Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Wednesday, October 12, 2011

Good news for Telangana?

New Delhi:  Will there be a consensus today on the Telangana issue? With the Centre still struggling to finalise its strategy to solve the Telangana statehood crisis, Finance Minister Pranab Mukherjee said on Saturday that the consultation process would end on Monday.

"The consultation process within the Congress is still going on. I think we will be able to complete the process by Monday," Mr Mukherjee said. He, however, refused to set any deadline for the resolution of the matter.

The pressure is now on the Congress for a time bound announcement of its position.

Actor and Praja Rajyam Party chief Chiranjeevi is expected to join discussions today.


The crisis has crippled normal life in the region; protests against party leaders have been taking place now for almost a month now. Even the house of Congress' pro-Telangana Cabinet minister S Jaipal Reddy was attacked, reportedly by Telangana activists, 24 hours after he met Pranab Mukherjee to discuss the issue.

On Sunday, Andhra Pradesh Chief Minister Kiran Kumar Reddy held talks with Pranab Mukherjee over the various options for a solution to the Telangana issue. He returned to Hyderabad yesterday morning, but Mr Mukherjee, who has now assumed the role of UPA's chief Telangana negotiator, continued his discussions with his party colleagues.

With Mr Mukherjee setting a time frame of Monday for the consultation process to be over, all eyes are set on what could be the possible win-win formula acceptable to pro-Telangana leaders as well as leaders from coastal Andhra and Rayalseema regions of Andhra.

Some of the options that are being talked about are:
  • Telangana with Hyderabad as capital, an option opposed by leaders from other parts of Andhra as well as a powerful section of people from Hyderabad who do not back the pro-Telangana sentiment
  • Hyderabad as Union Territory with other regions developing their own state capitals, an option that has few takers
  • Partition of Andhra Pradesh with Hyderabad being the common capital, but there are serious concerns about whether this is going to be a short term measure or a long term one and also who has rights over Hyderabad's revenue
  • Another option being talked about is the creation of RayalaTelangana, by including parts of Rayalaseema districts with Telangana. The idea is to have a new state with equal numbers of Lok Sabha and Assembly seats

The only option that the Centre has ruled out for now is that of imposing President's Rule in the state, but even as it continues to stay mum on the options it is exploring, time is running out with pro-Telangana activists threatening to intensify their agitation.





Take By: NDTV
 

 



Read more...

Telangana rail roko postponed to October 15

The Telangana Joint Action Committee (T-JAC) chairman M. Kodandaram announced on Tuesday that the three-day rail roko called by his organisation on October 12 to 14 had been deferred. It would now be organised in the Telangana region from October 15 to 17, he told reporters here.

Accordingly, the South Central Railway declared that all train services would run as per their original schedule on October 12, 13 and 14. It announced scrapping of the changes informed on Monday evening in the pattern of train services and also withdrew the travel advisory to the passengers.

Meanwhile, the A. P. State Road Transport Corporation (APSRTC) rolled out bus services partially from its various depots in the Telangana region as the National Mazdoor Union (NMU), the majority body in the Corporation, announced its decision to end the strike. 

Till noon, the Corporation operated about 25 per cent of the over 7,000 buses that cater to the region. 

However, it faced resistance from members of the Telangana RTC JAC, who squatted in front of the main gates of several depots. 

The JAC had strongly differed with the decision of the NMU leadership to end the strike on Monday evening after talks with the government.

Keywords: JACTelangana issue

Read more...

తెలంగాణపై ముచ్చట్లు

- ప్రణబ్ నివేదికపై చర్చ.. సమ్మె.. నిర్బంధంపై ఆజాద్ వివరణ
- గంటన్నర పైగా కాంగ్రెస్ కోర్ సమావేశం
- ఉద్రిక్త పరిస్థితులను గుర్తించినా నిర్ణయంపై నత్తనడకే
- రేపో మాపో మళ్లీ కోర్ కమిటీ భేటీ.. ఆ తర్వాత సీడబ్ల్యూసీ సమావేశం
- తెలంగాణపై అప్పటికి నిర్ణయానికి వస్తే యూపీఏ పక్షాలతో భేటీ
- అటు తర్వాతే అఖిలపక్ష సమావేశానికి పిలుపు!
- పక్షం రోజుల్లో చర్చల ప్రక్రియ పూర్తి!: కాంగ్రెస్ వర్గాల అంచనా

soniya-telangana-Newstalangana patrika telangana culture telangana politics telangana cinemaన్యూఢిల్లీ, అక్టోబర్ 11 (టీన్యూస్): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమస్యపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తన వైఖరేమిటో ఇంకా తేల్చుకోలేకపోయింది. తెలంగాణ సమస్యను ఒడ్డుకు చేరుస్తుందనుకున్న కీలకమైన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ఎప్పటిలాగే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సుదీర్ఘంగా గంటా నలభై ఐదు నిమిషాల పాటు చర్చించినా సమస్యకు పరిష్కారమార్గాన్ని కనుక్కోలేకపోయింది. కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో సబ్ కోర్ కమిటీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రముఖుల అభివూపాయాలను సేకరించి తయారు చేసిన నివేదికపై కోర్ కమిటీ సుదీర్ఘ విశ్లేషణ జరిపినా నిర్ణయంపై మాత్రం ఓ ప్రాథమిక అంచనాకు రాలేకపోయింది. మంగళవారం ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో సహా ప్రధాని మన్మోహన్, కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, ఏ.కె ఆంటోనీ, సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ హాజరయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ ఈ భేటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్నారు. తెలంగాణలో నెల రోజులుగా సాగుతున్న సకల జనుల సమ్మె తీవ్రతపై సమావేశం ప్రారంభంలోనే సభ్యులు చర్చించారు. సమ్మె ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా సమ్మె తీవ్రతలో ఇసుమంతైనా తేడా కనిపించడంలేదని వారు నిర్ధారణకు వచ్చారు. దాంతోపాటు సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైనాన్ని ఆజాద్ కోర్ కమిటీ సభ్యుల ముందుంచినట్టు సమాచారం. సకల జనుల సమ్మెపై ప్రభుత్వ అణచివేత ధోరణికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు తమ రాజీనామాలను అమోదింపజేసుకోవడానికి బుధవారం లోక్‌సభ స్పీకర్‌ను కలవనున్న విషయాన్ని ఆజాద్ ఈ సమావేశం దృష్టికి తెచ్చినట్టు తెలిసింది. అయితే కోర్ కమిటీ సభ్యులు మాత్రం ఆజాద్ చెప్పింది వినటమే తప్ప పెద్దగా స్పందించింది లేదని సమాచారం. ఇక తెలంగాణ, సీమాంధ్ర ప్రజా ప్రతినిధులతో ఆజాద్ చర్చలు జరిపి తయారు చేసిన నివేదిక, పదకొండు మంది రాష్ట్ర ప్రముఖుల అభివూపాయాలను క్రోడీకరించి ప్రణబ్ అందించిన నివేదికపై సభ్యులు తర్జనభర్జన పడ్డారు. అయినా తెలంగాణ సమస్యకు ఏ రకంగా సరైన ముగింపు పలకాలన్న దానిపై మాత్రం నిర్దిష్ట నిర్ణయానికి రాలేకపోయారు. కోర్ కమిటీ తీసుకోబోయే నిర్ణయాన్ని పార్టీ అత్యున్నత విధాన కమిటీ సీడబ్ల్యూసీలో అమోదింపజేయాలా లేక కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే అఖిలపక్ష సమావేశంలోనే ప్రకటించాలా అన్న సందిగ్ధం కోర్ కమిటీ సభ్యుల్లో కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటిస్తూ 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు సీడబ్ల్యూసీ అమోదం లేదని సీమాంధ్ర నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేసుకుని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పార్టీ నిర్ణయాన్ని సీడబ్ల్యూసీ ద్వారా అమోదింపజేస్తేనే మంచిదని మోజారిటీ సభ్యులు భావించినట్లు తెలిసింది.


అప్పుడే తెలంగాణపై పార్టీ నిర్ణయానికి అందరు కట్టుబడి ఉంటారని, ఎవరైనా వ్యతిరేకిస్తే వారిపై క్రమశిక్షణ చర్యలను కఠినంగా అమలు జరపవచ్చనే అభివూపాయంతోనే వారు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అదే సమయంలో సీడబ్ల్యూసీ సమావేశం జరగని పక్షంలో రాష్ట్రంలో నెలకొని ఉన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా త్వరితగతిన సమస్య పరిష్కారానికి పార్టీలోని సీనియర్ నాయకులను, ప్రధాన కార్యదర్శులను సంప్రదించి పార్టీ నిర్ణయాన్ని ప్రకటిద్దామన్న అంశంపై కూడా సభ్యులు చర్చించారు. పార్టీ నిర్ణయాన్ని ప్రకటిస్తే, రాష్ట్రంలో పరిస్థితులు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందన్న అంచనాతో సభ్యులు ఆ దిశలోనూ చర్చలు జరిపినట్లు సమాచారం. పార్టీ నిర్ణయాన్ని ప్రకటించి రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త స్థితిని అధిగమించి ఆ తర్వాత సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ నిర్ణయాన్ని అమోదింపజేయటం ద్వారా సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపవచ్చని కూడా సభ్యులు భావించినట్లు తెలిసింది. అయితే తెలంగాణ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలనుకున్న కోర్ కమిటీ ఎలాంటి గందరగోళానికి తావివ్వకుండా పార్టీ వ్యవహారాలపై పట్టున్న సీనియర్ నాయకులను సంప్రదించి ఒకటి రెండు రోజుల్లో మరో సారి సమావేశం కావాలని నిర్ణయించింది. ఏదేమైనా, తెలంగాణ విషయంలో పార్టీ వైఖరి ఎలా ఉండబోతున్నదనే విషయంపై ఊహాగానాలకు తావు లేకుండా గోప్యత పాటించాలని సభ్యులు అభివూపాయపడినట్టు తెలిసింది.

అందుకే సమావేశానంతరం ప్రతిసారి విలేకరులతో ముచ్చటించే ఒకరిద్దరు కోర్ కమిటీ సభ్యులు మంగళవారం మాత్రం ఎలాంటి సంకేతాలు అందించలేదు. వచ్చే కోర్ కమిటీ సమావేశంలో పార్టీ నిర్ణయాన్ని కోర్ కమిటీ ద్వారా ప్రకటించాలా లేక సీడబ్ల్యూసీ ద్వారా ప్రకటింపజేయాలా అన్న దానిపై స్పష్టత వచ్చాక అఖిలపక్షం ఏర్పాటుపై కూడా కోర్ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో పరిస్థితుల తీవ్రత దృష్ట్యా తెలంగాణపై పార్టీ వైఖరి వెల్లడైన వెను వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి సమస్య పరిష్కార బాధ్యతను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. ఈలోగా పార్టీ తీసుకున్న నిర్ణయంపై వచ్చేవారం యూపీఏ భాగస్వామ్య పక్షాలతో కూడా ఒక సమావేశం ఏర్పాటుచేయాలని యోచిస్తోంది. ఆ తర్వాతే ఒకటి రెండు రోజుల వ్యవధిలో అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని కోర్ కమిటీ భావిస్తోంది. ఈ మొత్తం సమావేశాల ప్రక్రియను చూస్తే పార్టీ పరంగా గానీ లేక ప్రభుత్వ పరంగా గానీ తెలంగాణ సమస్య పరిష్కారానికి ఓ నిర్దిష్ట నిర్ణయం రావాలంటే ఓ పక్షం రోజులకు మించి పట్టకపోవచ్చని హస్తినలో కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Take By: T News

Keywords: Telangana issue, Congress Core Group, Sonia Gandhi, Ghulam Nabi Azad, Kiran Kumar Reddy government

Read more...

టైర్ పంచరే!

-చెక్కుచెదరని ఆర్టీసీ సమ్మె
-సమ్మెలోనే 58 వేల మంది కార్మికులు
-డిపోల్లోనే 10 వేల బస్సులు
-ఎన్‌ఎంయూకు షాక్.. విరమణ ఆదేశాల ధిక్కరణ
-సమ్మెలో కొనసాగిన యూనియన్ సభ్యులు
-నేతల వైఖరిపై ఆగ్రహం
-ఎన్‌ఎంయూనూ బహిష్కరిస్తున్నాం
-టీ ఎన్‌ఎంయూ నేతల ప్రకటన
-తెలంగాణ వచ్చే దాకా సమ్మె కొనసాగుతుందని వెల్లడి


Bus1-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, అక్టోబర్ 11 :నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా సీమాంధ్ర సర్కారుతో కుమ్మకై్క సమ్మె విరమించిన ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్‌ఎంయూ)కు ఘోర భంగపాటు ఎదురైంది. సమ్మె విరమిస్తున్నట్లుగా యూనియన్ నేతలు సయ్యద్ మహమూద్, నాగేశ్వరరావు చేసిన ప్రకటనను ఉద్యోగులు, కార్మికులు ఏమాత్రం పట్టించుకోలేదు. సర్కారు ఇవ్వజూపిన అడ్వాన్సులు, జీతాలు, క్రమబద్ధీకరణ, స్పెషల్ లీవు తదితర తాయిలాలను ఎరచూపినా ఎడమకాలుతో తన్ని.. తెలంగాణే లక్ష్యంగా సమ్మెలో యథావిధిగా పాల్గొన్నారు. పాలకుల ప్రలోభాలకు లొంగిన నేతలను చీదరించుకుంటూ.. ఏ ఒక్కరు కూడా విధుల్లో చేరలేదు. సోమవారం మధ్యాహ్నానికే బస్సులు రోడ్డెక్కుతాయని ప్రగల్భాలు పలికిన ఆర్టీసీ ఎండీ ప్రసాదరావు మాటలు నీటి మీది రాతలేనని నిరూపించారు. మంగళవారం తెలంగాణలో ఒక్క బస్సు కూడా డిపోల నుంచి బయటకు రాలేదు. 23వ రోజు కూడా సమ్మె సంపూర్ణంగా సాగింది.

తెలంగాణపై అదే ఐక్యతను ప్రదర్శిస్తూ 58 వేల మంది కార్మికులు, ఉద్యోగులు విధులకు దూరంగా ఉన్నారు. తెలంగాణలో 10 వేలకు పైగా బస్సులు ఉండగా.. కేవలం 1288 బస్సులు మాత్రమే రోడ్లపై తిరిగాయి. వీటిలో 1200 బస్సులు హైదరాబాద్‌లో, 80 బస్సులు ఖమ్మంలో రోడ్లపై కనిపించాయి. ఈ బస్సులన్నీ అద్దె బస్సులే కావడం గమనార్హం. స్వీపర్లు, హోంగార్డులు, సీమాంధ్ర నుంచి వచ్చిన డ్రైవర్లు, కండక్టర్లు వీటిని నడిపినట్లు తెలిసింది. బస్సుల్లో ఎక్కేందుకు ప్రయాణికులు కరవయ్యారు. శిక్షణలేని డ్రైవర్లు నడుపుతున్న బస్సుల్లో ఎక్కి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎందుకనే ఆలోచనతో ప్రజలు వాటికి దూరంగా ఉంటున్నారు.

ఎన్‌ఎంయూ నేతలకు షాక్
ఆర్టీసీలో సమ్మె జరగాలంటే తమ యూనియన్ పాత్ర లేకుండా అసాధ్యమని విర్రవీగే ఎన్‌ఎంయూ అగ్రనాయకత్వానికి మంగళవారం షాక్ తగిలింది. తెలంగాణ వచ్చే వరకూ విధులకు హాజరుకాబోమని ఎన్‌ఎంయూ కేడర్ తేల్చిచెప్పడంతో వారికి దిమ్మతిరిగింది. తెలంగాణ ఆకాంక్షకు వ్యతిరేకంగా ఏ పార్టీ, ఏ యూనియన్ పని చేసినా దాని కథముగిసిన విషయం వారికి అర్థమైంది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా బంద్‌లు, సమ్మెలు జరిగినప్పుడల్లా తమ మద్దతు లేకుండా బస్సులు ఆగడం కుదరదని ఎన్‌ఎంయూ నాయకులు పదేపదే చెబుతుండేవారు. సకలజనుల సమ్మెలో భాగంగా సెప్టెంబర్ 19 నుంచి నుంచి సమ్మెకు దిగుతున్నట్లుగా ఆర్టీసీ జేఏసీ, ఎన్‌ఎంయూ తెలంగాణ ఫోరం నోటీసు ఇచ్చాయి. అయితే సమ్మె ప్రారంభం తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఎన్‌ఎంయూ నేతలు అనేక సార్లు మాట మార్చారు.

తాము లేకుండా సమ్మె చేస్తే ఆర్టీసీ జేఏసీ బలమెంత, మా బలమెంత అనే విషయం తెలుస్తుందనే దురుద్దేశంతో తాము రెండ్రోజుల తర్వాత నుంచి సమ్మెలోకి దిగుతామని ప్రకటించారు. చివరకు ఉద్యమవేడి చూసి 19 నుంచే సమ్మెలోకి దిగారు. సమ్మె విజయవంతంగా కొనసాగుతుండడంతో అది తమ యూనియన్ ఘనత తప్ప తెలంగాణ ఉద్యమానిది కాదని చాలాసార్లు అంతర్గత చర్చల్లో వ్యాఖ్యానించారు. తెలంగాణలో తమకు 45 వేల మంది కార్మికుల మద్దతుందని గొప్పలు చెప్పుకున్నారు. తాము సమ్మె విరమిస్తే ఆర్టీసీ బస్సులన్నీ రోడ్డెక్కుతాయని మాట్లాడారు. నిజానికి మొన్న ఆర్టీసీలో జరిగిన గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న 55 వేల మంది కార్మికులకుగాను ఎన్‌ఎంయూకు 25వేల ఓట్లు వచ్చాయి. ఆర్టీసీ జేఏసీలో ఉన్న 7 యూనియన్లకు మిగిలిన 30 వేల ఓట్లు పడ్డాయి. అయినా ఆర్టీసీ జేఏసీని కించపరిచేలా ఎన్‌ఎంయూ సీమాంవూధనాయకత్వం వ్యవహరించింది. చివరికి సమ్మె విరమించిన తర్వాత ఎన్‌ఎంయూది బలం కాదని వాపని తేలిపోయింది.

ఎన్‌ఎంయూను బహిష్కరిస్తున్నాం:
ఎన్‌ఎంయూ టీ ఫోరం నేతలు

సకల జనుల సమ్మెలో భాగంగా ఆర్టీసీ సమ్మెను యూనియన్ తరపున ముందుండి నడిపించిన తమ టీ ఫోరాన్ని రద్దు చేసే అధికారం ఎన్‌ఎంయూ సీమాంధ్ర ప్రాంత నేతలకు లేదని, తామే ఎన్‌ఎంయూ అగ్రనాయకత్వాన్ని బహిష్కరిస్తున్నామని టీ ఫోరం నేతలు థామస్‌డ్డి, అశ్వత్థామడ్డి, కె.హన్మంతు, కో చైర్మన్ మారయ్య తెలిపారు. విజయవాడలో జరిగిన యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశంలో తీర్మానం చేసి ఎన్‌ఎంయూ తెలంగాణ ఫోరంను ఏర్పాటు చేశామని, అలాంటి ఫోరంను యూనియన్ నేతలు ఏకపక్షంగా వ్యవహరిస్తూ అప్రజాస్వామిక పద్ధతిలో ఎలా రద్దు చేస్తారని వారు నిలదీశారు. ఎన్‌ఎంయూ సమ్మె విరమణపై వారు మంగళవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వచ్చే వరకు ఆర్టీసీ సమ్మె నిరవధికంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. టీ ఫోరం నాయకత్వాన్ని తెలంగాణ ప్రాంత కార్మికులు గుర్తించారని చెప్పారు. అరెస్టులకు భయపడి ఉద్యమాన్ని మధ్యలోనే వదిలేసి పారిపోయేవావరూ తెలంగాణలో లేరని గర్జించారు.

తెలంగాణ కోసం తెలంగాణ వాళ్లం సమ్మె చేస్తుంటే జీతాలు, అడ్వాన్సుల పేరుతో దాన్ని విరమించే హక్కు సీమాంధ్ర నేతలకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఎన్‌ఎంయూ విజయవాడ ప్రాంతీయ కార్యదర్శి సుబ్బారావు మీడియా ప్రకటనల వెనుక లగడపాటి రాజగోపాల్ ఆర్థిక సహాయం అందుతుందనే విషయం అందరికీ తెలుసని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత జీతాలు, అడ్వాన్సులు ఎలా తీసుకోవాలో తమకు బాగా తెలుసని అన్నారు. తెలంగాణలో మంగళవారం ఒక్క బస్సు కూడా అదనంగా డిపో నుంచి బయటికి రాలేదని, దీనిని బట్టి మహమూద్, నాగేశ్వరరావులకు ఉన్న బలమేమిటో అందరికీ తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. టీ ఫోరం ఆధ్వర్యంలో సమ్మెలో ఉన్న కార్మికులకు అండగా నిలుస్తామని

Take By : T News 
Keywords: Telangana issueCongress Core GroupSonia GandhiGhulam Nabi AzadKiran Kumar Reddy government

Read more...

ఉద్యమోద్యోగం..బంధించే దమ్ముందా! - పట్టాలపైకి కోట్ల మంది జనం


- వారందరీ అరెస్టు చేయగలరా?
- ముఖ్యమంవూతికి కేసీఆర్ సవాల్
- మానసికంగా ఎప్పుడో విడిపోయాం
- జరగాల్సింది భౌగోళిక విభజనే:
మహాధర్నాలో టీఆర్‌ఎస్ అధినేత
- అఖండ భారతానికి ఆదర్శం
- సకల జనుల సమ్మెపై కోదండరాం
- తుది శ్వాసదాకా పోరాటం : స్వామిగౌడ్
- కేసులు పెట్టాల్సింది కేంద్ర సర్కారుపైనే:
ధ్వజమెత్తిన బీజేపీ నేత విద్యాసాగర్‌రావు
- మలి పోరులో అగ్రభాగాన ఉద్యోగులు:
తెలంగాణ ప్రజావూఫంట్ చైర్మన్ గద్దర్
- కబ్జా భూములన్నీ పేదలకు పంచుతాం:
యునైటెడ్ ఫ్రంట్ నేత విమలక్క
- పోలీసులూ పోరులో దిగాలన్న సంధ్య
- ఉద్యమానికి రక్షణగా నిలుస్తాం:
లాయర్ల జేఏసీ నేత రాజేందర్‌డ్డి
- ఉద్యమహోరుతో పోటెత్తిన ఇందిరాపార్క్
- రాజధాని నడిబొడ్డున ఉద్యోగ ప్రభంజనం
- ఉద్యోగుల మహా ధర్నా గ్రాండ్ సక్సెస్
- పది జిల్లాల నుంచి తరలొచ్చిన ఉద్యోగులు


mahila-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaఅడుగడుగునా నిర్బంధం.. వారిని అడ్డ్డుకోలేకపోయింది! ఉద్యోగాలపై వేలాడుతున్న సీమాంధ్ర సర్కారు కత్తి.. వారిలో పోరాట స్పూర్తిని ఇసుమంతైనా దెబ్బతీయాలేక పోయింది! జీతాలు నిలిపేసిన ప్రభుత్వ పైశాచికం.. వారిలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను మరింత రగిలించింది! తెలంగాణ సాధన దిశగా మొదలైన సకల జనుల సమ్మె నెల రోజులకు చేరువవుతున్న మహత్తర తరుణాన.. మహా ధర్నా కోసం ఉద్యోగ సంఘాల జేఏసీ ఇచ్చిన ఒక్క పిలుపు... వందలు వేలుగా ఉద్యోగులను కదలించింది. పది జిల్లాల నుంచి ఉద్యోగ ప్రభంజనాన్ని వెల్లు రాజధాని నగరం నడిబొడ్డున ఉద్యోగ ఉద్యమ సెగ రగిలింది! ఇందిరాపార్క్ వద్ద వివిధ తెలంగాణ జిల్లాల నుంచి పోటెత్తిన ఉద్యోగులు చేసిన సమర నినాదం.. కిరణ్ సర్కారు వెన్నులో చలి పుట్టించింది! వేలాది మందితో జరిగిన ఉద్యోగ సంఘాల మహా ధర్నా గ్రాండ్ సక్సెస్ అయింది! నినాదాల హోరు.. పాటల జోరుతో హుషాత్తింది! ధర్నాకు వచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులకు అండగా సకల ప్రజాసంఘాలు కదిలొచ్చాయి. మేము సైతం అంటూ న్యాయవాదులు, డాక్టర్లు వారికి తోడు నిలబడ్డారు. ఉద్యమానికి దిశానిర్దేశం చేస్తున్న రాజకీయ నాయకత్వం సకల ఉద్యమ శ్రేణులకు భరోసా ఇస్తూ వేదికెక్కింది!

ఉద్యమం.. ఉత్సాహం కలగలిసి.. పోరు చైతన్యమై ప్రజ్వరిల్లింది! రాబోయే తెలంగాణలో సకల జనుల ఐక్యతను మచ్చుకు చాటి చెప్పింది! రైల్‌రోకోల సందర్భంగా కోట్లాది మంది పట్టాలపైకిరాబోతున్నారన్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. వారందరినీ అరెస్టు చేసే దమ్ముందా? ముఖ్యమంవూతికి సవాల్ విసిరారు. కోట్లాది మంది సిద్ధంగా ఉన్నారని, ప్రభుత్వం అరెస్టులకు దిగితే జైళ్లు చాలవని హెచ్చరించారు. మానసికంగా ఎప్పుడో విభజన జరిగిపోయిందన్న కేసీఆర్... ఇక జరగాల్సింది భౌగోళిక విభజనేనని తేల్చి చెప్పారు. విలీనం నాడు ఏదైతే తెలంగాణను కలుపుకున్నారో.. ఆ తెలంగాణనే తాము కోరుతున్నామని స్పష్టం చేశారు. యావత్ భారతానికే సకలజనుల సమ్మె ఆదర్శంగా నిలిచిందని జేఏసీ చైర్మన్ కోదండరాం చెప్పారు. ఉద్యమం మంటలు తగలడంతోనే ముఖ్యమంత్రి కవ్వింపు చర్యలకు దిగి.. అరెస్టులకు ఆదేశాలిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉరికొయ్యలు, చెరసాలలు, తుపాకులు అణచలేవని చెప్పా రు. తమ తుదిశ్వాస వరకూ తెలంగాణ ప్రజల పక్షాన ఉద్యమిస్తామని ఉద్యోగ జేఏసీ చైర్మన్ కే స్వామిగౌడ్ ప్రకటించారు. తెలంగాణ కోసం పోరాడే వారిపై కేసులు పెడితే, అంతకన్నా ముందు డిసెంబర్ 9 ప్రకటన చేసి డిసెంబర్ 23న విరమించుకున్న కేంద్ర ప్రభుత్వంపై, తెలంగాణను అడ్డుకుని ఉసురుపోసుకున్న లగడపాటి, మేకపాటి, రాయపాటిలపై కూడా కేసులు పెట్టాలని బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్‌రావు అన్నారు.

kcr-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaతెలంగాణ ఉద్యమం మొదటి దశను విద్యార్థులు విజయవంతం చేస్తే, రెండో దశను ఉద్యోగ సంఘాలు విజయవంతం చేశాయని తెలంగాణ ప్రజా ఫ్రంట్ చైర్మన్ గద్దర్ అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో భాగస్వాములైనా టీడీపీ, కాంగ్రెస్ నేతలే కలిసి రావడంలేదని ఆక్షేపించారు. ప్రస్తుతం ఆక్రమణకు గురైన భూములను తెలంగాణ రాగానే స్వాధీనం చేసుకుని, పేద ప్రజలకు పంచిపెడతామని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నేత విమలక్క చెప్పారు. యూనిఫాంలో ఉండే ఫారెస్టు, ఎక్సయిజ్ అధికారులు సకల జనుల సమ్మెలోకి కలిసి వస్తుంటే తెలంగాణ ప్రాంత పోలీసులు ఇంకా ఎందుకు ఊరుకుంటున్నారని పీవోడబ్ల్యూ నేత సంధ్య ప్రశ్నించారు. తెలంగాణలో పుట్టిన పోలీసులకు.. తెలంగాణ ఉద్యమకారులను అరెస్టు చేయడానికి చేతెపూలా వస్తున్నాయని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాడానికి సీమాంధ్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతాన్ని పోలీసు క్యాంపుగా మార్చిందని ప్రజావూఫంట్ నాయకురాలు రత్నమాల విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులను న్యాయపరంగా రక్షణగా నిలుస్తామని న్యాయవాదుల జేఏసీ నేత రాజేందర్‌డ్డి ప్రకటించారు. పోలీసులు కూడా ఉద్యమంలోకి రావాలని డాక్టర్స్ ఆఫ్ తెలంగాణ నేత డాక్టర్ నర్సయ్య అన్నారు.సకల జనుల సమ్మె నుంచి ఆర్టీసీ కార్మికులను విడగొట్టాలని ప్రభుత్వం ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా.. కార్మికులు తట్టుకుని నిలబడ్డారని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఆనందం చెప్పారు. ఉద్యమానిన గడప గడపకూ తీసుకెళ్లే పరిస్థితికి తెలంగాణ ప్రాంత ఆర్టీసీ ఉద్యోగులు వచ్చారని

Keywords: Telangana issueCongress Core GroupSonia GandhiGhulam Nabi AzadKiran Kumar Reddy government

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP