Thursday, October 13, 2011
Telangana and Darjeeling are different issues
Telangana Urdu conference on Friday
Tags: Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9 Read more...
దీపావళి పటాసే!
- మహారాష్ట్ర, కర్టాటకలో కరెంట్ కట్‌కట్
- 3 నుంచి 16 గంటల దాకా
- పదివేల మెగావాట్ల దాకా లోటు.. అంధకారమైన గ్రామీణ ప్రాంతాలు
- పట్టణాలు, నగరాలకూ సెగ.. మహారాష్ట్రలో జనం ఆందోళన
థర్మల్ విద్యుత్‌లో వెలుగులు వస్తాయి. జల విద్యుత్‌తోనూ అంధకారం తొలగిపోతుంది. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చడం వల్లకూడా వెలుగులు విరబూస్తాయి! రానున్న దీపావళి రోజుల్లో అఖిలభారతమూ బాణాసంచా కాల్చుకుని వెలుగులు నింపుకోవాల్సిన పరిస్థితి రాబోతున్నది! మహోధృతంగా సాగుతున్న తెలంగాణ సకల జనుల సమ్మెలో సింగరేణి బొగ్గు గని కార్మికులు మమేకమవడమే ఈ స్థితికి కారణం. తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా పోరు చేస్తున్న నల్లసూరీళ్లు.. తమ సమ్మె ప్రభావాన్ని యావత్ దేశంపైనా చూపించారు. ఫలితంగా వివిధ రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా లేక కటిక చీకట్లు ఆవరిస్తున్నాయి. దీంతో ఆంధ్రవూపదేశ్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటే తప్ప ఈ అంధకారాన్ని పారదోలలేమని వివిధ రాష్ట్రాల సీఎంలు చేతుపూత్తేస్తున్నారు. తమ తమ రాష్ట్రాల్లో 3 గంటలు మొదలుకు 16 గంటల వరకూ కరెంటు కోతలు విధిస్తున్నారు. తెలంగాణ సమస్యకు పరిష్కారం కోసం సకల తెలంగాణ లోకంతో పాటు వారూ ఎదురు చూస్తున్నారు!
- మహారాష్ట్ర డిమాండ్ 16500 మెగావాట్లు.. ప్రస్తుతం లభ్యత 11వేల మెగావాట్లు
- కర్ణాటకలో 2వేల మెగావాట్ల లోటు.. ప్రస్తుతం లభ్యత 130 మి.యూ.
- ఢిల్లీ డిమాండ్ 3400 మెగావాట్లు.. ప్రస్తుతం లభ్యత 3వేల మెగావాట్లు
- మధ్యవూపదేశ్ డిమాండ్ 7500.. ప్రస్తుత లభ్యత 6000 మెగావాట్లు
- బెంగాల్‌లో 600 మెగావాట్ల కొరత
కునారిల్లుతున్న ఎన్టీపీసీ ప్లాంట్లు ఉత్పత్తి సామర్థ్యం 34 వేల మెగావాట్లు ప్రస్తుత ఉత్పత్తి కేవలం 4వేల మెగావాట్లు గ్రిడ్‌లపై అదనపు భారం.. యూపీ, ఢిల్లీ మధ్య చిచ్చు మహారాష్ట్రలో పరిక్షిశమలకు 16 గంటల కోతకర్ణాటకలోనూ అదే పరిస్థితి.. ఆందోళనలో కేంద్ర ప్రభుత్వంబొగ్గు, విద్యుత్ శాఖల భేటీలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 12: వెలుగులు పంచే దీపావళిని భారతావని ఈ ఏడాది అంధకారంలో జరుపుకొనబోతున్నదా? మరికొద్ది రోజుల్లో సమీపిస్తున్న పండుగలోగా ప్రభుత్వం మేల్కొని కొన్ని కీలకమైన ప్రత్యామ్నాయాలు, చర్యలు తీసుకోని పక్షంలో అమావాస్యనాటి పండుగ దేశవ్యాప్తంగా కటిక చీకట్ల మధ్యనే జరుగనుంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా మహత్తరంగా సాగుతున్న సకల జనులసమ్మె, ఆ సమ్మెలో భాగంగా కీలకమైన సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడం ఈ పరిస్థితికి కారణమైంది. దాని ప్రభావం ఆంధ్రవూపదేశ్‌లోనే కాకుండా.. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరవూపదేశ్, ఆర్థిక రాజధాని ముంబై, దేశం నడిబొడ్డున్న ఉన్న మధ్యవూపదేశ్, దక్షిణాదిన కర్ణాటక సహా దేశంలోని అన్ని రాష్ట్రాలపైనా పడుతున్నది.
