Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Thursday, October 13, 2011

దీపావళి పటాసే!

-దేశవ్యాప్తంగా సింగరేణి పోరు ప్రభావం
- మహారాష్ట్ర, కర్టాటకలో కరెంట్ కట్‌కట్
- 3 నుంచి 16 గంటల దాకా
- పదివేల మెగావాట్ల దాకా లోటు.. అంధకారమైన గ్రామీణ ప్రాంతాలు
- పట్టణాలు, నగరాలకూ సెగ.. మహారాష్ట్రలో జనం ఆందోళన

123-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
థర్మల్ విద్యుత్‌లో వెలుగులు వస్తాయి. జల విద్యుత్‌తోనూ అంధకారం తొలగిపోతుంది. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చడం వల్లకూడా వెలుగులు విరబూస్తాయి! రానున్న దీపావళి రోజుల్లో అఖిలభారతమూ బాణాసంచా కాల్చుకుని వెలుగులు నింపుకోవాల్సిన పరిస్థితి రాబోతున్నది! మహోధృతంగా సాగుతున్న తెలంగాణ సకల జనుల సమ్మెలో సింగరేణి బొగ్గు గని కార్మికులు మమేకమవడమే ఈ స్థితికి కారణం. తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా పోరు చేస్తున్న నల్లసూరీళ్లు.. తమ సమ్మె ప్రభావాన్ని యావత్ దేశంపైనా చూపించారు. ఫలితంగా వివిధ రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా లేక కటిక చీకట్లు ఆవరిస్తున్నాయి. దీంతో ఆంధ్రవూపదేశ్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటే తప్ప ఈ అంధకారాన్ని పారదోలలేమని వివిధ రాష్ట్రాల సీఎంలు చేతుపూత్తేస్తున్నారు. తమ తమ రాష్ట్రాల్లో 3 గంటలు మొదలుకు 16 గంటల వరకూ కరెంటు కోతలు విధిస్తున్నారు. తెలంగాణ సమస్యకు పరిష్కారం కోసం సకల తెలంగాణ లోకంతో పాటు వారూ ఎదురు చూస్తున్నారు!

- మహారాష్ట్ర డిమాండ్ 16500 మెగావాట్లు.. ప్రస్తుతం లభ్యత 11వేల మెగావాట్లు
- కర్ణాటకలో 2వేల మెగావాట్ల లోటు.. ప్రస్తుతం లభ్యత 130 మి.యూ.
- ఢిల్లీ డిమాండ్ 3400 మెగావాట్లు.. ప్రస్తుతం లభ్యత 3వేల మెగావాట్లు
- మధ్యవూపదేశ్ డిమాండ్ 7500.. ప్రస్తుత లభ్యత 6000 మెగావాట్లు
- బెంగాల్‌లో 600 మెగావాట్ల కొరత

కునారిల్లుతున్న ఎన్టీపీసీ ప్లాంట్లు ఉత్పత్తి సామర్థ్యం 34 వేల మెగావాట్లు ప్రస్తుత ఉత్పత్తి కేవలం 4వేల మెగావాట్లు గ్రిడ్‌లపై అదనపు భారం.. యూపీ, ఢిల్లీ మధ్య చిచ్చు మహారాష్ట్రలో పరిక్షిశమలకు 16 గంటల కోతకర్ణాటకలోనూ అదే పరిస్థితి.. ఆందోళనలో కేంద్ర ప్రభుత్వంబొగ్గు, విద్యుత్ శాఖల భేటీలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: వెలుగులు పంచే దీపావళిని భారతావని ఈ ఏడాది అంధకారంలో జరుపుకొనబోతున్నదా? మరికొద్ది రోజుల్లో సమీపిస్తున్న పండుగలోగా ప్రభుత్వం మేల్కొని కొన్ని కీలకమైన ప్రత్యామ్నాయాలు, చర్యలు తీసుకోని పక్షంలో అమావాస్యనాటి పండుగ దేశవ్యాప్తంగా కటిక చీకట్ల మధ్యనే జరుగనుంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా మహత్తరంగా సాగుతున్న సకల జనులసమ్మె, ఆ సమ్మెలో భాగంగా కీలకమైన సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడం ఈ పరిస్థితికి కారణమైంది. దాని ప్రభావం ఆంధ్రవూపదేశ్‌లోనే కాకుండా.. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరవూపదేశ్, ఆర్థిక రాజధాని ముంబై, దేశం నడిబొడ్డున్న ఉన్న మధ్యవూపదేశ్, దక్షిణాదిన కర్ణాటక సహా దేశంలోని అన్ని రాష్ట్రాలపైనా పడుతున్నది.

