ఆ‘జాదూ’పై సోనియా నజర్!
- సీమాంవూధులతో చెట్టపట్టాలు
- టీ నేతలతో అంటీముట్టక లగడపాటితో గంటల తరబడి భేటీలు
- సీమాంవూధలో రాజకీయ పర్యటనలు
l వారి నుంచి సూట్‌కేసులు?
- ఆజాద్ తీరుపై అనుమానం
- అందుకే తెలంగాణ అంశంలో పక్కకుపోయిన రాష్ట్ర ఇన్‌చార్జి
- ప్రణబ్‌నూ నమ్మని అధినేత్రి!
- పటేల్, ఆంటోనీతో మినీ కోర్‌కమిటీ
- ఆజాద్ నివేదికను పట్టించుకోని వైనం
-మినీకోర్ కమిటీ నివేదికపైనే చర్చ
హైదరాబాద్, అక్టోబర్ 12 (టీ న్యూస్) :అధికారానికి ఏళ్ల తరబడి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ను 1994లో తానే అధికారంలోకి తెచ్చానని ఆయన చెప్పుకుంటుంటారు! తాను ఏపీ వ్యవహారాలకు దూరంగా ఉన్నప్పటి నుంచే రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయని ఆయన అంటుంటారు. వైఎస్ మరణానంతరం అవి మరింత పుంజుకున్నాయని చెబుతూ ఉంటారు. తాను లేనిదే ఏపీ కాంగ్రెస్ లేదన్న స్థాయిలో మాటలు చెప్పే గులాం నబీ ఆజాద్‌ను ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానం ఎందుకు పక్కనపెడుతున్నది? మూడు ప్రాంతాల నేతలతో చర్చలు జరిపి ఆజాద్ తయారు చేసిన నివేదికను కాదని, అహ్మద్‌ప ఏకే ఆంటోనీల సమక్షంలో మినీకోర్ కమిటీ ఇచ్చిన నివేదికపైనే కాంగ్రెస్ కోర్‌కమిటీ ఎందుకు చర్చించింది? ఈ విషయంలో లోతుపాతులను వెతికితే అనూహ్య అంశాలు బయటికి వస్తున్నాయి.
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ సీమాంధ్ర నేతల ప్రభావానికి, ప్రలోభాలకు లోనయ్యారని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నదని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సీమాంధ్ర నేతలు అందిస్తున్న సూట్‌కేసులకు ఆయన సంతృప్తిపడుతున్నారని మేడం దృష్టికి వచ్చిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఆ కారణంగానే తెలంగాణ సమస్య పరిష్కారం విషయంలో ఆజాద్‌ను పక్కన పెట్టినట్లు సమాచారం.
సీమాంధ్ర నేతలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ టీ కాంగ్రెస్ నేతలతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఆజాద్ వైఖరి మొదటి నుంచి విమర్శలకు గురవుతూనే ఉంది. ఆయన అధిక సమయం సీమాంవూధులతోనే గడుపుతున్నారని గతంలోనే విమర్శలు వచ్చాయి. టీ కాంగ్రెస్ నేతలతో ఆజాద్ చర్చలు జరిపిన తరువాత విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆజాద్ ఇంటికి వెళ్లి నాలుగైదు గంటలు ఆయనతో మాట్లాడారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారిని ఆజాద్ ప్రోత్సహిస్తున్నారని, ఇక్కడ ఆయన పర్యటనలు కూడా అదేవిధంగా ఉంటున్నట్టు సోనియాగాంధీ దృష్టికి వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. గాంధీ జయంతి జరిగిన అక్టోబరు 2న ఆజాద్ విజయవాడ పర్యటన లక్ష్యం, ఉద్దేశం సోనియాగాంధీ దృష్టికి వచ్చిందని భావిస్తున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షతో ఒకవైపు సకల జనుల సమ్మె ఉధృతంగా కొనసాగుతుండగా కేవలం లగడపాటిని సంతృప్తి పరిచేందుకు విజయవాడలో రాజకీయ కార్యక్షికమానికి ఆజాద్ వచ్చారని, ఆజాద్ కూడా ‘సంతృప్తి’ పడి వెళ్లిపోయారని విమర్శలు వచ్చాయి. తరువాత సీమాంధ్ర నేతల నుంచి మరో ఎంపీ కావూరి సాంబశివరావు వాదనలు వినేందుకు ఆజాద్ హస్తినలో ప్రత్యేకంగా సమయం కేటాయించారు. సమైక్యాంవూధకు అనుకూలంగా తన వాదనలు వినిపించేందుకు కావూరి అదేరోజు లగడపాటి, కేవీపీ రాంచందర్‌రావులతో ఢిల్లీలో సమావేశమై పూర్తిస్థాయిలో తయారయ్యారు. ఆ రోజు సాయంత్రం ఆయన ఆజాద్ ఇంటికి వెళ్లి, తన వాదనలు వినిపించాల్సి ఉంది. అయితే, చివరి నిమిషంలో ఈ సమావేశం రద్దు కావటం చర్చనీయమైంది. దీనికి కారణం సోనియా ఆదేశాలేనని సమాచారం.