మొత్తంగా 7 వేల మెగావాట్లు మొదలుకుని.. పది వేల మెగావాట్ల దాకా ఈ కొరత ఉంటున్నదని అంచనా. ఆంధ్రవూపదేశ్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ తన 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని మూసివేసింది. ఇతర ప్లాంట్లలో ఉత్పత్తిని తగ్గించివేసింది. తమ వ్యవస్థాపక సామర్థ్యం కంటే అతి తక్కువ విద్యుత్‌ను వివిధ ప్రాంతాల్లోని ఎన్‌టీపీసీ ప్లాంట్లు ఉత్పత్తి చేస్తున్నాయి. సింగరేణి సమ్మెకు తోడు వివిధ మైనింగ్ ప్రాంతాల్లో వర్షాలు కూడా కరెంటు కోతలకు కారణమవుతున్నాయి. ఈ పరిస్థితి కేంద్రానికి తీవ్ర ఆందోళన కల్గిస్తున్నది. దీంతో ప్రస్తుత సంక్షోభంపై చర్చించేందుకు బొగ్గు మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్‌ను కేంద్ర విద్యుత్ మంత్రి సుశీల్ కుమార్ షిండే కలువబోతున్నారు. ఇప్పటికే ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బొగ్గు శాఖ అధికారులు అత్యవసర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
పరిస్థితి తీవ్రంగా కనిపిస్తున్నా.. విద్యుత్ శాఖ అధికారులు మాత్రం పండుగ రోజులకు విద్యుత్ కొరత లేకుండా చూస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.
ఢిల్లీలో కటకట
విద్యుత్ కోత వల్ల ఢిల్లీలోని సామాన్య ప్రజలే కాదు.. ఆ రాష్ట్ర విద్యుత్ మంత్రికీ ఇక్కట్లు తప్పలేదు. ఢిల్లీ విద్యుత్ మంత్రి హరున్ యూసఫ్ మంగళవారం పాల్గొన్న ఒక కార్యక్షికమంలో మూడు సార్లు కరెంటు పోయింది. కరెంటు పోవడంతో ఇదే సమయంగా భావించిన సభికులు తమ ప్రాంతాల్లో పదే పదే కరెంటు పోతున్నదంటూ మంత్రికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీ నగరంలో గత కొద్ది రోజులుగా కరెంటు కోతలను ఎదుర్కొంటున్నది. వివిధ విద్యుత్ ఉత్పత్తి స్టేషన్‌ల నుంచి సరఫరాలో ఆటంకాలు ఏర్పడటంతో పాటు ఉత్తరవూపదేశ్‌లోని నార్తరన్ గ్రిడ్ నుంచి దాని పరిధిలోని రాష్ట్రాలకు అధికమొత్తంలో విద్యుత్ సరఫరా కారణంగా మాటిమాటికీ విద్యుత్ సరఫరా నిలిచిపోతున్నది. ఢిల్లీ గరిష్ఠ డిమాండ్ 3200-3400 మెగావాట్లుగా ఉంది.
కానీ.. ప్రస్తుతం 3వేల మెగావాట్ల మేరకే విద్యుత్ సరఫరా అవుతున్నది. ఫలితంగా మూడు నుంచి నాలుగు గంటల పాటు నగరంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ కోతలు విధిస్తున్నారు. అసలే ఒకవైపు బొగ్గు కొరతకు తోడు ఉత్తరాది గ్రిడ్ నుంచిఉత్తరవూపదేశ్, హర్యానాలు అధికమొత్తంలో విద్యుత్‌ను వినియోగించుకుంటున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఆరోపించారు. కేంద్రం తక్షణమే ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇక్కట్లలో మధ్యవూపదేశ్
మధ్యవూపదేశ్ పరిస్థితీ దారుణంగానే ఉంది. రాష్ట్రంలో డిమాండ్ 7500 మెగావాట్లు కాగా.. సరఫరా మాత్రం 6వేల మెగావాట్లు మాత్రమే ఉంటున్నది. మధ్యవూపదేశ్ విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన వనరు బొగ్గు. సింగరేణి నుంచి తగిన స్థాయిలో బొగ్గు సరఫరా లేకపోవడంతో మధ్యవూపదేశ్‌లో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలిగింది.
‘మహా’ దారుణం
మహారాష్ట్ర పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గరిష్ట డిమాండ్ 16500 మెగావాట్లు కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 11వేల మెగావాట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉంటున్నది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 3 గంటలు మొదలుకుని.. 9 గంటల వరకూ కోతలు ఉంటున్నాయి. దీంత దిక్కుతోచని మహారాష్ట్ర విద్యుత్ సంస్థ ‘మహావితరన్’ రాష్ట్రంలో పరిక్షిశమలకు 16 గంటలు కోత విధించాలని నిశ్చయించింది. బుధవారం నుంచి ఈ కోత వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు రోజుల్లో వారానికి ఒకసారి ఉంటుంది. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో కరెంటు కోతలపై మహారాష్ట్రలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వాసాయిలోని రాష్ట్ర విద్యుత్ బోర్డు సరఫరా కేంద్రంపై ప్రజలు దాడి చేసి దహనం చేశారు. థానే, యవత్మాల్, బుల్ధన, నలసొపర, నాశిక్ తదితర చోట్ల కూడా ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి.
మరో ప్రత్యామ్నాయం కూడా లేకపోవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం గత మూడు వారాలుగా అడ్డదిడ్డంగా కోతలు విధిస్తున్నది. పట్టణ ప్రాంతాల్లో ఏడు గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 11 నుంచి 13 గంటల వరకూ కోతలు ఉంటున్నాయి. తెలంగాణలో కొనసాగుతున్న సమ్మె కారణంగానే మహారాష్ట్రలో విద్యుత్ సంక్షోభంనెలకొందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చెప్పారు. సింగరేణిలో సమ్మె కొనసాగుతున్న కారణంగా రాష్ట్రంలోని థర్మల్ పవర్ ప్రాజెక్టులకు బొగ్గు సరఫరా లేక పోవడం వల్లే తాము రాష్ట్రంలో విద్యుత్ కోతలు విధించాల్సి వచ్చిందని చవాన్ బుధవారం ఇక్కడ విలేకరులకు చెప్పారు. మహారాష్ట్రలోని పరాస్, భుసావల్, కొరాడి, చంద్రాపూర్, తదితర ప్లాంట్‌లకు సింగరేణి బొగ్గే ఆధారం. పండుగ సీజన్‌లో విద్యుత్ డిమాండ్ మరింత ఉంటుందన్న విషయం తమ దృష్టిలో ఉందని చెప్పిన ఉపముఖ్యమంత్రి పవార్.. పరిస్థితిని అధిగమించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోళ్ల అంశాన్ని పరిశీలిస్తున్నట్లు విద్యుత్ శాఖను కూడా నిర్వహిస్తున్న పవార్ చెప్పారు. సెంట్రల్ గ్రిడ్‌కు కూడా ఆంధ్రవూపదేశ్ నుంచి వచ్చే బొగ్గే ఆధారమని ఆయన తెలిపారు. కనుక ఆంధ్రవూపదేశ్‌లో పరిస్థితులు సాధారణ స్థాయికి వస్తేనే విద్యుత్ సరఫరా మెరుగవుతుందని అన్నారు.
కర్ణాటక కకావికలు
సింగరేణి సమ్మె ప్రభావం పొరుగునే ఉన్న కర్ణాటక రాష్ట్రంపైనా పడింది. కర్ణాటకలో 2వేల మెగావాట్లకుపైగా లోటు ఉన్నది. ఒక బెంగళూరు నగరానికే వెయ్యి మెగావాట్ల కొరత ఉంది. 160మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా.. కేవలం 130 మిలియన్ యూనిట్ల లభ్యతే ఉంది. పరిస్థితి తీవ్రత నేపథ్యంలో వారాంతపు సెలవుల పద్ధతికి బదులు వారంలో అందరికీ ఒక రోజు సెలవు ఇచ్చే పద్ధతిని అనుసరించాలని రాష్ట్రంలోని పరిక్షిశమలను కర్ణాటక ప్రభుత్వం కోరింది. పరిక్షిశమల్లో రోస్టర్ విధానం అమలు చేయడంతో పాటు బెంగళూరు నగరంలో నివాస ప్రాంతాలకు నిర్దిష్ట సమయాల్లో కోతలను కూడా అమలు చేస్తున్నది.
నగరాలు, పట్టణాల్లో సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ కరెంటు కోత విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర ప్రాంతాల్లో 8 గంటల మేర విద్యుత్ కోతలు విధించాలని తీర్మానించింది. రాష్ట్రంలోని థర్మల్ పవర్ ప్రాజెక్టులకు బొగ్గు సరఫరా చేసే ఆంధ్రవూపదేశ్‌లో పరిస్థితిలు సాధారణ స్థాయికి వచ్చేదాకా ఈ పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బెంగళూరు నగరాని నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తామని రాష్ట్ర విద్యుత్ సంస్థ బెస్కామ్ చెబుతునప్పటికీ.. అడపాదడపా కరెంటు పోతూనే ఉన్నదని బెంగళూరు వాసులు చెబుతున్నారు.
బెంగాల్‌లోనూ కోతలే
కోల్‌కతా నగరాన్ని మినహాయిస్తే బెంగాల్‌లోని 90 లక్షల విద్యుత్ వినియోగదారులకు రోజుకు 4-5 గంటల పాటు విద్యుత్ కోతలు ఎదురవుతున్నాయి. రోజుకు 600 మెగావాట్ల కొరతను బెంగాల్ ఎదుర్కొంటున్నది. ఉత్తరవూపదేశ్‌లోనూ విద్యుత్ కొరత తీవ్రంగా ఉంది. ఉత్తరవూపదేశ్ ముఖ్యమంత్రి మాయావతి కూడా ఆంధ్రవూపదేశ్‌లో పరిస్థితులు సాధారణ స్థాయికి రానంత వరకూ ఇక్కడ కూడా విద్యుత్ కోతలు తప్పవని చెప్పారు. ఉత్తరాది జాతీయ గ్రిడ్ నుంచి యూపీ 12వందల మెగావాట్ల అధిక విద్యుత్‌ను వాడుకుంటున్నదని ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్న విమర్శల నేపథ్యంలో ఆమె ఈ విధంగా స్పందించారు.
కష్టాల్లో ఎన్టీపీసీ
- దెబ్బతీసిన సింగరేణి సమ్మె
- ఇతర ప్రాంతాల నుంచీ బొగ్గు బంద్
న్యూఢిల్లీ, అక్టోబర్ 12 :దేశంలోని వివిధ ప్రాంతాల్లో థర్మల్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. దక్షిణాదిలో తెలంగాణ డిమాండ్‌తో సింగరేణి కార్మికులు సమ్మెకు దిగిన నేపథ్యంలో అక్కడ బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోవడం, మరోవైపు తూర్పు, మధ్య ప్రాంతాల్లోని బొగ్గు గనుల్లో భారీ వర్షాల కారణంగా ఉత్పత్తి నిలిచిపోవడంతో ఎన్టీపీసీ డీలాపడింది. ఫలితంగా దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయలో విద్యుత్ కొరత నెలకొని ఉంది. దేశంలో థర్మల్ విద్యుత్ సరఫరా చేయడంలో ఎన్టీపీసీదే కీలక పాత్ర. ఇది 34వేల మెగావాట్లను ఉత్పత్తి చేస్తుంది. ఒక విధంగా ప్రపంచంలోనే దీనికి ఒకటవ స్థానం.
కానీ.. ఇప్పుడు ఆ సంస్థ ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ కేవలం 4వేల మెగావాట్లు మాత్రమే! ఢిల్లీలోని దాద్రి, ఉత్తరాదిలో సింగ్రౌలి, ఉంచార్, మధ్యవూపదేశ్‌లోని వింధ్యాంచల్, ఫరక్కా, తూర్పు ప్రాంతంలోని కహలాగాంవ్, దక్షిణాదిన రామగుండం, సింహాద్రి ప్లాంట్లు బొగ్గు సరఫరా లేక తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఢిల్లీలోని బహదూర్‌పురా ప్లాంటు ఆగ్రా కాలువ నుంచి నీటి సరఫరా లేకపోవడంతో ఉత్పత్తిని తగ్గించి వేసింది. విద్యుత్ ప్లాంట్లలోని కూలింగ్‌టవర్స్ కోసం ఈ నీటిని వినియోగిస్తారు. సింగరేణితో పాటు ఉత్తర, మధ్య, తూర్పు కోల్‌ఫీల్డ్స్‌తో పాటు మహానది బొగ్గు గనుల నుంచి ఎన్టీపీసీ ప్లాంట్‌లకు బొగ్గు సరఫరా నిలిచిపోయింది.
సమ్మె విచ్ఛిన్నానికి సీఎం కుట్ర?
- కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో మంతనాలు
- గ్రేటర్ ఎమ్మెల్యేల పేరుతో డ్రామా
- చేతులు మారిన రూ.150 కోట్లు?
- తెలంగాణ విద్యార్థులపై నేతల కపట ప్రేమ
- పేరెంట్స్ కమిటీ ముసుగులో గందరగోళం
హైదరాబాద్, అక్టోబర్ 12(టీ న్యూస్): తెలంగాణ ఉద్యమం నుంచి విద్యార్థులను వేరు చేయాలనే కార్పొరేట్ కుట్ర జరుగుతోంది. కార్పొరేట్ కళాశాలల విద్యార్థులకు తెలంగాణ కోసం ఉద్యమించాలన్న భావన పెరిగింది. విద్యాసంస్థలను బహిష్కరించి ఉద్యమంలో పాల్గొంటుండడంతో సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీంతో విద్యార్థుల తల్లిదంవూడులతో ఒత్తిళ్లు చేయించి కళాశాలలను నడిపించాలని కుట్ర పన్నింది. ఈకుట్ర కూడా విఫలమవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా రంగంలోకి దింపింది. ఇందులో భాగంగానే సమ్మె చేస్తున్న వారిపై కూడా దాడులు చేస్తామనే సంకేతాలను కిరణ్ సర్కారు ఇస్తోంది. సీమాంధ్ర కార్పొరేట్ విద్యాసంస్థలతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి కుమ్మకై్క సమ్మె విచ్ఛిన్నానికి కుట్ర పన్నారు. సమ్మెతో విద్యార్ధుల భవిష్యత్‌ను నాశనం చేయొద్దంటూ కొత్త నినాదం ఎత్తుకున్నారు. గతంలో ఇదే ముఖ్యమంత్రి తెలంగాణ కావాలని ఉద్యమించిన పేద విద్యార్థులను పోలీసులతో విచక్షణారహితంగా కొట్టించారు. విశ్వవిద్యాలయాలను పోలీస్ క్యాంప్‌లుగా మార్చారు.
కానీ కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తమ వ్యాపారం దెబ్బతింటుందనగానే హడావుడిగా సీఎం రంగంలోకి దిగారు. వారితో రహస్య మంతనాలు చేశారు. ఐఐటీ, మెడిసిన్ భ్రమల్లో సగటు విద్యార్థుల తల్లిదంవూడులను ఉంచి, కోట్లు దండుకుంటున్న సీమాంధ్ర కార్పొరేట్ విద్యాసంస్థలను కాపాడటానికి నడుం బిగించారు. సర్కారు విద్య సర్వ నాశనమైనా ఫర్వాలేదు కానీ, ఇక ప్రైవేట్ విద్యాసంస్థకు ఇబ్బంది కలుగకూడదన్న తీరుగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు సీమాంవూధకు చెందిన టీడీపీ నేతలను కూడా కలుపుకొని సమ్మెకు వ్యతిరేకంగా కృత్రిమ ఆందోళనలు చేయించే కార్యక్షికమానికి పూనుకున్నారు. ఈ వ్యవహారంలో సీమాంధ్ర కార్పొరేట్ విద్యాసంస్థల నుంచి రూ.150 కోట్లు చేతులు మారినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పేరెంట్స్ కమిటీ పేర్లతో రగడ
హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కొంత మంది విద్యార్థుల తల్లిదంవూడులతో విలేకరుల సమావేశాలు పెట్టించి ఉద్యమం నుంచి విద్యార్థుల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌కు చెందిన ఎన్నారై కాలేజీ వద్ద కుట్రను మొదలుపెట్టి, ప్రభుత్వం నెమ్మదిగా తెలంగాణ వ్యతిరేక శక్తులను కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. పేరెంట్స్ కమిటీల పేరుతో సమ్మె పట్ల దుష్ర్పచారం చేస్తోంది. ఇందులో భాగంగానే సంగాడ్డి ఎమ్మెల్యే తూర్పు జయవూపకాశ్ రెడ్డి భార్య, సంగాడ్డి కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నిర్మల కొంత మంది మహిళలను వెంటబెట్టుకుని సంగాడ్డి ఐబీ గెస్ట్‌హౌజ్ వద్ద ఆందోళన చేపట్టారు. పెద్దగా తెలంగాణవాదుల నుంచి మద్దతు లభించక పోవటంతో ఆందోళన విరమించారు. విశాలాంధ్ర పేరుతో కొంత మంది సీమాంధ్ర నేతలు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో పరకాల ప్రభాకర్, మాజీ ఐపీఎస్ ఆంజనేయడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న వారు విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక విలేకరులపై చిందులేశారు.