India-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
మొత్తంగా 7 వేల మెగావాట్లు మొదలుకుని.. పది వేల మెగావాట్ల దాకా ఈ కొరత ఉంటున్నదని అంచనా. ఆంధ్రవూపదేశ్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ తన 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని మూసివేసింది. ఇతర ప్లాంట్లలో ఉత్పత్తిని తగ్గించివేసింది. తమ వ్యవస్థాపక సామర్థ్యం కంటే అతి తక్కువ విద్యుత్‌ను వివిధ ప్రాంతాల్లోని ఎన్‌టీపీసీ ప్లాంట్లు ఉత్పత్తి చేస్తున్నాయి. సింగరేణి సమ్మెకు తోడు వివిధ మైనింగ్ ప్రాంతాల్లో వర్షాలు కూడా కరెంటు కోతలకు కారణమవుతున్నాయి. ఈ పరిస్థితి కేంద్రానికి తీవ్ర ఆందోళన కల్గిస్తున్నది. దీంతో ప్రస్తుత సంక్షోభంపై చర్చించేందుకు బొగ్గు మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్‌ను కేంద్ర విద్యుత్ మంత్రి సుశీల్ కుమార్ షిండే కలువబోతున్నారు. ఇప్పటికే ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బొగ్గు శాఖ అధికారులు అత్యవసర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

పరిస్థితి తీవ్రంగా కనిపిస్తున్నా.. విద్యుత్ శాఖ అధికారులు మాత్రం పండుగ రోజులకు విద్యుత్ కొరత లేకుండా చూస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.

ఢిల్లీలో కటకట
విద్యుత్ కోత వల్ల ఢిల్లీలోని సామాన్య ప్రజలే కాదు.. ఆ రాష్ట్ర విద్యుత్ మంత్రికీ ఇక్కట్లు తప్పలేదు. ఢిల్లీ విద్యుత్ మంత్రి హరున్ యూసఫ్ మంగళవారం పాల్గొన్న ఒక కార్యక్షికమంలో మూడు సార్లు కరెంటు పోయింది. కరెంటు పోవడంతో ఇదే సమయంగా భావించిన సభికులు తమ ప్రాంతాల్లో పదే పదే కరెంటు పోతున్నదంటూ మంత్రికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీ నగరంలో గత కొద్ది రోజులుగా కరెంటు కోతలను ఎదుర్కొంటున్నది. వివిధ విద్యుత్ ఉత్పత్తి స్టేషన్‌ల నుంచి సరఫరాలో ఆటంకాలు ఏర్పడటంతో పాటు ఉత్తరవూపదేశ్‌లోని నార్తరన్ గ్రిడ్ నుంచి దాని పరిధిలోని రాష్ట్రాలకు అధికమొత్తంలో విద్యుత్ సరఫరా కారణంగా మాటిమాటికీ విద్యుత్ సరఫరా నిలిచిపోతున్నది. ఢిల్లీ గరిష్ఠ డిమాండ్ 3200-3400 మెగావాట్లుగా ఉంది.

కానీ.. ప్రస్తుతం 3వేల మెగావాట్ల మేరకే విద్యుత్ సరఫరా అవుతున్నది. ఫలితంగా మూడు నుంచి నాలుగు గంటల పాటు నగరంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ కోతలు విధిస్తున్నారు. అసలే ఒకవైపు బొగ్గు కొరతకు తోడు ఉత్తరాది గ్రిడ్ నుంచిఉత్తరవూపదేశ్, హర్యానాలు అధికమొత్తంలో విద్యుత్‌ను వినియోగించుకుంటున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఆరోపించారు. కేంద్రం తక్షణమే ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇక్కట్లలో మధ్యవూపదేశ్
మధ్యవూపదేశ్ పరిస్థితీ దారుణంగానే ఉంది. రాష్ట్రంలో డిమాండ్ 7500 మెగావాట్లు కాగా.. సరఫరా మాత్రం 6వేల మెగావాట్లు మాత్రమే ఉంటున్నది. మధ్యవూపదేశ్ విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన వనరు బొగ్గు. సింగరేణి నుంచి తగిన స్థాయిలో బొగ్గు సరఫరా లేకపోవడంతో మధ్యవూపదేశ్‌లో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలిగింది.

