టైర్ పంచరే!
-చెక్కుచెదరని ఆర్టీసీ సమ్మె
-సమ్మెలోనే 58 వేల మంది కార్మికులు
-డిపోల్లోనే 10 వేల బస్సులు
-ఎన్‌ఎంయూకు షాక్.. విరమణ ఆదేశాల ధిక్కరణ
-సమ్మెలో కొనసాగిన యూనియన్ సభ్యులు
-నేతల వైఖరిపై ఆగ్రహం
-ఎన్‌ఎంయూనూ బహిష్కరిస్తున్నాం
-టీ ఎన్‌ఎంయూ నేతల ప్రకటన
-తెలంగాణ వచ్చే దాకా సమ్మె కొనసాగుతుందని వెల్లడి
హైదరాబాద్, అక్టోబర్ 11 :నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా సీమాంధ్ర సర్కారుతో కుమ్మకై్క సమ్మె విరమించిన ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్‌ఎంయూ)కు ఘోర భంగపాటు ఎదురైంది. సమ్మె విరమిస్తున్నట్లుగా యూనియన్ నేతలు సయ్యద్ మహమూద్, నాగేశ్వరరావు చేసిన ప్రకటనను ఉద్యోగులు, కార్మికులు ఏమాత్రం పట్టించుకోలేదు. సర్కారు ఇవ్వజూపిన అడ్వాన్సులు, జీతాలు, క్రమబద్ధీకరణ, స్పెషల్ లీవు తదితర తాయిలాలను ఎరచూపినా ఎడమకాలుతో తన్ని.. తెలంగాణే లక్ష్యంగా సమ్మెలో యథావిధిగా పాల్గొన్నారు. పాలకుల ప్రలోభాలకు లొంగిన నేతలను చీదరించుకుంటూ.. ఏ ఒక్కరు కూడా విధుల్లో చేరలేదు. సోమవారం మధ్యాహ్నానికే బస్సులు రోడ్డెక్కుతాయని ప్రగల్భాలు పలికిన ఆర్టీసీ ఎండీ ప్రసాదరావు మాటలు నీటి మీది రాతలేనని నిరూపించారు. మంగళవారం తెలంగాణలో ఒక్క బస్సు కూడా డిపోల నుంచి బయటకు రాలేదు. 23వ రోజు కూడా సమ్మె సంపూర్ణంగా సాగింది.
తెలంగాణపై అదే ఐక్యతను ప్రదర్శిస్తూ 58 వేల మంది కార్మికులు, ఉద్యోగులు విధులకు దూరంగా ఉన్నారు. తెలంగాణలో 10 వేలకు పైగా బస్సులు ఉండగా.. కేవలం 1288 బస్సులు మాత్రమే రోడ్లపై తిరిగాయి. వీటిలో 1200 బస్సులు హైదరాబాద్‌లో, 80 బస్సులు ఖమ్మంలో రోడ్లపై కనిపించాయి. ఈ బస్సులన్నీ అద్దె బస్సులే కావడం గమనార్హం. స్వీపర్లు, హోంగార్డులు, సీమాంధ్ర నుంచి వచ్చిన డ్రైవర్లు, కండక్టర్లు వీటిని నడిపినట్లు తెలిసింది. బస్సుల్లో ఎక్కేందుకు ప్రయాణికులు కరవయ్యారు. శిక్షణలేని డ్రైవర్లు నడుపుతున్న బస్సుల్లో ఎక్కి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎందుకనే ఆలోచనతో ప్రజలు వాటికి దూరంగా ఉంటున్నారు.
ఎన్‌ఎంయూ నేతలకు షాక్
ఆర్టీసీలో సమ్మె జరగాలంటే తమ యూనియన్ పాత్ర లేకుండా అసాధ్యమని విర్రవీగే ఎన్‌ఎంయూ అగ్రనాయకత్వానికి మంగళవారం షాక్ తగిలింది. తెలంగాణ వచ్చే వరకూ విధులకు హాజరుకాబోమని ఎన్‌ఎంయూ కేడర్ తేల్చిచెప్పడంతో వారికి దిమ్మతిరిగింది. తెలంగాణ ఆకాంక్షకు వ్యతిరేకంగా ఏ పార్టీ, ఏ యూనియన్ పని చేసినా దాని కథముగిసిన విషయం వారికి అర్థమైంది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా బంద్‌లు, సమ్మెలు జరిగినప్పుడల్లా తమ మద్దతు లేకుండా బస్సులు ఆగడం కుదరదని ఎన్‌ఎంయూ నాయకులు పదేపదే చెబుతుండేవారు. సకలజనుల సమ్మెలో భాగంగా సెప్టెంబర్ 19 నుంచి నుంచి సమ్మెకు దిగుతున్నట్లుగా ఆర్టీసీ జేఏసీ, ఎన్‌ఎంయూ తెలంగాణ ఫోరం నోటీసు ఇచ్చాయి. అయితే సమ్మె ప్రారంభం తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఎన్‌ఎంయూ నేతలు అనేక సార్లు మాట మార్చారు.
తాము లేకుండా సమ్మె చేస్తే ఆర్టీసీ జేఏసీ బలమెంత, మా బలమెంత అనే విషయం తెలుస్తుందనే దురుద్దేశంతో తాము రెండ్రోజుల తర్వాత నుంచి సమ్మెలోకి దిగుతామని ప్రకటించారు. చివరకు ఉద్యమవేడి చూసి 19 నుంచే సమ్మెలోకి దిగారు. సమ్మె విజయవంతంగా కొనసాగుతుండడంతో అది తమ యూనియన్ ఘనత తప్ప తెలంగాణ ఉద్యమానిది కాదని చాలాసార్లు అంతర్గత చర్చల్లో వ్యాఖ్యానించారు. తెలంగాణలో తమకు 45 వేల మంది కార్మికుల మద్దతుందని గొప్పలు చెప్పుకున్నారు. తాము సమ్మె విరమిస్తే ఆర్టీసీ బస్సులన్నీ రోడ్డెక్కుతాయని మాట్లాడారు. నిజానికి మొన్న ఆర్టీసీలో జరిగిన గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న 55 వేల మంది కార్మికులకుగాను ఎన్‌ఎంయూకు 25వేల ఓట్లు వచ్చాయి. ఆర్టీసీ జేఏసీలో ఉన్న 7 యూనియన్లకు మిగిలిన 30 వేల ఓట్లు పడ్డాయి. అయినా ఆర్టీసీ జేఏసీని కించపరిచేలా ఎన్‌ఎంయూ సీమాంవూధనాయకత్వం వ్యవహరించింది. చివరికి సమ్మె విరమించిన తర్వాత ఎన్‌ఎంయూది బలం కాదని వాపని తేలిపోయింది.
ఎన్‌ఎంయూను బహిష్కరిస్తున్నాం:
ఎన్‌ఎంయూ టీ ఫోరం నేతలు
సకల జనుల సమ్మెలో భాగంగా ఆర్టీసీ సమ్మెను యూనియన్ తరపున ముందుండి నడిపించిన తమ టీ ఫోరాన్ని రద్దు చేసే అధికారం ఎన్‌ఎంయూ సీమాంధ్ర ప్రాంత నేతలకు లేదని, తామే ఎన్‌ఎంయూ అగ్రనాయకత్వాన్ని బహిష్కరిస్తున్నామని టీ ఫోరం నేతలు థామస్‌డ్డి, అశ్వత్థామడ్డి, కె.హన్మంతు, కో చైర్మన్ మారయ్య తెలిపారు. విజయవాడలో జరిగిన యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశంలో తీర్మానం చేసి ఎన్‌ఎంయూ తెలంగాణ ఫోరంను ఏర్పాటు చేశామని, అలాంటి ఫోరంను యూనియన్ నేతలు ఏకపక్షంగా వ్యవహరిస్తూ అప్రజాస్వామిక పద్ధతిలో ఎలా రద్దు చేస్తారని వారు నిలదీశారు. ఎన్‌ఎంయూ సమ్మె విరమణపై వారు మంగళవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వచ్చే వరకు ఆర్టీసీ సమ్మె నిరవధికంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. టీ ఫోరం నాయకత్వాన్ని తెలంగాణ ప్రాంత కార్మికులు గుర్తించారని చెప్పారు. అరెస్టులకు భయపడి ఉద్యమాన్ని మధ్యలోనే వదిలేసి పారిపోయేవావరూ తెలంగాణలో లేరని గర్జించారు.
తెలంగాణ కోసం తెలంగాణ వాళ్లం సమ్మె చేస్తుంటే జీతాలు, అడ్వాన్సుల పేరుతో దాన్ని విరమించే హక్కు సీమాంధ్ర నేతలకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఎన్‌ఎంయూ విజయవాడ ప్రాంతీయ కార్యదర్శి సుబ్బారావు మీడియా ప్రకటనల వెనుక లగడపాటి రాజగోపాల్ ఆర్థిక సహాయం అందుతుందనే విషయం అందరికీ తెలుసని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత జీతాలు, అడ్వాన్సులు ఎలా తీసుకోవాలో తమకు బాగా తెలుసని అన్నారు. తెలంగాణలో మంగళవారం ఒక్క బస్సు కూడా అదనంగా డిపో నుంచి బయటికి రాలేదని, దీనిని బట్టి మహమూద్, నాగేశ్వరరావులకు ఉన్న బలమేమిటో అందరికీ తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. టీ ఫోరం ఆధ్వర్యంలో సమ్మెలో ఉన్న కార్మికులకు అండగా నిలుస్తామని
0 comments:
Post a Comment