడ్డికి సూచించారు. జానా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండటంతో తెలంగాణపై గట్టిగా ఉన్న మరో ముగ్గురు మంత్రులు గీతాడ్డి, బస్వరాజు సారయ్య, శ్రీధర్‌బాబులను కూడా రాజీనామాలకు ఒప్పించాలని ఎంపీలు నిర్ణయించారు.
జానా మాట్లాడుతున్నప్పుడు ముఖం చాటేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలు

టీ స్టీరింగ్ కమిటీ సమావేశం అనంతరం మంత్రి జానాడ్డి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఎంపీలు పొన్నం ప్రభాకర్, కోమటిడ్డి రాజగోపాల్‌డ్డి, సిరిసిల్ల రాజయ్య ముఖం చాటేసి వెళ్ళిపోయారు. పొన్నంను పేరుపెట్టి పిలిచినా కూడా ఆయన అటువైపు రాకుండా వెళ్ళిపోయారు. అదే విధంగా ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, టీ రాజయ్య కూడా జానా మాట్లాడుతున్నప్పుడు ఆయన వెంట నిలబడేందుకు ఏమాత్రం ఇష్టంలేక బయటికి వచ్చేశారు. జానాడ్డి అధిక ప్రసంగంతో విసిగిపోయి ప్రెస్ కాన్ఫెన్స్ మధ్యలోనుంచే కోమటిడ్డి వెంకట్‌డ్డి, ఎమ్మెల్సీ యాదవడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నిష్ర్క మించారు.
Take By: T News
Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, Tags: bandh in Telanagana, schools closed, TRS, Banswada, TRS win Banswada,

0 comments:
Post a Comment