ఉద్యమోద్యోగం..బంధించే దమ్ముందా! - పట్టాలపైకి కోట్ల మంది జనం
- వారందరీ అరెస్టు చేయగలరా?
- ముఖ్యమంవూతికి కేసీఆర్ సవాల్
- మానసికంగా ఎప్పుడో విడిపోయాం
- జరగాల్సింది భౌగోళిక విభజనే:
మహాధర్నాలో టీఆర్‌ఎస్ అధినేత
- అఖండ భారతానికి ఆదర్శం
- సకల జనుల సమ్మెపై కోదండరాం
- తుది శ్వాసదాకా పోరాటం : స్వామిగౌడ్
- కేసులు పెట్టాల్సింది కేంద్ర సర్కారుపైనే:
ధ్వజమెత్తిన బీజేపీ నేత విద్యాసాగర్‌రావు
- మలి పోరులో అగ్రభాగాన ఉద్యోగులు:
తెలంగాణ ప్రజావూఫంట్ చైర్మన్ గద్దర్
- కబ్జా భూములన్నీ పేదలకు పంచుతాం:
యునైటెడ్ ఫ్రంట్ నేత విమలక్క
- పోలీసులూ పోరులో దిగాలన్న సంధ్య
- ఉద్యమానికి రక్షణగా నిలుస్తాం:
లాయర్ల జేఏసీ నేత రాజేందర్‌డ్డి
- ఉద్యమహోరుతో పోటెత్తిన ఇందిరాపార్క్
- రాజధాని నడిబొడ్డున ఉద్యోగ ప్రభంజనం
- ఉద్యోగుల మహా ధర్నా గ్రాండ్ సక్సెస్
- పది జిల్లాల నుంచి తరలొచ్చిన ఉద్యోగులు
అడుగడుగునా నిర్బంధం.. వారిని అడ్డ్డుకోలేకపోయింది! ఉద్యోగాలపై వేలాడుతున్న సీమాంధ్ర సర్కారు కత్తి.. వారిలో పోరాట స్పూర్తిని ఇసుమంతైనా దెబ్బతీయాలేక పోయింది! జీతాలు నిలిపేసిన ప్రభుత్వ పైశాచికం.. వారిలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను మరింత రగిలించింది! తెలంగాణ సాధన దిశగా మొదలైన సకల జనుల సమ్మె నెల రోజులకు చేరువవుతున్న మహత్తర తరుణాన.. మహా ధర్నా కోసం ఉద్యోగ సంఘాల జేఏసీ ఇచ్చిన ఒక్క పిలుపు... వందలు వేలుగా ఉద్యోగులను కదలించింది. పది జిల్లాల నుంచి ఉద్యోగ ప్రభంజనాన్ని వెల్లు రాజధాని నగరం నడిబొడ్డున ఉద్యోగ ఉద్యమ సెగ రగిలింది! ఇందిరాపార్క్ వద్ద వివిధ తెలంగాణ జిల్లాల నుంచి పోటెత్తిన ఉద్యోగులు చేసిన సమర నినాదం.. కిరణ్ సర్కారు వెన్నులో చలి పుట్టించింది! వేలాది మందితో జరిగిన ఉద్యోగ సంఘాల మహా ధర్నా గ్రాండ్ సక్సెస్ అయింది! నినాదాల హోరు.. పాటల జోరుతో హుషాత్తింది! ధర్నాకు వచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులకు అండగా సకల ప్రజాసంఘాలు కదిలొచ్చాయి. మేము సైతం అంటూ న్యాయవాదులు, డాక్టర్లు వారికి తోడు నిలబడ్డారు. ఉద్యమానికి దిశానిర్దేశం చేస్తున్న రాజకీయ నాయకత్వం సకల ఉద్యమ శ్రేణులకు భరోసా ఇస్తూ వేదికెక్కింది!
