రాంబాబు సినిమాపై ప్రభుత్వ కమిటీ ఏర్పాటు
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంపై విషం చిమ్ముతూ నిర్మించిన
‘కెమెరామెన్ గంగాతో రాంబాబు’ సినిమా వివాదంపై ఎట్టకేలకు ప్రభుత్వం
స్పందించింది. ఈచిత్ర వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని
నియమించింది. సమాచార శాఖ కమిషనర్ చంద్రవదన్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు
చేసింది.
కమిటీలో సభ్యులుగా నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ, సినీ
దర్శకుడు తమ్మారెడ్డి భరధ్వాజ, విజయేందర్, వందేమాతరం శ్రీనివాస్,
ఎన్.శంకర్, శ్రీధర్‌లను నియమించారు. ఇవాళ మధ్యాహ్నం 12-30 గంటలకు ఈ కమిటీ
సినిమాను వీక్షిస్తుంది.
చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు, డైలాగులు ఉంటే
తొలగించాలని సమాచార, పౌరసంబంధాలు, సినీ ఆటోగ్రఫీ మంత్రి డీకే అరుణ
ఆదేశించారు. ఈమేరకు కమిటీని నియమిస్తున్నట్టు ఆమె ఉత్తర్వులు జారీ చేశారు.
Take By: T News
0 comments:
Post a Comment