గ్రేటర్ ఎమ్మెల్యేలను రంగంలోకి దించిన సీఎం
ముఖ్యమంత్రి కిరణ్ బాధ్యతను ఆయన అనుంగులైన గ్రేటర్ ఎమ్మెల్యేలు నెత్తికెత్తుకున్నారు. మంగళ, బుధవారాలలో సీఎల్‌పీ కేంద్రంగా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ఎమ్మెల్యేలు, ఇందులో గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు, రంగాడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు మీడియా సమావేశాలు నిర్వహించి విద్యాసంస్థలను, విద్యుత్‌ను సమ్మెనుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున చేతులు మారడంతో ఈ మేరకు విద్యార్థుల పేరుతో కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ ఎమ్మెల్యేలు డ్రామాలాడుతున్నారని తెలంగాణవాదులు తీవ్రంగా మండిపడుతున్నారు. తెలంగాణ కోసం అధిష్ఠానంపై ఒత్తిడి తేవడం చాతకాని ఈ నేతలు సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి విద్యార్థుల చదువులను సాకుగా చూపుతున్నారంటున్నారు.
సమ్మెనుంచి విద్యాసంస్థలను మినహాయించాలనడం కాదు... సమస్య పరిష్కరించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, అది చాతకానప్పుడు సమ్మెనుంచి మినహాయింపులు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు లేదని తెలంగాణ నగార ఎమ్మెల్యే హరీశ్వర్‌డ్డి మండిపడ్డారు. విద్యాసంస్థలను సమ్మెనుంచి మినహాయించమని కోరడం కాదు... తెలంగాణ తెస్తే అసలు సమ్మెనే ఉండదు కదా... ఆదిశగా ప్రయత్నం చేయమని టీడీపీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌డ్డి గ్రేటర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుధీర్‌డ్డి, రాజిడ్డి, భిక్షపతియాదవ్‌లకు సలహా ఇచ్చారు.
ఆదాయంపై ప్రభావం చూపుతుందనే...
హైదరాబాద్‌తో సహా వివిధ తెలంగాణ జిల్లాలో సీమాంధ్ర కార్పొరేట్ విద్యాసంస్థలు దాదాపు మూడునుంచి నాలుగు వేల కోట్ల రూపాయల మధ్య వ్యాపారం కొనసాగిస్తున్నాయని ఒక అంచనా. ఈ సమ్మె ఇలాగే కొనసాగితే విద్యాసంస్థల క్యాలెండర్ దెబ్బతింటుందని, ఫలితంగా వ్యాపారంలో భారీగా లాభాలు పడిపోతాయని కార్పొరేట్ విద్యాసంస్థలు భావిస్తున్నాయి.. హైదరాబాద్‌తో పాటు వివిధ తెలంగాణ జిల్లాలో శ్రీ చైతన్య, నారాయణ, గాయత్రి, గౌతమి, ఎన్‌ఆర్‌ఐ, వికాస్, విజ్ఞాన్‌లతో పాటు కార్పొరేట్ టెక్నోస్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇలా ఒక్కో సంస్థ వందల సంఖ్యలో తమ బ్రాంచీలను నిర్వహిస్తున్నాయి. ఈ విద్యాసంస్థల ఒక్కో క్యాంపస్‌లో 1500ల నుంచి రెండు వేల వరకు విద్యార్థులున్నారు. ఈ సంస్థలు ఒక్కో విద్యార్థి నుంచి ఏడాదికి రూ.
Tags: Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9
రైల్‌రోకోలో పాల్గొంటాం
- తెలంగాణ ఇవ్వండి లేదంటే రాజీనామాలు ఆమోదించండి
- రాజీనామాలపై స్పీకర్‌ను కలిసిన టీ కాంగ్రెస్ ఎంపీలు
- పరిశీలిస్తానని మీరాకుమార్ హామీ:తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల స్పష్టీకరణ
- అవసరమైతే పార్టీ సభ్యత్వాన్ని వదులుకుంటా: రాజగోపాల్‌రెడ్డి
- మాకు కసబ్‌కు మించిన శిక్షలా: ఎంపీ పొన్నం
- రైల్‌రోకోలో పాల్గొంటామని అధిష్ఠానానికి తెలిపాం: వివేక్
- విధిలేని పరిస్థితుల్లోనే సమ్మెలో పాల్గొంటున్నాం: మందా
న్యూఢిల్లీ, అక్టోబర్ 12 (టీన్యూస్):‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి, లేదా మా రాజీనామాలు ఆమోదించండి’ అని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు తేల్చిచెప్పారు. రాజకీయ జేఏసీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న రైల్‌రోకోలో తామూ పాల్గొంటామని స్పష్టం చేశారు. తెలంగాణ సమస్య పరిష్కారంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా తమ రాజీనామాలను ఆమోదించాలని టీ కాంగ్రెస్ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్‌ను బుధవారం ఆమె కార్యాలయంలో కలిశారు. జూన్ 4న చేసిన తమ రాజీనామాలపై ఆమోదించాలని కోరారు. అందరి అభివూపాయాలను సావధానంగా విన్న స్పీకర్ రాజీనామాల పరిశీలన వేగవంతంగా జరుగుతోందని ఎంపీలకు హమీ ఇచ్చారు. స్పీకర్‌ను కలిసిన వారిలో రాజ్యసభ సభ్యుడు కే కేశవరావుతో పాటు ఎంపీలు మందా జగన్నాథం, గుత్తా సుఖేందర్‌డ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్, కోమటిడ్డి రాజ్‌గోపాల్‌డ్డి, రాజయ్య, మధుయాష్కీ, బలరాం నాయక్‌లు ఉన్నారు.
అనంతరం పార్లమెంటు ఎదుట మీడియా పాయింట్‌లో ఎంపీలు కేకే, మధు యాష్కీ మాట్లాడుతూ రాజీనామా చేసిన ఎంపీ సురేష్ షెట్కార్ బాన్సువాడ ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నందున స్పీకర్‌ను కలిసేందుకు తమతోపాటు రాలేకపోయారని గుత్తా సుఖేందర్‌డ్డి తెలిపారు. స్పీకర్ కోరితే ఒక్కొక్కరిగా కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాజీనామాల ఆమోదం అనేది స్పీకర్ విచక్షణాధికార పరిధిలోని అంశమైనందున, ఇంతకుమించి తాము ఎక్కువ మాట్లాడలేమని పేర్కొన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతోనే రాజీనామాల ఆమోదానికి పట్టుబట్టామని అన్నారు.
రైల్ రోకోను విజయవంతం చేయండి: ఎంపీలు
15వ తేదీ నుంచి తెలంగాణలో నిర్వహించ తలపెట్టిన రైల్‌రోకోలో ప్రత్యక్షంగా పాల్గొనాలని టీ కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయించారు. కేశవరావు నివాసంలో బుధవారం ఉదయం రెండు గంటల పాటు జరిగిన ఎంపీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రైల్‌రోకోను విజయవంతం చేయడానికి జిల్లాల వారీగా ఎంపీలు రైల్వేస్టేషన్ల బాధ్యతలను సైతం స్వీకరించారు. కేశవరావు నల్లగొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఒక్కొక్కరోజు రైల్‌రోకోలో పాల్గొనబోతున్నారు. ఈ సమావేశం అనంతరం ఎంపీ బలరామ్ నాయక్ విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రైల్‌రోకోలో పాల్గొని, ఈ కార్యక్షికమాన్ని విజయవంతం చేయాలని నిర్ణయించామని చెప్పారు. రైల్‌రోకో ద్వారా అధిష్ఠానం, కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. అధికార పార్టీ సభ్యులైనప్పటికీ, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే సమ్మెలో పాల్గొంటున్నామని తెలిపారు. ఎంపీ మందా జగన్నాథ్ మాట్లాడుతూ ప్రజలనుంచి ఎన్ని విమర్శలు వచ్చినా నిర్ణయం కోసం ఇంతకాలం వేచి చూశామని, ఇక తమకు ఓపిక నశించడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మెలో పాలుపంచుకోనున్నామన్నారు.
కొలువులను పణంగా పెట్టి మరీ ఉద్యోగులు ఉద్యమిస్తుంటే తాము ఇళ్లలో కూర్చోలేమని కోమటిడ్డి రాజగోపాల్‌డ్డి పేర్కొన్నారు. అవసరమైతే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి మరీ ఉద్యమిస్తామని చెప్పారు. ముఖ్యమంవూతితో కుమ్మకై్కన కొందరు ఎమ్మెల్యేలు సమ్మెను విరమించాలని నీతులు బోధించాల్సిన అవసరం లేదని మండిపడ్డారు.
మాకు కసబ్‌కు మించిన శిక్షలా: పొన్నం
రైల్‌రోకోలో పాల్గోనే వారికి ఉగ్రవాది కసబ్‌కు విధించిన శిక్షకు మించిన శిక్షలు విధిస్తామని బెదిరించడం ఏంటని ఎంపీ పొన్నం ప్రశ్నించారు. వివేక్ మాట్లాడుతూ శాంతియుతంగా సమ్మె చేస్తున్న ఉద్యోగులపై పోలీసు నిర్భందాన్ని వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. బలగాలను వెనక్కు పిలవాలని కేంద్రాన్ని కోరారు. రైల్‌రోకోను విజయవంతం చేస్తామన్న విషయాన్ని పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్ ద్వారా అధిష్ఠానానికి నివేదించామని తెలిపారు. రైల్‌రోకోను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకొని తీరతామంటూ భయోత్పాతాన్ని సృష్టిస్తున్న డైరెక్టర్ జనరల్ హుడాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీ కాంగ్రెస్ నేతలు కేంద్ర హోంమంత్రి చిదంబరాన్ని గురువారం కలవనున్నారు. ఈ మేరకు అపాయింట్‌మెంటు కోరుతూ ఎమ్మెల్సీలు అమోస్, యాదవడ్డి చిదంబరానికి లేఖ రాశారు.
Tags: Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9
ఆ‘జాదూ’పై సోనియా నజర్!
- సీమాంవూధులతో చెట్టపట్టాలు
- టీ నేతలతో అంటీముట్టక లగడపాటితో గంటల తరబడి భేటీలు
- సీమాంవూధలో రాజకీయ పర్యటనలు
l వారి నుంచి సూట్‌కేసులు?
- ఆజాద్ తీరుపై అనుమానం
- అందుకే తెలంగాణ అంశంలో పక్కకుపోయిన రాష్ట్ర ఇన్‌చార్జి
- ప్రణబ్‌నూ నమ్మని అధినేత్రి!
- పటేల్, ఆంటోనీతో మినీ కోర్‌కమిటీ
- ఆజాద్ నివేదికను పట్టించుకోని వైనం
-మినీకోర్ కమిటీ నివేదికపైనే చర్చ
హైదరాబాద్, అక్టోబర్ 12 (టీ న్యూస్) :అధికారానికి ఏళ్ల తరబడి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ను 1994లో తానే అధికారంలోకి తెచ్చానని ఆయన చెప్పుకుంటుంటారు! తాను ఏపీ వ్యవహారాలకు దూరంగా ఉన్నప్పటి నుంచే రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయని ఆయన అంటుంటారు. వైఎస్ మరణానంతరం అవి మరింత పుంజుకున్నాయని చెబుతూ ఉంటారు. తాను లేనిదే ఏపీ కాంగ్రెస్ లేదన్న స్థాయిలో మాటలు చెప్పే గులాం నబీ ఆజాద్‌ను ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానం ఎందుకు పక్కనపెడుతున్నది? మూడు ప్రాంతాల నేతలతో చర్చలు జరిపి ఆజాద్ తయారు చేసిన నివేదికను కాదని, అహ్మద్‌ప ఏకే ఆంటోనీల సమక్షంలో మినీకోర్ కమిటీ ఇచ్చిన నివేదికపైనే కాంగ్రెస్ కోర్‌కమిటీ ఎందుకు చర్చించింది? ఈ విషయంలో లోతుపాతులను వెతికితే అనూహ్య అంశాలు బయటికి వస్తున్నాయి.
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ సీమాంధ్ర నేతల ప్రభావానికి, ప్రలోభాలకు లోనయ్యారని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నదని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సీమాంధ్ర నేతలు అందిస్తున్న సూట్‌కేసులకు ఆయన సంతృప్తిపడుతున్నారని మేడం దృష్టికి వచ్చిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఆ కారణంగానే తెలంగాణ సమస్య పరిష్కారం విషయంలో ఆజాద్‌ను పక్కన పెట్టినట్లు సమాచారం.
సీమాంధ్ర నేతలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ టీ కాంగ్రెస్ నేతలతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఆజాద్ వైఖరి మొదటి నుంచి విమర్శలకు గురవుతూనే ఉంది. ఆయన అధిక సమయం సీమాంవూధులతోనే గడుపుతున్నారని గతంలోనే విమర్శలు వచ్చాయి. టీ కాంగ్రెస్ నేతలతో ఆజాద్ చర్చలు జరిపిన తరువాత విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆజాద్ ఇంటికి వెళ్లి నాలుగైదు గంటలు ఆయనతో మాట్లాడారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారిని ఆజాద్ ప్రోత్సహిస్తున్నారని, ఇక్కడ ఆయన పర్యటనలు కూడా అదేవిధంగా ఉంటున్నట్టు సోనియాగాంధీ దృష్టికి వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. గాంధీ జయంతి జరిగిన అక్టోబరు 2న ఆజాద్ విజయవాడ పర్యటన లక్ష్యం, ఉద్దేశం సోనియాగాంధీ దృష్టికి వచ్చిందని భావిస్తున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షతో ఒకవైపు సకల జనుల సమ్మె ఉధృతంగా కొనసాగుతుండగా కేవలం లగడపాటిని సంతృప్తి పరిచేందుకు విజయవాడలో రాజకీయ కార్యక్షికమానికి ఆజాద్ వచ్చారని, ఆజాద్ కూడా ‘సంతృప్తి’ పడి వెళ్లిపోయారని విమర్శలు వచ్చాయి. తరువాత సీమాంధ్ర నేతల నుంచి మరో ఎంపీ కావూరి సాంబశివరావు వాదనలు వినేందుకు ఆజాద్ హస్తినలో ప్రత్యేకంగా సమయం కేటాయించారు. సమైక్యాంవూధకు అనుకూలంగా తన వాదనలు వినిపించేందుకు కావూరి అదేరోజు లగడపాటి, కేవీపీ రాంచందర్‌రావులతో ఢిల్లీలో సమావేశమై పూర్తిస్థాయిలో తయారయ్యారు. ఆ రోజు సాయంత్రం ఆయన ఆజాద్ ఇంటికి వెళ్లి, తన వాదనలు వినిపించాల్సి ఉంది. అయితే, చివరి నిమిషంలో ఈ సమావేశం రద్దు కావటం చర్చనీయమైంది. దీనికి కారణం సోనియా ఆదేశాలేనని సమాచారం.
