Saturday, December 24, 2011
కరకు మాటల కట్జు (Justice Markandey Katju blasts the media )
- సినిమా, క్రికెటర్లకు భారతరత్న ఇస్తారా!
- ఇది దిగజారుడుతనమే- స్వీయ అవసరాల కోసమే 90% పాత్రికేయులు పని చేస్తున్నారు
- వినోదానికే మీడియా ప్రాధాన్యం
- వివాదాస్పదమవుతున్న ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, డిసెంబర్ 23:దేవానంద్ చనిపోతే ఆ వార్తను మొదటి పేజీలో వెయ్యాలా? దేశంలోని మీడియా 90 శాతం వినోదాత్మక అంశాలకే ప్రాధాన్యం ఇస్తోంది! పత్రికా స్వాతంత్య్రం పేరుతో మీడియా పరిధులు దాటి ప్రవర్తిస్తోంది. దేశంలోని 90 శాతం మంది పాత్రికేయులు సామాన్య ప్రజల కోసం కాకుండా, స్వీయ అవసరాల కోసం పనిచేయడం దారుణం! భారత రత్న అవార్డు క్రికెటర్లకు, సినిమా తారలకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది! ఇవి ఎవరో మామూలు వ్యక్తి చేసిన వ్యాఖ్యలు కాదు! దేశ పత్రికా వ్యవస్థను నియంవూతించే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు చైర్మన్‌గా ఇటీవల ఎన్నికైన సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జు చేసిన విమర్శలు! అసలు మీడియా బాధ్యతే లేనట్లు ప్రవర్తిస్తోందన్న స్థాయిలో కట్జు దుమ్మెత్తిపోయడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఏ వ్యవస్థలోనైనా ఎన్నోకొన్నిలోపాలు ఉండటం సహజం. మీడియా అందుకు అతీతమేమీ కాదు. కానీ.. మొత్తం అన్ని మీడియా సంస్థలను కలగలిపేసి మార్కండేయ వరుస వ్యాఖ్యానాలు చేయడంపై అభ్యంతరాలూ వ్యక్తమవుతున్నాయి. అయినా కట్జు కరుకు మాటలు ఆగడం లేదు. తాజాగా ఆయన భారత రత్న అవార్డు ఎవరికి ఇవ్వాలనే అంశంపై స్పందించారు.
కట్జు చేసిన వ్యాఖ్యల్లో కొన్ని...
‘ఇప్పుడు ప్రజలంతా భారతరత్న అవార్డును క్రికెటర్లకు, సినిమాస్టార్లకు ఇవ్వాలని మాట్లాడుతున్నారు. తరిగిపోతున్న సాంస్కృతిక విలువలను ఇది గుర్తు చేస్తోంది. మనం నిజమైన హీరోలను వదిలేస్తున్నాం. ఈరోజు మనదేశం నాలుగు రోడ్ల కూడలిలో నిలబడింది. మన దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపే నాయకుడు కావాలి.
అటువంటివారికే భారతరత్న ఇవ్వాలి. ఇప్పటికే వారు చనిపోయి ఉన్నా వారికి అవార్డు ఇవ్వాలి. క్రికెటర్లు, సినిమాస్టార్ల లాంటి సాంఘిక ఔచిత్యం లేని వారికి భారతరత్న ఇవ్వడం అవార్డు ఔన్యత్యాన్ని దిగజార్చడమే. సచిన్, ధ్యాన్ చంద్ లాంటి వారికి భారతరత్న ఇవ్వడానికి బదులు ఉర్దూ కవి మీర్జా గాలిబ్, బెంగాల్ రచయిత శరత్‌చంద్ర, తమిళనాడు కవి సుబ్రమణ్య భారతికి భారత రత్న ఇవ్వాలి.
l సినిమా నటుడు దేవానంద్ మరణవార్తను మొదటి పేజీలో వేస్తారా? దేశంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల ఫొటోలను మధ్య పేజీలలో వేసి సినిమా స్టార్ మరణవార్తను మొదటిపేజీలో వేయడంలో ప్రాముఖ్యం ఏంటి? భారతదేశ సాంఘిక, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వార్తలు రాయాలి. దేవానంద్ సినిమాలను చిన్నతనంలో చూశాను. ఆయన నటనను ఇష్ట పడ్డాను.
l సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో ఉన్న అనైతిక సమాచారాన్ని తొలగించాలన్న సమాచార శాఖ మంత్రి కపిల్ సిబాల్ అభివూపాయానికి మద్దతు పలుకుతున్నాను. దేశ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాలంటే ఇంటర్‌నెట్‌లో ఉన్న అనైతిక సమాచారాన్ని తొలగించాలి. ఇలా చేయడం తప్పుకాదు.
l దేశంలోని మీడియా 90 శాతం వినోదాత్మక అంశాలకే ప్రాధాన్యం ఇస్తోంది. దేశ ప్రయోజనాలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ప్రజలకు అవసరమైన వార్తలు అందించకుండా, అన్నీ తెలుసని వారికి వారే మేధావులమని అనుకుంటే ఎలా? జర్నలిస్టులంతా చరివూతతోపాటు భాషా పరిజ్ఞానం పెంచుకోవాలి. అప్పుడే వారు రాసిన వార్తలలో తప్పులు దొర్లవు.
l దేశంలోని ఎలక్షిక్టానిక్ మీడియాను కూడా ప్రెస్‌కౌన్సిల్ పరిధిలోకి తీసుకురావాలి. స్వీయనియంవూతణ పాటించని చానళ్లపై చర్యలు తీసుకోవాలి. పత్రికా స్వాతంత్య్రం పేరుతో మీడియా పరిధులు దాటి ప్రవర్తిస్తోంది. అపరిమిత స్వేచ్ఛను అరికట్టాలి.
l పాత్రికేయులంతా మనదేశంలోని సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. దేశంలోని 90 శాతం మంది సామాన్య ప్రజలకోసం పనిచేయకుండా వారి స్వీయ అవసరాల కోసం పనిచేయడం దారుణం. ఈ అంశాలను క్రమబద్ధీకరించడానికి ప్రెస్ కౌన్సిల్‌కు మరిన్ని అధికారాలు కావాలి.
ఉడుకుతున్న భూగోళం (Global Warming)
- ప్రతి దశాబ్దానికి 0.1 డిగ్రీల సెంటిక్షిగేడ్ పెరుగుదల
- కరిగిపోనున్న ధ్రువపు మంచు- వచ్చే కొన్నేళ్లలో..జీవం మనుగడ ప్రశ్నార్థకం
- ఖండాల శీతోష్ణస్థితిలో పెనుమార్పులు - భారత్‌కూ పెను ముప్పు
ఏళ్లుగా భూవాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. చలికాలంలో వేడి, వర్షాలు పడాల్సిన సమయంలో ఎండలు, ఎండ కాయాల్సిన సమయంలో వానలు పడుతూ.. జనజీవనాన్ని శీతోష్ణస్థితి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వీటికి తుఫాన్‌లు తోడై జీవజాతిని కలవరపెడుతోంది. దీనంతటికీ కారణం ఏంటో తెలుసా..? మానవుల స్వయంకృతాపరాధం వల్ల పెరిగిపోతున్న కర్బన ఉద్గారాలు.
వాతావరణంలో వీటి చేరిక అధికమై భూగోళం మండిపోతోంది. పారిక్షిశామికాభివృద్ధి పేరిట గాలిలోకి వదులుతున్న కర్బనం భూమినే మింగేసే స్థితికి చేరుకుంది. హరిత గృహ వాయువు నగీన్‌హౌస్ గ్యాసెస్) ల వల్ల ఉష్ణోక్షిగతలు ఉచ్ఛస్థితికి చేరుకున్నాయి. ఏడాదికేడాది ఉష్ణోక్షిగత పెరుగుదల పరంపర ఇలాగే కొనసాగితే.. భూమి వేడెక్కి శీతోష్ణస్థితిలో తీవ్ర మార్పులు రానున్నాయి. ఫలితంగా.. కరువు, క్షామంతోపాటు హిమానీ నదాలు కరగడంతో సమువూదాలు ఉప్పొంగి ధరివూతిపై జీవం మనుగడే ప్రశ్నార్థకమవనుంది. ఈ భయంకర నిజాలు నాసా పరిశోధనలో వెలుగుచూశాయి.
పారిక్షిశామిక యుగాని కంటే ముందు కాలం (1880)తో పోల్చినపుడు ప్రస్తుతం భూ ఉపరితల ఉష్ణోక్షిగత 0.8 డిగ్రీ సెంటిక్షిగేడ్ (1.4 డిగ్రీల ఫారన్‌హీట్స్) పెరిగింది. అంతటితో ఆగకుండా ప్రతి దశాబ్దానికి ఉష్ణోక్షిగత 0.1 డిగ్రీల సెంటిక్షిగేడ్ (0.2 డిగ్రీల ఫారన్‌హీట్‌కు) పెరుగుతూనే ఉంది. ఫలితంగా పగలు, రాత్రి ఉష్ణోక్షిగతలు అమాం తం పెరిగిపోయి.. చల్లని వాతావరణమే కనుమరుగవుతోంది. వేడి పవనాలు భూవాతావరణంలోకి దూసుకొస్తున్నాయి. దీంతో శీతోష్ణస్థితి సమతౌల్యం దెబ్బతిని పంట దిగుబడిపై ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయి.
1970 నుంచి ప్రపంచంలోని చాలా చోట్ల కరువుకు ప్రధానం కారణం ఈ భూతాపమే. ఉష్ణోక్షిగతలో మార్పుల వల్ల ప్రపంచ దేశాలను సైక్లోన్‌లు కుదిపేస్తున్నాయి. వీటి తాకిడికి కోట్ల మంది ప్రజలు నిరాక్షిశయులై ఆకలితో అలమటిస్తున్నారు. హిమానీ నదాల కరుగుదల ఈ ఉష్ణోక్షిగతలో మార్పులతో ముంచుకొచ్చే పెనువూపమాదం. 1880 నుంచి ఇప్పటి వరకూ పెరుగుతున్న ఉష్ణోక్షిగత వల్ల ఇప్పటికే ధ్రువాల వద్ద ముఖ్యంగా మంచు దుప్పటి అలుముకున్న అంటార్కిటికా, గ్రీన్‌ల్యాండ్‌లో మంచు కరిగి సముద్ర మట్టాల స్థాయి ఘననీయంగా పెరిగిపోయింది.
ఈ రెండు ప్రాంతాల్లో నాసాకు చెందిన గొడ్డార్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ స్టడీస్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 10,000 ఏళ్ల క్రితం సముద్రం మట్టం స్థాయి 25 మీటర్లు (82 ఫీట్లు) ఉండేది. అప్పటి నుంచీ భౌగోళిక ఉష్ణోక్షిగత ప్రతీ డిగ్రీ పెరుగుదలకు సముద్ర మట్టం స్థాయి 20 మీటర్లు (66 ఫీట్లు) పెరుగుతున్నట్లు పరిశోధకులు లెక్కకట్టారు. మంచు కరుగుదల అనేది అన్ని చోట్ల ఒకేలా ఉండకుండా పశ్చిమ అంటార్కిటికాలోని పైన్ దీవిలో అనూహ్య పరిమాణంలో ఉంటోందని తేల్చారు. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే.. 2100 సంవత్సరంలో సముద్ర మట్టపు స్థాయి పెరిగి నీరంతా భూమిని ముంచేస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
అయితే దీనిపై దేశాధినేతలు క్రోటోవూపొటోకాల్ ఒప్పందం చేసుకుని దశాబ్దాలుగా చర్చలు జరుపుతున్నా.. అవి ఓ కొలిక్కి రాకపోవంతో 350 పార్ట్స్ ఫర్ మిలియన్ల కార్బన్‌డైఆకె్సైడ్ వాతావరణంలో కొనసాగుతూనే ఉంది. దీనిపై దేశాధినేతలు సాచివేత ధోరణి అవలంభిస్తుండటంతో భౌగోళిక వాతావరణంలో కార్బన్ ఉద్గారాల స్థాయి సంవత్సరానికి సరాసరిగా 0.0001 పార్ట్స్ ఫర్ మిలియన్ పెరుగుతోంది. దీని ప్రభావం వల్లే ఇప్పటికే ధ్రువవూపాంతాల వద్ద మంచు కరిగి సముద్ర మట్టం పెరుగుదల రూపంలో భవిష్యత్తు విపత్తు కళ్లముందు కదలాడుతోంది.
2. రాత్రి, పగటి ఉష్ణోక్షిగతలు గణనీయంగా పెరిగాయి
3. మైదాన ప్రాంతాల్లోకి వేడిగాలులు వీస్తున్నాయి.
4. సముద్ర మట్టాల స్థాయి పెరిగిపోయింది
5. 1970 నుంచి కరువు తాండవం చేస్తోంది
6. మూడు దశాబ్దాలుగా.. సైక్లోన్ల తాకిడి పెరిగిపోయింది
7. ఉష్ణమండల ప్రాంతంలో నీటి వనరులు తగ్గిపోయాయి
2. ఐరోపా: సముద్ర మట్టాల పెరుగుదలతో వరదల బీభత్సం పెరిగిపోయింది. పర్వత ప్రాంతాల్లో హిమానీ నదాలు కరిగిపోయాయి. మంచు తగ్గిపోవడంతో అనేక జీవజాతులు కనుమరుగైపోయాయి. దక్షిణ ఐరోపాలో పంట దిగుబడి తీవ్రంగా తగ్గిపోయింది.
3. ఆఫ్రికా: వర్షాలు తగ్గిపోవడంతో పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. 2020 కల్లా 75 నుంచి 250 మంది ప్రజలు నీటి ఎద్దడితో కొట్టుమిట్టాడుతారని అంచనా. పదేళ్లలో 50 శాతం పంట దిగుబడి తగ్గిపోయే ప్రమాదముంది.
4. ఆసియా: కేంద్ర, దక్షిణ, తూర్పు, ఆగ్నేయాసియాలో 2050 వరకు మంచినీటి లభ్యత గణనీయంగా తగ్గనుంది. తీరవూపాంతాలను వరదలు ముంచెత్తే అవకాశం అధికం.
2. అస్థవ్యస్థ రుతుపవనాల వల్ల నదులలోని నీరు తగ్గి.. వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తి కుంటుపడుతోంది
3. ప్రతి 1 డిగ్రీ సెంటిక్షిగేడ్ ఉష్ణోక్షిగత పెరుగుదలకు 4-5 మిలియన్ టన్నల గోధుమల ఉత్పత్తి తగ్గిపోతోంది
4. సముద్ర మట్టం పెరిగిపోయి తీరవూపాంత ప్రజలకు మంచినీరు కరువవుతోంది
5. దేశ తీర, ఉష్ణమండల ప్రాంతంలో వరదలు సంభవించి ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోంది
6. నాసా అధ్యయనం ప్రకారం భూతాపం వల్ల 2050 కల్లా భారత్‌లోని 50 శాతం అటవీవూపాంతం కనుమరుగైపోయి..జీవజాతులు అంతరించిపోయే ప్రమాదముంది.-సెంట్రల్ డెస్క్
Take By: T News Read more...
సమన్వయంతో అణిచేద్దాం!
- ప్రత్యేకవాదం వినిపించేందుకు ఒక్కరూ లేరు
- తెలంగాణ నుంచి ముగ్గురున్నా..ముగ్గురివీ వ్యక్తిగత ప్రయోజనాలే!
- కమిటీ ఏర్పాటులో ముందు జాగ్రత్త
హైదరాబాద్, డిసెంబర్ 23 ():‘సమన్వయ కమిటీ’ ఏర్పాటు వెనుక తెలంగాణ వ్యతిరేక ప్రయోజనాలు దాగి ఉన్నాయా? తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఆకాంక్షలను కట్టడి చేయడానికే ఈ కమిటీని ముందుకు తీసుకువచ్చారా? తెలంగాణకు బద్ధ వ్యతిరేకులను, తెలంగాణపై గట్టిగా మాట్లాడని వారిని కమిటీలోకి తీసుకోవడం వెనుక కాంగ్రెస్ ఆలోచన ఏంటి? తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించే ఏ ఒక్క నాయకుడికీ ఈ కమిటీలో ఎందుకు స్థానం దక్కలేదు? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కోసం ఉద్దేశించినట్లు చెబుతున్న సమన్వయ కమిటీ విషయంలో ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్నలివి!
రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తలోదారిన నడుస్తున్నారు కనుక, అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని సమన్వయం చేసేందుకు అంటూ సమన్వయ కమిటీని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ చైర్మన్‌గా ఏర్పాటు చేశారు.
ఈ కమిటీలోకి సభ్యులుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఏ పదవీ లేదని రుసరుసలాడుతున్న చిరంజీవిని తీసుకోవడంతో పాటు పీసీసీ మాజీ చీఫ్ డీఎస్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ కావూరి సాంబశివరావును తీసుకున్నారు. గతంలో ఈ కమిటీలో ఉన్న జానాడ్డి, కేవీపీ రామచందర్‌రావు, గీతాడ్డిని ఈ సారి పక్కనపెట్టారు. మొత్తంగా ఈ కమిటీలో తెలంగాణ అంశాన్ని గట్టిగా వినిపించే నాయకుడుకానీ, ఉద్యమం అణచివేతకు ప్రభుత్వం ప్రయత్నిస్తే గట్టిగా అడ్డుకునే నేత లేకపోవడంపై ప్రత్యేక రాష్ట్ర వాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆకాంక్షను అడ్డుకునేందుకు, అణచివేసేందుకు ముందు జాగ్రత్తగా రూపొందించిన పక్కా పథకమని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. తెలంగాణకు బద్ధ వ్యతిరేకులైన వారిని ఈ కమిటీలో నియమించడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. పీసీసీ మాజీ చీఫ్ డీఎస్, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తెలంగాణవారే అయినా.. వీరు ముగ్గురూ అంత గట్టిగా తెలంగాణవాదం వినిపిస్తున్న వారు కాదు.
డీ శ్రీనివాస్ తెలంగాణపై ఏదో ఒకటి చెబుతున్నా ఆయన లక్ష్యం అంతా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వద్ద ఆశీస్సులు పొందటం కోసమేనన్నట్లు కనిపిస్తోందని విమర్శలున్నాయి. తెలంగాణవాదాన్ని గట్టిగా వినిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలేవీ అగుపించటం లేదు. ఏ పదవీ లేనపుడు అంతో కొంతో తెలంగాణ అంటూ మాట్లాడిన డీఎస్ తాజాగా ఎమ్మెల్సీ పదవి దక్కటంతో ఇతరత్రా పదవుల కోసమే అంగలారుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
తెలంగాణ అభివృద్ధి మండలిని కేంద్రం వేస్తే.. దానిపై ఆధిపత్యం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. ఇక డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఏనాడూ తెలంగాణవాదిగా మాట్లాడకపోవటం గమనార్హం. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఈ పదవిని వాడుకుంటున్నారు తప్పితే తెలంగాణవాదాన్ని వినిపించేందుకు కనీస ప్రయత్నం కూడా చేయటం లేదని పలువురు తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన నేత కావడంతోనే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి లభించింది. దీని ద్వారా రాష్ట్రంలో కీలకమైన హోం శాఖను తెచ్చుకునేందుకే ఆయన ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం ఉంది. ఈ శాఖ కోసం పట్టుబట్టిన ఆయన.. అధిష్ఠానం వద్ద ఇప్పటికే తన అభ్యర్థనను ఉంచినట్లు తెలుస్తోంది. ఇక, షబ్బీర్‌అలీ కూడా తెలంగాణకంటే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ఆజాద్‌తో సన్నిహితంగా ఉండి ఈ కమిటీలో స్థానం పొందారని అంటున్నారు.
ఆయన కూడా తెలంగాణ వాణిని గట్టిగా వినిపించిన దాఖలాలు బహు అరుదు. కాగా, కమిటీలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారందరూ తెలంగాణను గట్టిగా వ్యతిరేకిస్తున్నవారే. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలంగాణవాదుల ముందు మాత్రం తాను రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదని చెబుతున్నా ఈ మేరకు ఆయన చేస్తున్న ప్రయత్నాలేమీ కనిపించటం లేదు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి కూడా సమైక్యవాదిగానే వ్యవహరిస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను పట్టించుకోవటం లేదు. కరడుగట్టిన సమైక్యవాదిగా చెప్పుకునే చిరంజీవికి ఈ కమిటీలో ప్రాతినిథ్యం లభించింది. ఆయన తెలంగాణను నేరుగా వ్యతిరేకిస్తున్నారు.
ఆయనకంటే కావూరి సాంబశివరావు మరో రెండు అడుగులు ముందుకు వేసి.. తెలంగాణను గట్టిగా వ్యతిరేకిస్తూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటానికి జాతీయ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. ఈ లాబీయింగ్ విస్తృతస్థాయిలో ఉందని, దీనికి జాతీయ నాయకులు కూడా ప్రలోభాలకు గురయ్యారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో సమైక్యవాదులకు పెద్ద పీట వేసే విధంగా కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేయటం పట్ల తెలంగాణవాదుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
రాజకీయ పోరాటాలు కూడా మరింత ఉధృతం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళనలపైన, ఉద్యమాలపైన సర్కారు గతంలో అనుసరించిన పద్ధతులనే ఈ సారీ అనుసరించవచ్చు. గతంలో 42రోజులపాటు వీరోచితంగాసాగిన సకల జనుల సమ్మెసందర్భంగా పెద్ద ఎత్తున పోలీసులు జులుం ప్రదర్శించారు. సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులను తీవ్రంగా వేధించారు. దీనికి టీ కాంగ్రెస్ నేతల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకతలు పెల్లుబికాయి. మళ్లీ ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నమైతే సమన్వయ కమిటీలో మాట్లాడుకుంటాం.. అన్న మాట చెప్పి ప్రభుత్వం తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
దీంతో టీ కాంగ్రెస్ నాయకుల నోళ్లు మూయించడానికి, వారు కూడా తమపై ఒత్తిళ్లను సమన్వయ కమిటీపైకి నెట్టేసేందుకు వీలు కలుగుతుందన్న వాదన వినిపిస్తోంది. పైగా టీ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడిన పక్షంలో వారిపై కేసుల విషయంలో సర్కారు తానుఅనుకున్నదే చేసేందుకు సమన్వయ కమిటీని ఉపయోగించుకోవచ్చన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. 2014 దాకా తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ సాగదీస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ కాలంలో పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శలదాడి నుంచి తప్పించుకోవడానికే ఈ కమిటీని ఉద్దేశించారని అంటున్నారు.
రాష్ట్రంలో వైఎస్ ప్రాధాన్యాన్ని పూర్తిగా తగ్గించానని, కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు ఆదరించేలా పథకాల రూపకల్పన చేసి వాటిని అమలు చేస్తున్నట్టు కిరణ్‌కుమార్‌డ్డి అధిష్ఠానం వద్ద చెప్పుకొన్నట్టు తెలిసింది. దీంతో జగన్ ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయిందని, వైఎస్‌కున్న పలుకుబడి క్షీణించిందని, దీనివల్ల భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఎనలేని మేలు జరుగుతుందని కిరణ్‌కుమార్‌డ్డి రాష్ర్ట్ర ఇన్‌చార్జి వద్ద గట్టిగా వాదించి, రాష్ట్రంలో తనకు ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురు కాకుండా కమిటీ నిర్మాణం జరిగేందుకు విజయవంతంగా కృషి చేసినట్టు చెబుతున్నారు.
వైఎస్ అత్యధిక ప్రచారం చేసుకున్న రెండు రూపాయల కిలో బియ్యం పథకం, రాజీవ్ ఉద్యోగశ్రీ, పావలా వడ్డీకే రుణాలు తదితర కార్యక్షికమాలు పూర్తిస్థాయిలో మార్చివేసి, వైఎస్ పథకాలు రాష్ట్రంలో లేకుండా చేసినట్టు ఆయన అధిష్ఠానం వద్ద చెప్పుకొన్నారని అంటున్నారు. వాటి స్థానంలో రూపాయికే కిలో బియ్యం, రాజీవ్ ఉద్యోగ కిరణాలు, వడ్డీ లేని రుణాలు అందిస్తూ వాటిని కాంగ్రెస్ పథకాలుగా రాష్ట్ర ప్రజలు గుర్తించేలా ప్రచార కార్యక్షికమాన్ని ముమ్మరం చేసినట్టు కూడా కిరణ్‌కుమార్‌డ్డి అధిష్ఠానానికి వివరించినట్టు సమాచారం.
దీంతో కిరణ్‌కుమార్‌డ్డి అభీష్టం మేరకే సమన్వయ కమిటీ ఏర్పాటైందని, పీసీసీ అధ్యక్షుని హోదాలో కమిటీ సభ్యునిగా ఉన్న బొత్స సత్యనారాయణ మినహా ఇతరుపూవరూ కిరణ్‌కుమార్‌డ్డికి ప్రతికూలంగా మాట్లాడే అవకాశం లేదని, దీంతో ముఖ్యమంత్రి తన పంతాన్ని నెగ్గించుకునే విధంగా కమిటీకి రూపకల్పన జరిగిందని భావిస్తున్నారు. అయితే, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ అధ్యక్షతన జరిగే సమన్వయ కమిటీ సమావేశాల్లో ఆజాద్ ముందు బొత్స సత్యనారాయణ పెద్దగా నిరసనలు తెలిపే అవకాశాలుండవని, అంతా తూతూమంవూతంగా జరుగుతుందనే అభివూపాయం వ్యక్తమవుతోంది.
Take By: T News Read more...