‘మహా’ దారుణం
మహారాష్ట్ర పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గరిష్ట డిమాండ్ 16500 మెగావాట్లు కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 11వేల మెగావాట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉంటున్నది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 3 గంటలు మొదలుకుని.. 9 గంటల వరకూ కోతలు ఉంటున్నాయి. దీంత దిక్కుతోచని మహారాష్ట్ర విద్యుత్ సంస్థ ‘మహావితరన్’ రాష్ట్రంలో పరిక్షిశమలకు 16 గంటలు కోత విధించాలని నిశ్చయించింది. బుధవారం నుంచి ఈ కోత వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు రోజుల్లో వారానికి ఒకసారి ఉంటుంది. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో కరెంటు కోతలపై మహారాష్ట్రలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వాసాయిలోని రాష్ట్ర విద్యుత్ బోర్డు సరఫరా కేంద్రంపై ప్రజలు దాడి చేసి దహనం చేశారు. థానే, యవత్మాల్, బుల్ధన, నలసొపర, నాశిక్ తదితర చోట్ల కూడా ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి.

మరో ప్రత్యామ్నాయం కూడా లేకపోవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం గత మూడు వారాలుగా అడ్డదిడ్డంగా కోతలు విధిస్తున్నది. పట్టణ ప్రాంతాల్లో ఏడు గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 11 నుంచి 13 గంటల వరకూ కోతలు ఉంటున్నాయి. తెలంగాణలో కొనసాగుతున్న సమ్మె కారణంగానే మహారాష్ట్రలో విద్యుత్ సంక్షోభంనెలకొందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చెప్పారు. సింగరేణిలో సమ్మె కొనసాగుతున్న కారణంగా రాష్ట్రంలోని థర్మల్ పవర్ ప్రాజెక్టులకు బొగ్గు సరఫరా లేక పోవడం వల్లే తాము రాష్ట్రంలో విద్యుత్ కోతలు విధించాల్సి వచ్చిందని చవాన్ బుధవారం ఇక్కడ విలేకరులకు చెప్పారు. మహారాష్ట్రలోని పరాస్, భుసావల్, కొరాడి, చంద్రాపూర్, తదితర ప్లాంట్‌లకు సింగరేణి బొగ్గే ఆధారం. పండుగ సీజన్‌లో విద్యుత్ డిమాండ్ మరింత ఉంటుందన్న విషయం తమ దృష్టిలో ఉందని చెప్పిన ఉపముఖ్యమంత్రి పవార్.. పరిస్థితిని అధిగమించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోళ్ల అంశాన్ని పరిశీలిస్తున్నట్లు విద్యుత్ శాఖను కూడా నిర్వహిస్తున్న పవార్ చెప్పారు. సెంట్రల్ గ్రిడ్‌కు కూడా ఆంధ్రవూపదేశ్ నుంచి వచ్చే బొగ్గే ఆధారమని ఆయన తెలిపారు. కనుక ఆంధ్రవూపదేశ్‌లో పరిస్థితులు సాధారణ స్థాయికి వస్తేనే విద్యుత్ సరఫరా మెరుగవుతుందని అన్నారు.

కర్ణాటక కకావికలు
సింగరేణి సమ్మె ప్రభావం పొరుగునే ఉన్న కర్ణాటక రాష్ట్రంపైనా పడింది. కర్ణాటకలో 2వేల మెగావాట్లకుపైగా లోటు ఉన్నది. ఒక బెంగళూరు నగరానికే వెయ్యి మెగావాట్ల కొరత ఉంది. 160మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా.. కేవలం 130 మిలియన్ యూనిట్ల లభ్యతే ఉంది. పరిస్థితి తీవ్రత నేపథ్యంలో వారాంతపు సెలవుల పద్ధతికి బదులు వారంలో అందరికీ ఒక రోజు సెలవు ఇచ్చే పద్ధతిని అనుసరించాలని రాష్ట్రంలోని పరిక్షిశమలను కర్ణాటక ప్రభుత్వం కోరింది. పరిక్షిశమల్లో రోస్టర్ విధానం అమలు చేయడంతో పాటు బెంగళూరు నగరంలో నివాస ప్రాంతాలకు నిర్దిష్ట సమయాల్లో కోతలను కూడా అమలు చేస్తున్నది.

