కరకు మాటల కట్జు (Justice Markandey Katju blasts the media )
- సినిమా, క్రికెటర్లకు భారతరత్న ఇస్తారా!
- ఇది దిగజారుడుతనమే- స్వీయ అవసరాల కోసమే 90% పాత్రికేయులు పని చేస్తున్నారు
- వినోదానికే మీడియా ప్రాధాన్యం
- వివాదాస్పదమవుతున్న ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, డిసెంబర్ 23:దేవానంద్ చనిపోతే ఆ వార్తను మొదటి పేజీలో వెయ్యాలా? దేశంలోని మీడియా 90 శాతం వినోదాత్మక అంశాలకే ప్రాధాన్యం ఇస్తోంది! పత్రికా స్వాతంత్య్రం పేరుతో మీడియా పరిధులు దాటి ప్రవర్తిస్తోంది. దేశంలోని 90 శాతం మంది పాత్రికేయులు సామాన్య ప్రజల కోసం కాకుండా, స్వీయ అవసరాల కోసం పనిచేయడం దారుణం! భారత రత్న అవార్డు క్రికెటర్లకు, సినిమా తారలకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది! ఇవి ఎవరో మామూలు వ్యక్తి చేసిన వ్యాఖ్యలు కాదు! దేశ పత్రికా వ్యవస్థను నియంవూతించే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు చైర్మన్‌గా ఇటీవల ఎన్నికైన సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జు చేసిన విమర్శలు! అసలు మీడియా బాధ్యతే లేనట్లు ప్రవర్తిస్తోందన్న స్థాయిలో కట్జు దుమ్మెత్తిపోయడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఏ వ్యవస్థలోనైనా ఎన్నోకొన్నిలోపాలు ఉండటం సహజం. మీడియా అందుకు అతీతమేమీ కాదు. కానీ.. మొత్తం అన్ని మీడియా సంస్థలను కలగలిపేసి మార్కండేయ వరుస వ్యాఖ్యానాలు చేయడంపై అభ్యంతరాలూ వ్యక్తమవుతున్నాయి. అయినా కట్జు కరుకు మాటలు ఆగడం లేదు. తాజాగా ఆయన భారత రత్న అవార్డు ఎవరికి ఇవ్వాలనే అంశంపై స్పందించారు.
కట్జు చేసిన వ్యాఖ్యల్లో కొన్ని...
‘ఇప్పుడు ప్రజలంతా భారతరత్న అవార్డును క్రికెటర్లకు, సినిమాస్టార్లకు ఇవ్వాలని మాట్లాడుతున్నారు. తరిగిపోతున్న సాంస్కృతిక విలువలను ఇది గుర్తు చేస్తోంది. మనం నిజమైన హీరోలను వదిలేస్తున్నాం. ఈరోజు మనదేశం నాలుగు రోడ్ల కూడలిలో నిలబడింది. మన దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపే నాయకుడు కావాలి.
అటువంటివారికే భారతరత్న ఇవ్వాలి. ఇప్పటికే వారు చనిపోయి ఉన్నా వారికి అవార్డు ఇవ్వాలి. క్రికెటర్లు, సినిమాస్టార్ల లాంటి సాంఘిక ఔచిత్యం లేని వారికి భారతరత్న ఇవ్వడం అవార్డు ఔన్యత్యాన్ని దిగజార్చడమే. సచిన్, ధ్యాన్ చంద్ లాంటి వారికి భారతరత్న ఇవ్వడానికి బదులు ఉర్దూ కవి మీర్జా గాలిబ్, బెంగాల్ రచయిత శరత్‌చంద్ర, తమిళనాడు కవి సుబ్రమణ్య భారతికి భారత రత్న ఇవ్వాలి.
l సినిమా నటుడు దేవానంద్ మరణవార్తను మొదటి పేజీలో వేస్తారా? దేశంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల ఫొటోలను మధ్య పేజీలలో వేసి సినిమా స్టార్ మరణవార్తను మొదటిపేజీలో వేయడంలో ప్రాముఖ్యం ఏంటి? భారతదేశ సాంఘిక, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వార్తలు రాయాలి. దేవానంద్ సినిమాలను చిన్నతనంలో చూశాను. ఆయన నటనను ఇష్ట పడ్డాను.
l సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో ఉన్న అనైతిక సమాచారాన్ని తొలగించాలన్న సమాచార శాఖ మంత్రి కపిల్ సిబాల్ అభివూపాయానికి మద్దతు పలుకుతున్నాను. దేశ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాలంటే ఇంటర్‌నెట్‌లో ఉన్న అనైతిక సమాచారాన్ని తొలగించాలి. ఇలా చేయడం తప్పుకాదు.
l దేశంలోని మీడియా 90 శాతం వినోదాత్మక అంశాలకే ప్రాధాన్యం ఇస్తోంది. దేశ ప్రయోజనాలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ప్రజలకు అవసరమైన వార్తలు అందించకుండా, అన్నీ తెలుసని వారికి వారే మేధావులమని అనుకుంటే ఎలా? జర్నలిస్టులంతా చరివూతతోపాటు భాషా పరిజ్ఞానం పెంచుకోవాలి. అప్పుడే వారు రాసిన వార్తలలో తప్పులు దొర్లవు.
l దేశంలోని ఎలక్షిక్టానిక్ మీడియాను కూడా ప్రెస్‌కౌన్సిల్ పరిధిలోకి తీసుకురావాలి. స్వీయనియంవూతణ పాటించని చానళ్లపై చర్యలు తీసుకోవాలి. పత్రికా స్వాతంత్య్రం పేరుతో మీడియా పరిధులు దాటి ప్రవర్తిస్తోంది. అపరిమిత స్వేచ్ఛను అరికట్టాలి.
l పాత్రికేయులంతా మనదేశంలోని సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. దేశంలోని 90 శాతం మంది సామాన్య ప్రజలకోసం పనిచేయకుండా వారి స్వీయ అవసరాల కోసం పనిచేయడం దారుణం. ఈ అంశాలను క్రమబద్ధీకరించడానికి ప్రెస్ కౌన్సిల్‌కు మరిన్ని అధికారాలు కావాలి.
0 comments:
Post a Comment