సీమాంవూధుల నుంచి ఆజాద్ ప్రత్యేకంగా ఏదో ఆశిస్తున్నారని, వారి వాదనలకు లేదా వారి అభివూపాయాలకు ‘విలువ’నిచ్చి తెలంగాణవాదులతో మాత్రం తెలంగాణ ఇవ్వటం తన చేతుల్లో లేదని ఏదో మాటలు చెప్పి పంపించారని, ఇదంతా నిఘావర్గాల ద్వారా సోనియా దృష్టికి వచ్చినట్టు చెబుతున్నారు. మరో కీలక నేత ప్రణబ్ ముఖర్జీ కూడా తెలంగాణపై మొదటి నుంచి కొంత వ్యతిరేకతతో ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఆయన ‘డిసెంబరు 9 ప్రకటన’ను కూడా వ్యతిరేకించారని, తాను ఆ రోజు ఢిల్లీలో ఉండి ఉంటే ఇలాంటి ప్రకటన వచ్చి ఉండేది కాదని చెప్పినట్టు కూడా వార్తలొచ్చాయి. ఇటీవల ఓ వార్తా చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలోనూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంత ఆషామాషీ కాదని, రాష్ట్రాల విభజనకు ప్రత్యేక ప్రాతిపదిక అవసరమని చెప్పినట్టుగా వచ్చిన వార్తలపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ప్రణబ్ తాను అలా అనలేదంటూ తప్పించుకున్నారు.
అయినా, తెలంగాణవాదుల్లో ప్రణబ్‌పట్ల విశ్వాసం పెరగలేదు. దీంతో సోనియా అటు ఆజాద్‌ను ఇటు ప్రణబ్‌ను కూడా విశ్వాసంలోకి తీసుకోకుండా తనకు విశ్వాసపావూతులైన అహ్మద్ పటేల్, ఏకే ఆంటోనీలను భాగస్వాములుగా చేస్తూ మినీ కోర్ కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో అక్టోబరు 2 తరువాత జరుగుతున్న ప్రతీ సమావేశాల్లోనూ అహ్మద్ పటేల్, ఆంటోనీ ఉండి తెలంగాణ అంశాన్ని సమీక్షిస్తున్నారు. ట్రబుల్ షూటర్‌గా పేరు పొందిన ప్రణబ్‌కు ముందుగా బాధ్యతలు అప్పగించి ఆయనపై విశ్వాసముంచిన సోనియా తరువాతి పరిణామాలతో మనసు మార్చుకుని తెలంగాణ సమస్యను ప్రత్యేక కమిటీ ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అప్పటివరకు ఆజాద్ ఆయా ప్రాంతాల నేతల నుంచి సేకరించిన అభివూపాయాలను కూడా పరిగణలోకి తీసుకోని పరిస్థితి ఏర్పడింది. ప్రణబ్ ఆధ్వర్యంలో తిరిగి మినీ కోర్ కమిటీ పలు సమావేశాలు నిర్వహించి తయారు చేసిన నివేదికను ప్రధాని మన్మోహన్ అధ్యక్షతన జరిగే కోర్ కమిటీకి ఇటీవల సమర్పించింది.
దీంతో అక్టోబరు 2 వరకు ఆజాద్ చేసిన ప్రయత్నాలన్నింటికీ విలువ లేకుండా పోయిందని ఏఐసీసీ వర్గాలు అంటున్నాయి. ఆంటోనీ, అహ్మద్ పటేల్ సమక్షంలో జరిగిన మినీ కోర్ కమిటీకే ప్రాధాన్యం ఏర్పడిందని, ఈ మినీ కోర్ కమిటీ ఇచ్చిన రిపోర్టుపైనే సోమవారం ప్రధాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమీక్షించినట్టు విశ్వసనీయ సమాచారం. మారుతున్న పరిణామాలు తెలంగాణకు అనుకూలంగా ఉంటున్నాయని, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పటం, గూర్ఖాలాండ్ కోసం పోరాడుతున్న నేతలు తెలంగాణకు అనుకూలంగానే స్పందించటం వల్ల కూడా జాతీయ స్థాయిలో మార్పు కనిపిస్తోంది. వీటన్నింటికంటే ఉత్తరవూపదేశ్‌లో త్వరలో జరగబోయే ఎన్నికలు కీలకం కాబోతున్నాయి. యూపీని మూడు రాష్ట్రాలుగా విభజించాలని అక్కడి కాంగ్రెస్ కమిటీ ఇప్పటికే తీర్మానించింది. దీనికి యూపీ సీఎం కూడా అనుకూలంగానే ఉన్నారు.
యూపీ ఎన్నికల నోటిఫికేషన్ ముందే కాంగ్రెస్ పార్టీ చిన్న రాష్ట్రాలకు అనుకూలమని ప్రకటిస్తే తప్ప ఆ ఎన్నికల్లో నిలదొక్కుకునే అవకాశాల్లేవు. దీనిని నిరూపించుకోవాలంటే కాంగ్రెస్ తెలంగాణకు అనుకూలమని ప్రకటించాల్సి ఉంటుందని, ఈ దిశలోనే కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ అభివూపాయాన్ని ముందుగా ప్రకటించి తెలంగాణపై జాతీయ స్థాయిలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటారని తెలంగాణవాదులు విశ్వసిస్తున్నారు.