సీమాంవూధుల నుంచి ఆజాద్ ప్రత్యేకంగా ఏదో ఆశిస్తున్నారని, వారి వాదనలకు లేదా వారి అభివూపాయాలకు ‘విలువ’నిచ్చి తెలంగాణవాదులతో మాత్రం తెలంగాణ ఇవ్వటం తన చేతుల్లో లేదని ఏదో మాటలు చెప్పి పంపించారని, ఇదంతా నిఘావర్గాల ద్వారా సోనియా దృష్టికి వచ్చినట్టు చెబుతున్నారు. మరో కీలక నేత ప్రణబ్ ముఖర్జీ కూడా తెలంగాణపై మొదటి నుంచి కొంత వ్యతిరేకతతో ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఆయన ‘డిసెంబరు 9 ప్రకటన’ను కూడా వ్యతిరేకించారని, తాను ఆ రోజు ఢిల్లీలో ఉండి ఉంటే ఇలాంటి ప్రకటన వచ్చి ఉండేది కాదని చెప్పినట్టు కూడా వార్తలొచ్చాయి. ఇటీవల ఓ వార్తా చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలోనూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంత ఆషామాషీ కాదని, రాష్ట్రాల విభజనకు ప్రత్యేక ప్రాతిపదిక అవసరమని చెప్పినట్టుగా వచ్చిన వార్తలపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ప్రణబ్ తాను అలా అనలేదంటూ తప్పించుకున్నారు.
అయినా, తెలంగాణవాదుల్లో ప్రణబ్‌పట్ల విశ్వాసం పెరగలేదు. దీంతో సోనియా అటు ఆజాద్‌ను ఇటు ప్రణబ్‌ను కూడా విశ్వాసంలోకి తీసుకోకుండా తనకు విశ్వాసపావూతులైన అహ్మద్ పటేల్, ఏకే ఆంటోనీలను భాగస్వాములుగా చేస్తూ మినీ కోర్ కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో అక్టోబరు 2 తరువాత జరుగుతున్న ప్రతీ సమావేశాల్లోనూ అహ్మద్ పటేల్, ఆంటోనీ ఉండి తెలంగాణ అంశాన్ని సమీక్షిస్తున్నారు. ట్రబుల్ షూటర్‌గా పేరు పొందిన ప్రణబ్‌కు ముందుగా బాధ్యతలు అప్పగించి ఆయనపై విశ్వాసముంచిన సోనియా తరువాతి పరిణామాలతో మనసు మార్చుకుని తెలంగాణ సమస్యను ప్రత్యేక కమిటీ ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అప్పటివరకు ఆజాద్ ఆయా ప్రాంతాల నేతల నుంచి సేకరించిన అభివూపాయాలను కూడా పరిగణలోకి తీసుకోని పరిస్థితి ఏర్పడింది. ప్రణబ్ ఆధ్వర్యంలో తిరిగి మినీ కోర్ కమిటీ పలు సమావేశాలు నిర్వహించి తయారు చేసిన నివేదికను ప్రధాని మన్మోహన్ అధ్యక్షతన జరిగే కోర్ కమిటీకి ఇటీవల సమర్పించింది.
దీంతో అక్టోబరు 2 వరకు ఆజాద్ చేసిన ప్రయత్నాలన్నింటికీ విలువ లేకుండా పోయిందని ఏఐసీసీ వర్గాలు అంటున్నాయి. ఆంటోనీ, అహ్మద్ పటేల్ సమక్షంలో జరిగిన మినీ కోర్ కమిటీకే ప్రాధాన్యం ఏర్పడిందని, ఈ మినీ కోర్ కమిటీ ఇచ్చిన రిపోర్టుపైనే సోమవారం ప్రధాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమీక్షించినట్టు విశ్వసనీయ సమాచారం. మారుతున్న పరిణామాలు తెలంగాణకు అనుకూలంగా ఉంటున్నాయని, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పటం, గూర్ఖాలాండ్ కోసం పోరాడుతున్న నేతలు తెలంగాణకు అనుకూలంగానే స్పందించటం వల్ల కూడా జాతీయ స్థాయిలో మార్పు కనిపిస్తోంది. వీటన్నింటికంటే ఉత్తరవూపదేశ్‌లో త్వరలో జరగబోయే ఎన్నికలు కీలకం కాబోతున్నాయి. యూపీని మూడు రాష్ట్రాలుగా విభజించాలని అక్కడి కాంగ్రెస్ కమిటీ ఇప్పటికే తీర్మానించింది. దీనికి యూపీ సీఎం కూడా అనుకూలంగానే ఉన్నారు.
యూపీ ఎన్నికల నోటిఫికేషన్ ముందే కాంగ్రెస్ పార్టీ చిన్న రాష్ట్రాలకు అనుకూలమని ప్రకటిస్తే తప్ప ఆ ఎన్నికల్లో నిలదొక్కుకునే అవకాశాల్లేవు. దీనిని నిరూపించుకోవాలంటే కాంగ్రెస్ తెలంగాణకు అనుకూలమని ప్రకటించాల్సి ఉంటుందని, ఈ దిశలోనే కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ అభివూపాయాన్ని ముందుగా ప్రకటించి తెలంగాణపై జాతీయ స్థాయిలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటారని తెలంగాణవాదులు విశ్వసిస్తున్నారు.
0 comments:
Post a Comment