నగరాలు, పట్టణాల్లో సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ కరెంటు కోత విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర ప్రాంతాల్లో 8 గంటల మేర విద్యుత్ కోతలు విధించాలని తీర్మానించింది. రాష్ట్రంలోని థర్మల్ పవర్ ప్రాజెక్టులకు బొగ్గు సరఫరా చేసే ఆంధ్రవూపదేశ్‌లో పరిస్థితిలు సాధారణ స్థాయికి వచ్చేదాకా ఈ పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బెంగళూరు నగరాని నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తామని రాష్ట్ర విద్యుత్ సంస్థ బెస్కామ్ చెబుతునప్పటికీ.. అడపాదడపా కరెంటు పోతూనే ఉన్నదని బెంగళూరు వాసులు చెబుతున్నారు.

బెంగాల్‌లోనూ కోతలే
కోల్‌కతా నగరాన్ని మినహాయిస్తే బెంగాల్‌లోని 90 లక్షల విద్యుత్ వినియోగదారులకు రోజుకు 4-5 గంటల పాటు విద్యుత్ కోతలు ఎదురవుతున్నాయి. రోజుకు 600 మెగావాట్ల కొరతను బెంగాల్ ఎదుర్కొంటున్నది. ఉత్తరవూపదేశ్‌లోనూ విద్యుత్ కొరత తీవ్రంగా ఉంది. ఉత్తరవూపదేశ్ ముఖ్యమంత్రి మాయావతి కూడా ఆంధ్రవూపదేశ్‌లో పరిస్థితులు సాధారణ స్థాయికి రానంత వరకూ ఇక్కడ కూడా విద్యుత్ కోతలు తప్పవని చెప్పారు. ఉత్తరాది జాతీయ గ్రిడ్ నుంచి యూపీ 12వందల మెగావాట్ల అధిక విద్యుత్‌ను వాడుకుంటున్నదని ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్న విమర్శల నేపథ్యంలో ఆమె ఈ విధంగా స్పందించారు.

కష్టాల్లో ఎన్టీపీసీ
- దెబ్బతీసిన సింగరేణి సమ్మె
- ఇతర ప్రాంతాల నుంచీ బొగ్గు బంద్

ntpc-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
న్యూఢిల్లీ, అక్టోబర్ 12 :దేశంలోని వివిధ ప్రాంతాల్లో థర్మల్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. దక్షిణాదిలో తెలంగాణ డిమాండ్‌తో సింగరేణి కార్మికులు సమ్మెకు దిగిన నేపథ్యంలో అక్కడ బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోవడం, మరోవైపు తూర్పు, మధ్య ప్రాంతాల్లోని బొగ్గు గనుల్లో భారీ వర్షాల కారణంగా ఉత్పత్తి నిలిచిపోవడంతో ఎన్టీపీసీ డీలాపడింది. ఫలితంగా దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయలో విద్యుత్ కొరత నెలకొని ఉంది. దేశంలో థర్మల్ విద్యుత్ సరఫరా చేయడంలో ఎన్టీపీసీదే కీలక పాత్ర. ఇది 34వేల మెగావాట్లను ఉత్పత్తి చేస్తుంది. ఒక విధంగా ప్రపంచంలోనే దీనికి ఒకటవ స్థానం.

కానీ.. ఇప్పుడు ఆ సంస్థ ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ కేవలం 4వేల మెగావాట్లు మాత్రమే! ఢిల్లీలోని దాద్రి, ఉత్తరాదిలో సింగ్రౌలి, ఉంచార్, మధ్యవూపదేశ్‌లోని వింధ్యాంచల్, ఫరక్కా, తూర్పు ప్రాంతంలోని కహలాగాంవ్, దక్షిణాదిన రామగుండం, సింహాద్రి ప్లాంట్లు బొగ్గు సరఫరా లేక తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఢిల్లీలోని బహదూర్‌పురా ప్లాంటు ఆగ్రా కాలువ నుంచి నీటి సరఫరా లేకపోవడంతో ఉత్పత్తిని తగ్గించి వేసింది. విద్యుత్ ప్లాంట్లలోని కూలింగ్‌టవర్స్ కోసం ఈ నీటిని వినియోగిస్తారు. సింగరేణితో పాటు ఉత్తర, మధ్య, తూర్పు కోల్‌ఫీల్డ్స్‌తో పాటు మహానది బొగ్గు గనుల నుంచి ఎన్టీపీసీ ప్లాంట్‌లకు బొగ్గు సరఫరా నిలిచిపోయింది. 

Take By: T News

Tags: Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9

0 comments:

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP