రైల్‌రోకోలో పాల్గొంటాం
- తెలంగాణ ఇవ్వండి లేదంటే రాజీనామాలు ఆమోదించండి
- రాజీనామాలపై స్పీకర్‌ను కలిసిన టీ కాంగ్రెస్ ఎంపీలు
- పరిశీలిస్తానని మీరాకుమార్ హామీ:తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల స్పష్టీకరణ
- అవసరమైతే పార్టీ సభ్యత్వాన్ని వదులుకుంటా: రాజగోపాల్‌రెడ్డి
- మాకు కసబ్‌కు మించిన శిక్షలా: ఎంపీ పొన్నం
- రైల్‌రోకోలో పాల్గొంటామని అధిష్ఠానానికి తెలిపాం: వివేక్
- విధిలేని పరిస్థితుల్లోనే సమ్మెలో పాల్గొంటున్నాం: మందా
న్యూఢిల్లీ, అక్టోబర్ 12 (టీన్యూస్):‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి, లేదా మా రాజీనామాలు ఆమోదించండి’ అని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు తేల్చిచెప్పారు. రాజకీయ జేఏసీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న రైల్‌రోకోలో తామూ పాల్గొంటామని స్పష్టం చేశారు. తెలంగాణ సమస్య పరిష్కారంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా తమ రాజీనామాలను ఆమోదించాలని టీ కాంగ్రెస్ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్‌ను బుధవారం ఆమె కార్యాలయంలో కలిశారు. జూన్ 4న చేసిన తమ రాజీనామాలపై ఆమోదించాలని కోరారు. అందరి అభివూపాయాలను సావధానంగా విన్న స్పీకర్ రాజీనామాల పరిశీలన వేగవంతంగా జరుగుతోందని ఎంపీలకు హమీ ఇచ్చారు. స్పీకర్‌ను కలిసిన వారిలో రాజ్యసభ సభ్యుడు కే కేశవరావుతో పాటు ఎంపీలు మందా జగన్నాథం, గుత్తా సుఖేందర్‌డ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్, కోమటిడ్డి రాజ్‌గోపాల్‌డ్డి, రాజయ్య, మధుయాష్కీ, బలరాం నాయక్‌లు ఉన్నారు.
అనంతరం పార్లమెంటు ఎదుట మీడియా పాయింట్‌లో ఎంపీలు కేకే, మధు యాష్కీ మాట్లాడుతూ రాజీనామా చేసిన ఎంపీ సురేష్ షెట్కార్ బాన్సువాడ ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నందున స్పీకర్‌ను కలిసేందుకు తమతోపాటు రాలేకపోయారని గుత్తా సుఖేందర్‌డ్డి తెలిపారు. స్పీకర్ కోరితే ఒక్కొక్కరిగా కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాజీనామాల ఆమోదం అనేది స్పీకర్ విచక్షణాధికార పరిధిలోని అంశమైనందున, ఇంతకుమించి తాము ఎక్కువ మాట్లాడలేమని పేర్కొన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతోనే రాజీనామాల ఆమోదానికి పట్టుబట్టామని అన్నారు.
రైల్ రోకోను విజయవంతం చేయండి: ఎంపీలు
15వ తేదీ నుంచి తెలంగాణలో నిర్వహించ తలపెట్టిన రైల్‌రోకోలో ప్రత్యక్షంగా పాల్గొనాలని టీ కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయించారు. కేశవరావు నివాసంలో బుధవారం ఉదయం రెండు గంటల పాటు జరిగిన ఎంపీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రైల్‌రోకోను విజయవంతం చేయడానికి జిల్లాల వారీగా ఎంపీలు రైల్వేస్టేషన్ల బాధ్యతలను సైతం స్వీకరించారు. కేశవరావు నల్లగొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఒక్కొక్కరోజు రైల్‌రోకోలో పాల్గొనబోతున్నారు. ఈ సమావేశం అనంతరం ఎంపీ బలరామ్ నాయక్ విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రైల్‌రోకోలో పాల్గొని, ఈ కార్యక్షికమాన్ని విజయవంతం చేయాలని నిర్ణయించామని చెప్పారు. రైల్‌రోకో ద్వారా అధిష్ఠానం, కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. అధికార పార్టీ సభ్యులైనప్పటికీ, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే సమ్మెలో పాల్గొంటున్నామని తెలిపారు. ఎంపీ మందా జగన్నాథ్ మాట్లాడుతూ ప్రజలనుంచి ఎన్ని విమర్శలు వచ్చినా నిర్ణయం కోసం ఇంతకాలం వేచి చూశామని, ఇక తమకు ఓపిక నశించడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మెలో పాలుపంచుకోనున్నామన్నారు.
కొలువులను పణంగా పెట్టి మరీ ఉద్యోగులు ఉద్యమిస్తుంటే తాము ఇళ్లలో కూర్చోలేమని కోమటిడ్డి రాజగోపాల్‌డ్డి పేర్కొన్నారు. అవసరమైతే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి మరీ ఉద్యమిస్తామని చెప్పారు. ముఖ్యమంవూతితో కుమ్మకై్కన కొందరు ఎమ్మెల్యేలు సమ్మెను విరమించాలని నీతులు బోధించాల్సిన అవసరం లేదని మండిపడ్డారు.
మాకు కసబ్‌కు మించిన శిక్షలా: పొన్నం
రైల్‌రోకోలో పాల్గోనే వారికి ఉగ్రవాది కసబ్‌కు విధించిన శిక్షకు మించిన శిక్షలు విధిస్తామని బెదిరించడం ఏంటని ఎంపీ పొన్నం ప్రశ్నించారు. వివేక్ మాట్లాడుతూ శాంతియుతంగా సమ్మె చేస్తున్న ఉద్యోగులపై పోలీసు నిర్భందాన్ని వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. బలగాలను వెనక్కు పిలవాలని కేంద్రాన్ని కోరారు. రైల్‌రోకోను విజయవంతం చేస్తామన్న విషయాన్ని పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్ ద్వారా అధిష్ఠానానికి నివేదించామని తెలిపారు. రైల్‌రోకోను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకొని తీరతామంటూ భయోత్పాతాన్ని సృష్టిస్తున్న డైరెక్టర్ జనరల్ హుడాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీ కాంగ్రెస్ నేతలు కేంద్ర హోంమంత్రి చిదంబరాన్ని గురువారం కలవనున్నారు. ఈ మేరకు అపాయింట్‌మెంటు కోరుతూ ఎమ్మెల్సీలు అమోస్, యాదవడ్డి చిదంబరానికి లేఖ రాశారు.
Tags: Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9
0 comments:
Post a Comment