తెలంగాణ కాంగ్రెస్ విశ్వాస ఘాతుకమే
- స్వరాష్ట్ర సాధనలో మొదటినుంచీ నేతలది మోసపూరిత వైఖరే
- సకల జనం సమ్మెలో ఉంటే సర్కారుకు సన్నాయి ఊదే మంత్రులు
- అక్రమ అరెస్టులతో నిర్బంధకాండ సాగుతున్నా నోరు మెదపని వైనం
- టీ కాంగ్రెస్‌పై నిప్పులు చెరుగుతున్న తెలంగాణవాదులు
- కాంక్షిగెస్‌కో ఖతం కరో నినాదమే ఈ గడ్డపై ఇక పిక్కటిల్లాలని నిర్ణయం
హైదరాబాద్, అక్టోబర్ 18 :కాలమేదైతేనేం.. ద్రోహ చింతనే నరనరాన సర్రున కదులుతున్నపుడు! కాలమేదైతేనేం.. కొత్త బాట వేసుకొని ముందుకు సాగిపోతున్నవారితో కలిసిరాక బాటనిండా జిల్లేళ్లు చల్లాలనుకున్నపుడు! కాలమేదైతేనేం.. కరవాలాలను ఇచ్చి కదనరంగాన చెలరేగమన్నపుడు ఆ కాలాన్నే వెన్నుపోటు పొడవాలనుకున్నపుడు!! ఉద్యమాల కాలం విలువ తెలియని ఇలాంటి వారిని ఏమంటారు? ద్రోహులంటారు.. వారిని తెలంగాణ కాంగ్రెస్ నాయకులంటారు.. అని 36 రోజులుగా సకల జనుల సమ్మెలో కదం తొక్కుతున్న సబ్బండ వర్ణాలు ఇప్పుడు నినదిస్తున్నాయి. తెలంగాణ సాధన కోసం ఒక్క తాటిపైకి రాలేని తెలంగాణ కాంగ్రెస్ నాయకులను అన్ని వర్గాలు ఛీత్కరిస్తున్నాయి. నిజానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మొదటి నుంచీ ద్రోహ బుద్ధ్దితోనే వ్యవహరిస్తున్నారు. ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులతోపాటు వేర్వేరు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు సకల జనుల సమ్మె ప్రారంభించిన సమయంలో కాంగ్రెస్ నేతలు కూడా తమతో కలిసి వస్తారని వారు విశ్వసించారు. కానీ, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వారి నమ్మకాన్ని వమ్ము చేశారని, విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే, కాంగ్రెస్‌కో ఖతం కరో అనే నినాదంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. దీంతో గుబులు రేగిన తెలంగాణ కాంగ్రెస్ తమ వరకు తాము సంఘటితంగా ఉన్నామని చాటుకునేందుకు ఆదరాబాదరగా మంగళవారం సాయంత్రం ఎంపీ కె. కేశవరావు నివాసంలో స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. మరోసారి అభాసుపాలయ్యారు. నిర్ధిష్టమైన కార్యాచరణకు పూనుకోకుండానే వారు ఆ సమావేశాన్ని తూతూ మంత్రంగా ముగించారు. తెలంగాణ ప్రజలను మోసం చేసే విధంగానే ఈ సమావేశం కూడా కొనసాగింది. అంది వచ్చిన అవకాశాలను కనీసం ఉపయోగించుకునే ప్రయత్నం చేయకుండా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అవకాశవాదంతో, డోలాయమానంతో వ్యవహరిస్తూ ఉద్యమానికి చేయూతనివ్వకపోగా స్వార్థానికే ప్రతీ కార్యక్షికమాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారని వారిపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు.
పదవీ రాజకీయాల కోసం అప్పటి పీసీసీ అధ్యక్షుడు వై.ఎస్.రాజశేఖర్‌డ్డి అనుమతి తీసుకుని, ఆయన తోడ్పాటును స్వీకరించిన తరువాతే నాడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఉద్యమమంటూ సోనియా గాంధీకి మహజర్లు సమర్పించారని, ఆనాటి నుంచి నేటి వరకు వారికి పదవీకాంక్ష తప్ప తెలంగాణ పోరుపై శ్రద్ధ కనిపించటం లేదని తెలంగాణవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరాయి నేత కోసమే అధిక సీట్లను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ఆడిన నాటకంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెలంగాణవాదం వినిపించారు తప్పితే సొంతగడ్డలో పరాయి పాలనతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పట్టించుకునే పాపానికి పోలేదని తెలంగాణవాదులు విమర్శిస్తున్నారు. అయితే, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆమరణ దీక్ష తరువాత ఏర్పడిన పరిస్థితుల్లో తెలంగాణకు అనుకూలంగా కేంద్రం చేసిన ప్రకటన నేపథ్యంలో మరింత సంఘటితంగా ఉద్యమించి ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా వ్యవహరించాల్సిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అవకాశవాదంతోనే పనిచేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఆ తరువాత సీనియర్ మంత్రి జానాడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో తెలంగాణ రాజకీయ జేఏసీ ఆవిర్భమైంది. డిసెంబర్ 9 ప్రకటన తరువాత కొందరు తెలంగాణ కాంగ్రెస్ నేతలు హడావిడిగా కనిపించినా మళ్లీ వారే జేఏసీ నుంచి డిసెంబర్ 23న బయటపడ్డారు.
ఆ తరువాత జేఏసీలో టీఆర్‌ఎస్ క్రియాశీలక పాత్రను పోషిస్తూ ఇతర పార్టీలను కలుపుకొని ఉద్యమ నిర్మాణం చేస్తున్నా కాంగ్రెస్ నేతలు ప్రేక్షకపావూతనే వహిస్తూ వస్తున్నారని, నిర్మాణాత్మక పాత్రను పోషించటం లేదని తెలంగాణవాదులు దుయ్యబడుతున్నారు. కేసీఆర్ దీక్ష తరువాత కేంద్రంలో పూర్తి అనుకూల వాతావరణం ఏర్పడింది. దీనిని ప్రతికూలంగా మార్చేందుకు సీమాంధ్ర నేతలు రాజీనామాల డ్రామా ఆడారు. సమైక్యాంధ్ర పేరిట కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించారు. అంతే స్థాయిలో ప్రతిఘటించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కనీసమావూతంగా కూడా ప్రయత్నించలేదని, నాడు వారి వైఖరి సమర్థనీయంగా లేదని తెలంగాణవాదులు అభివూపాయపడుతున్నారు. ప్రభుత్వపరంగా తెలంగాణకు వ్యతిరేకంగా చర్యలు కనిపిస్తున్నా ముఖ్యమంవూతుల మెప్పు కోసం తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు పాకులాడుతున్నారు తప్పితే ఇప్పటివరకు వారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చటానికి తగిన కార్యాచరణను అమలు చేయలేదని వారంటున్నారు. సీమాం ధ్ర నాయకుల వైఖరికి నిరసనగా వందల సంఖ్యలో యువకులు, విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు భీషణ ప్రతిజ్ఞలు మాత్రం చేశారు. శవాలపై ప్రతినలు చేస్తూ తెలంగాణ కోసం అవిక్షిశాంత పోరాటం చేస్తామని, తెలంగాణ సాధ నే తమ లక్ష్యమని బీరాలు పోయారు. పోరుగడ్డ ఉస్మానియా వర్సిటీకి వెళ్లి విద్యార్థులతో చర్చలు జరిపి మేమే పోరాడుతాం అని చెప్పారు తప్పితే చేతల్లో మాత్రం ఏమీ చేయలేదు.
పిండ ప్రదానాల తరువాతే...
తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా కళ్లు తెరవని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు, మంత్రులకు వ్యతిరేకంగా ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు పిండ ప్రదానాలు చేసి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేసిన తరువాతే తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కదలిక వచ్చింది. ఇక మేమూ పోరాడుతామంటూ జనంలోకి వచ్చారు తప్పితే అప్పటివరకు తెలంగాణ జిల్లాల్లో పర్యటించే సాహసం కూడా చేయలేకపోయారు. ప్రజల ఒత్తిడికి తలొగ్గారు తప్పితే చిత్తశుద్ధి కనిపించలేదని, సొంత నియోజకవర్గాల్లో పర్యటించాలంటే జై తెలంగాణ అనక తప్పదని భావించే వారు డ్రామాలాడారని తెలంగాణవాదులు అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ప్రజల్లో మొదటి నుంచీ అనుమానాలున్నాయి. చివరకు తెలంగాణ మేధావి ప్రొఫెసర్ జయశంకర్ అంత్యక్షికియల్లోనూ టీ కాంగ్రెస్ నేతలను పాలు పంచుకోనివ్వకుండా తెలంగాణవాదులు అడ్డుకున్నారు. వారిపై అనుమానాలకు ఇది పరాకాష్టగా చెప్పుకోవచ్చని తెలంగాణవాదులు అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల నమ్మకవూదోహం తెలిసినందునే తెలంగాణవాదులు వారిపట్ల మొదటి నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సకల జనుల సమ్మె ప్రారంభిస్తూ ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులు తెలంగాణ సమాజం అంతా కాంగ్రెస్ మంత్రులు, నాయకుల నుంచి కొద్దిపాటి విశ్వాసాన్ని ఆశించారు. అత్యద్భుతంగా సాగుతున్న సకల జనుల సమ్మెలో తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, శాసనసభ్యులు కూడా పాల్గొని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఒప్పించి తెలంగాణను సాధిస్తారని, రాజకీయంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా కదులుతారని భావించినట్టు తెలంగాణవాదులు పేర్కొంటున్నారు.
అయితే, అందరి ఆశలపై నీళ్లు చల్లి సకల జనుల సమ్మె పెద్ద ఎత్తున జరిగినా కాంగ్రెస్ నేతలు అందులో భాగస్వాములు కాకుండా నమ్మకవూదోహం చేశారని తెలంగాణవాదులు నిరసిస్తున్నారు. పైగా సమ్మె వాయిదా వేసుకోవాలని సీనియర్ మంత్రి జానాడ్డి చెప్పటాన్ని కూడా తెలంగాణవాదులు సహించలేకపోయారు. తెలంగాణ జిల్లాల్లో జానాడ్డి దిష్టిబొమ్మలను దహనం చేయటంతోపాటు పిండ ప్రదానాలు చేశారు. తెలంగాణ సమాజం మొత్తంగా కాంగ్రెస్ మంత్రుల వైఖరిని తీవ్రస్థాయిలో దుయ్యబట్టింది. ఉద్యమిస్తున్న ఉద్యోగులు, టీచర్లను ఇబ్బందులకు గురి చేసేలా జీవోలు జారీ చేస్తుంటే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు కనీసం ఖండించలేదు. పైగా మంత్రివర్గంలో ఉండి తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్ర సర్కార్ తీసుకున్న నిర్ణయాల్లో పాలు పంచుకోవటాన్ని తెలంగాణవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా కొన్ని కార్మిక సంఘాలు, మరికొన్ని టీచర్ల సంఘాలు తమ సమ్మెను వాయిదా వేసుకుని కార్యాచరణ ప్రకటించినా, తెలంగాణ సమాజాన్ని ఉత్తేజ పరిచేలా ఈ పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ మంత్రులు, నాయకులు తగిన వ్యూహాన్ని, ప్రణాళికను రూపొందించలేకపోయారు. టీ కాంగ్రెస్ మంత్రుల శషబిషలు అర్థం చేసుకున్న తెలంగాణ సమాజం ద్రోహులను నమ్మకూడదని, అందుకే కాంగ్రెస్‌కో ఖతం కరో అన్న నినాదంతో భావి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం జరిగిన తెలంగాణ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ సమావేశం కొండంత రాగం తీసి ఏదో చేసినట్టు సాగింది.
కాగా, కొందరు తెలంగాణ ఎంపీలు టీఆర్‌ఎస్‌లో చేరుతారని వచ్చిన వార్తలను తీవ్రస్థాయిలో ఖండించేందుకు తమ ఉక్రోషాన్ని వెళ్లగక్కారు తప్పితే అసలు లక్ష్యం గురించి ఈ సమావేశంలో చర్చించలేదు. తమలోనే కొందరు తెలంగాణ ద్రోహులున్నారని స్వయంగా సీనియర్ నేత కే.కేశవరావు చెప్పటం గమనార్హం. కనీస నిబద్ధత లేని తెలంగాణ కాంగ్రెస్ నేతల వల్ల ప్రయోజనం లేదని, అందుకే కాంగ్రెస్‌ను ఖతం చేయటమే లక్ష్యంగా పనిచేస్తేనే అధిష్ఠానానికి సెగ పుడుతుందని తెలంగాణవాదులు భావిస్తున్నారు. సొంత ఎంపీలు, ఎమ్మెల్యేలను ఇతర పార్టీల నేతలను అరెస్టులు చేసినా పట్టించుకోని తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు పైరవీల కోసం పదవులను అంటి పెట్టుకుని ఉన్నారని, తెలంగాణ కాంగ్రెస్ మోసకారితనాన్ని బట్టబయలు చేసి ఆ పార్టీలోని నమ్మకవూదోహులకు తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు.
రాజీనామా చేయండి లేదా మాలో కలవండి:కాంగ్రెస్ నేతలకు హిజ్రాల సూచన
ఖమ్మం: ఖమ్మంలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో హిజ్రాలు బొట్టుబోనాలతో ప్రదర్శన నిర్వహించారు. టీ కాంగ్రెస్ నేతలు రాజీనామా చేయాలని, ముఖ్యంగా జిల్లాకు చెందిన డిప్యూటీ స్పీకర్ బట్టి విక్రమార్క వెంటనే రాజీనామా చేయాలని లేకపోతే చీరకట్టుకొని తమలో కలవాలని సూచించారు. నీటిపారుదల శాఖ ఉద్యోగులు దీక్ష ే పట్టారు. ‘రామయ్య మా తెలంగాణ మాకిప్పించవయ్యా’ అంటూ జేఏసీ నాయకులు భద్రాచలంలోని గోదావరి నదిలో మునిగి నిరసన వ్యక్తం చేశారు. మధి, బోనకల్లు, పాల్వంచలో సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో, కొత్తగూడెం, పాల్వంచలో దీక్షలు, కల్లూరు, జేఏసీ ఆధ్వర్యంలో ధూంధాం, కామేపల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో, కొత్తగూడెంలో సీమాంధ్ర భూతాన్ని తరిముకుంటూ నిరసన ప్రదర్శన నిర్వహించారు.

Take By: T News
Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, Tags: bandh in Telanagana, schools closed, TRS, Banswada, TRS win Banswada,

0 comments:
Post a Comment