విరమణ కాదు.. రూపం మార్పు సమ్మె కొనసాగుతుంది
- జాక్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టీకరణ
- స్వాతంత్య్ర సమరం,విప్లవాల్లోనూ ఎన్నో రూపాలు
- తెలంగాణ ప్రజలపై ప్రభుత్వం వివక్ష
- రెండో శ్రేణి పౌరులుగా పరిగణిస్తోంది
- అణచివేత కాంగ్రెస్‌పై ఉద్యమిస్తాం
- నేడు మద్యం దుకాణాలు బంద్
హైదరాబాద్, అక్టోబర్ 18 :తెలంగాణ కోసం వివిధ వర్గాల ప్రజలు రకరకాలుగా ఉద్యమిస్తున్నారని, సమ్మె విరమణ మాటే లేదని, రూపం మాత్రమే మారుతుంటుందని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలను రెండో శ్రేణి పౌరులుగా పరిగణిస్తున్నదని ఆయన ఆరోపించారు. తెలంగాణకోసం సమ్మెకు దిగినవారిపై పోలీసుల లాఠీచార్జీలు, దాడులతో కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశం తేటతెల్లమైందని చెప్పారు. ఇకనుంచి తెలంగాణ వ్యతిరేకి కాంగ్రెస్‌పైనే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. మంగళవారం ఆయన ఉద్యోగ సంఘాల జేఏసీ సెక్రటరీ జనరల్ శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘‘ప్రజలు వ్యతిరేకిస్తున్నందునే సమ్మె విరమించారా..? అందుకే ఒక్కో సంఘం సమ్మె నుంచి జారిపోతున్నదా..?’’ అంటూ విలేకరులు ప్రశ్నించగా సమాధానమిచ్చారు.
‘‘తెలంగాణకోసం సకల జనుల సమ్మె కొనసాగుతుంది. ఉద్యమంలో అనేకులు చేరారు. కొన్ని సంఘాలు సమ్మె విరమిస్తే, ఉద్యమం నుంచి ఆ సంఘాలు వెళ్లిపోతున్నాయని మీడియా చిత్రీకరించడం సరికాదు. సమ్మె రూపం మార్చుకున్నాం. అనేక మార్పులు, చేర్పులు చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తాం. ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు అందరూ సహకరిస్తున్నారు. ప్రజలు వ్యతిరేకించినందునే సమ్మె విరమించామన్న వార్తలు అవాస్తవం. ఇకనుంచి ఉద్యమం అవసరాన్ని బట్టి, పరిస్థితులనుబట్టి అనేక రూపాల్లో కొనసాగుతుంది. అణచివేయాలనుకుంటున్న కాంగ్రెస్‌పై ఉద్యమిస్తాం’’ అని తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కూడా అనేక మార్పులు జరిగాయన్న సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. సహాయ నిరాకరణ నుంచి నాటి ఉద్యమం అనేక రూపాలు మార్చుకున్నదన్నారు. అదే విధంగా ఫ్రెంచ్, రష్యా విప్లవాల్లోనూ అనేక రూపాలు మారాయని తెలిపారు. సమ్మె విషయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీలతో చర్చించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. తెలంగాణ కోసం మద్యం దుకాణాలను ఒకరోజు బంద్ చేస్తామని మద్యం దుకాణాల సంక్షేమ సంఘం ప్రకటించడాన్ని ఆయన స్వాగతించారు. మద్యం దుకాణాల బంద్‌కు సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు.
ఎకె్సైజ్ సిబ్బంది సమ్మెలో ఉండడంతో మద్యం దుకాణాలు సరఫరా చేయకున్నా.. రెంట్ వసూలు చేయడాన్ని ఆయన ఖండించారు. అధికారుల సూచన మేరకు వేరే జిల్లాల నుంచి మద్యం తీసుకునేందుకు వెళ్లిన దుకాణాల వారిని అక్కడి వారు పరాయివారిగా చూశారని ఆయన తెలిపారు. తెలంగాణ కోరుతూ శాంతియుతంగా ఉద్యమం చేస్తే రాజవూదోహం, దేశవూదోహం కేసులు పెడ్తారా అని ఉద్యోగ సంఘాల జేఏసీ సెక్రటరీ జనరల్ శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పదవులకు రాజీనామా చేయకున్నా తెలంగాణ ఉద్యమాన్ని కాపాడుతారని ఆశించామని, అయితే వారు మోసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నేడు మద్యం దుకాణాలు బంద్
తెలంగాణ సాధనలో భాగంగా బుధవారం ఒకరోజు మద్యం దుకాణాలు మూసివేస్తున్నామని తెలంగాణ మద్యం దుకాణాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు దామోదర్‌గౌడ్ తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్షతో పోతే మళ్ళీరాని ప్రాణాలను 700 మంది త్యాగం చేశారని ఆయన ఆవేదన చెందారు. అంతటి త్యాగాలు సాగినచోట- డబ్బు పోయినా సంపాదించగలమన్న భావంతో తాము ఒక రోజు దుకాణాలను మూసివేస్తున్నామని తెలిపారు. తెలంగాణవ్యాప్తంగా అందరూ బుధవారం దుకాణాలను మూసివేయాలని ఆయన కోరారు.
Take By: T News
Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, Tags: bandh in Telanagana, schools closed, TRS, Banswada, TRS win Banswada,
0 comments:
Post a Comment