ఉద్యమం.. ఉత్సాహం కలగలిసి.. పోరు చైతన్యమై ప్రజ్వరిల్లింది! రాబోయే తెలంగాణలో సకల జనుల ఐక్యతను మచ్చుకు చాటి చెప్పింది! రైల్‌రోకోల సందర్భంగా కోట్లాది మంది పట్టాలపైకిరాబోతున్నారన్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. వారందరినీ అరెస్టు చేసే దమ్ముందా? ముఖ్యమంవూతికి సవాల్ విసిరారు. కోట్లాది మంది సిద్ధంగా ఉన్నారని, ప్రభుత్వం అరెస్టులకు దిగితే జైళ్లు చాలవని హెచ్చరించారు. మానసికంగా ఎప్పుడో విభజన జరిగిపోయిందన్న కేసీఆర్... ఇక జరగాల్సింది భౌగోళిక విభజనేనని తేల్చి చెప్పారు. విలీనం నాడు ఏదైతే తెలంగాణను కలుపుకున్నారో.. ఆ తెలంగాణనే తాము కోరుతున్నామని స్పష్టం చేశారు. యావత్ భారతానికే సకలజనుల సమ్మె ఆదర్శంగా నిలిచిందని జేఏసీ చైర్మన్ కోదండరాం చెప్పారు. ఉద్యమం మంటలు తగలడంతోనే ముఖ్యమంత్రి కవ్వింపు చర్యలకు దిగి.. అరెస్టులకు ఆదేశాలిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉరికొయ్యలు, చెరసాలలు, తుపాకులు అణచలేవని చెప్పా రు. తమ తుదిశ్వాస వరకూ తెలంగాణ ప్రజల పక్షాన ఉద్యమిస్తామని ఉద్యోగ జేఏసీ చైర్మన్ కే స్వామిగౌడ్ ప్రకటించారు. తెలంగాణ కోసం పోరాడే వారిపై కేసులు పెడితే, అంతకన్నా ముందు డిసెంబర్ 9 ప్రకటన చేసి డిసెంబర్ 23న విరమించుకున్న కేంద్ర ప్రభుత్వంపై, తెలంగాణను అడ్డుకుని ఉసురుపోసుకున్న లగడపాటి, మేకపాటి, రాయపాటిలపై కూడా కేసులు పెట్టాలని బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్‌రావు అన్నారు.
తెలంగాణ ఉద్యమం మొదటి దశను విద్యార్థులు విజయవంతం చేస్తే, రెండో దశను ఉద్యోగ సంఘాలు విజయవంతం చేశాయని తెలంగాణ ప్రజా ఫ్రంట్ చైర్మన్ గద్దర్ అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో భాగస్వాములైనా టీడీపీ, కాంగ్రెస్ నేతలే కలిసి రావడంలేదని ఆక్షేపించారు. ప్రస్తుతం ఆక్రమణకు గురైన భూములను తెలంగాణ రాగానే స్వాధీనం చేసుకుని, పేద ప్రజలకు పంచిపెడతామని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నేత విమలక్క చెప్పారు. యూనిఫాంలో ఉండే ఫారెస్టు, ఎక్సయిజ్ అధికారులు సకల జనుల సమ్మెలోకి కలిసి వస్తుంటే తెలంగాణ ప్రాంత పోలీసులు ఇంకా ఎందుకు ఊరుకుంటున్నారని పీవోడబ్ల్యూ నేత సంధ్య ప్రశ్నించారు. తెలంగాణలో పుట్టిన పోలీసులకు.. తెలంగాణ ఉద్యమకారులను అరెస్టు చేయడానికి చేతెపూలా వస్తున్నాయని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాడానికి సీమాంధ్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతాన్ని పోలీసు క్యాంపుగా మార్చిందని ప్రజావూఫంట్ నాయకురాలు రత్నమాల విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులను న్యాయపరంగా రక్షణగా నిలుస్తామని న్యాయవాదుల జేఏసీ నేత రాజేందర్‌డ్డి ప్రకటించారు. పోలీసులు కూడా ఉద్యమంలోకి రావాలని డాక్టర్స్ ఆఫ్ తెలంగాణ నేత డాక్టర్ నర్సయ్య అన్నారు.సకల జనుల సమ్మె నుంచి ఆర్టీసీ కార్మికులను విడగొట్టాలని ప్రభుత్వం ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా.. కార్మికులు తట్టుకుని నిలబడ్డారని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఆనందం చెప్పారు. ఉద్యమానిన గడప గడపకూ తీసుకెళ్లే పరిస్థితికి తెలంగాణ ప్రాంత ఆర్టీసీ ఉద్యోగులు వచ్చారని
Keywords: Telangana issue, Congress Core Group, Sonia Gandhi, Ghulam Nabi Azad, Kiran Kumar Reddy government
0 comments:
Post a Comment